పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : హిమవంతుపురంబు నలంకరించుట

3-111-వ.
ఇట్లు తన సర్వబంధుజనులకు గౌరీవివాహమహోత్సవం బెఱింగించి పంచిన వారును నిజ బంధుసహితు లై తక్షణంబునఁ జనుదెంచిన.

టీక :-
తక్షణము = ఆక్షణము.
భావము :-
ఇలా తన బంధువులందరికీ గౌరీ వివాహమహోత్సవం గురించి తెలియచేయగా వారంతా వెంటనే రాగా.

3-112-ఉ.
భూరివిలాసుఁ డై త్రిదశపుంగవ సంగతసంగుఁ డై జటా
భాసుధామరీచి మన పార్వతి వెండ్లికి వచ్చుచున్న వాఁ
డాయ నీక్షణం బనుచు నందము గాఁ దన యున్న ప్రోలు శృం
గాము సేయఁ బంచె శుభకౌతుకచిత్రవిభూతి నొప్పఁగన్.

టీక :-
త్రిదశులు = దేవతలు; పుంగవుడు = శ్రేష్ఠుడు; సంగతసంగుడు = కూడాచేరిక కలవాడు; జటాభార సుధామరీచి = బరువైన జటయందు అమృత కిరణాలిచ్చే చంద్రుని ధరించిన వాడు, శివుడు; అరయు = తెలిసికొను; ప్రోలు = పురము; కౌతుకము = అపూర్వ ఉత్సాహము; విభూతి = గొప్ప వైభవము.
భావము :-
గొప్ప విలాసంతో దేవతా సమూహాలతో కూడిన వాడై పరమ శివుడు పార్వతి పెండ్లాడుటకు వస్తున్నాడని హివంతుడు తెలిసికొన్నాడు. వెంటనే తన పురమును అపూర్వఉత్సాహముతో, అందముగా, మంగళకరముగా, మహావైభవంగా తీర్చిదిద్దమని హిమవంతుడు ఆజ్ఞలు జారీచేసెను. సేవకులను నియమించాడు.

3-113-వ.
ఇట్లు పురంబు శృంగారంబు చేయం బంచిన.

టీక :-
శృంగారము = అలంకారము.
భావము :-
ఈ విధముగా హిమవంతుడు పట్టణాన్ని అలంకరించమని ఆజ్ఞాపించగా....

3-114-క.
ణులను గనకంబుల ద
ర్పముల నవ పల్లవముల హువస్త్రములన్
బ్రణుతగతిని నెత్తిరి తో
ములు పురవీధు లందు చ్చల యందున్.

టీక :-
దర్పణము = అద్దము.
భావము :-
మణులు, బంగారము, అద్దములు, లేత చిగుళ్ళు, అనేక రకాల వస్త్రములను తోరణములుగా పురవీధులలోనూ రచ్చబండల చుట్టూ కట్టి అలంకరించారు.

3-115-సీ.
మృగనాభిజలములు ముంగిళ్లఁ జల్లిరి
ముగ్గులు దీర్చిరి ముత్తియములఁ
నర నంగళ్లఁ జిత్తరువులు వ్రాసిరి
హేమకుంభము లెత్తి రిండ్ల నెల్లఁ
హుమార్గములనంది డగలు గట్టిరి
కీలించి కట్టరి మేలుకట్లు
మనీయగతుల వాద్యములు మ్రోయించిరి
యెలమి శృంగారించి రెల్లచోట్లఁ

3-115.1-ఆ.
రఁగ సకలలోకతికి సమర్పింప
నాయితములు చేసి ఖిలమణులు
ర్వజనులు మిగుల సంపద నొందిరి
భూధరేంద్రుఁడేలు పురమునందు.

టీక :-
మృగనాభి = కస్తూరి; ముత్తియము = ముత్యము; చిత్తరువులు = (చిత్రములు) బొమ్మలు; నంది పడగ = నంది బొమ్మ చిత్రించిన పతాకా, టెక్కెము; కీలించు = కూర్చు; మేలుకట్టు = చాందినీ; పరగ = ఒప్పుగా; సంపద = శ్రేయస్సు.
భావము :-
ముంగిళ్ళలో కస్తూరి కలిపిన నీళ్ళు చల్లారు. ముత్యాలతో ముగ్గులు వేసారు. బజార్లలో చిత్రములు గీయించారు. ప్రతి ఇంటిపై బంగారు కలశములనుంచారు. చాలా చోట్ల నందిపడగలు అనుజండాలు కట్టారు. చాందినీలు కూర్చి కట్టారు. కమనీయంగా వాద్యాలు మ్రోగిస్తున్నారు. ప్రతిప్రదేశము అందంగా అలంకరించారు. జగదీశ్వరునకు సమర్పించడానికి అనేక మణులను సిద్ధము చేసుకున్నారు. హిమవంతుని నగరంలో అందరూ చాలా శ్రేయస్సులు కలిగి యున్నారు.

3-116-వ.
మఱియు ననేకప్రకారంబుల నాదిమపురుషుఁడగు విశ్వకర్మచే నిర్మితం బైన యోషధిప్రస్ధపురంబు శృంగారంబుచేయించి తనపర్వతంబునం గల బిలంబులు కొలంకులు సానుదేశంబులు నలంకరించె నగ్గిరీంద్రుం డంత.

టీక :-
బిలము = గుహ; కొలంకులు = సరోవరాలు; సానుదేశములు = కొండచరియలు.
భావము :-
ఇంకనూ అనేక రకాలుగా ఆదిమ పురుషుడైన విశ్వకర్మచే నిర్మితమైన హిమవంతుని నగరమైన ఓషధిప్రస్థపురమును అలంకరించి తన పర్వతములో గల గుహలు, సరోవరాలు, కొండచరియలు అన్నింటినీ ఆ గిరీంద్రుడు అలంకరింపచేసెను. అప్పుడు....

3-117-సీ.
తారకాసురుచేతి దారుణకృత్యముల్
మానుగ నిటమీఁద మాను ననియుఁ
దారలదీధితి లకొని మాయించు
టెంత యింతటఁ గరుణింతు ననియు
రుపెండ్లి చూడ రంని మేరుగిరి చాటు
వారికిఁ జెప్పఁ బోలయు ననియు
గౌరీవివాహలగ్నంబెల్లి ప్రొద్దునఁ
దిరిగి తూర్పునఁ బొడతెంతు ననియు

3-117.1-ఆ.
సంభ్రమించి పెండ్లసాటించి యవ్వలి
దిక్కు మొగము చేసితీవ్రగతుల
కల జారిణీవ్రజంబులు హర్షాబ్ధిఁ
గ్రుంకె నపరవార్ధిఁ గ్రుంకె నినుఁడు.

టీక :-
మానుగ = నిజముగా; దీధితి = వెలుగు; అపర = పడమటి దిక్కు; ఇనుడు = సూర్యుడు.
భావము :-
ఇకపై నిజముగా తారకాసురుని దారుణాలు తగ్గుతాయి. నక్షత్రాల వెలుగు మాయం చేయడం ఎంత పని అయినా ఇంక కరుణిస్తాను. హరుని పెండ్లికి రమ్మని మేరు పర్వత వెనుకప్రక్కల వారికి చెప్పాలి. గౌరీ వివాహ ముహూర్తం రేపు ప్రొద్దునకదా! అప్పటికి తూర్పుకు వస్తాను. అని వేగముగా పెండ్లి గురించి చాటించి పడమటివైపు సముద్రమున అస్తమించాడు. సకల వేశ్యలు ఆనందంలో మునిగిపోయారు.

3-118-క.
లారి పనుపుగూఢ
క్రమున జని వేగుచూచు కాలరుల క్రియన్
లములరాజు గ్రుంకిన
క్రమున నొక్కొక్క చుక్క గానంబడియెన్.

టీక :-
కమలారి = చంద్రుడు; వేగు = గూఢచారి; కాలరి = పదాతి బలములోని బంటు.
భావము :-
సూర్యుడు క్రుంగగానే, చంద్రుడు పంపగా నెమ్మదిగా వచ్చి గూఢచారులలలా క్రమముగా ఒక్కొక్క నక్షత్రమూ కనబడసాగాయి.

3-119-ఉ.
చీఁటి గప్పె నాకసముఁ; జీఁకటి గప్పెదిగీభకుంభముల్;
చీఁటి గప్పె భూతలముఁ; జీఁకటి గప్పెఁ జరాచరాదులన్;
జీఁటి గప్పె దంపతుల చిత్తపయోజవనాంతరంబులన్;
జీఁటి గప్పె లోకములు చీకులు సేయుచు నంతకంతకున్.

టీక :-
దిగీభకుంభములు = దిగ్గజముల కుంభస్థలములు; పయోజము = తామర; చీకు = అంధత్వము ;.
భావము :-
ఆకాశాన్ని, దిగ్గజాల కుంభస్థలాను, భూమండలమంతను, సకల చరాచరములను, దంపతుల మనోకమలములను అడవులందును, సకలలోకములను అంతకంతకు అంధులను చేస్తూ చీకటి కప్పివేసినది.

3-120-వ.
ఇట్లు నిబిడాంధకార బఁధుర పటలంబున నందంబులై భూతజాలంబు సుప్తంబునుం బొంది యున్నసమయంబున.

టీక :-
నిబిడ = దట్టము; బంధుర = దట్టమైన; పటలము = సమూహము; నందము = సంతోషము; సుప్త = నిద్రించినవాడు.
భావము :-
ఈ విధంగా చిక్కని చీకట్లు దట్టంగా వ్యాపించడంతో సంతోషంగా సమస్త ప్రాణులూ నిద్రించియున్న సమయంలో....

3-121-సీ.
త్నాకరము ద్రచ్చ రాజుపుట్టెడువేళఁ
దొడఁగిన యమృతబిందువు లనంగ
మలవైరిని రాహు బళింప నంతంతఁ
దొరఁగు వెన్నెలరేని తునుక లనఁగ
నాకాశలక్ష్మి దా రుని పెండ్లకి నిరు
కేలఁబట్టిన సేసఁబ్రాలనంగ
నిఖిలేశునకు బ్రహ్మ నీలాంబరమున మే
ల్కట్టు కట్టిన మౌక్తికంబు లనఁగ

3-121.1-ఆ.
వీధు లేర్పడంగ వెలుఁగు మెఱుంగుల
చిదుప లమరు భంగిఁ జెలువు మిగిలి
గనవీధినుండి నతర నిబిడాంధ
కారమనియఁ దారకంబు లొప్పె.

టీక :-
రత్నాకరము = సముద్రము; త్రచ్చు = చిలుకు; తొరగు = జారు; సేసబ్రాలు = తలంబ్రాలు, అక్షతలు; మేల్కట్టు= చాందినీ; మౌక్తికము = ముత్యము.
భావము :-
సముద్రాన్ని చిలకడానికి చంద్రుడు పుట్టిన వేళ చెదిరిన అమృత బిందువులా అనేలా; రాహువు చంద్రుని కబళించునపుడు చెదరిన వెన్నెల తునకలా యన్నట్లు; హరుని పెండ్లికి ఆకాశలక్ష్మి రెండు చేతులతో పట్టిన అక్షంతలా యన్నట్లు; శివుని కొరకు బ్రహ్మ నీలాకాశచాందినీకి వ్రేలాడదీసిన ముత్యాల్లా యన్నట్లు; దారి వెతుక్కుంటూ వెలుగు ముక్కలు విస్తరించినట్లు చిక్కని చీకటి కొంత అలిసేలా ఆకాశవీధిలో నక్షత్రాలు మెరిసాయి.