పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : ఈశ్వరుఁడు హాలాహలమును మ్రింగుట.

ఈశ్వరుఁడు హాలాహలమును మ్రింగుట.

3-248-వ.
అని పలికి సకల దేవతా సమేతుండ నై యేగుదెంచి; తదవసరంబున.

టీక :-
తత్ = ఆ యొక్క; అవసరము = సమయము.
భావము :-
అని పలికి దేవతలందరితో కలసి వచ్చి, ఆ సమయములో.

3-249-సీ.
ప్రళయకాలము నాఁటి భానుమండలముల
వెలుఁగులపొది వోలె వెల్గివెల్గి
విలయాగ్నియును బోలి విస్ఫురత్కణముల
గనంబునేలయుఁ ప్పికప్పి
కాలాగ్ని రుద్రుని ఫాలాగ్నియును బోలెఁ
డునమోఘార్చులఁ గ్రాలిక్రాలి
డబాగ్నియునుబోలె డధులుఁదరికొని
డుభయంకరవృత్తిఁ గ్రాచిగ్రాచి

3-249.1-ఆ.
వెన్నుఁ డాది గాఁగ వేల్పుల నెల్లను
ల్లఁజేసి తరులు దులుగిరులు
జీవులనక కాల్చు శితహలాహలమను
హ్నిఁగాంచి కోపహ్నితోడ.

టీక :-
విస్ఫురత్ = విస్ఫురణ అనగా ప్రకాశము, కంపనము కలవి; అర్చి = మంట; జడధి = సముద్రము; దరికొను = కాలు, మండు; వెన్నుడు (వి) = విష్ణువు (ప్ర); శిత = వాడియైన; వహ్ని = అగ్ని.
భావము :-
ఆ హాలాహల యగ్ని ప్రళయకాలంనాటి సూర్యబింబముల సమూహముల వెలిగుల పొది వలె వెలిగిపోతోంది. ప్రళయాగ్ని వలె మిణుకు మిణుకు మెఱుస్తున్న అగ్నికణములతో భూమ్యాకాశములు కప్పివేస్తోంది, కాలాగ్ని రుద్రుని ఫాలాగ్నులులా చాలా మిక్కిలి సాటిలేని మంటలతో సంచలిస్తోంది. సముద్రాన్ని ఇంకింపచేసే బడబాగ్ని వలె కాల్చివేస్తోంది. విష్ణువు మొదలైన వేల్పులను నల్లగా చేస్తోంది. చెట్లు నదులు కొండలు జీవులని చూడకుండా కాల్చేస్తోంది. ఆ వాడియైన హాలాహల యగ్నినిచూసి కోపాగ్నితో.

3-250-వ.
మఱియు నత్యంత విజృంభిత సంరంభమానసుండ నై కరాళించి; హాలాహలకీలంబుఁ గనుంగొని యెదురుకొని; గౌఁగిలింపం గలయు చందంబున బొమలు ముడివడ; నైదు ముఖంబుల నగణితంబులై భుగులుభుగుల్లని మంటలు మిడుఁగురులు నెగయ; సర్వాంగంబులు గుడుసువడ భుజాదండంబులుచాచి బ్రహ్మాండంబులు లోనుగాఁ గల మదీయ దివ్యాకారంబు విడంబించి దుర్నిరీక్షంబై వెలుంగుచున్న కాలకూటంబు నీక్షించి “నిలునిలు. పోకుపోకు” మని యదల్చుచు సమంచితశీతలాలోకనంబుల నతిశీతలంబుఁ గావించి త్రిజగద్భయంకరంబుగా హుంకరించిన సమయంబున.

టీక :-
విజృంభిత = చెలరేగిన; సంరంభము = వేగిరపాటు; కరాళించి = బొబ్బరించి; కీలము = జ్వాల; బొమలు = కనుబొమలు; మిడుగురులు = అగ్ని కణములు; గడుసుపడు = కలగబాఱు; విడంబించు = అనుకరించు; దుర్నిరీక్షణము = చూడరానిది.
భావము :-
ఇంకనూ, మిక్కిలి విజృంభించిన వేగిరపాటు కలవాడనై గట్టిగా బొబ్బలుపెడుతూ హాలాహల జ్వాలను కనుగొని ఎదురుగా వెళ్ళాను. బ్రహ్మాండములన్నీ లోపల యున్న నా దివ్యమైన రూపాన్ని కౌగిలించే విధంగా అనుకూలంగా చేసుకున్నాను. కోపముతో కనుబొమలు ముడిపడ్డాయి. ఐదు ముఖములతో భుగభుగమని అనంతమైన మంటలు అగ్ని కణములు ఎగయసాగాయి. సర్వాంగములూ చుట్టబెడుతూ భుజములు చాచాను. చూడశక్యంకాక యుండి వెలుగిపోతున్న కాలకూటమును చూసి ఆగమని హెచ్చరిస్తూ చల్లని చూపులతో అంతటి విషాగ్నిని అతి చల్లగా చేసాను. మూడు లోకాలూ భయపడేటట్లుగా హుంకరించాను. ఆ సమయంలో....

3-251-ఉ.
ల్లసురేంద్రులున్ బొగడనెంతయుఁ దేజముదూలిపోయి నా
ల్లనిచూడ్కి జల్లనగ త్వరతం జనుదెంచి నూత్నసం
పుల్లపయోజపత్రమును బోలు మదీయ కరాంబుజంబుపై
ల్లన వచ్చి నిల్చె విష ప్పుడు నేరెడుపండు నాకృతిన్.

టీక :-
చూడ్కి = చూపు; సంఫుల్ల = విరిసిన; పయోజ = తామర; పత్రము = రేకు (దళము); అంబుజము = తామరపువ్వు.
భావము :-
దేవేంద్రులందరూ నన్ను పొగడుచుండగా (కాలకూట విషము) తేజము తగ్గి నా చల్లని చూపులకు చల్లబడి వెంటనే వచ్చి అప్పుడే పూర్తిగా విరిసిన పద్మ దళము వంటి నా హస్తపద్మముపైకి మెల్లగా వచ్చి నేరేడు పండు వలె నిలిచింది.

3-252-వ.
ఇట్లు నిలచిన విషానలంబుఁ గనుంగొని.

టీక :-
అనలము = అగ్ని.
భావము :-
అలా నా చేతిలో నిలబడిన విషాగ్నిని చూసి.

3-253-క.
రుహగర్భుఁడు మొదలుగఁ
దేవత లెల్ల మ్రొక్కఁ డు నద్బుతమై
వెలిఁగెడు తద్విషవహ్నుల
మున నే నిలుపుకొంటిఁ గంజాతముఖీ!

టీక :-
జలరుహము = పద్మము; వహ్ని = అగ్ని; కంజాతము = నీటినుండి పుట్టినది.
భావము :-
ఓ పద్మముఖీ! గౌరీదేవీ! నారాయణుడు మొదలైన దేవతలంతా మ్రొక్కుతుండగా చాలా అద్భుతముగా వెలిగే విషాగ్నిని గొంతులో నిలిపి ఉంచుకున్నాను.

3-254-వ.
ఇట్లు గరళభక్షణంబు చేసిన సమయంబున; సకలలోకంబుల వారును జయజయ శబ్దంబుల నతిబల! త్రిజగదభినవ భుజబలాభిరామ! అహోబల బ్రహ్మ విష్ణు మహేశ్వర రూప! అహోబల సోమసూర్యాగ్ని నేత్ర! అహోబల సకలబ్రహ్మాండ నాటక తంత్రావధాన! అహోబల దేవాది దేవ! యని కీర్తించుచు; నూర్ధ్వబాహులై సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి; సంభ్రమంబును సంతసంబును నాశ్చర్యంబును భయంబును భక్తియు సందడింప నిట్లని స్తుతియింపఁ దొణంగిరి.

టీక :-
అహో = ఆశ్చర్యార్థకము; ఊర్ధ్వబాహులు = చేతులు పైకెత్తి.
భావము :-
ఇలా గరళ భక్షణము చేసిన సమయమున సకలలోకాలవారూ జయజయధ్వానాలతో అతిబలా మూడులోకాలలోనూ అభినవమైన భుజబలము కలవాడా! బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా! చంద్రసూర్యఅగ్నులు కన్నులుగా కలవాడా! సకల బ్రహ్మాండములయందునూ నాటక తంత్రములు నడిపేవాడా! దేవాధిదేవా! అహోబల అహోబలా అంటూ అహో నీదే బలమంటూ స్తుతిస్తూ చేతులు పైకెత్తి సాష్టాంగ నమస్కారములు చేసారు. తొట్రుపాటు సంతోషము ఆశ్చర్యము భయము భక్తి కలుగగా ఇలా స్తుతించసాగారు....

3-255-క.
ణము వేఁడిన మమ్మును
రుణన్ రక్షించి విషము గ్రహియించుటయుం
మాశ్చర్యము చేనెను
ణాగతపారిజాత! ర్వజ్ఞనిధీ!

టీక :-
శరణాగత = శరణు పొందినవాడు; సర్వజ్ఞ = అన్నీ తెలిసిన.
భావము :-
శరణు కోరినవారికి కల్పవృక్షము వంటివాడా! సమస్తమూ తెలిసినవాడా! శరణు కోరిన మమ్మల్ని కరుణతో కాపాడి విషాన్ని స్వీకరించడము మాకు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలుగచేసింది.

3-256-క.
క్తుల నుపలాలింపఁగ
క్తుల నిగ్రహము లెల్ల భంజింప దయన్
క్తజనపారిజాతా!
క్తజనాధార! నీకుఁ రఁగు మహేశా!

టీక :-
ఉపలాలనము = బుజ్జగించు; నిగ్రహము = అపకారము; భంజనము = విరుచు; పరగ = ఒప్పు.
భావము :-
భక్తజనులకు కల్పవృక్షము వంటివాడా! భక్తులకు ఆధారమైనవాడా! భక్తులను బుజ్జగించుటయు, భక్తులకు కలిగిన అపకారములను పోగొట్టుటయు మహేశా! నీకే ఒప్పింది.

3-257-క.
దిక్కులు నేలయు నింగియుఁ
జుక్కలు ననలుండు హరియు సూర్యుఁడు యముఁడును
చుక్కలరాయుఁడు పవనుఁడు
నిక్కువముగ నీవె కావె నిర్మలమూర్తీ!

టీక :-
నిక్కువము = యదార్థము.
భావము :-
ఓ నిర్మలమైనవాడా! పరమశివా! దిక్కులు, నేల, నింగి, నక్షత్రాలు, అగ్ని, విష్ణువు, సూర్యుడు, యముడు, చంద్రుడు, వాయుదేవుడు నిజముగా నీవే కదా!

3-258-క.
యుములు సంధ్యలు రాత్రులు
ములు ఋతువులును నెలలు సంవత్సరముల్
ములు దరువులు దినములు
ళ్లు పక్షములు నీవె బాలేందుధరా!

టీక :-
పక్షము = పదిహేను రోజులు; బాలేందు = బాలచంద్రుడు.
భావము :-
బాలచంద్రమౌళీశ్వరా! శంకరా! యుగములు, సంధ్యలు, రాత్రులు, లోకములు, ఋతువులు, మాసములు, సంవత్సరములు, కొండలు, చెట్లు, రోజులు, పగళ్ళు, పక్షములు సర్వమూ నీవే కజా.

3-259-క.
వేదాంతనిమిత్తంబులు
వేదంబులు ధర్మములును విమలాత్మకముల్
వాదంబులు తంత్రంబులు
మోదంబులు నీవె కావె మునిరాజనుతా!

టీక :-
నిమిత్తము = కారణము; మోదము = సంతోషము.
భావము :-
ఓ మునులచే నుతింపబడేవాడా! (1) ఉపనిషత్తులు, (2) కారణములు, (3) వేదములు, (4) ధర్మములు (5) విమలాత్మకములు (6) వాదములు (7) తంత్రములు, (8) మోదములు అన్నీ శంకరా నీవే కదా! వివరణలు: (1) ఉపనిషత్తాదులైన వేదాంతములు; (2) (అ) సమవాయ కారణములు, అసమవాయు కారణములు, నిమిత్తకారణములు అను త్రివిధకారణములు మరొకవిధంగా (ఆ) కాలము, స్వభావము, నియతి, పురుషుడు, కర్మ అని పంచకారణములు మరియొక విధమున (ఇ) స్వభావము, ఈశ్వరుడు, కాలము, యదృచ్ఛ, నియతి, పరిణామము అను షట్కారణముల; (3) ఋక్యజుస్సామాధర్వణ యను చతుర్వేదములు; (4) జాతిధర్మములు, దేశధర్మములు, కులధర్మములు, గుణధర్మములు, ఆపద్ధర్మములు అను పంచవిధ ధర్మములు ; (5) నిర్మలమైనవి సర్వమూ, (6) (అ) సంవాదము, వివాదము అను ద్వివిధ-వాదములు. మరియొక విధమున (ఆ) వాదము, జల్పము, వితండము. అను త్రివిధ-వాదములు మరియొక (ఇ) విధమున ఆరంభ వాదము, సంఘాత వాదము, పరిణామ వాదము, వివర్త వాదము అను చతుర్విధ వాదములు మరియొక విధమున (ఈ) సత్‌ఖ్యాతివాదము, అసత్‌ఖ్యాతి వాదము, అనిర్వచనీయ ఖ్యాతివాదము, అన్యథాఖ్యాతివాదము, ఆత్మఖ్యాతివాదము, అఖ్యాతివాదము అను షడ్విధ-వాదములు; (7) (అ) దేవ తంత్రము, బౌద్ధ తంత్రములు, జైన తంత్రములు అను త్రివిధతంత్రములు, మరియొకవిధమున (ఆ) మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము, అసంప్రేక్ష్యకారిత్వములు అను పంచతంత్రములు మరియొక విధమున ఇవేకాక (ఇ) షష్టితంత్రములు, (ఈ) చతుషష్టితంత్రములు కూడా కలవు; (8) (అ) విషయానందము, యోగానందము, అద్వైతానందము, విదేహానందము, బ్రహ్మానందము అను పంచ-ఆనందములు మరియొక విధమున (ఆ) బ్రహ్మానందము, వాసనానందము, విషయానందము, ఆత్మానందము, అద్వైతానందము, యోగానందము, సహజానందము, విద్యానందము అను అష్టవిధానందమలు (ఆంధ్రభాగతిడాట్.కం వారి సౌజన్యముతో)

3-260-క.
లిమియు లేమియు బుద్ధియు
లునీతులు శూరగుణము భాగ్యంబును బం
ధులుదానంబులు దాతయుఁ
లిదండ్రులు నీవెకాద రుణేందుధరా!

టీక :-
కలిమి = సంపద; తరుణ = కొత్త.
భావము :-
బాలచంద్రమౌళీ! శివా! సంపద కలియుండుట, సంపద లేకపోవుట, మతి, సకల నీతులు, శూరత్వము, అదృష్టము, చుట్టములు, దానములు, దాతయు, తల్లిదండ్రులు సర్వమూ నీవే కదా!

3-261-వ.
మహాత్మా! నిన్ను వేఱువేఱ నెన్న నేల సకలభూతాంతర్యామి వని వినంబడుచుండు. వేదంబులవలన నీ మహిమ కొలఁది వినుతి సేయ వశమే పరమేశ్వరా! పరమభట్టారకా! సచ్చిదానందస్వరూపా!” యని బహుప్రకారంబుల వర్ణించుచున్న కమలసంభవప్రముఖ లైన దేవగణంబులం జరియింప నియోగించి నాటఁగోలె సమస్త జగత్పరిపాలనంబు సేయుచున్నవాఁడ” నని మఱియు నమ్మహాదేవుండిట్లనియె.

టీక :-
భట్టారక = ముని; చరియించు = తిరుగు, మెలగు; నియోగించి = ఆజ్ఞాపించి; నాటఁగోలె = ఆరోజు మొదలుకొని.
భావము :-
మహాత్మా! నిన్ను వేరువేరుగా యెంచి చెప్పడమెందుకు. నీవు సర్వాంతర్యామివి. వేదముల వలన నీ మహిమ చెప్పడం సాధ్యము కాదు. పరమేశ్వరా! పరాభట్టారకా! సచ్చిదానందస్వరూపుడా!” అంటూ రకరకాలుగా వర్ణిస్తున్న బ్రహ్మ మొదలుగా గల దేవతలను తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపించి అప్పటినుండి లోకాలను పాలిస్తున్నాను.” అని ఇంకా మహాదేవుడు ఇలా అన్నాడు.

3-262-క.
“గళము మ్రింగినకతమున
ళగళుం డండ్రు జనులు జపతిగమనా!
ళము మ్రింగినచందము
రుణీ! వినుపింపవలసెఁ ద్దయు నీకున్.

టీక :-
కతము = కారణము; తద్దయు = విస్తారము.
భావము :-
గజగమనా! తరుణీ! గౌరీదేవీ! గరళము మింగినందువలన జనులు గరళగళుండు అన్నారు. గరళము మింగిన విధానము నీకు వివరముగా చెప్పవలసి ఉన్నది.

3-263-సీ.
రమొప్ప నీ నీలకంఠ స్తవంబులో
బలయేకశ్లోక మైనఁజాలుఁ
రమొప్పనీ నీలకంఠ స్తవంబులో
బలయర్ధశ్లోక మైనఁజాలుఁ
రమొప్పనీ నీలకంఠ స్తవంబులో
బలపాదశ్లోక మైనఁజాలుఁ
రమొప్పనీ నీలకంఠ స్తవంబులో
బల కించిన్మాత్ర మైనఁజాలుఁ

3-263.1-ఆ.
విమలభక్తితోడ వినినఁ బఠించిన
జ్జనుండు సకలసంపదలును
లిగి భవము లేక కైలాసవాసుఁడై
న్నుఁజేరియుండు లిననేత్ర!”

టీక :-
కరమొప్ప = మిక్కిలి ప్రకాశించేలా; స్తవము = స్తోత్రము.
భావము :-
అబలా! గౌరీదేవీ! ఈ నీలకంఠ స్తవములో ఏ ఒక్క శ్లోకమైనా చాలు లేదా అర్థ శ్లోకమైనా చాలు లేదా ఒక పాదమైనా చాలు లేదా కనీసం ఏ కొంచమైనా చాలు నిర్మలమైన భక్తితో విన్నా, చదివినా ఆ సజ్జనులకు సకల సంపదలూ కలిగి పుట్టుక లేక కైలాసవాసుడై నన్ను చేరి యుంటాడు.