పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : హిమవంతుఁడు కన్యాదానము చేయుట.

3-179-క.
తెవాసిన సమయంబునఁ
మేశ్వరుఁ జూడవమ్మ బాలిక యనుచున్
గిరిరాజు మంతనంబునఁ
ళాక్షికి హైమవతికిఁ దావినిపించెన్.

టీక :-
మంతనము = రహస్యము; తరళాక్షి = కదలెడి కన్నులు కలది; హైమవతి = హిమవంతుని పుత్రిక.
భావము :-
తెరతీసిన సమయంలో శివుడిని చూడమని హిమవంతుడు గౌరీదేవిని రహస్యంగా బుజ్జగించి (చెవిలో) చెప్పెను.

3-180-వ.
అంత.
భావము :-
అంతట

3-181-శా.
న్యాదానము చేనెఁ బర్వతుఁడు గంగామౌళికిన్ లగ్న మా
న్నంబైన సురేంద్రమంత్రి కణఁకన్ ర్వంబు సంసిధ్ధమై
జెన్నారం సుముహూర్త మన్నఁ దెరవాసెన్మ్రోసెవాద్యంబు ల
న్యోన్యాలోకన మయ్యె దంపతులకున్ మోహానురాగంబునన్.

టీక :-
కణకన్ = ప్రయత్నము; చెన్నారు = అందమైన; అన్యోన్య = పరస్పరము; ఆలోకనము = చూచు.
భావము :-
లగ్నము దగ్గరకు వచ్చిన సమయంలో బృహస్పతి చక్కగా అన్నీ సిద్ధంచేసుకుని పూనికతో సుముహూర్తం అన్నాడు. అలా అనగానే తెర తీసారు. మంగళవాద్యములు మ్రోగాయి. మోహానురాగంతో దంపతులు ఒకరినొకరు చూసుకున్నారు. పర్వతుడు గంగామౌళికి కన్యాదానము చేసెను.

3-182-క.
దేర పదపద్మంబులు
దేవియు మణిపూజ చేసె దృగ్ధీప్తులచేన్
దేవీవిలాస వననిధి
బావుగ నోలాడఁ జొచ్చె వు చూడ్కుల దాన్.

టీక :-
దృగ్దీప్తులు = చూపుల కాంతి; వన = జలము.
భావము :-
ప్రభువు పాదపద్మములకు శైలజాదేవి తన చూపులనే మణులతో పూజ చేసెను. అయ్యవారుతన చూపులతో తాను గౌరీదేవీ విలాసమనే సముద్రంలో ఓలలాడెను.

3-183-శా.
లీలన్బార్వతి సేసలన్ శివుని మౌళిన్బోసెఁదాఁ గోరికల్
కేలిందోయిటఁ బట్టి శంకరునిపైఁ గీలించెనో నాఁగ న
వ్వేళన్సత్కృప దోయిలించి సతిపై విశ్వేశ్వరుం డిచ్చె నాఁ
బోలన్శంభుఁడు ప్రాలుపోసెఁ దలపైఁ బూర్ణేందుబింబాస్యకున్.

టీక :-
కీలించు = చేరవేయు; పూర్ణేందుబింబాస్య = నిండుచంద్రుని వంటి ముఖము కలది.
భావము :-
తన కోరికలను దోసిట పట్టి శంకరునికి చేరవేసిందా అన్నట్లు పార్వతీదేవి విలాసంగా శివుని తలపై తలంబ్రాలు పోసింది. ఆ సమయంలో దయతలచి ఆమె కోరికలను తీర్చాడా అన్నట్లు శంభుడు పూర్ణేందుముఖికి యైన శైలజాదేవి తలపై దోసిటతో తలంబ్రాలు పోసెను.

3-184-సీ.
దేవాదిదేవుండు తెఱఁగొప్ప నంతలో
తివామహస్తంబు క్కఁ బట్టి
పెద్దింటిలోనుండి పెంపారఁగాఁ బెండ్లి
రుఁగుమీఁదికి వచ్చి ర్ధితోడ
హురత్న పీఠంబుపైనొప్ప వేంచేసి
మలజన్ముఁడు యాజకంబు సేయ
వేదోక్తవిధిని బ్రవేశహోమము చేసి
వెలుపటి కన్యఁ దాపలికిఁ దెచ్చి

3-184.1-ఆ.
యొనర లాజకాదిహోమంబుఁ గావించి
ఱియుఁ దగిన కృత్యముల నొనర్చి
కలలోకభర్త శంభుండు ముదముతో
చలవృత్తి నున్న వసరమున.

టీక :-
వామహస్తము = ఎడమచేయి; కమలజన్ముడు = బ్రహ్మ; యాజక = యజ్ఞము చేయించువాడు; లాజహోమము = వివాహములో పేలాలతో చేసే హోమము.
భావము :-
పరమేశ్వరుడు పార్వతీ దేవి ఎడమచేతిని పట్టుకున్నాడు. పెద్దింటిలోనుండి పెండ్లి యరుగుమీదకి వచ్చెను. కోరి బహు రత్నములచే పొదగబడిన పీటపై కూర్చొనెను. బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో వేదాలలో చెప్పబడినట్లు ప్రవేశ హోమముచేసెను. కుడిప్రక్కనున్న కన్యను ఎడమ ప్రక్కకు తెచ్చి లాజహోమము మొదలైనవి చేసెను. ఇంకనూ చేయవలసిన కార్యక్రమములన్నీ పూర్తిచేసెను. పిమ్మట జగదేకపతి సంతోషంతో నిలకడగానున్న సమయమున....