పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : పార్వతినిరజతశైలంబునకుఁ బంపుట.

3-189-సీ.
"నుసన్న లాలించి డు నప్రమత్తవై
దేవేశుమనుసు రాఁ దిరుగుమమ్మ
పంపకయట మున్న ర్త చిత్తములోని
నులెల్ల నాయితఱపు మమ్ము
టవారునిటవారు య్యెడుగడయును
విభుఁడుగాఁ జూచి సేవింపుమమ్మ
యెన్నెన్నిభంగుల నేరూపముల యందుఁ
రళకంధరుకెడ గాకుమమ్మ

3-189.1-ఆ.
యాశ్రయించువారి మ్మ రక్షించుమీ
లరనత్తమామ లిగిరేని
ప్పగిఁపవచ్చు తనికి నెవ్వరు
చెలువ! లేరుగానఁ జెప్ప వలసె.”

టీక :-
అప్రమత్తత = జాగరూకత.
భావము :-
కంటి సంజ్ఞలను గ్రహించి, చాలా జాగరూకతతో భర్త మనసు నీవైపు ఉండేలా చూసుకో. చెప్పకముందే ఆతని మనసులోని పనులు సిద్ధపరచు. పుట్టింటివారిని, మెట్టినింటివారిని రక్షించడం విభుని సేవ అనుకో. ఏ విధముగానూ ఏ రూపములోనూ శివునికి ఎడబాటు కాకు. ఆశ్రయించిన వారిని రక్షించు. అత్తమామలుంటే వారికి అప్పగించవచ్చు. అతనికెవరూ లేరు కాబట్టి నీకే చెప్పవలసి వచ్చింది.

3-190-వ.
అని యమ్మహీధరుండు.
భావము :-
ఆ హిమవంతుడు అలా చెప్పి...

3-191-సీ.
"న్నియ! నీ రాజు గంధంబు బూయఁడు
దనాంగ! భస్మంబు మాకు లేదు;
శృంగారి! నీ భర్త జీరలు గట్టఁడు
యిభదైత్యుతోలు మా యింట లేదు;
పొలఁతి! నీ నాథుండు పువ్వులు ముడువఁడు;
యింకొక్క క్రొన్నెల యింట లేదు;
లేమ! నీ భర్త పళ్లెరమునఁ గుడువడు;
విధికపాలమ్ము మా వెంట లేదు;

3-191.1-ఆ.
గాన మనువుగడప రళకంధరునకు
నముగొఱఁత యైనఁ గినయట్టి
యుచిత ధనము లొసఁగకున్నచోఁ గన్నియ
గముమెచ్చు గాదు గవుగాదు.”

టీక :-
ఇభదైత్యుతోలు = గజాసురుని చర్మము; క్రొన్నెల = క్రొత్తనెల చంద్రుడు; లేమ = స్త్రీ; విధి = బ్రహ్మదేవుడు; మనువు = జీవనము.
భావము :-
కన్యా! నీ విభుడు గంధము పూసుకోడానికి భస్మము మా యింట లేదమ్మా. శృంగారీ! నీ భర్త వస్త్రములు కట్టుటకు. గజాసుర చర్మము మా యింటిలో లేదు తల్లీ. నీ నాధుడు పువ్వులు పెట్టుకోడానికి. ఇంకో కొత్త చంద్రుడు మా యింట లేడు తల్లీ. నీ భర్త భుజించడానికి, పళ్ళెముగా బ్రహ్మ కపాలము మా వద్ద లేదమ్మా. కావున జీవనము సాగించడానికి నీలకంఠునకు ధనము తక్కువైనా తగినంత ధనమిచ్చుట మాకు సబబు. అలా ఈయకపోతే మమ్ము లోకం మెచ్చదు. న్యాయమూ కాదు కదమ్మా”.

3-192-వ.
అని మహాదేవి నొడం బఱచి.

టీక :-
ఒడంబరచు = ఒప్పించు.
భావము :-
అని హిమవంతుడు మహాదేవిని ఒప్పించి....

3-193-సీ.
న్నంబులుగఁ బెక్కు న్నెలచీరెలు
భూరి నానా హేమభూషణములు
మత్తగజంబులు నుత్తమాశ్వంబులు
నాతపత్రంబులు నందలములు
పురములు చామరంబులు పుష్పకంబులు
కొలఁకులు వనములు గోగణములు
భాసిల్లు ధనమును దాసీజనంబులు
ణిపీఠములు దివ్వమందిరములు

3-193.1-ఆ.
రఁగపర్వతములు హుపుణ్యభూములు
లయునట్టి వివిధ స్తువులును
రుణతోడనపుడు గౌరీకుమారికి
రణమిచ్చియనిపె చలవిభుఁడు.

టీక :-
వన్నె = రంగు; హేమభూషణములు = బంగారు ఆభరణాలు; అశ్వము = గుఱ్ఱము; ఆతపత్రము = గొడుగు; అందలము = పల్లకీ; చామరము = వింజామర; పుష్పకము = విమానము; కొలకులు = సరస్సులు; భాసిల్లు = ప్రకాశించే; అరణము = వివాహ కాలమునందు అల్లునకు, ఆడబిడ్డకు ఈయబడు ధనము.
భావము :-
సన్నని రకరకముల రంగురంగుల వస్త్రములు, అనేకమైన బంగారు ఆభరణములు, మదపుటేనుగులు, మేలుజాతి గుఱ్ఱములు, గొడుగులు, పల్లకీలు, పట్టణములు, విసనకర్రలు, విమానములు, సరస్సులు, వనములు, గోవులు, ధనములు, సేవకులు, మణులు తాపిన పీఠములు, దివ్య మందిరములు, పర్వతములు, పుణ్యభూములు, అవసరమైన వివిధ వస్తువులను కరుణతో గౌరీకుమారికి పర్వతరాజు అరణముగా నిచ్చెను.

3-194-వ.
తత్సమయంబున.

టీక :-
తత్ = ఆ.
భావము :-
ఆ సమయంలో.

3-195-శా.
శ్రీకంఠుండు సదాశివుండు నియతిన్ శృంగారలోలుండు గౌ
రీకాంతాసహితంబు సమ్మదము పేర్మింబోవ వేంచేనె సు
శ్రీకైలాసగిరీంద్ర పర్వతముకున్ శ్రీకామినీనాథ వా
ణీకాంతాధిప ముఖ్యు లెల్లఁ గొలువన్ నిత్యోత్సవప్రీతితోన్.

టీక :-
శ్రీకామినీ నాథుడు = విష్ణుమూర్తి; వాణీకాంతాధిపుడు = బ్రహ్మ.
భావము :-
గరళకంఠుడైన సదాశివుడు విష్ణువు, బ్రహ్మదేవుడు మొదలైనవారు కొలుస్తుండగా, పద్దతి ప్రకారం శృంగారిగా నిత్యోత్వములపై ప్తీతితో గౌరీదేవేరితో కలసి కైలాసానికి ప్రయాణమయ్యాడు.

3-196-క.
దుఁడు శంభుం డల్లుఁడు
మర్ధిం జేసినట్టి గౌరవమునకున్
గిరిరాజు ప్రీతుఁ డయ్యెను
రువడి దేవతలు జనిరి రిణామముతోన్.

టీక :-
వరదుడు = వరమునిచ్చువాడు; పరిణామము = క్షేమము.
భావము :-
వరదుడు, శంభుడైన పరమశివుడు అల్లుడై మామగారిగా తనకు చేసిన గౌరవమునకు ఆ హిమవంతుడు సంతోషించెను. క్రమముగా దేవతలు క్షేమముగా తమ స్థానములకరిగిరి.