పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : షష్ఠ్యంతములు

1-42-క.
రుణాంచితగుణమణికిని
సురుచిరబాలేందుబింబచూడామణికిన్
దైవశిఖామణికిని
జితరధీమణికి భక్తచింతామణికిన్.

టీక :-
కరుణ అంచిత గుణమణి = దయా పూరిత శ్రేష్ఠమైన గుణులు కలవాడు ; సు = మంచి, గొప్ప; రుచిర = అందమైన; బాలేందుబింబము = చంద్రవంక; చూడామణి = శిరోరత్నముగా కలవాడు; చిరము - చిరతరము - చిరతమము; ధీమణి = బుద్ధిశాలి; భక్త చింతామణి = భక్తులకు చింతామణి వలె కోరికలు తీర్చు వాడు.
భావము :-
కరుణతో నిండిన గొప్పగుణాలు కలవానికి, శశిశేఖరునకు, వరదునకు, మిక్కలి బుద్ధిశాలికి, భక్తుల కొంగు బంగారమునకు.....

1-43-క.
హాలాహలభక్షునకును
శైలాదిప్రముఖదేవనరక్షునకున్
ఫాలానలచక్షునకున్
శ్రీలితవిచక్షుణుకును జితదక్షునకున్.

టీక :-
హాలాహలము = సముద్రమథనమున జనించిన భీకర విషము; భక్షుడు = భక్షించిన వాడు; శైలాది = శిలాదుని సంతానము, నంది; ఫాల అనల చక్షుడు = నుదుట అగ్నినేత్రము కలవాడు, శివుడు; శ్రీలలిత = శ్రీకరమైన లలితోపాసనా విద్య; విచక్షుణుడు = నిష్ణాతుడు; జిత = జయించిన.
భావము :-
గరళము బక్షించిన వానికి, నందీశ్వరుడూ మున్నగు దేవతలను కాపాడువానికి, నుదుటి యందు అగ్ని నేత్రము కలవానికి, లలితోపాసనా విద్య యందు నిష్ణాతుడైన వానికి, దక్షుని జయించినవానికి.....

1-44-క.
ముకుళితకరసురపతికిని
లబ్రహ్మాండభాండయమాయానా
తంత్రసూత్రధారికిఁ
బ్రటితవిస్ఫారమతికిఁ బార్వతిపతికిన్.

టీక :-
ప్రకటిత = ప్రసిద్ధమైన; విస్ఫార = మిక్కిలి అధికమైన; మతి = బుద్ధిశాలి.
భావము :-
దేవేంద్రునిచే నమస్కరింపబడేవానికి, సకల బ్రహ్మాండభాండ సమూహాలనీ ఆడించే మాయానాటకసూత్రధారికి, మిక్కిలి అధికమైన బుద్ధిశాలికి, పార్వతీపతికి ఈ కృతిని అంకితం ఇస్తున్నాను.