పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : నారదుఁడు పార్వతికి దక్షుఁని యఙ్ఞముఁ దెలుపుట

1-100-క.
నిదాక్షాయణిఁ గనుగొని
వితుండై కేలుమోడ్చి విన్నప మవధా
వరత సురవరార్చిత!
జాయతనేత్ర! గంధవారణగమనా!

టీక :-
వినతుడు = వంగి నమస్కరించినవాడు; కేలుమోడ్చు = చేతులు ముకుళించి నమస్కరించు; గంధవారణము = మదగజము.
భావము :-
నారదుడు కైలాసంలోని పార్వతి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి ”ఎల్లప్పుడూ దేవతాశ్రేష్ఠులచే పూజింపబడుదానా! పద్మాలవంటి నేత్రములు కలదానా! మదపుటేనుగులా నడిచుదానా! పార్వతీ! నా మనవి వినవమ్మా” అన్నాడు.

1-101-ఉ.
ల్లీ!మీ జనకుండు దక్షుఁడు మదాంప్రేరితస్వాంతుఁ డై
ఫుల్లాంభోజదళాక్షి తత్త్వముఁ దలంపున్లేక వెల్వెట్టి శో
భిల్లందక్కిన భూరిదేవగణమున్ బిల్పించి దుర్యాగముం
జెల్లింపం సమకట్టినాఁ డిదె మిముం జింతింపఁ డింతేనియున్.

టీక :-
స్వాంతుడు = మనసు కలవాడు; పుల్లాంభోజదళాక్షి = పూర్తిగా విచ్చుకున్న పద్మదళముల వంటి కన్నులు కలామె, విశాలాక్షి; వెల్వెట్టి = వెలివేసి; భూరి దేవ గణము = సమస్త దేవతా సమూహములు; దుర్ యాగము = చెడ్డ యాగము; చెల్లింపన్ = పూర్తిచేయుటకు.
భావము :-
అమ్మా! మీతండ్రి దక్షుడు నీ విశాలాక్షీ తత్వం తెలుసుకోలేక మదంచేత గుడ్డిదైన మనస్సు చెప్పినట్లుగా వింటూ మిమ్మల్ని వెలివేసి తక్కిన దేవగణాలన్నింటినీ పిలిచి ఒక దుర్యాగం చేస్తున్నాడు. మిమ్మల్ని గురించి అసలు ఆలోచించడం లేదు.

1-102-వ.
అని విన్నవించి.
భావము :-
అని చెప్పి.....

1-103-క.
దినారా కని ముని నా
దుఁడరిగిన పిదప గౌరి రాజానన దా
నారికి నెల్లప్పుడు
దిదప్పని భార్య గాన నమునఁ గలఁగెన్.

టీక :-
నారాక = నేను వచ్చుటకు కారణము; రాజానన = రాజు (చంద్రుడు వంటి ఆనన (ముఖము కలామె), పార్వతీదేవి; మదనారి = శివుడు.
భావము :-
ఇది చెప్పడానికే నేను వచ్చానంటూ నారదముని వెళ్ళిపోయాడు. చంద్రముఖి ఐన గౌరి శివుని మనస్సున విడువని భార్య కనుక తనలో తానే కలత చెందింది.

1-104-క.
దువులు పెక్కులు చదివియు
దిమదిమయి మండి నేఁడు లహరు వెలిగా
నిదియేల చేయఁ దొడగెను
మున నని వగచుఁ బదరు దిలోఁ బెగడున్.

టీక :-
మదిమదియయి = మనసుపట్టలేక; మండి = ఈర్ష్యాదులచే తపించు, ఒళ్ళుమండు; మలహరు = శివుడు, వ్యు. మర హృ అచ్. కృచప్ర. మలము (పాపమును) హరించువాడు, శారీరకమైన మలము (పాపము) మఱియు యోగసాధనలో జనించు మలము ఐన ఉభయ మలములను హరించువాడు, శివుడు
భావము :-
చాలా చదువుకున్నవాడు. ఆచదువు మనస్సను శుద్ధి చేయడానికే కదా. ఇప్పుడా మనస్సు ఈర్ష్యతో మండుతోంది. అందుకనే మన దోషాలను హరించే పరమేశ్వరుడు దక్షునికి అవసరం లేకపోయాడని పార్వతి మనస్సులోనే బాధపడుతోంది.

1-105-క.
ఏ వినుపింపక ముందఱ
దేవాధీశుండు వినినఁ దెగువన్ గోపం
బేవంక వ్రాలి చొచ్చునొ
యేవిధ మొనరింతు దీని కేమి దలంతున్.
భావము :-
“నేను దేవతలకు ప్రభువైన శంకరునికి చెప్పకముందే ఆయన ఇంకెవరి వల్లనైనా వింటే ఆకోపం ఎటువైపు వెళ్తుందో ఏమో? ఏంచేయగలను? ఏ చేయాలి?.......

1-106-ఉ.
చెప్పినఁ దప్పువచ్చునొకొ చెప్పక యున్నను దప్పువచ్చునో
ప్పు దొలంగరానియది దారుణ మెమ్మెయి నాథుచేత నే
యొప్పున నైన నుండెదను యొప్పమి నైనను నిర్వహించెదన్
ప్పినఁ బిన్నబుద్ధి యగుఁ దా ననుచున్ మది నిశ్చయంబుతోన్.
భావము :-
నేను చెబితే ఏం తప్పో, చెప్పకపోతే ఏం తప్పో. ఏమి చేసినా తప్పు తప్పే అవుతుంది. అందుకని శివుని చేతనే ఈ దారుణాన్ని తప్పో, ఒప్పో ఏదో ఒకలా అనుకునేటట్లు నేను చేయదగిన పని చేస్తాను” అని అమ్మవారు నిశ్చయించుకుంది.

1-107-క.
వడ వడకుచు నుడుగుచు
జిడిముడిమయి నొంది కలఁగి చింతాకుల యై
వెడఁగుఁదనంబున నిలుచుచుఁ
డువాడినపువ్వు భంగిఁ గాంతి దొఱంగన్.
భావము :-
అమ్మవారు వణకిపోతోంది.మనస్సంతా చిక్కులతో నిండి చింతాక్రాంత అయ్యింది. ఆమె ఏమీ తేల్చుకోలేక కాంతి తగ్గి వాడిన సుమము వలె యున్నది.

1-108-క.
పెవులు దడపుచుఁ గొంకుచు
రుచు బెగడుచును నడుగు ల్లన నిడుచున్
నము వంచుచు నడఁగుచుఁ
దుదినాలుక తొట్రుపడఁగఁ దొయ్యలి వగతోన్.

టీక :-
గొంకు – పల్లటిలు; అదరు = భయముతో అదురు; బెగడు = బెదురుతో వణకు; అడగు = నమ్రమగు; తొయ్యలి = స్త్రీ, కని పెంచెడిది; వగ = సంతాపము
భావము :-
ఆరిపోతున్న పెదవులను తడుపుకుంటోంది. భయపడుతూ, తడబడుతూ నడుస్తోంది. తల వంచుకొంది. చివరకు బాధతో నాలుక తొట్రుపడుతుండగా పార్వతీదేవి…

1-109-క.
నుదెంచి శంభు కట్టెదు
నిలిచి కరంబు నోడ్చి వధారు! ద్విష
ద్ఘన!కుంభిదైత్యవిదళన!
జాతభవాండజనక! నజాక్షనుతా!

టీక :-
శంభుడు = శివుడు; కరంబునోడ్చి = చేతులు ముకుళించి; అవధారుః = వినుము; విషద్ఘనుడు = శిక్షించిన విషము కలవాడు.
భావము :-
చేతులు జోడించి శంభుని ఎదుట నిలుచుండి. “కుంభివంటి మహారాక్షసుల్ని చంపినవారు మీరు. బ్రహ్మాండానికి జనకులు మీరు. విష్ణువు చేత పొగడబడేవారు మీరు. దయచేసి వినండి.....

1-110-క.
కంఠ! మిమ్ముఁ బిలువక
తెగించుక లేక మిమ్ముఁ దెలియక దక్షుం
ఱిమఱి యాగము సేయుచు
మెయుచు నున్నాఁడు రాజమిహిరాగ్నక్షా!

టీక :-
కఱకంఠడు = (నీలపు) మచ్చ కంఠమున కలవాడు, శివుడు; తెఱగు = పద్ధతి; అఱిముఱిన్ = తొందరపడి.
భావము :-
నీలకంఠా! సూర్యచంద్రాగ్నులు నేత్రములుగా కల త్రినేత్రా! శివా! పద్ధతి తెలియక, మిమ్ములను పిలువక, మీ గురించి తెలియక దక్షుడు తొందరపడి యజ్ఞము చేస్తూ ప్రకాశిస్తున్నాడయ్యా!.

1-111-ఉ.
నా! శచీమనఃకమలనాథుఁడు కిన్నరనాథుఁడున్ రమా
నాథుఁడు భారతీహృదయనాథుఁడు పంకజనాథుఁడున్ జగ
న్నాదురాత్మునోమునకు నందముఁ బొందుచుఁ బోయినారు మా
నా! సురాదినాథ దిననాథ భుజంగమనాథ వందితా!
భావము :-
లక్ష్మీపతి యైన విష్ణువు, దేవతల పతి యైన ఇంద్రుడు, దినమునకు పతి సూర్యుడు, భుజంగములకు పతి యైన ఆదిశేషుడు మొదలైన వారిచే నమస్కరింపబడేవాడా! ఓ నాథా ! శచీదేవి మనోనాథుడు ఇంద్రుడు, కిన్నరలకు పతి యైన కుబేరుడు, రమాదేవి పతి విష్ణువు, భారతీదేవి భర్త బ్రహ్మదేవుడు, దినములకు నాథుడు యైన సూర్యుడు సంతోషంగా దురాత్ముడైన దక్షుని యాగమునకు వెళ్ళినారు, సకల జగములకు అధినాథ! శంకర!.

1-112-క.
ఱియును దక్కిన సురలును
రుడోరగ యక్ష దైత్య గంధర్వాధీ
శ్వరులెల్లఁ జన్నవారలు
దురితాత్ముని యాగమునకు దురితారాతీ!

టీక :-
ఆరాతి = శతృవు
భావము :-
పాపభయంకరా! పరమేశ్వరా! ఇంకను మిగిలిన దేవతలు, గరుడ, సర్ప, యక్ష, దైత్య, గంధర్వాధీశ్వరు లందరూ ఆ పాపాత్ముని యాగమునకు వెళ్ళారు.

1-113-క.
దితొల్లి లేని చందం
దియేమో వింత చంద వధా రని తాఁ
లక కుదురై నిలిచిన
ముదితం గని కరుణ మదిని మునుకొని నిగుడన్.

టీక :-
అవధార = వినవలసినది; ముదిత = భార్య, స్త్రీ; మునుకొను = మొదలిడు; నిగుడు = విజృంభించు;
భావము :-
పూర్వం ఎపుడూ లేని వింత పద్ధతి. “వినం” డంటూ పార్వతీదేవి అంతా చెప్పి కదలక మెదలక నిలబడిందట. శివునికి ఆమెను చూసి దయకలిగింది.

1-114-వ.
పరమేశ్వరుం డిట్లనియె.

టీక :-
శివుడు ఇలా అన్నాడు.
భావము :-
1-115-చ.

1-115-చ.
నుపకగంధి! నీ పలుకు సంగతి చాలదు వాఁడు దివ్యులన్
మునులను బిల్చి నోము పెనుమూఢత నోచిననోముఁగాక యో
జనిభాననా! యుచిత వాక్యము లే లొకొ నీతు లేలొకో
మునఁ బిల్వమిన్ మనకు మాన్యత కేమి కొఱంత చండికా!

టీక :-
చనుపకము = చంపకము; మాన్యత = గౌరవము; చండిక = కొపము కలామె, పార్వతి.
భావము :-
“పార్వతీదేవీ! చంపకము యొక్క సువాసన గలదానా! నీవు అన్న మాటలు సమర్థనీయము కాదు. తామరపువ్వు వంటి ముఖము కలదానా! ఇలా ఎఱుకపరచు మాటలు, నీతులు ఎందుకులే. దక్షుడు దేవతలను, మునులను మాత్రమే పిలిచి పెద్ద మూర్ఖత్వంతో యాగం చేస్తే చేశాడు. మనగౌరవానికి తక్కువైనట్లు ఈ మాటలెందుకు? చండిక! కోపము గల దానివే కానీ మనల్ని పిలవకపోయి నంతమాత్రాన మన గౌరవానికి ఏమి తక్కువ?.

1-116-ఉ.
మెచ్చని మామ లిండ్లకును మేకొని శోభనవేళఁ బిల్వమిన్
పొచ్చెము గల్గుఁ బోఁదగుట పోలదు నల్లుర కెజ్జగంబులం
బొచ్చెము లేదు కన్యలకుఁ బుట్టిన యిండ్లకుఁ బోవ లోకము
న్మెచ్చును బొమ్ము పబ్బముకు మీ తలిదండ్రులఁ జూడఁ బైదలీ!

టీక :-
పొచ్చెము = పరాభవము; పబ్బము = ఉత్సవము; పైదలి = వయసు కత్తె, స్త్రీ .
భావము :-
ఈ లోకంలో శుభకార్యములందు మెచ్చని మామ ఇండ్లకు పోయిన అల్లుళ్ళకు పరాభవము జరుగుతుంది. ఓ అందగత్తే! పార్వతీ! ఇక స్త్రీల విషయంలో పుట్టినింటికి వెళితే లోకం మెచ్చుకుంటుంది. మీ తల్లిదండ్రులను, యాగమును చూచుటకు నీవు వెళ్ళుము.” అన్నాడు శివుడు.

1-117-గీ.
నుచుఁ జంద్రజూటుఁ డానతి యిచ్చిన
శివుఁడు దన్ను వేఱుచేసె ననుచు
ఫాల మందు పాణిద్మము ల్ధరియించి
వెలది మ్రొక్కి నిలిచె వెఱపుతోడ.
భావము :-
ఇలా శివుడు అనేటప్పటికి శివుడు తనను ఆయననుండి వేరు చేస్తున్నాడని బాధపపడుతూ తన మృదువైన హస్తాలు నుదుటికి తగిలించి నమస్కరిస్తూ, భయపడుతూ అలాగే నిలబడిపోయింది.

1-118-మత్త.
ల్లియాదిగఁ దండ్రి యాదిగఁ దాత యాదిగఁ గల్గువా
రెల్లభంగుల నీవె కాని మహేశ! యన్య మెఱుంగ నే
నుల్లమందునఁ జిత్తగించితి వొప్పముల్ దగు నయ్య! యా
ప్రల్లదుం డట నాకుఁ దండ్రి భరంబు వల్కితి శంకరా!

టీక :-
ప్రల్లదుడు = దుష్టుడు, భరంబు = భారము
భావము :-
“పరమేశ్వరా! తల్లి మొదలు, తండ్రి మొదలు, తాత మొదలు నిఖిల బంధులోకమంతా నీవే అనుకున్నాను. కానీ మరో విధంగా నేను ఎప్పుడూ భావించలేదు. శంకరా! దుష్టుడైన దక్షుడు నాకు తండ్రి అగుట వలన నేనలా కఠినంగా మాట్లాడాను.”

1-119-వ.
ఇట్లని.
భావము :-
అమ్మవారు ఈవిధంగా అని......

1-120-మత్త.
శ్రీలాటము సంఘటించిన చేతులా నవి నాళినీ
లాకల్మదభృంగముల్ నయనాళికల్వలు జక్కవల్
పాయిళ్ళు మరాళముల్ నడక్తి నీరుకడల్ దగన్
గాలిగాఁ గలకంఠి నిల్చెఁ గొలంకు భంగి దలంకుచున్.

టీక :-
లలాటము = నుదురు; నాళికము = పద్మము; నీల అలకలు = నల్లని ముంగురులు; భృంగము = తుమ్మెద; జక్కవ = చక్రవాకము; మరాళము = హంస; నీరుకడలు = నీటి అలలు; గాలిగాన్ = గాలివీచగా; కొలంకు = చెరువు; తలకు = చలించు.
భావము :-
పార్వతీ దేవి గాలి వీచగా చలించే నీటి అలలుతోనున్న సరోవరంలా, అలాగే భక్తితో చిన్నగా వణకుతూ కదలకుండా నిలబడింది. అలా నిలిచిన ఆమె శ్రీకరమైన లలాటానికి తగిలించిన చేతులు పద్మాలు. జుట్టు ముంగురుల తుమ్మెదలగుంపు. కళ్ళు కలువలు. చన్నులు జక్కవ పిట్టలు. హంస నడకలు. భక్తి సముద్రమంత.

1-121-వ.
అప్పుడు దరహసితవదనుండై య ప్పరమేశ్వరుం డిట్లనియె.
భావము :-
అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు.

1-122-ఉ.
మాలు వేయు నేమిటికి? మాకడ నీవును నేము నీకడం
బాలగంధి! యుండుదుము; పాలకశబ్దము నర్థ మట్ల నా
మాలు దాఁటఁగా వలదు; న్నన నీ చెలు లెల్లఁ గొల్వఁగా
బోటిరొ! పొమ్ము; నీ జనకు పొందగు నోమునకుం గుటుంబినీ!

టీక :-
పాటలగంధి = పున్నాగ పుష్పముల సువాసనల అందగత్తె; పాలక = విడువక; బోటి = ఆడుది, చెలి, (ప్ర) యువతి; పొందగు = పొందికగలది, చక్కనైన; కుటుంబిని = కుటుంబపోషకురాలగు స్త్రీ., భార్య
భావము :-
“వేయి మాటలెందుకు? మనమెక్కడ ఉన్నా నా దగ్గర నీవు, నీ దగ్గర నేను విడువక ఉంటాము. పున్నాగ పూలసుగంధముతో నుండు పార్వతీదేవీ! శబ్దార్ధములవిడువని వలె కలిసే ఉంటాము; చెలి పార్వతీదేవీ! నా మాటల్ని కాదనకు. నీ చెలుల సేవలు పొందుతూ నీవు నీ తండ్రి యాగమునకు వెళ్ళు. కుటుంబినీ!” అన్నాడు.