పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : బ్రహ్మాదులునమస్కరించి మన్మథుని వృత్తాంతముఁ దెల్పుట.

3-185-క.
దేతలు మునులు బ్రహ్మయు
దేవేంద్రుఁడు గూఁడి మ్రొక్కి ధృతి నవనతులై
“భాజసంహరణ! మహా
దేవా!యవధారు దేవదేవ! మహేశా!

టీక :-
ధృతి = నిబ్బరము, ధైర్యము; అవనతులు = తలవంచి నమస్కారము చేసినవారు; భావజుడు = మన్మథుడు; అవధారు = దయతో విను.
భావము :-
దేవతలు, మునులు, బ్రహ్మ, దేవేంద్రుడు మొదలైనవారంతా కలసి మ్రొక్కారు. నిబ్బరంగా తలవంచి నమస్కరించి, “మన్మథ సంహారా! మహాదేవా! దేవదేవా! మహేశా! దయచేసి మా విన్నపాన్ని వినండి.

3-186-సీ.
శాన! మే మెల్ల యీమంగళము చూడ
భావించి రప్పించి పంచబాణుఁ
బుత్తేరఁగా వచ్చె భూతేశ! మీ యెడ
తఁడు భక్తుండు మీ డుగులాన
కాము చేసిన తప్పు గౌరీశ! మమ్మును
న్నించిసైరించి మానితముగఁ
గంతు నాకారంబు ఱకంఠ కృపచేసి
యిమ్మని మ్రొక్కిన నీశ్వరుండు

3-186.1-ఆ.
క్తవత్సలుండు పార్వతికన్నియ
మోముచూడఁ బుట్టె కాముఁడంత
నాగధరుని పెండ్లి నాలుగు దినములు
ప్రీతితోడ నుండెఁ బెంపు మిగిలి.

టీక :-
సైరించు = క్షమించు; మానితము = మన్నింపబడిన; కంతు = మన్మథుడు.
భావము :-
ఈశ్వరా! మేమంతా ఈ శుభకార్యము చూడాలనే మన్మథుని రప్పించి పంపితేనే అతను మీ వద్దకు వచ్చాడు. అతను మీ భక్తుడు. మీ పాదాలపై ఒట్టు. కాముడు చేసిన తప్పుకు మమ్మల్ని మన్నించి, క్షమించి దయచేసి మన్మథునికి రూపు తిరిగి యీయ” మని ప్రార్థించగా భక్తవత్సలుడైన ఈశ్వరుడు పార్వతి వంక చూడగా కాముడు పుట్టెను. నాగాభరణుడు పెండ్లి నాలుగురోజులూ ఆనందంగా యున్నాడు.

3-187-వ.
అయ్యవసరంబున.
భావము :-
ఆ సమయంలో.

3-188-ఉ.
మ్మరునాఁడు రేపు తుహినాచలనాథుఁడు కూతుఁ బార్వతిన్
మ్మని చేరఁ బిల్చి “నిను రాజకళాధరు కిచ్చినట్టి భా
గ్యమ్ముఘటించె” నంచుఁ బులల్మెయి నిండఁగ నంతబాష్పముల్
గ్రమ్మశిరంబు మూర్కొనుచు గౌరతమై కురు లెల్ల దువ్వుచున్.

టీక :-
రాజకళాధరుడు = చంద్రధరుడు; మూర్కొను = వాసనచూచు.
భావము :-
ఆరవ రోజున హిమవంతుడు కూతురైన పార్వతిని రమ్మని దగ్గరకు పిలిచి “నిన్ను చంద్రశేఖరునకిచ్చిన అదృష్టము నాకు దక్కింది.” అంటూ శరీరం పులకించగా కన్నుల ఆనందభాష్పములు నిండగా తలను వాసన చూసి, కురులు దువ్వుతూ.