పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : కథాప్రారంభము

1-45-వ.
మత్సమర్పితం బగు వితతవిస్ఫురిత వీరభద్రవిజయాంచిత కథా ప్రసంగ ప్రారంభం బెట్టి దనిన; మహిత మాతులుంగ మందార చందన సాల భల్లాతకీ ప్రముఖరాజిత కుంభినీ విరాజితంబును; కురువింద కుందమ హిమ్లాత మధుక శతపత్ర కమల కల్హార కరవీర మల్లి కాది వల్లీ సంఫుల్ల పుష్పవల్లీ లలిత పరిమళ సుగంధబంధుర దిగంతరాళంబును; నిజ విరోధంబుఁ దొరంగినగతి వసియించు చంచరీక శారికా కీరనాకీల చక్రవాక నీలకంఠ కనకనయన కంక నాళలింగ క్రౌంచ కారంభ కారండ కానకపోత పారావత శకుని భరద్వాజ చకోర లావుక జీవంజీవవాయ సారాతి కోయష్టిక డిండిభసార సశాతఖండ నారంగత్పదారంగ గణనాద ప్రమోదితంబును; మండిత గడభేరుండ వేదండ కంఠీరవ శరభ శార్దూల శంబర జంబూక గవయ వరారోహ ప్లవంగ శల్య సారంగ చమరీమృగ గోకర్ణ వృకాది మహామృగ మందిరంబును; దందశూక గాధేయ మార్జాల మూషక నివాసంబును; సకల పుణ్య తరంగిణీ మంగళ సంగమంబును; వినిర్మల సరోవర విలసితంబును; అనుపమ మునినాద నిరంతర బహుళ పాఠ నిఖిల నిగమ కలకలారావ ఘటిత గగన తలంబును; ధర్మ తపోధన ధాన్య దాన తాపసోత్తమ సంతత సంతుష్ట హోమ ధూమ సమ్మిళిత బృందారకాలోకనంబును; సర్వభువన మహారణ్యరత్నంబును; సకల మునిజనస్తోత్ర పాత్రంబును నగు నైమిశారణ్యపుణ్యక్షేత్రంబు నందు.

టీక :-
మాతులుంగ = మాదీఫలం; సాల = మద్ది; భల్లాతకి == జీడిమామిడి; కురువింద = తుంగముస్తె; కుందము = మొల్ల; మధుక = ఇప్ప; శతపత్ర = రేకులు ఎక్కువగా గల తామర, వ్యు. శతపత్రాని అస్య; కల్హారం = ఎఱ్ఱకలువ; కరవీర = గన్నేరు; చంచరీక = తుమ్మెద; శారిక = గోరువంక; కీర = చిలుక; నాకీల చెవిటి కాకి; నీలకంఠ = నెమలి; కనక నయన కంక = ఎఱ్ఱ కన్నుల కొంగ; నాళలింగక్రౌంచ = కంఠ నాళమున లింగ రూప బొడిపి కల క్రౌంచ పక్షి; కారంభ = ఫ్రేంకణ; కారండ = కన్నెలేడి యను పక్షి; కానకపోత = అడవి పావురము; పారావత = పావురము; శకుని నల్లపిచ్చుక; భరద్వాజ = ఏంట్రిత పక్షి; లావుక - మీన వల్లంకి; జీవంజీవ = వెన్నెలపులుగు; వాయస కాకి; కోయష్టిక = చీకుకొక్కెర, గుడ్డికొంగ; డింఢిభ = చెకుముకి?; సారస = బెగ్గురుపక్షి; శాతఖండ = ఉమ్మెత్త?; గండభేరుండ = పక్షివిశేషమే కానీ మృగములలో చెప్పబడుతోంది; వేదండ = ఏనుగు; కంఠీరవ = సింహం; శరభ = మీగండ్ల మెకము, ; శార్ధూల = పులి; శంబర = ఎర్రని చిన్ని జింక; జంబూక = నక్క; గవయ = గురుపోతు; వరారోహ = గజము; ప్లవంగ = కోతి; శల్య = ఏదుపంది; సారంగ = లేడి; చమరీమృగం = జడలబర్రె; గోకర్ణం = కంచరగాడిద; వృక =తోడేలు; దందశూక = సర్పం; గాధేయ = పిల్లఉడుములు; మార్జాలము = పిల్లి; మూషకము = ఎలుక.
భావము :-
పోతన తను అందిస్తున్న వీరభద్రవిజయము యొక్క కథా ప్రారంభము ఏమనగా (నైమిశారణ్య వర్ణనతో ప్రారంభించబడింది). గొప్పవైనటువంటియుమ మాతులుంగ (మాదీఫలము); మందారము, చందనము, సాల (మద్ది); భల్లాతకి (జీడిమామిడి) మొదలైన వృక్షాలతో ప్రకాశిస్తున్నది; కురువింద (తుంగముస్తె); కుందము (మొల్ల) హిమ్లాత, మధుక (ఇప్ప); శతపత్ర (రేకులు ఎక్కువగా గల తామర, శతపత్రాని అస్య; కల్హారము (ఎఱ్ఱకలువ); కరవీరము (గన్నేరు); మల్లిక మొదలైన లతలకు చక్కగా విడిచిన పూల పరిమళాలతో నిండిన దిక్కులు కలది; తమలో తమకున్న విరోధాల్ని మరచినట్లు సంచరించే చంచరీకము (తుమ్మెద); శారిక (గోరువంక); కీరము (చిలుక); నాకీలము (చెవిటి కాకి); చక్రవాకము, నీలకంఠము (నెమలి); కనక నయన కంక (ఎఱ్ఱ కన్నుల కొంగ); నాళలింగక్రౌంచము (కంఠ నాళమున లింగ రూప బొడిపి కల క్రౌంచ పక్షి); కారంభము (ఫ్రేంకణ); కారండవము (కన్నెలేడి యను పక్షి); కానకపోతము (అడవి పావురము); పారావతము (పావురము); శకుని (నల్లపిచ్చుక); భరద్వాజ (ఏంట్రిత పక్షి); చకోరము, లావుకము (మీన వల్లంకి); జీవంజీవము (వెన్నెల పులుగు); వాయసము (కాకి); ఆరాతి, కోయష్టికము (చీకుకొక్కెర, గుడ్డికొంగ); డింఢిభ (చెకుముకి?); సారసము (బెగ్గురుపక్షి); శాతఖండము (ఉమ్మెత్త?) మొదలైన పక్షి జాతుల కూతలతో ఆనందాన్ని కలిగించేదీ అలాగే గండభేరుండము (పక్షివిశేషమే కానీ మృగములలో చెప్పబడుతోంది); వేదండము (ఏనుగు); కంఠీరవము (సింహం); శరభము (మీగండ్ల మెకము), ; శార్ధూలము (పులి); శంబరము (ఎర్రని చిన్ని జింక); జంబూకము (నక్క); గవయము (గురుపోతు); వరారోహము (గజము); ప్లవంగము (కోతి); శల్యము (ఏదుపంది); సారంగము (లేడి); చమరీమృగము (జడలబర్రె); గోకర్ణము (కంచరగాడిద); వృకము (తోడేలు) మున్నగు పెద్ద జంతువులక అలవాలము ఐనది, దందశూకము (సర్పం); గాధేయము (పిల్లఉడుములు); మార్జాలము (పిల్లి); మూషకము (ఎలుక)లకు నివాసమైనదీ, పుణ్యనదులతో, మంగళకరమైన సరోవరాలతో ప్రకాశించేదీ, ధర్మాత్ములు, మహర్షుల వేదఘోషలతో అలాగే పఠన-పఠనాలతో శబ్దించే ఆకాశం కలదీ, తపోధనులూ, ధనధాన్యదానాలతో కూడిన హోమధూమాలు దేవతలచే చూసి పొగడబడేది, సకల భువనాలలో గల మహారణ్యాలలో శ్రేష్ఠమైనది. మునీశ్వరులు అందరూ స్తుతించ తగ్గది ఈ నైమిశారణ్య పుణ్యక్షేత్రము. ఇక్కడ ఒకనాడు…..

1-46-చ.
పెనుపగు దీర్ఘసత్ర మను పేరిట యాగము జేసి పుణ్యులై
మునులొక కొంద ఱుత్తములు మోదముతో సుఖగోష్ఠి నుండ న
య్యనిలుఁడు వచ్చి శైవకథ న్నియు నిచ్చలుఁ జెప్పుచుండఁగా
రుచు నొక్కనాఁ డచటి తాపసు లెల్లను వాయుదేవుతోన్.

టీక :-
పెనుపగు = గొప్పదైన; అనిలుడు = వాయుదేవుడు; నిచ్చలు = నిరంతరంముగా.
భావము :-
గొప్పదైన దీర్ఘసత్రమనుయాగమును పూర్తిచేసి మునులుకొందఱు సంతోషంగా మాట్లాడుకొనుచున్నారు. ఆసమయంలో వాయుదేవుడు వచ్చి, శైవకథలను నిరంతరంగా వినిపిస్తూ ఉండేవాడు. ఆసమయంలో తాపసులు వాయుదేవునితో.....

1-47-ఉ.
శైకథా ప్రసంగములు శైవజనంబుల దివ్యకీర్తనల్
శైపురాణసారములు శైవరహస్యములున్ మహాయశ
శ్శ్రీర! నీకు మానసము సిద్దము నీ వెఱుగంగరాని యా
శైము లేదు రూపమును సారము నీకు ముఖస్థ మారయన్.
భావము :-
మహానుభావా! శివకథలు, శివభక్తుల కీర్తనలు, శైవపురాణాల సారము, శైవరహస్యాలు నీ మనస్సులో స్థిరంగా ఉన్నాయి. నీకు తెలియని శైవవిషయం లేదు. శివరూపమూ, శివసారమూ నీ ముఖంలోనే కనబడతాయి.

1-48-చ.
శికథ లెల్ల వేదములచేత నెఱింగిన మేటి వీవ యో
నసురా! సురేంద్రనుత! భాసురపుణ్య! సురాగ్రగణ్య! యా
విరళ వీరభద్రవిజయాకర సారసుధారసంబు మా
చెవులకు మన్మనోరథము చెల్వముగాఁ జిలికింపవే దయన్.

టీక :-
మేటి = శ్రేష్ఠమైన వాడు; ఈవ = నీవే; పవనసురుడు= వాయుదేవుడు; అవిరళము = సాంద్రమైన; సార = సారవంతమైన; మత్ మనోరథము= మా యొక్క ఇచ్చ; చెల్వము = చక్కన.
భావము :-
ఓ వాయుదేవా! వేదాలలోని శివతత్వాన్ని పూర్తిగా తెలిసినవాడివి.ఇంద్రుని పుత్రుడవు. దివ్యమైన పుణ్యమూర్తివి. దేవతలలో మొదట లెక్కింపదగినవాడివి. దయచేసి వీరభద్రవిజయమును వీనులవిందుగా వినిపించుము”

1-49-వ.
అని మఱియు బహుప్రకారంబుల నమ్మహామునులు సంస్తుతింప న వ్వాయుదేవుం డగణిత సంతోషమానసుం డై యిట్లనియె.
భావము :-
అంటూ పలు విధాలుగా ఆమహామునులు నుతింపగా వాయుదేవుడు ఆనందంగా ఇలా అన్నాడు.

1-50-సీ.
దేవాదిదేవుని తెఱఁగిట్టి దందమా
తెఱఁగులెల్లను బుట్టు తెఱఁగుదాన
దనమదారాతిఁ దివెద మందమా
చదువుల కెల్లను మొదలు దాన;
బ్రహ్మాదివంద్యుని రికింత మందమా
బ్రహ్మాదులకు నైన బ్రహ్మ దాన;
దేవతారాధ్యుని దెలిసెద మందమా
తెలిసిన మీఁదటిధృతియుఁ దాన;

1-50.1-తే.
యెంత యనఁగ నేర్తు నేమని వర్ణింతు
నేది యాది యంత్య మేది యరయ
కలమునకు నతని సంతతానందంబు
నెఱిఁగి కొలఁదిసేయ నెట్లువచ్చు?

టీక :-
తెఱగు= విధము; మదనమదారాతిఁ = మదనుని మదమునకు ఆరాతి, శత్రువు, శివుడు.
భావము :-
“దేవదేవుని మార్గం ఇలా ఉంటుంది అందామంటే అన్ని దారులనూ పట్టే దారే ఆయన. కామదహనం చేసినవాని గురించి చదివాము అందామంటే చదువులన్నిటికీ మొదలే ఆయన. బ్రహ్మాదులకు నమస్కరింపదగిన వాడిని వెదుకుదామంటే వారికి కూడా మూలమైన బ్రహ్మమే ఆయన. సర్వదేవతా ఆరాధ్యుణ్ణి తెలుసుకుందామా అంటే తెలిసిన తర్వాత ఉంచుకోగల స్థిరజ్ఞానం ఆయనే. ఎంతని నేర్చుకోను? ఏమని వర్ణించగలను? మొదలేది? చివరేది? ఆయన ఆనందాన్ని తెలిసిందనుకోవడం బ్రహ్మానందాన్ని తక్కువ చేయడమే

1-51-వ.
ఐనను నానేర్చువిధంబున మీ యడిగిన యర్థంబు సవిస్తరంబుగా వినిపింతు" నని య మ్మహామునులకు వాయుదేవుం డిట్లనియె.
భావము :-
అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు మీరడిగిన దానిని వివరంగా వినిపిస్తానని వాయుదేవుడు చెప్పడం మొదలుపెట్టాడు.

1-52-ఉ.
తొల్లియుగాదు లందు భవదూరుఁడు చంద్రవిభూషణుం డుమా
ల్లభుఁ డాదినాయకుఁడు వాసవవంద్యుఁడు వెండికొండపై
నెల్లఁగణంబులున్ గొలువ నేర్పునఁ బర్వతరాజపుత్రితో
ల్లలితాత్ముఁ డై సకలసంపదలం గొలువుండె సొంపుతోన్.

టీక :-
వాసవుడు = ఇంద్రుడు; వెండికొండ = కైలాసపర్వతము; సకలసంపదలు = అష్టైశ్వర్యములు.
భావము :-
పూర్వము యుగారంభాలలో చంద్రశేఖరుడు, ఉమాపతి, ఆదిదేవుడు, ఇంద్రుడు సైతం నమస్కరించేవాడైన శివుడు పార్వతితో కలసి గణములన్నీ సేవిస్తుండగా సర్వైశ్వర్యములతో వెండికొండపై కొలువై ఉన్నాడు.

1-53-వ.
ఇట్లు పరమేశ్వరుండు రజతధరణీధరశిఖరంబున నగణ్యరమ్యతర రత్నసింహాసనంబునం గొలు వున్న సమయంబున.

టీక :-
రజత ధరణీధరము = వెండి కొండ, కైలాస పర్వతము; రమ్యము – రమ్యతరము - రమ్యతమము.
భావము :-
ఆవిధంగా శివుడు వెండికొండపై బహుమిక్కిలి అందమైన రత్నసింహాసనంపై కూర్చుని ఉండగా.....

1-54-క.
రునకుఁ దమ పనులన్నియు
రుసన్ విన్నపము సేయలె నని దేవా
సుముని గంధార్వాధిపు
యఁగఁ గైలాసమునకు రిగిరి ప్రీతిన్.
భావము :-
తమ పనులన్నిటినీ విన్నవించుకొనుటకు దేవతలు, మునులు, గంధర్వులు మొదలైనవారంతా కైలాసానికి వచ్చారు.

1-55-క.
దువులు పెక్కులు గల వా
దువులకును మొదలు నాల్గుదువులు
దువులకు మొదలుగలిగిన
దువులు గల శంభుఁ గొలువఁ దువులు వచ్చెన్.

టీక :-
నాల్గుచదువులు= చతుర్వేదములు; శంభుడు = శివుడు; చదువులు= వేదములు; చదువులు = పరావిద్య, బ్రహ్మవిద్య.
భావము :-
చదువులు అనేకం ఉన్నాయి. వీటన్నిటికి మూలమైన చదువులు నాలుగు. అవి చతుర్వేదాలు. ఈ చదువులకు మూలమైన బ్రహ్మజ్ఞానము కలవాడు శివుడు. ఆయనను సేవించడానికి వేదాలు వచ్చాయి.

1-56-ఉ.
న్నగవైరి నెక్కి యిరుక్కియలన్మును లర్థిఁ గొల్వఁగా
న్నుతి నారదాది యతి సంఘము సేయగ నభ్రవీధి పై
నున్నతమై మణుల్వెలుఁగ నూర్జితకీర్తి రమావిభుండు దాఁ
న్నగ కంకణుం గొలువ భాసురుఁ డై చనుదెంచె నెమ్మితోన్.

టీక :-
పన్నగవైరి= గరుత్మంతుడు; ఇరు= రెండు; పక్కియలు= ప్రక్కలను; అర్థిన్ = కోర్; కొల్వగా= సేవించుటకు; సంఘముచేయు = సమావేశమగు; అభ్రవీధి = ఆకాశమార్గమున; ఊర్జితము = దృఢమైన, గొప్ప; పన్నగకంకణుడు = శివుడు; భాసురుడు = ప్రకాశించువాడు; నెమ్మి = ప్రేమ, సంతోషము.
భావము :-
గరుడవాహనాన్ని ఎక్కి ఇరుప్రక్కలా మునులు సేవిస్తుండగా, నారదాది మహర్షులు కూడి వచ్చి కీర్తిస్తుండగా, నక్షత్రాలు వెలిగే ఆకాశవీధిలో గొప్ప కీర్తి కలవాడైన లక్ష్మీపతిపన్నగకంకణుడైన శివుని సేవించడానికి సంతోషముగా విచ్చేసెను. గమనిక: – ఈ ఘట్టంలో విచ్చేసినవారు వారి వాహనాలు: విష్ణుమూర్తి – పన్నగవైరివాహనుడు - గరుడుడు బ్రహ్మదేవుడు – మరాళవాహనుడు - హంస ఇంద్రుడు – ఐరావతవాహనుడు - ఐరావతము అగ్నిదేవుడు – అజవాహనుడు - మేకపోతు యమధర్మరాజు – మహిషవాహనుడు - దున్నపోతు నైరతి – నరవాహనుడు - మానవుడు వరుణదేవుడు – మీనవాహనుడు - చేప మన్మథుడు - మీనధ్వజుడు చంద్రుడు - సారంగధ్వజుడు కుబేరుడు – అశ్వ వాహనుడు - గుఱ్ఱము ఈశానుడు – ఫణిధరుడు, వృషభవాహనుడు – ఎద్దు

1-57-ఉ.
తా తుషార హార హిమధామ సితాంబుజ శారదాభ్రమం
దా నిభోజ్జ్వలం బగుచుఁ ద్దయు వేగ మరాళవాహుఁడై
భూరిగుణాకరుం డమృతభుక్పతివంద్యుఁడు ధాత వచ్చె వి
స్ఫారుఁడు భారతీవిభుఁడు పార్వతినాథునిఁ గొల్వ భక్తితోన్.

టీక :-
తుషారము = మంచు; హిమదామము = మంచుబిందువల దండ, వరుస; సితాంబుజము = తెల్ల తామర; శారదాభ్రము = శరత్కాలపు తెల్లని మబ్బు; నిభము = సాటియైనది; తద్దయు = మిక్కలి; మరాళము = హంస; వాహుడు = వాహనము ఎక్కినవాడు; అమృతభుక్ పతి వంద్యుడు = దేవతల ప్రభువైన ఇంద్రుడు నమస్కరించువాడు; ధాత = బ్రహ్మదేవుడు; విస్పారుడు = అధికుడు.
భావము :-
నక్షత్రాలు, మంచుబిందువులమాల, మంచుకప్పిన తామరలు, కమ్మిన శరత్కాలపు తెల్లని మేఘాలకు సాటివచ్చేంత ఉజ్ఝ్వలమైన తెల్లనైన హంసవాహనంపై; గొప్ప గుణములు కలవాడు, దేవేంద్రారాధ్యుడు, సరస్వతీపతి ఐన విధాత పార్వతీపతిని కొలుచుటకు మిక్కిలి వేగంగా వచ్చాడు.

1-58-ఉ.
దేజనాధినాథులును దేవగురుండును సంస్తుతింప నై
రాణదంతి నెక్కి తగు రాజకదంబము చక్రవర్తులున్
వావిరిఁ గొల్వఁగా నిగమవంద్యునిఁ గొల్వ శచీవిభుండు స
ద్భావుఁడు నాకవల్లభుఁడు న్యుఁడు వచ్చె నగణ్యపుణ్యుఁ డై.

టీక :-
దేవజన అధినాథులు = దేవతల ప్రభులు; దేవగురుడు = బహస్పతి; ఐరావణము = ఐరావతము; దంతి = ఏనుగు; వావిరి = క్రమముగా, అధికముగా; నిగమవంద్యుడు = వేదాలచే కొలువబడువాడు, శివుడు; శచీవిభుడు = శచీదేవి భర్త, ఇంద్రుడు; సద్భావుడు= సద్భావము కలవాడు; నాక = స్వర్గము.
భావము :-
దేవతాశ్రేష్ఠులు, బృహస్పతీ స్తుతిస్తుండగా ఐరావతమునెక్కి రాజసమూహము, చక్రవర్తులు వరుసగా సేవిస్తుండగా వేదాలు సేవించే పరమశివుని సేవించడానికి శచీదేవి భర్త, గుణవంతుడు, ధన్యుడైన

1-59-క.
శిలయ్యేడును వెల్గఁగ
సుతర మగు నజము నెక్కి శోభిల్లుచుఁ ద
న్నఖిల మునులు నుతి సేయఁగ
ఖిలేశ్వరుఁ గొల్వ వచ్చె నలుఁడు ప్రీతిన్.

టీక :-
అజము = మేకపోతు, అనలుడు = అగ్నిదేవుడు.
భావము :-
సప్తార్చి ఐన అగ్ని దేవుడు ఏడు శిఖలతో ప్రకాశిస్తూ మేకపోతునెక్కి మునులు కీర్తిస్తుండగా అఖిలేశ్వరుడైన శివుని కొలుచుటకు వచ్చెను.

1-60-క.
దంప్రచండహస్తులు
మండితగతిఁ దన్నుఁ గొలువ దమహి షారూ
ఢుండైవచ్చెఁ గృతాంతుఁడు
ఖండితశుండాలదనుజు డకుం గొలువన్.

టీక :-
దండ ప్రచండ హస్తులు = దుడ్డుకఱ్ఱలు భయంకరముగ చేతులలో కలవారు; యమభటులు; మండిత = అలంకరింపబడిన; ఆరూఢుడు = ఎక్కినవాడు; కృతాంతుడు = యముడు; ఖండిత శుండాలదనుజుడు = గజాసురుని సంహరించిన వాడు, శివుడు; కడకున్ = వద్దకు.
భావము :-
భయంకరమైన దండాయుధములు ధరించిన యమభటులు తనను సేవిస్తుండగా బలిసిన దున్నపోతుపై అధిరోహించినవాడై గజాసురసంహారకుడైన శివుని సేవించడానికి యమధర్మరాజు వచ్చెను.

1-61-క.
మిక్కిలి విభవము మెఱయఁగ
గ్రక్కున మానవుని నెక్కి డు వేడుకతోఁ
క్కని నైరృతి వచ్చెను
చుక్కలరాయనిధరించు సుభగునిఁ గొలువన్.
భావము :-
ఎంతో వైభవంతో నరవాహనమెక్కి నైరృతి శశిధరుడైన శివుని సేవించడానికి వచ్చెను.

1-62-క.
మీనంబు నెక్కి వరుణుఁడు
కానుక లెన్నేని గొనుచుఁ గాంతలు గొలువన్
దా రుగుదెంచె రాజిత
మీద్వజహరుని గొలువ మించిన భక్తిన్.

టీక :-
మీనధ్వజుడు = మన్మథుడు.
భావము :-
వరుణదేవుడు తన వాహనమైన మీనమును ఎక్కి వనితలు సేవిస్తుండగా మన్మథసంహారిని కొలుచుటకు బహుమతులు తీసుకుని వచ్చెను.

1-63-క.
గౌరీనాయకుఁ గొలువగ
సారంగధ్వజుఁడు నగుచు సంభ్రమలీలం
దారాపథమున వచ్చెను
దారాచలశిఖరమునకుఁ ద్దయు వేడ్కన్.

టీక :-
సారంగము = లేడి; సారంగధ్వజుడు = చంద్రుడు; తారాపథము = ఆకాశమార్గము; తారాచలము = కైలాసపర్వతము; తద్దయు = మిక్కిలి.
భావము :-
సారంగధ్వజుడు చంద్రుడు మిక్కిలి ఆనందాశ్చర్యాలతో ఆకాశమార్గాన కైలాస పర్వతాగ్రమునకు గౌరీనాథుని కొలుచుటకు వచ్చెను.

1-64-ఉ.
మంళదివ్యసంపదలు మానుగ నన్నియుఁ గొంచు గిన్నరుల్
ముంలఁ బేర్మితో నడువ మోదముఁ బొంది తురంగవాహుఁ డై
సంతి సిద్ధులున్నరులు సంయములుం దను గారవింపఁగా
సండికానిఁ గొల్వ నతి సంపద నేఁగెఁ గుబేరుఁ డాఢ్యుఁడై.

టీక :-
మానుగ = అందముగా, పొందుగా; సంగతి = చేరి; మోదము = సంతోషము; సంయములు = ఇంద్రియనిగ్రహం కలవారు, మునులు; సంగడికాడు = స్నేహితుడు; ఆఢ్యుడు = సంపన్నుడు.
భావము :-
కుబేరుడు సంపన్నుడు కావడంతో శుభకరాలైన దివ్యసంపదలను అందముగా పట్టుకొని కిన్నరలు ప్రేమగా ముందు నడువగా సిద్ధులు, నరులు, మునులు గౌరవిస్తుండగా ఆనందముతో అశ్వ వాహనమెక్కి తన స్నేహితుడైన శివుని కొలుచుటకు వెడలెను.

1-65-క.
నాథులు కొల్వఁగ గో
పతివాహనుఁడు భుజగకంకణుఁ గొలువన్
ణుతింపరాని వేడుక
ణిధరుఁ డీశానుఁ డరిగె వ్యాత్మకుఁ డై.

టీక :-
గోగణపతి = వృషభము
భావము :-
గణనాథులు సేవిస్తుండగా ఫణిధరుడైన ఈశానుడు వృషభవాహన మెక్కి చాలా సంతోషంగా భుజగకంకణుడైన శివుని కొలుచుటకు వెళ్ళెను.

1-66-వ.
ఇవ్విధంబున.
భావము :-
ఈ విధముగా

1-67-సీ.
విశిఖాదండాది పాశ ధనుః ఖడ్గ
లాసమునకు శివునివాసమునకు.
హంస తార్క్ష్య వృషాది రి హయ మృగ ఝష
కాషాయవేషిత మను లగుచు;
సరసిజ కింకరాసురధునీలఘు చిత్త
నభూతి శ్రీరాజి లితు లగుచు;
సంవ్యదయోదండమంగమిత్రాభ్రస
త్యప్రభాభోగ నిత్యాత్ము లగుచు;

1-67.1-ఆ.
రిశిఖి యమ దైత్య రుణ చంద్ర కుబేర
శివ హరి యజు లాదిశివుని గొలువ
రుగుదెంచి రంత నానంద మైన కై
లాసమునకు శివునివాసమునకు.

టీక :-
పవి = వజ్రాయుధము; తార్క్ష్యుడు = గరుడుడు; హరి = విష్ణువు, ఇంద్రుడు, ఏనుగు; మృగము = లేడి, ధుని = నది; లఘు = వడిగల, భూతి = సంపద; రాజి = పంక్తి, రేఖ, అంగము = మనసు; దైత్యుడు = నైరృతి.
భావము :-
ఇంద్రుడు వజ్రాయుధం కలిగి, ఘన సంపదలతో ఐరావతం పైనను; అగ్నిదేవుడు శిఖలనే ఆయుధం కలిగి, ప్రకాశమనే సంపదతో, ప్రభలనే భోగముతోను; యముడు పాశమనే ఆయుధం కలిగి, వడి అనే సంపదతో, దండమనే భోగముతోను; నైరృతి ధనుస్సును ఆయుధంగా కలిగి అసురులనే సంపదతోను; వరుణుడు నదులనే సంపదలతో, మిత్ర అనే భోగముతో, ఝషమనే వాహనంపైనను; చంద్రుడు చిత్తమనే సంపదతోను, అంగమనే భోగముతోను, జింక ధ్వజముతోనూ; కుబేరుడు ఖడ్గం ఆయుధంగా కలిగి, కింకరులను సంపదగా కలిగి, అశ్వ వాహనంపైనను; ఈశానుడు (ఈశాన్యము దిక్కుకు అధిపతి) శూలాయుధం కలిగి, ఘనభూతి సంపదగగా, వృషభ వాహనంపైనను; విష్ణువు చక్రాయధం కలిగి, శ్రీ అనే సంపదతో, దయ అనే భోగముతో, గరుడ వాహనం పైనను; బ్రహ్మ దండము ఆయుధముగా కలిగి, సరసిజ అనే సంపదతో, సత్యమనే భోగముతో, హంస వాహనం పైనను ఎక్కి కాషాయవేషధారులై ఆనందకరమైన శివుని నివాసమైన కైలాసమునకు వెళ్ళిరి.

1-68-వ.
ఇ ట్లరుగుదెంచి సకలభువనప్రధానదేవతలును, సప్తలోకపాలురును, సనకసనంద నాది యోగీంద్రులును, సిద్ధ కిన్నర కింపురుష గరుడ గంధర్వ విద్యాధరులును, మార్కండేయ ఘటజ మరీచి గౌతమ కశ్యప వామదే వాత్రి భృగు దధీ చ్యుపమన్యు దుర్వాస నారదాదులగు మహామునులును, ననంత సంతసంబునఁ గలధౌతకుధర శిఖరంబుఁ బ్రవేశించి దేవదేవుని దివ్యాలయంబు డాయం బోయి తదీయ ద్వారంబున నందఱుం బాదచారులై దౌవారికు లగు జయవిజయుల నాలోకించి యిట్లనిరి.

టీక :-
ఘటజుడు = ఘటము (కుండ) యందు జడు పుట్టినవాడు, అగస్త్యుడు; దౌవారికులు = ద్వారపాలకులు; కలధౌత కుధరము = వెండి కొండ, కైలాస పర్వతము; పాదచారులు = కాలినడకను వచ్చువారు.
భావము :-
ఆ విదంగా విచ్చేసిన సకల లోకాల ప్రథాన దేవతలు; సప్తలోకపాలకులు; సనకసనందాది యోగీంద్రులు, సిధ్ధ కిన్నెర కింపురుష గరుడ గంధర్వ విద్యాధరులును; మార్కండేయుడు, అగస్త్యుడు, మరీచి, గౌతముడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, భృగువు, దధీచి, ఉపమన్యువు, దుర్వాసుడు, నారదుడు మున్నగు మహామునులు మిక్కిలి సంతోషంతో కైలాసము చేరి ద్వారము వద్దకు పాదచారులై చేరి అక్కడి ద్వారపాలకులు జయవిజయులతో ఇలా అన్నారు.

1-69-ఉ.
చ్చట నున్నవాఁడు శివుఁ డేమివిధంబున నున్నవాఁడొకో
చ్చితి మెల్లవారమును వారిజలోచనుఁ డాదిగాఁగ మా
చ్చినరాక నిన్ గొలువచ్చినవా రని చంద్రమౌళికిం
జెచ్చెర మీరు విన్నపముచేసి తగన్మ ఱుమాట చెప్పుఁడా.

టీక :-
ఉన్నవాడు = ఉన్నాడు; వారిజలోచనుడు = విష్ణువు; చంద్రమౌళి = శివుడు; చెచ్చెర = శీఘ్రమే; మాఱుమాట = సమాధానమ, ప్రత్యుత్తరము.
భావము :-
“శివుడెక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? మేము, విష్ణుమూర్తి మొదలైన వారమంతా తనను సేవించడానికి వచ్చామని తెలిపి, తిరిగి శివుడేమి ప్రత్యుత్తరము ఇచ్చాడో వచ్చి చెప్పండి.”.

1-70-వ.
అని పలికిన వారును "నగుఁగా" కని శంకరు నాస్థానమండపంబు దరియంజొచ్చి య ద్దేవునకు నమస్కారంబు లాచరించి యిట్లనిరి.

టీక :-
తరయజొచ్చు = చేరవచ్చు.
భావము :-
అనగా సరేనని శంకరుని కొలువు వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు.

1-71-ఉ.
శ్రీనితావిభుండు, సరసీరుహగర్భుఁడు, నింద్రుఁ డాదిగా
దేతలున్మునీంద్రులును దేవరఁ గన్గొన వచ్చినారు దు
ర్గావిభు కిప్పుడే యవసరం బని శ్రీమొగసాలి నున్న వా
రేవిధ మింక వారలకు నేర్పడ నానతి యీవె శంకరా!

టీక :-
శ్రీవనితా విభుడు = విష్ణువు; సరసీరుహ గర్భుడు = బ్రహ్మదేవుడు; దేవర = ప్రభువు, దేవుడు; మొగసాల = వాకిలి, తలవాకిట పంచ, ముఖమండపము; ఉన్నవారు = ఉన్నారు.
భావము :-
“శంకరా! విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, మునీంద్రులు మిమ్ములను ఇప్పుడే సందర్శించాలని వచ్చి మీ వాకిట నిలచియున్నారు.వారికేమి చెప్పమంటారో ఆజ్ఞాపించండి”

1-72-వ.
అనవుఁడు న వ్విన్నపం బవధరించి "వారలం దోడితెం"డని యానతిచ్చిన వారును జని దేవతల కిట్లనిరి.
భావము :-
దౌవారికులు అలా అనగా వారి విన్నపాన్ని విని “వారిని ప్రవేశపెట్ట”మని అనుజ్ఞనీయగా ద్వారపాలకులు వెళ్ళి దేవతలతో ఈవిధంగా అన్నారు.

1-73-క.
మీరాక విన్నవించిన
గౌరీపతి కొలువులోనఁ గారుణ్యముతో
వాలఁ బుత్తెమ్మనియెను
మీలు చనుఁ డవసరంబు మే లని పలుకన్.

టీక :-
పుత్తెంచు = పంపు; మీరలు = మీరు; అవసరము = సమయము, అవకాశము.
భావము :-
“కొలువులో ఉన్న గౌరీపతికి మీరు వచ్చిన విషయం తెలియజేయగా వారు పంపించమన్నారు.మీరు వెళ్లండి. మీకుశుభం కలుగును” అన్నారు.

1-74-క.
ముమున హరియును నజుఁడును
దువులు మును లాదిగాఁగ కలజనంబుల్
నారిఁ గొలువ వచ్చిరి
పడి సంభ్రమము భయము క్తియుఁ గదురన్.

టీక :-
పదఁపడి = పదంపడి కి రూపాంతరము.
భావము :-
పిమ్మట. విష్ణుమూర్తి, బ్రహ్మ, వేదాలు, మునులు మొదలైనవారంతా చాలా ఆశ్చర్యము, భయము, భక్తులతో శివుని సేవించడానికి సంతోషంగా వచ్చారు.

1-75-వ.
ఇవ్విధంబునఁ గొలువుచొచ్చి యమ్మహాదేవునింగాంచి సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి నిటలతట సంఘటిత ముకుళిత కరకమలులును, సర్వాంగ పులకాంకితులును నై యిట్లని స్తుతియింపం దొడంగిరి.
భావము :-
ఈవిధంగా శివుని కొలువులో ప్రవేశించి దేవదేవుని చూసి, నుదుటిపై ముకుళించిన రెండు చేతులూ జోడించి, సాష్టాంగనమస్కారము చేసి, పులకితులై ఈవిధంగా ప్రార్ధించసాగారు.

1-76-క.
జయ గౌరీవల్లభ!
జయ గంగావతంస! య నిస్సంగా!
జయ గోపతివాహన!
జయ వేదాంతవేద్య! య పరమేశా!

టీక :-
గోపతి = వృషభము; గంగా వతంసుడు = గంగను సిగబంతిగా కలవాడు.
భావము :-
“గౌరీపతీ, గంగాధరా, విరాగీ, వృషభ వాహనా, వేదంతవేద్యా, పరమేశా జయము

1-77-క.
జయ పరమపరాయణ!
జయ భవ్యానుభావ! య సర్వేశా!
జయ త్రిపురాసురహర!
జయ లోకాధినాథ! య శ్రీకంఠా!
భావము :-
అని మఱియు ననేకవిధంబుల నుతియించి తత్ప్రసాద కరుణా విశేషంబుల నానందించి యుచితాసనంబుల నుండి; రక్కొలు వగమ్య రమ్య నిఖిల దేవతాజన కిరీట కీలిత దివ్యమణి ప్రభాపటల దేదీప్యమాన తేజోమహిమాభిరామంబును, అగణిత గణాలంకృతం బును, నసమాన మానితంబును, అనంత వైభవ ప్రమోదితంబును నై యొప్పుచున్న సమయంబున.

1-78-వ.
అని మఱియు ననేకవిధంబుల నుతియించి తత్ప్రసాద కరుణా విశేషంబుల నానందించి యుచితాసనంబుల నుండి; రక్కొలు వగమ్య రమ్య నిఖిల దేవతాజన కిరీట కీలిత దివ్యమణి ప్రభాపటల దేదీప్యమాన తేజోమహిమాభిరామంబును, అగణిత గణాలంకృతం బును, నసమాన మానితంబును, అనంత వైభవ ప్రమోదితంబును నై యొప్పుచున్న సమయంబున.

టీక :-
కీలిత = పొదగబడిన; అబిరామము = మనోహరమైనది; మానితము = మన్నింపబడినది.
భావము :-
అంటూ అనేకవిధాలుగా ప్రార్ధించారు. శివుని కరుణకు వారు ఆనందించారు. ఉచితాసనములపై కూర్చున్నారు. ఆ కొలువు దేవతల కిరీటాలలోని దివ్యమణుల కాంతులతో మిక్కిలి మనోహరమైదీ, లెక్కలేనన్ని శివగణాలతో అలంకరింపబడినది, అనంత వైభవంతో సంతేషిస్తున్నది ఐ ఉన్న ఆ సమయంలో.

1-79-మ.
రి! లాభంబె; శిఖీ! సుఖంబె; యమ! నిత్యానందమే; నైరృతీ!
యివే; పార్థివ! మేలె; మారుతి! సుఖంబే; కిన్నరాధీశ్వరా!
రిణామంబె; శివా! శివంబె; ద్రుహిణా! ద్రంబె, గోవింద! శ్రీ
మే; యంచు దయాళుఁడై యడిగె శ్రీకంఠుండు దేవాదులన్.

టీక :-
ఇరవు = అనుకూలము; పార్థివుడు = రాజు (చంద్రుడు): కిన్నరాధీశ్వరుడు = కుబేరుడు; పరిణామము = క్షేమము; శివము = శుభము; ద్రుహిణుడు = బ్రహ్మదేవుడు: శ్రీకంఠుడు = విషము కంఠమున కలవాడు, శివుడు.
భావము :-
“ఇంద్రా! లాభమేనా? అగ్నీ! సుఖమేనా? యముడా! నిత్యానందమేనా? నైరృతీ! అంతా అనుకూలంగా ఉన్నదా? చంద్రుడా! మేలేనా ? వాయువా! సుఖమేనా? కుబేరా! క్షేమమేనా? శివా! శుభమేనా? బ్రహ్మా! భద్రమేనా? విష్ణూ! శ్రీకరమేనా?” అంటూ శివుడు దేవాదుల క్షేమసమాచారాలను అడుగుచున్నాడు.

1-80-వ.
ఇట్లు పరమేశ్వరుం డడిగిన నందఱు నాలాగునఁ దమతమ పరిణామంబులు విన్నవించి "దేవా! భవదీయకరుణావిశేషంబున సర్వ సంపన్నం బై యుండుఁ గావున; మాకు నే కార్యంబును నప్రతిహతంబై చెల్లుచుండు" నని పలికి సుఖగోష్ఠి నున్న సమయంబున.

టీక :-
ఆలాగున = ఆవిధముగ; పరిణామము = క్షేమము; అప్రతిహతము = అడ్డులేనిది, నిరాటంకము; చెల్లు = కొనసాగు.
భావము :-
ఈవిధంగా పరమేశ్వరుడు అడుగగా వారంతా తమ తమ క్షేమసమాచారములు తెలియచేసి, “మీ అనుగ్రహం వలన మా పనులన్నీ నిరాటంకముగా జరుగుతున్నాయి.” అని చెప్పి సంతోషంగా ఉన్న సమయంలో....