పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : ఆశ్వాసాంతము

3-264-వ.
అని మహాదేవుండు దేవికిం జెప్పె" నని చెప్పి తదనంతరంబ.

టీక :-
తదనంతరంబ = ఆ తరువాత.
భావము :-
అని మహాదేవుడు దేవికి చెప్పెను. ఆ తరువాత.....

3-265-మత్త.
నావాహనరంజనా! మదనాగవిద్విషభంజనా!
నాదానవఖండనా! మునినాథ సాగరమండనా!
యోగిరాజసమానచిత్త పయోజ షట్పద వేషణా!
నాభూషితభూషణా! శరణాగతామరపోషణా!

టీక :-
నాగము = సింహము; నాగము = పాము; నాగము = ఏనుగు; మండనుడు = నుతింబడువాడు; పయోజ = తామర; షట్పదము = తుమ్మెద.
భావము :-
సింహ వాహిని యైన దుర్గను రంజింప చేయువాడా! పాము విషమును విరిచేవాడా! గజాసురుని అంతమొందించినవాడా! మునినాథ సమూహములచే నుతింపబడువాడా! యోగిరాజుల మనస్సనే తామరలపై వాలు తుమ్మెద వంటివాడా! పాములను అలంకారముగా ధరించేవాడా! శరణుకోరు దేవతలను పోషించేవాడా!

3-266-క.
శ్రీనీలరుచిర కంధర!
మానిత త్రిపురాంబురాశి మందర! గౌరీ
పీపయోధరయుగళ
స్థాపరీరంభమోదసంరంభ! శివా!

టీక :-
శ్రీ = విషము; నీల = నలుపు; రుచిర = అందమైన; కంధరము = మెడ; మానిత = పూజింపబడే; త్రిపురాంబురాశి (స్వర్గ భూ పాతాళ లోకములలో ప్రవహించెడి నది) గంగ; మందర = పాగా; పీన = బలిసినది; పయోధరయుగళము = కుచద్వయము; పరీరంభము = ఆలింగనము; మోదము = సంతోషము; సంరంభము = వేగిరపాటు.
భావము :-
విషము చేత నల్లబడిన అందమైన కంఠము కలవాడా! పూజనీయురాలైన గంగదేవికి కల్పవృక్షము వంటివాడా! గౌరీ ఆలింగమునకు వేగిరపడేవాడా! శివా!

3-267-మా.
లనయనబాణా! ప్రస్ఫురత్పంచబాణా!
మితగుణకలాపా! చ్యుతానందరూపా!
విలకమలనేత్రా! విశ్వతంత్రైకసూత్రా!
ప్రథనుతగభీరా! పార్వతీచిత్తచోరా!

టీక :-
కమలనయనుడు = విష్ణువు; బాణం = రవము; ప్రస్ఫురత్ = ప్రకాశించే; కలాపము = సమూహము; అచ్యుత = స్థిరముగా యుండే; తంత్రము = కారణము; గభీర = గాంభీర్యము.
భావము :-
త్రిపురాసుర సంహారమున విష్ణువును బాణముగా ధరించినవాడా! పంచబాణుడైన మన్మథునికి తిరిగి ప్రకాశమిచ్చినవాడా! అమితమైన గుణ సమూహము కలవాడా! శాశ్వతమైన ఆనందరూపము కలవాడా! నిర్మలమైన కమలములవంటి నేత్రములు కలవాడా! ప్రపంచాన్ని నడిపే హేతుభూతమైనవాడా! ప్రమథ గణములచే పొగడబడే గాంభీర్యము కలవాడా! పార్వతి మనసు దోచినవాడా!.

3-268-గ.
ఇది శ్రీ మన్మహేశ్వర యివటూఠి సోమనారాథ్యా దివ్య శ్రీపాదపద్మారాధక కేసనామాత్యపుత్త్ర పోతయనామధేయ ప్రణీతంబైన శ్రీవిరభద్రవిజయం బను మహాపురాణ కథ యందు మహాదేవు పంపున మునులు వోయి; ముద్రారోపణంబు చేసి వచ్చుటయు; హరి విరించ్యాదిబృందారక సేవితుం డై యీశ్వరుండు వివాహంబునకుం జనుటయు; హిమ నగేంద్రుని మహోత్సవంబున భూమిక్రుంగిన శంభుపంపునం గుంభజుం డరిగిన నత్యంత సమతలం బై యుండుటయును; గౌరీవివాహంబును; భవానీశంకర సంవాదంబును; దేవ దాన వోద్యోగంబును; కాలకూట సంభవంబును; దానిఁ బరమేశ్వరుండు పరహితార్థం బై యుపసంహరించి నీలకంఠుండ నైతి నని యానతిచ్చుటయు; నన్నది తృతీయాశ్వాసము.

టీక :-
విరించి = బ్రహ్మ; కుంభజుడు = అగస్త్యుడు; ఉద్యోగము = యత్నము.
భావము :-
ఇది సోమనారాధ్యులైన యివటూరి కేసనామాత్యుని పుత్రుడైన పోతన రచించిన శ్రీ వీరభద్ర విజయం అను మహాపురాణ కథయందు మహాదేవుడు పంపగా మునులు వెళ్ళి ముద్రారోహణము చేసి రావడము; బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మున్నగు దేవతలచే సేవించబడుతూ ఈశ్వరుడు వివాహమునకు వెళ్ళుటయు; హిమవంతుని మహోత్సవమునకు భూమి క్రుంగగా ఈశ్వరుడు అగస్త్యును పంపి సమతలముగా చేయించుటయు; గౌరీ కళ్యాణము; భవానీ శంకరుల సంవాదము; దేవదానవుల యత్నము; కాలకూట విషము పుట్టడము; దానిని పరమేశ్వరుడు పరులమేలు కొరకు కంఠములోనుంచుకొని నీలకంఠుడయ్యానని శివుడు చెప్పుట యన్నది తృతీయాశ్వాసము.