పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : అంగనాజనంబులీశ్వరునిఁ జూడవచ్చుట.

3-143-ఉ.
కాలునిఁ గెల్చి లీలమెయిఁ గాముఁబరాజితుఁ జేసి కొండరా
చూలికిఁ జిక్కి జూటమున చుక్కలరేని ధరించి జాణఁ డై
వేలుపుటేటిమిండఁ డొగి వేడుక వచ్చుచు నున్నవాఁడు నీ
లాకలార! రండు మనమారఁగఁ జూతము కోర్కి దీరఁగన్.

టీక :-
కాలుడు = యముడు; కాముడు = మన్మథుడు; జాణడు = విలాసవంతుడు; వేలుపుటేరు = గంగ; మిండ = పురుషుడు, వృత్తియందు మిండఁడునకు మీఁదివర్ణము లోపింపఁగా మిగిలిన రూపము. (ఉదా. మిండతపసి; మిండతుమ్మెద); ఒగి = క్రమముగా; నీలాలకలు = నల్లని ముంగురులుకల అందగత్తెలు; మనమారగ = మనసుతీరా.
భావము :-
“నల్లని కురులు కల అందగత్తెలారా! యముని దండించినవాడు, మన్మథుని ఓడించినవాడు, జూటమున చంద్రుని ధరించినవాడు, గంగమ్మమగడు కొండలరాజు కుమార్తెకు చిక్కి, విలాసపురుషుడై వస్తున్నాడు. రండి. మనసారా కోరికతీరా చూద్దాము.

3-144-చ.
పుహరుఁ జూడ రండు శివుఁ బూర్ణమనోరధుఁ జూడ రండు ని
ర్జనుతుఁ జూడ రండు నెఱజాణనిఁ జూడఁగ రండు యిందుశే
రుమదిఁ జూడ రండు విషకంధరుఁ జూడఁగ రండు దేవశే
రుశివుఁ జూడ రం” డనుచుఁ గాంత లనంతమనోరథంబులన్.

టీక :-
పురహరుడు = త్రిపురాలను నాశనం చేసినవాడు, పరమశివుడు; పూర్ణమనోరథుడు = కోరికలు తీరినవాడు;, పరమశివుడు; నిర్జరులు = దేవతలు.
భావము :-
త్రిపురాంతకుడు, పూర్ణమనోరథుడు, దేవతలు కీర్తించేవాడు, నెఱజాణుడు, చంద్రశేఖరుడు, గరళకంఠుడు, దేవశేఖరుడు యైన శివుని చూడడానికి రం” డనుచు కాంతలు చూడాలనే మిక్కలి కోరికతో వచ్చిరి.

3-145-చ.
కలతాసమూహములొ కాఱుమెఱుంగులొ కాముదీములో
సిజబాణజాలములొ న్మథరాజిత లక్ష్ములో యనం
వగు మోహజాలములొ క్కనిచుక్కలొ చంద్రరేఖలో
నఁగఁ దలోదరుల్ త్రిభువనాభినవప్రభ లుల్లసిల్లఁగన్.

టీక :-
మెఱగు = మెరుపు; దీము = సాకి తీర్చిన పిట్ట, దీమము (వేటగాడు ఎరగా పన్నినది) నకు రూపాంతరము; అంసనకుంట = చేపలుండే ప్రదేశం; ఉల్లసిల్లు = ప్రకాశించు.
భావము :-
శివుని చూడవచ్చిన ఆ సన్నని ఉదరము గలవారు, మూడు లోకాలలోని కొత్త కాంతులతో ప్రకాశిస్తున్నవారు ఐన ఆ అంగనామణులు. బంగారు తీగెలో, నల్లని మేఘంలో తెల్లని మెఱుపులో, మన్మథుడు తీర్చి దిద్దిన పిట్టలో, మన్మథుడు వేటకోసం పన్నిన ఎరలో, మన్మథ బాణములో, ప్రకాశించే మన్మథ లక్ష్ములో, మోహపు వలలో, చక్కని చుక్కలో, చంద్రరేఖలో యనేటట్లు యున్నారు

3-146-ఉ.
బాలు వూర్ణ యౌవనలుఁ బ్రౌఢలు లోలలుఁ బుణ్యపణ్య నీ
లాక లంబుజాత విమలానన లోలి నలంకరించుచో
వేలుపురేని దా వెలయ వీనులఁ బూజలు సేయుచాడ్పునన్
గ్రాలిన హేమపత్రములు ర్ణములం దిడి వచ్చె నోర్తుదాన్.

టీక :-
ప్రౌఢ = మధ్య వయస్కురాలు; పుణ్య = మనోజ్ఞమైన; పణ్య = పొగడదగినది; నీలాలకలు = నల్లనిముంగురులు కలవారు; అంబుజాతలు = పద్మముల వంటివారు; విమలాననలు = నిర్మలమైన ముఖము కలవారు; ఓలి = వరుసగా; వేలుపురేడు = దేవాధిదేవుడు; వీనులు = చెవులు; క్రాలు = అల్లలాడు; ఓర్తు = ఒకర్తె; వెలయించు = ప్రకటించు; చాడ్పు = విధము.
భావము :-
చిన్న పిల్లలు, పూర్ణ యవ్వనవతులు, మధ్య వయస్కులు, లోలత్వం కలవారు, మనోజ్ఞమైన పొగడదగిన నల్లని ముంగురులు కలవారు, పద్మముల వంటి నిర్మలమైన మోము కలవారు వరుసగా అలంకరించుకొని వస్తే ఒకామె తాను దేవదేవునికి చెవులతో పూజచేయ వచ్చిందా అన్నట్లు చెవులకు అల్లలాడే బంగారు రేకులు ధరించి వచ్చెను.

3-146-మ.
తిమై తుమ్మెద మొత్తముల్ కమలపంక్తింగప్పు భావంబునన్
రినీలాంచిత మేఖలావళులు దా మందంద శీఘ్రంబుగన్
రుఁజూడన్ బఱతెంచు వేగమునఁ బాదాంభోజ యుగ్మంబులన్
రఁగన్ బాఱుచు మ్రోల నేఁగిరి సతుల్ ఫాలాక్షు నీక్షింపఁగన్.

టీక :-
తిరము = స్థిరము; మొత్తము = తుమ్మెదల గుంపు మొత్తము; హరినీలము = ఇంద్రనీలమణి; మేఖల = నడుముకు కట్టుకొను ఆభరణము, వడ్డాణము; యుగ్మము = రెండు (జత); పాఱుచు = పరుగెడుతూ; మ్రోల = ఎదురు; ఈక్షించు = చూచు.
భావము :-
నిలకడగా తుమ్మెదలగుంపులు కమలముల సమూహాలను కప్పినట్లు, ఆ వనితల పద్మాల వంటి నడుముల వడ్డాణములు అక్కడక్కడ నీలాలు పొదిగబడి ఉన్నాయి. శివుని చూడడానికి వేగంగా వెళుతున్న వారి పాదాలు పద్మాలలా ఉన్నాయు. అటువంటి నడుములు, పాదములు చక్కగా ఒప్పుతుండగా,ఫాలాక్షుడైన శివుని చూచుటకు సతులు పరుగెడుతూ ఎదురకు వెళ్ళిరి.

3-148-క.
మృడుఁజూచు లోచనంబులఁ
దొరి మదాంధముల నెల్లఁ దొలఁగఁగ నిడి తా
వెలించిన క్రియ నొక్కతె
కంటం బారఁ దీర్చెఁ గాటుక రేఖల్.

టీక :-
మృడుడు = భక్తులను సంతోషపెట్టువాడు, శివుడు; లోచనములు = కళ్ళు; మదాంధములు =మదముతో కళ్ళుమూసుకొనిపోవు.
భావము :-
భక్తులను సంతోషపెట్టే శివుని చూసే కళ్ళకు తన మదాంధత్వాన్ని బయటకు తోసినట్లు ఒకతె కంటి కొనల చివర పొడవుగా కాటుక రేఖలు తీర్చెను.

3-149-క.
త్తఱి నొక్కతె పదముల
త్తుక హత్తించి క్రొత్తత్తుకతో న
చ్చొత్తిన కమలంబులగతి
జొత్తిల్లన్ జంద్రమౌళిఁ జూడఁగ వచ్చెన్.

టీక :-
అత్తఱి = ఆ సమయమున; లత్తుక = లాక్షారసము; జొత్తిలు = ఎర్రనగు.
భావము :-
ఆ సమయంలో పాదాలకు లత్తుక రంగు పూసి కొత్త ఎర్రకాంతితో పుట్టిన పద్మంలా ఎర్రని పాదాలతో ఒకతె చంద్రమౌళిని చూచుటకు వచ్చెను.

3-150-చ.
అడుగుల నశ్వవేగ మిభయానకు నంచుఁ జెలంగుపోలికన్
గడుకొని పాదపద్మముల ఘల్లని యందెలు మ్రోయఁ జెచ్చెరన్
తొడవులు వేడుకం దొడిగి తొయ్యలి యొక్కతె పుష్పమాల క్రొ
మ్ముడిపయిఁ గానరాఁజెదిరి ముందట వచ్చె మహేశుఁ జూడగన్.

టీక :-
అశ్వము = గుఱ్ఱము; ఇభయాన = ఏనుగు వలె నడచునామె; చెచ్చెర = శీఘ్రముగా; తొడవులు = భూషణములు; తొయ్యలి = స్త్రీ.
భావము :-
ఒకామె భూషణములు ధరించి, జడముడిపై పూలమాల జారుతుండగా, ఏనుగులా నడిచే స్త్రీ గుర్రము వేగముతో నడచినట్లు. పాదాల అందెలు ఘల్లని మ్రోగుచుండగా వేగముగా మహేశ్వరుని చూచుటకు వచ్చెను.

3-151-మ.
మేశుం బరికించు సంభ్రమగతుల్ భావంబు లో నెంతయున్
స్ధిమై యొప్పిన లోలతం గదియఁ దా శృంగారమున్ జేయఁగాఁ
మర్ధిన్ మఱపొంది యెంతయును శృంగారంబుగా వచ్చె స
త్వయై మోదముఁ బొంది యొక్క సతి కైల్యాధిపుం జూడఁగన్.

టీక :-
సంభ్రమము = వేగిరపాటు; కదియు = దగ్గరగా వచ్చు.
భావము :-
నిలుకడగా అలంకరించుకుంటున్న ఆమె, పరమేశ్వరుని చూడాలనే తొందరపాటులో లోలత్వం పొంది, చేతిలో పని మరచి అలంకారము పూర్తి కాకుండా సంతోషముతో కైవల్యాధిపుని చూచుటకు బహు చక్కగా వచ్చెను.

3-152-క.
డురాజధరల కెల్లను
దొవయ్యెడు నాకుఁ దొడవుఁ దొడుగఁగ నేలా
తొవులు దొడిగినఁ గొఱఁతని
యుడురాజోత్తమునిఁ జూడ నొక్కతె వచ్చెన్.

టీక :-
ఉడు = నక్షత్రము; దొడవ = కురూపి; తొడవు = భూషణములు.
భావము :-
“చంద్రకళాధరులందరికీ భూషణము వంటిదానిని యైన నేను భూషణములు ధరించుటెందుకు? ఆభరణాలు ధరించినా తక్కువే.” యని ఒకతె అలంకారాలు లేకుండానే చంద్రశేఖరుని చూచుటకు వచ్చెను.

3-153-క.
మారారికిఁ దిలకం బగు
తారాపతి గేలిసేయఁ లఁచిన భంగిన్
నీజలోచన తిలకము
చారుగతిని గప్పుర మిడి య్యన వచ్చెన్.

టీక :-
మారారి = మదనుని శతృవైన శివుడు; తారాపతి = చంద్రుడు; నీరజలోచన = పద్మాక్షి.
భావము :-
శివునికి తిలకము వలెనున్న చంద్రుని పరిహసించే విధంగా ఒక పద్మాక్షికర్పూరమును (కర్పూరము తెల్లగా ఉంటుంది) తిలకము వలె పెట్టుకొని వచ్చెను.

3-154-సీ.
న్నీట మృగమదపంకంబు మేదించి
నిపుణత మైదీఁగె నిండ నలఁది
తురలై కొప్పుల డచొళ్లెములువెట్టి
లీలమైఁ బుష్పమాలికలు చేర్చి
హువస్త్రములుగట్టి పాలిండ్లకవలకు
ల్లల్లమాటుపయ్యదలు దిగిచి
వివిధభూషణములు వెఱవొప్ప ధరియించి
నపారములఁదిలములు వెట్టి

3-154.1-ఆ.
ఖిలభువనమోహనాకారములు గ్రాలఁ
బూర్ణచంద్రుఁ బోలు మోము లమర
విశ్వనాధుఁ జూడ వేడుక దళుకొత్త
సంతనమునఁ బురముకాంత లెల్ల.

టీక :-
మృగమద పంకము = కస్తూరి; మేదించు = మర్దించు; చొళ్ళియము = జడచుట్ట; ఘనసారము = కర్పూరము.
భావము :-
పన్నీరులో కస్తూరిని బాగా మర్దించి మెరుపులాంటి శరీరానికి పూసుకున్నారు. చతురతతో కొప్పులవద్ద జడ చుట్టలు చుట్టారు. వాటిని పూలమాలలతో అలంకరించారు. రకరకాల వస్త్రాలు ధరించారు. పాలిండ్లపై మాటుగా పయ్యెదలు వేసుకున్నారు. ఆద్భుతమైన వివిధ భూషణములు ధరించారు.కర్పూర తిలకములు దిద్దుకున్నారు. అలా చంద్రముఖులైన ఆ పురకాంతలు విశ్వమోహనాకారులై విశ్వనాథుని వీక్షించడానికి విచ్చేసిరి.

3-155-వ.
ఇట్లు విలసితాలంకారంబున.

టీక :-
విలసిత = ప్రకాశింపబడిన.
భావము :-
ఈ విధముగా ఆ పురకాంతలు అలంకారాలతో ప్రకాశించినవారై.

3-156-ఉ.
చంలనేత్రి “దాను దనన్నులుఁ గన్నులు ముద్దుమోములున్
బంశరాపహారికిని భాతిగ నల్లనఁ జూపి చూడ్కి నా
టించెద నేర్పు లెల్లఁ బ్రకటించెద లోలత నన్ను డాయ ర
ప్పించెద మన్మధుం గెలుచు బీర మణంచెద చూడు బాలికా!

టీక :-
చంచలనేత్రి = కదలెడి కన్నులు కలది; పంచశరాపహారి = శివుడు; భాతి = కాంతి; తానుచూడ్కి = చూపు.
భావము :-
ఒక చంచలనేత్రి తన చెలితో “తాను తన చన్నులు, కన్నులు, ముద్దు ముఖము ఆ మదనారికి కాంతితో మెల్లగా చూపి చూపులు తనవైపు తిప్పేలా నేర్పుగా చేసి లోలత్వంతో తన వద్దకు వచ్చేలా చేసి మన్మథుని గెలిచానన్న గర్వము అణచివేస్తాను. చూడు బాలికా! అన్నది.

3-157-ఉ.
క్కటి చెప్పెదన్ వినుమయొయ్యన రమ్ములతాంగి! నేఁడు నా
క్కదనంబు చూచి మదసామజచర్మధరుండు శూలి దా
చిక్కునొ చిక్కఁడో నిజము చెప్పుము నాకుఁ గురంగలోచనా!
చిక్కినఁ జిక్కకున్న మఱి చెల్వలతో వినుపింపకుండుమీ.”

టీక :-
ఒయ్యన = మెల్లగా; సామజము = ఏనుగు; కురంగము = లేడి.
భావము :-
లతాంగీ! లేడికన్నుల చిన్నదానా! ఇలా రా. ఒక విషయం మెల్లగా చెప్తాను. విను. నేడు నా అందము చూసి మదగజచర్మధారి, శూలియైన శివుడు తాను నాకు చిక్కుతాడొ చిక్కడో నాకు చెప్పు. నాకు చిక్కినా చిక్కకపోయినా మన చెలులకు మాత్రం చెప్పకు సుమా!” అని ఆమె అనెను

3-158-శా.
లోలాక్షీ! తగు నీదు విభ్రమమునాలోకించి కామార్ధియై
వాలాయంబుగఁ జిక్కుఁ జంద్రధరుఁ డో వామేక్షణా! నేఁడు శ్రీ
కైలాసాద్రివిభుండు పొందు ఘనగంగావాహినీమౌళి నా
శూలింగన్నియ చూడ్కి లోఁబఱచు నంచున్దారు గీర్తించుచున్.

టీక :-
లోలాక్షి = కదలెడి కన్నులు కలది; విభ్రమము = శృంగారచేష్ట; ఆలోకించు = చూచు; వాలాయము = అనివార్యము; వామేక్షణ = అందమైన చూపు కలామె, సుందరి.
భావము :-
“సుందరీ! నీ శృంగార చేష్టలను చూసి కామార్థియై తప్పకుండా ఆ చంద్రధరుడు నీకు చిక్కుతాడు. నీ చూపులతో ఆ కైలాసాద్రి విభుని, గంగాధరునిశూలిని లోబరచుకుంటావు.” అని ఆ చెలులు ఆమెను కీర్తించారు.

3-159-వ.
ఇట్లు బహుప్రకారంబులఁ దమలో నొండొరులు నుపశమించుచు మన్మధాలాపంబులు పలుకుచున్నమన్మధోత్సాహమానసు లై సంభ్రమంబున.

టీక :-
ఉపశమించు = శాంతించు; సంభ్రమము = వేగిరపాటు.
భావము :-
ఈ విధముగా తమలో తాము రకరకాలుగా మన్మథ తాపము శాంతించేలా మధురంగా మాట్లాడుతూ వేగిరిపాటుతో.

3-160-సీ.
కుంభికుంభముఁ బోలు కుచకుంభభరమున
వెడవెడనడుములు వీఁగియాడ;
బాలేందుఁడునుబోలు ఫాలస్థలంబున
నీలకుంతలములు దూలుచుండఁ;
జారుచక్రముఁ బోలు ఘనచక్రంబుల
మరఁగట్టిన మేఖములు వీడఁ;
బంకజంబులఁబోలు పాదయుగ్మంబుల
డివడినడుఁగులు డఁబడంగ

3-160.1-ఆ.
గోపతీశుఁ జూచు కోర్కులు ముడివడఁ;
జేడె లొకతొకర్తుఁ గూడఁ బాఱి
ల్లవాఁడె వచ్చె మరులతోఁ బంచ
దనుఁడల్లవాఁడె; వాఁడె”యనుచు.

టీక :-
కుంభి = ఏనుగు; వెడవెడ = అత్యల్పము; కుంతలము = వెంట్రుక; చారు = అందమైన; మేఖల = స్త్రీలు ధరించు మొలనూలు; గోపతీశు = నంది వృషభము యజమాని యైన శివుడు.
భావము :-
ఏనుగు కుంభస్థలాల వంటి కుచకుంభముల బరువుకు సన్నని నడుము ఊగిసలాడుతుండగా, బాలచంద్రుని వంటి నుదురుపై నల్లని ముంగురులు చెదురుతుండగా, చక్కనైన చక్రముల వంటి తుంటికి కట్టిన మొలనూలు జారుతుండగా, పద్మాలవంటి పాదములు వేగముగా నడవడం వలన తడబడగా, శివుని చూడాలనే కోరికతో ఒక్కొక్కరే కూడబలుక్కుంటూ “అతడే అతడే దేవతలతో వచ్చిన ఐదు ముఖముల పెండ్లి కొడుకు” అనుకుంటూ.

3-161-మత్త.
వేడుకం బురకన్యకల్ దమ వీధులం బొడ వైన యా
మేమాడువు లెక్కి చూచుచు మేలిజాలక పంక్తులన్
గూడిచూచుచు శంభుఁ జూచుచు గోపవాహఁ నుతించుచున్
బాడుచుం దమలోన నిట్లని ల్కి రప్పుడు ప్రీతితోన్.

టీక :-
మాడువు = మిద్దెటిల్లు; మేలి = శ్రేష్ఠమైన; జాలకము = తిటికీ.
భావము :-
వేడుకతో పురకన్యలు తమ వీధులలో గల ఎత్తైమ మేడలు, మిద్దెలు ఎక్కి చూస్తూ కిటికీలనుండి చూస్తూ శంభుని చూస్తూ వృషభవాహనుని పొగుడుతూ పాడుతూ ప్రీతితో తమలో తాము ఇలా అనుకుంటున్నారు.

3-162-సీ.
"మలాక్షి! యీతఁడే ళ్యాణమూ ర్తి యై
మ్మోదమునవచ్చు జాణమగఁడు
కామిని! యీతఁడే నజటావలిలోన
మిన్నేరుఁ దాఁచిన మిండగీఁడు
వెలఁదిరో! యీతఁడే వెన్నెలపాపని
పువ్వుగాఁ దురిమిన పుట్టుభోగి
గువరో!యీతఁడే న గౌరినలరింప
మాయపు వటు వైన మాయలాఁడు

3-162.1-ఆ.
ఉత్తమాంగి! యితఁడె విత్తేశు చెలికాఁడు
విమలనేత్రి! యితఁడె వేల్పుఱేఁడు
యిందువదన! యితఁడె మందిరకైలాస
కంధరుండు నీలకంధరుండు.”

టీక :-
మిన్నేరు = గంగ; మిండగీడు = మొనగాడు; విత్తేశుడు = కుబేరుడు; మందిరకైలాసకంధరుడు = కైలాస పర్వతము నివాసముగా కలవాడు, శివుడు.
భావము :-
కమలముల వంటి కన్నులు కలదానా! ఇతడే పెండ్లి కొడుకై సంతోషంగా వచ్చే జాణ పార్వతి భర్త. సుందరీ! ఇతడే జటలో గంగను దాచిన మొనగాడు. వనితా! ఇతడే చంద్రుని సిగలో పువ్వుగా తురుముకున్న పుట్టుభోగి. ఓ మగువా! ఇతడే మన గౌరిని సంతోషపెట్టడానికి మాయా వటునిగా వచ్చిన మాయలాడు. ఉత్తమురాలా! ఇతడే కుబేరుని స్నేహితుడు. యువతీ! ఇతడే దేవాధిదేవుడు. చంద్రముఖీ! ఇతడే కైలాసవాసి యైన నీలకంఠుడు.”

3-163-వ.
అని మఱియు.
భావము :-
ఇలా అనిన పిమ్మట మరల ఇలా అనసాగెను

3-164-సీ.
గోరాజగమనునిఁ గొనియాడువారును
శంభుపై సేనలు ల్లువారు
రమేశునాత్మలో భావించువారును
గిరిరాజునల్లు నగ్గించువారు
లోకైకనాథు నాలోకించువారును
శివదేవుకై కూర్మి సేయువారు
రుణేందుధరుఁబొందఁ మకించువారును
మృడునకుఁ గేలెత్తి మ్రొక్కువారు

3-164.1-ఆ.
భూధరేంద్రుఁ జాల భూషించువారును
సొరిది నమరకోటిఁ జూచువారు
కొమరుమిగుల నీశుఁ గొనియాడువారును
మెలఁగి రప్పురంబు మెలఁత లెల్ల.

టీక :-
గోపతి = నంది వృషభము; సేసలు = అక్షతలు; అగ్గించు = స్తుతించు; ఆలోకించు = చూచు; కూర్మి = చెలిమి; తరుణ = లేత; తమకించు = మోహించు; కేలు = చేయి; భూధరేంద్రుడు = హిమవంతుడు; భూషించు = స్తుతించు; సొరిది = వరుస; కొమరుమిగులు = అందగించు; మెలత = స్త్రీ.
భావము :-
ఆ ఓషధీప్రస్థ పురమందలి స్త్రీలు నందివాహనుని పొగుడుతూ శంభునిపై అక్షతలు చల్లేవారు, పరమేశ్వరుని మనసులో ధ్యానించేవారు, పర్వతరాజు యల్లుని కీర్తించువారు, జగదేకపతిని చూసేవారు, శివునితో చెలిమి చేసేవారు, బాలేందుధరుని పొందాలని మోహపడేవారు, భక్తులను సంతోషపెట్టే శివునికి చేతులెత్తి నమస్కరించేవారు, హిమవంతుని పొగిడేవారు, పెండ్లికి వచ్చిన దేవతలను వరుసగా అందరినీ దర్శించేవారు, అందగించేలా శివుని పొగుడేవారు ఇలా ఆ వనితలు రకరకాలుగా భక్తితోమెలగేవారు.