పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : దేవతలుబ్రహ్మను వేఁడుట.

3-229-వ.
ఇట్లు విన్నవించిరి.
భావము :-
సురాసరలు బ్రహ్మదేవునికి ఇలా విన్నవించారు.

3-230-శా.
దుగ్ధాంభోనిధిశాయి దోడుగ భుజాదుర్వారదర్పోన్నతిన్
దుగ్ధాంభోధి మథించుచో విషశిఖల్ తోరంబులై పుట్టి ని
ర్ధగ్ధున్జేసె రమేశ్వరున్ వెనుకొనెన్ దైత్యామరశ్రేణి సం
దిగ్ధంబయ్యె జగంబు లింక నణఁచున్ దెల్లంబు వాణీపతీ!

టీక :-
దుగ్ధాంభోనిధిశాయి = పాలసముద్రమున పండుకొని యుండెడువాడు, విష్ణువు; దుర్వార = వారింపరాని; తోరము = అధికము; నిర్దగ్ధ = కాల్చబడిన; రమేశ్వరుడు = విష్ణువు; వెనుకొను = వెంబడించు; తెల్లము = స్పష్టముగా తెలియు.
భావము :-
ఓ బ్రహ్మదేవా! క్షీరసముద్రాన్ని విష్ణువు సహాయంతో వారింపరాని మా భుజబలముసతో చిలుకగా అధికంగా విషజ్వాలలు పుట్టి విష్ణువును కాల్చేయసాగాయి. విషజ్వాలలు సురాసురులను వెంబడించసాగాయి. ఇక సకల లోకాలను అణచేస్తుంది ఇది తత్యం. దీనిని అణిచే మార్గం స్పష్టంచెయ్యి.

3-231-వ.
అనిన బ్రహ్మదేవుం డిట్లనియె.
భావము :-
ఆలా అడిగిన దేవతలతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు.

3-232-మ.
దినాచేత నణంగ నేరదు వినుం డీరేడులోకంబులన్
త్రిశుం డెవ్వఁడు వాఁడు దీని నణఁచున్ దేవాసురవ్రాతమా!
త్రిశారాధ్యుని భక్తవత్సలు మహాదేవున్ శివుం గాంచి యా
పిపన్ రం డని బ్రహ్మ యొయ్య నరుగన్ బృందారకవ్రాతమున్.

టీక :-
ఈరేడు = పదునాలుగు; త్రిదశులు = ఎప్పటికీ ముప్పది ఏండ్ల వయసు ఉండేవారు,దేవతలు; వ్రాతము = సమూహము; త్రిదశారాధ్యుడు = దేవతలచే ఆరాధించబడు శివుడు; ఒయ్యన = మెల్లగా, చప్పుడు లేకుండా; అరుగు = వెళ్ళు; బృందారకవ్రాతము = దేవతా సమూహము.
భావము :-
ఇది నాచేత అణగదు. సురాసుర సమూహములారా! వినండి. ఈ పదునాలుగు భువనాలకు దేముడెవ్వడో వాడే దీనిని అణచివేయగలడు. దేవతలు ఆరాధించే భక్తవత్సలుడు, మహాదేవుడుయైన శివుని దర్శించి తరువాత రండని బ్రహ్మ మెల్లగా వెళ్ళిపోయెను. అప్పుడు దేవతా సమూహము....