పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : క్షీరాబ్ధిని హాలాహలము బుట్టుట.

3-224-వ.

మఱియు, నిలింప దనుజ సముదయంబులు తమతమ బాహు బలంబులు మెచ్చక మత్సరంబునఁ బెన్నుద్దులై నింగిముట్ట నార్చుచు హుంకారంబున బింకంబులం బలుకుచు ననంత పరాక్రములై తనర్చు నియమంబునఁ దరువ మందరాచలంబు దిర్దిరం దిరుగుడుపడి యమ్మహార్ణవంబు జలంబులన్నియు దిగంతంబులఁ జెదరి భూతలంబులం బగులఁ జేయంజాలిన ఘుమఘుమా రావంబులతో వెలినురుఁగు లెగయ మహాద్భుతంబున నాలోల కల్లోలంబై నిఖిల జలచర సందోహంబుతో వలయాకారంబుఁ గొని తిరుగుపడిన నయ్యవసరంబున; నఖిలభువనక్షోభం బైనఁ జరాచర జంతుజాలంబులు దొరలుచుండె నవ్విధంబున.

టీక :-

నిలింప = దేవత; మత్సరము = ఈర్ష్య; ఉద్ది = సమానము; పెన్నుద్ది = మహాసమఉజ్జీ; ఆర్చు = బొబ్బరించు; బింకము = గర్వము; దిర్దిరం = తిరుగుట యందలి ధన్వనుకరణ, గిరగిర; ఘుమఘుమారావంబు = ఘాటైన వాసన వ్యాపించే శబ్దము; వెలి = బయటకు; ఆలోల = కొద్దిగా కదలినది.

భావము :-

ఇంకనూ, దేవాదానవ సమూహములు ఒకరి బాహుబలం మరొకరు మెచ్చక; ఈర్ష్య కలవారై; నింగిని తాకేలా గట్టి గట్టి అరుపులు అరుస్తూ హుంకరిస్తూ; బింకపు గర్వోక్తులు పలుకుతూ; పరాక్రమాలు చూపుతూ; పట్టుదలతో చిలుకసాగారు. మందర పర్వతం గిరగిరా తిరుగుతుంటే ఆ మహాసముద్రములోని జలములన్నీ దిగంతములకు చెదరి జలములన్నీ దిగంతములకు చెదరుతున్నయి. భూతలము పగుళ్ళుబారేలా ఘుమఘుమారావంబుతో బయటకు తెల్లని నురుగులెగయుచున్నాయి. అలా తుళ్ళుతున్న పెద్ద అలలు పుడుతున్నయి. సముద్రములోని జలచరాలన్నీ మందర పర్వతము తిరుగుడు అనుసరించి తిరుగుతున్నవి ఆ సమయంలో అన్ని లోకాలలోని ప్రాణులు క్షోభించేలా చరాచర జంతుజాలములూ దొర్లిపోవుచున్నాయి. ఈవిధముగా.

3-225-ఉ.

జెట్టిమగల్ సుధాంబునిధిఁ జేరి మధింపగ నందుఁ జంద్రుఁడుం

బుట్టకమున్న లక్ష్మియును బుట్టుకమున్న సుధాజలంబునుం

బుట్టకముందటన్ నిఖిలభూతభయంకర మై సురాసురుల్

పట్టిన చేతులున్విడిచి పాఱఁగఁ బుట్టె విషాగ్నికీలముల్.

టీక :-

జెట్టి = శూరుడు; పాఱు = పరుగెట్టు; కీలము = మంట.

భావము :-

మిక్కిలి పౌరుషంగల శూరులు పాలసముద్రాన్ని చేరి మధిస్తున్నారు.చగా అందులో చంద్రుడు, లక్ష్మి, అమృతము పుట్టుటకుముందు, సురాసురులు చేస్తున్న పనిని విడిచి పరుగెట్టేలా చేసే, సర్వప్రాణి భయంకరమైన విషాగ్ని మంటలు పుట్టినవి.

3-226-వ.

మఱియును విలయసమయంబున జలధరానేక నిర్ఘాత గంభీర ఘోషణంబులుం బోలె గుభులుగుభు ల్లనునాదంబుల బ్రహ్మాండంబు లన్నియు నదరి బెగడి తిరిగి పరస్పరనినాదంబు చెలంగి చరాచరజంతుజాలంబులు ప్రళయకాలంబు గదిసెనో యని నిలచిన విధంబున డెందంబులు భయంబునం దల్లడిల్లి మూర్ఛల్లి; యొండొంటి పయం బడి తూలంబోవ సకలసాగరవలయితం బగు వసుంధరావలయంబు గ్రుంగి భుజంగపతి పయిం బడ భుజంగపతియును గమఠపతి పయిం బడఁ బ్రళయకాలాగ్నియుం బోలె సకలభూత భయంకరం బై నిటలనయనాగ్నియుం బోలె మహాహుతి సందోహం బై బడబాగ్నియుం బోలె నిష్ఠురంబై ప్రళయకాలభద్ర బడబానలంబులు సంబంధులై కూడి దరించు చందంబుననందంబై యందంద బృందారక బృందంబులు హాహాకారంబులతో మందరవలయితం బగు నాగంబు విడిచికులశైలగుహాంతరాళంబులఁ బడి పరుగులిడ వెనుతగిలి గిరులును తరులును నదులునుసాగరంబులు పురంబులు కాల్చుచుఁ గోలాహలంబు సేయు సమయంబున.

టీక :-

విలయము = ప్రళయము; ఘోష = ధ్వని; బెగడు = భయపడు; నిటల = నుదురు; బడబాగ్ని = సముద్రంలో ఉండే అగ్ని; నిష్ఠురము = కఠినము; బృందారక = వేలుపు.

భావము :-

ఇంకనూ ప్రళయ సమయంలో సముద్రాలన్నీ చేసే అనేక గంభీరమైన ధ్వనులవలె పాల సముద్రము గుభిల్లు గుభిల్లుమంటూ శబ్దంచేయసాగింది. బ్రహ్మాండాలన్నీ అదిరి భయపడి మరలా అందరూ గట్టిగా కేకలు పెడుతున్నాయి. చరాచరములు అన్నీ ప్రళయకాలము వచ్చిందేమో అని ఉన్నపళంగా హృదయములు భయముతో తల్లడిల్లి మూర్ఛనొంది ఒకరిపైనొకరు పడి తూలబోయారు. అప్పుడు సాగరము సరిహద్దులుగా భూమి క్రుంగి వాసుకిపై పడగా వాసుకి కూర్మావతారునిపై పడసాగెను. ప్రళయ కాలాగ్ని వలె, శివుని ఫాలలోచనాగ్ని వలె గొప్పవైన మంటలతో బడబాగ్ని వలె, కఠినమైన ప్రళయకాలము బడబాగ్నివలె. అవన్నీ కలసి వచ్చిన. విధంగా వ్యాపిస్తూ యుంది దేవతలు హాహాకారాలు చేస్తూ మందర పర్వతం చుట్టూ ఉన్న వాసుకిని వదలి కులపర్వతాల గుహలలోకి పరుగులు పెడుతున్నారు. వెంటపడి వస్తూ ఆ విషాగ్నికీలలు కొండలు, చెట్లు, నదులు, సముద్రాలు, పట్టణములు కాలుస్తూ కోలాహలం చేయుచున్న సమయంలో.

3-227-ఆ.

కమలలోచనుండు కమలాధినాథుండు

వనధి డాసి యున్నవాఁడు గాన

కాలకూటవహ్ని గదిసి సోఁకిన రక్త

వర్ణుఁ డంత నీలవర్ణుఁ డయ్యె.

టీక :-

కమలలోచనుడు = పద్మములవంటి కన్నులు కల విష్ణువు; కమలాధనాథుడు = లక్ష్మీపతి; వనధి = సముద్రము; రక్తవర్ణము = ఎరుపు రంగు.

భావము :-

కమలలోచనుడైన లక్ష్మీపతి సముద్రములో కూర్మము వలె దాగియున్నాడు కావున విషాగ్ని వేడి తగిలి ఎర్రని వాడు కాస్తా నీలిరంగులోకి మారాడు.

3-228-క.

అంతసురాసురనాథులు

సంతాపము నొంది బ్రహ్మసన్నిధికి భయ

భ్రాంతులయి పోయి వాణీ

కాంతునిఁ బొడఁగాంచి దీనగతి నవమతులై.

టీక :-

వాణీకాంతుడు = బ్రహ్మదేవుడు; అవమతి = అవమానంపొందినవాడు.

భావము :-

అప్పుడు దేవతలు, రాక్షసులు బాధపడి, భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఆయనను దర్శించి దీనంగా అవమానపడుతబ