పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : హిమవంతుఁడు పార్వతికి శివునిం జూపుట

1-205-శా.
"మ్మా!పార్వతి! దేవదేవుఁ డగు నా ర్ధేందుచూడామణిన్
మ్మాకానఁగ బోద" మంచు ముదమారంబాలఁ గొంచున్ బ్రయా
మ్మైశీతనగాంతరాళమునకున్ క్షత్రవీధిన్ మహా
మ్మోదంబున బోయి యంతఁ గనియెన్ శైలేంద్రుఁ డమ్ముందటన్.

టీక :-
అర్ధేందు చూడామణి= అర్థ చంద్రుని శిఖపై అలంకరించుకున్నవాడు; కానగ= చూచుటకు; ముదమార= సంతోషంగా; కొంచున్ = తీసుకొని; శీతనగము = మంచు కొండ, హిమాలయములు; అంతరాళము = నడిమిచోటు; నక్షత్రవీధి = ఆకాశమార్గము.
భావము :-
"అమ్మా! పార్వతీ! దేవదేవుడైన ఆ శివుని చూచుటకు వెళ్దాం రా అమ్మా" అంటూ ఎంతో సంతోషంగా ప్రయాణమై ఆకాశమార్గమున హిమాలయ పర్వతముల నడిమికి, బాలను తీసుకొని వెళ్ళి హిమవంతుడు తన ముందర ఇలా దర్శించాడు.

1-206-చ.
తర మాతులుంగ వట ర్జుర రంభ కదంబ నింబ చం
నవచంపకక్రముకతాలతమాల విశాల సాల రో
వర గంధసార ఘనసార యుదంబర చూత కేతకీ
స లవంగ లుంగ తరు పంక్తుల నొప్పినదాని వెండియున్.

టీక :-
ఘనతర = మిక్కిలి గొప్పవైన; మాతులుంగ = మాదీఫలం; వట =మర్రి; రంభ= అరటి; నింబ= వేప; నవచంపక = సంపెంగ; క్రముక= పోక; తాల= తాటి; తమాల= ఉలిమరి; విశాల = విరివైన; సాల= మద్ది; రోచన= కొండబురుగు; వర = కుంకుమపూవు; గంధసార= చందనము; ఔదుంబర= మేడి; చూత= మామిడి; కేతకి = మొగలి; లుంగ= పుల్లమాదీఫలము ;తరులు =వృక్షములు; వెండియున్ = మఱియును.
భావము :-
బహు గొప్పవైన మాదీఫల, మర్రి, ఖర్జూర, అరటి, కడిమి, వేప, చందన, సంపెంగ, పోక, తాటి, ఉలిమిరి, పెద్ద మద్ది,కొండబురుగు, లవంగ, పుల్లమాదీఫలము చెట్ల యొక్క వరుసలతో నిండి చక్కగా ఉన్న ఆ వెండికొండనూ, మఱియు....

1-207-క.
కొకులఁ దిరిగెడు హంసల
కల నాదముల కీర లకలములునుం
కంఠంబుల నాదము
ళినాదము లమరు సుందరారామంబున్.

టీక :-
కొలకులు = సరస్సులు ; కీరము =చిలుక ; కలకంఠ= కోకిల ;అళి =తుమ్మెద; ఆరామము= ఉద్యానవనము.
భావము :-
సరస్సులలో తిరుగుతున్న హంసల కలకలనాదం, చిలుకల కలకలములు, కోకిలల నాదములు, తుమ్మెదల ఝంకారములు వినిపిస్తున్న సుందర ఉద్యానవనమును...

1-208-వ.
కని య మ్మహావనంబు దరియంజొచ్చి తత్ప్రదేశంబున.

టీక :-
కని= చూసి ;ఆమహావనంబు= ఆమహారణ్యంలోకి ; తఱియజొచ్చు = ప్రవేశించు; తత్ ప్రదేశము= ఆ స్థలంలో.
భావము :-
వాటిని చూసి ఆ మహావనము ప్రవేశించి, అక్కడ.....

1-209-మ.
రఁగన్వెల్పలి చింత మాని యచలబ్రహ్మాసనాసీనుఁ డై
తిమై రాజిత దేహమున్విమల భూతిన్దీర్చి కూర్చుండె తా
రుసుల్ నేరక తన్నుఁ దాన తలపై గాఢాత్ము డై నిష్ఠతో
రుఁడయ్యోగసమాధిమై దవిలి నిత్యానందుఁ డై యుండగన్.

టీక :-
పరగ= ఒప్పుగా; వెల్పలి= వెలుపలి ; చింత= తలపు; అచల= కదలని; బ్రహ్మాసనాసీనుడై = ధ్యానమునకు తగిన ఆసనము వేసిన వాడై; తిరము= స్థిరము; రాజిత= ప్రకాశించు; విమల= నిర్మలమైన; భూతి= విభూది; గరుసు= ఎల్ల, మేర; నేరక= తెలియక; తలపు= స్మరించుట; దవిలి= ప్రయత్నించి.
భావము :-
వెలుపలి తలపులన్నీ ఒప్పుగా మాని కదలకుండా ధ్యానమునకు తగిన ఆసనము (పద్మాసనము) వేసినవాడై స్థిరమై నిర్మలమైన విభూది పూతతో ప్రకాశించే దేహంతో కూర్చొని ఉండెను. ఎల్లలులేని, మేరలు తెలియని తనను తాను స్మరిస్తూ నిష్ఠతో ఆత్మ ధ్యానంలో యోగసమాధియందు శివుడు ఆనందస్వరూపుడుగా యున్నాడు.అలా ఉండగా.....

1-210-చ.
చెలువయు దాను గాంచి శివుఁ జేర భయంపడి కొంతదవ్వులన్
నిలిచె గిరీంద్ర శేఖరుఁడు, నీళగళుండును నంతలోనఁ బెం
పొయ సమాధి మాని కడు నొప్పుగఁ గన్నులు విచ్చి చూచుచోఁ
లికె ధరాధరుం డలరి పార్వతికిం దగఁ బ్రీతి తోడుతన్.

టీక :-
చెలువ = అందగత్తె; దవ్వు = దూరము; గిరీంద్ర శేఖరుడు= హిమవంతుడు; నీళగళుడు = నీలకంఠుడు (శివుడు) ; ఒలయ = కూర్చు; ఒప్పుగ = అందముగా; ధరాధరుడు = పర్వతము, హిమవంతుడు; అలరి =సంతోషంతో.
భావము :-
గౌరి మఱియు హిమవంతుడు, అటువంటి శివుని చూసి, వద్దకు వెళ్ళుటకు భయపడి కొంత దూరాన నిలిచారు. అంతలో నీలకంఠుడు సమాధి నుండి బయటకు వచ్చి కన్నులు విప్పి చూశాడు. అప్పుడు, హిమవంతుడు సంతోషంగా ప్రేమగా పార్వతితో ఇలా అన్నాడు.....

1-211-మ.
"దెశంభుండు సమాధి వోవిడిచి నిత్యానందముం దోఁచె; న
ల్లదెకాన్పించెఁ; గృపాక్షులం దెఱచెఁ; దా నాలించె లోకంబులన్;
వేదండసమానయాన! మునిరాణ్మందారునిం జేరఁగా
నై యున్నది సమ్ముఖంబునకు డాయంబోదమా పార్వతీ!"

టీక :-
కృపాక్షులు= దయగల కన్నులు ; ఆలించు= విను; మదవేదండము= మత్తగజము; యాన= వెళ్ళుట; మునిరాణ్మందారుడు= మహర్షుల పాలిటి మందారమైనవాడు; అదను= తగిన సమయము ;సమ్ముఖము =ఎదురుగా ; డాయు= సమీపము.
భావము :-
"పార్వతీ! అదిగో శంభుడు సమాధి విడిచి సంతోషంగా కనిపిస్తున్నాడు. అదిగో చూడు కనబడుతున్నాడు. కరుణాపూరితములైన కన్నులు తెఱిచాడు. జగముల ప్రార్థనలను విన్నాడు. మహర్షుల పాలిటి మందారము వంటి వాడైన ఆ శివుని చేరుటకు ఇదే తగిన సమయము. ఆయనకు దగ్గరకు వెళ్దామా? మదగజముల నడకల పార్వతీ!"

1-212-వ.
అని విచారించి.
భావము :-
అని అడిగి.

1-213-క.
గిరిరాజు తన్ను డగ్గర
రుదెంచి వినమ్రుఁ డగుచు బ్జదళాక్షిన్
రిశనము వెట్టి నిలచినఁ
రుణయు మోదంబుఁ బుట్టెఁ ఱకంఠునకున్.

టీక :-
డగ్గర= దగ్గర; అరుదెంచి = వచ్చి; అబ్జదళాక్షి = కలువ రేకుల వంటి కన్నులు కల వనిత; దరిశనము= దర్శనము; మోదము =సంతోషము.
భావము :-
హిమవంతుడు తనకు దగ్గరగా వచ్చి వినయంతో గౌరిని ముందుపెట్టి నిలబడగా శివునకు దయ, సంతోషము కలిగినవి.

1-214-సీ.
కామునిబాణమో కందర్పదీపమో
జూచి వెఱఁగుపడియె సోమధరుఁడు.
మెలగెఁడుతీఁగెయో మెఱుఁగులబొమ్మయో
తీరగు బంగారుతీఁగెయొక్కొ
మోహంపుదీమమో మోహనవార్ధియో
లాలితమోహనక్ష్మియొక్కొ
చిత్రంపురేఖయో శృంగారములు దోఁచు
రేఖయో పూర్ణేందురేఖయొక్కొ

1-214. 1-ఆ.
నఁగ నొప్పుదానిఁ భినవలావణ్య
రూపకాంతు లందు రూఢి కెక్కి
రఁగుచున్నదానిఁ ర్వతకన్యక
జూచి వెఱఁగుపడియె సోమధరుఁడు.

టీక :-
కాముడు= మన్మథుడు; కందర్పుడు =మన్మథుడు ;వేల్పు= దేవత ;మెలగు= వర్తించు; మోహపుదీమము = జంతువులను మోహింపజేసే ఎర వంటిది; వార్ధి= సముద్రము; రూఢి= ప్రసిద్ధి ; పరగుచున్న=విహరించు.
భావము :-
మన్మథ బాణమా? మన్మథదీపమా? కాంతి రేఖా? దేవకన్యా ? మెరుపుతీగా? మెఱుగుల బొమ్మా ? బంగారుతీగా? మోహింపచేయడానికి ఎరనా? మోహపుసముద్రమా? లలితమైన మోహనలక్ష్మా? చిత్రమైన రేఖా? శృంగారముతో మనసు దోచు రేఖా? నిండు చంద్రరేఖా? అనిపించేలా అభినవ రూపకాంతులతో ప్రకాశిస్తూ విహరిస్తున్న ఆ పర్వత రాజకన్యను చూసి చంద్రకళాధరుడు ఆశ్చర్యపోయాడు.

1-215-వ.
అయ్యవసరంబున.
భావము :-
ఆ సమయంలో..

1-216-ఉ.
పలాక్షి చిత్తమున య్యురగాధిపబాహుకంకణుం
జూచుచు నుండెఁ గాని మఱి చూచినచూపు మరల్ఫ లేమనిం
జూచిమహీధ్రవల్లభుఁడు శూలికి మ్రొక్కఁగదమ్మ బాలికా!
చూచెదు గాని నీ వనుచు సుందరి మ్రొక్కఁగఁ బంచి వేడ్కతోన్.

టీక :-
చపలాక్షి = కదిలెడి కన్నులు కల వనిత; చిత్తము= మనసు; ఉరగము =పాము; మహీధ్రవల్లభుడు= హిమవంతుడు; శూలి= శూలాయుధమును ధరించువాడు, శివుడు.
భావము :-
కదిలెడి కన్నుల గౌరి, చేతులకు సర్పములను కంకణములుగా ధరించిన శివుని చూపు మరల్చకుండా అలా చూస్తూనే ఉండిపోయింది. అది గమనించిన హిమవంతుడు "అమ్మాయీ! ముందు త్రిశూలధరునికి నమస్కరించమ్మా తరువాత చూద్దువుగాని" అంటూ ఆనందంగా నమస్కరింపచేశాడు.

1-217-వ.
పరమ సమ్మోదంబున నమ్మహాత్మునికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి కరకమలంబులు ముకుళించి యి ట్లనియె.

టీక :-
సమ్మోదంబున= సంతోషంతో; ముకుళించి = జోడించి.
భావము :-
పరమానందముగా ఆ మహాత్మునికి సాష్టాంగదండప్రణామము చేసి, చేతులు జోడించి, హిమవంతుడు ఇలా అన్నాడు.

1-218-క.
"జజయ శ్రీగిరిమందిర!
జయ మందారహార! లలితవర్ణా!
జయ భువనాధీశ్వర!
జయ యోగీంద్రపారిజాత! మహేశా!

టీక :-
శ్రీగిరి= శ్రీశైలము; వర్ణము= రంగు; పారిజాతము= దేవ వృక్షము.
భావము :-
"శ్రీశైలవాసా! జయము జయము. మందారదామమును ధరించినవాడా! జయము జయము. లలితమైన(తెల్లని) రంగు గలవాడా! జయము జయము. చతుర్దశ భువనములకు అధిపతీ! జయము జయము. యోగులపాలిటి కల్పవృక్షము వంటివాడా! మహేశ్వరా! జయము జయము-.

1-219-క.
జయ శ్రీగిరిమందిర!
జయ మందారహార! లలితవర్ణా!
జయ భువనాధీశ్వర!
జయ యోగీంద్రపారిజాత! మహేశా!

టీక :-
హాలాహలధరుడు= హాలాహల విషమును ధరించినవాడు; కమలసంభవుడు= బ్రహ్మదేవుడు; వినుత= పొగడబడేవాడు; పన్నగకంకణ= పాములను కంకణములుగా ధరించినవాడు; అవతంస= సిగబంతి.
భావము :-
హాలాహలమును ధరించినవాడా! జయము జయము. దేవేంద్ర బ్రహ్మదేవులచేత పొగడబడేవాడా! జయము జయము. పాములను కంకణములుగా ధరించినవాడా! జయము జయము. గంగను తలపై సిగబంతిగా ధరించినవాడా! జయము జయము. ఇందు శేఖరుడా! జయము.

1-220-సీ.
కుసుమదామంబులు కోమలి తన మౌళిఁ
నిన్నె కాని దేవ! నిశ్చయంబు.
జరాజనిభయాన గంధంబు తనమేన
లఁదదు నీ మేన లఁది కాని;
రాజీవదళనేత్ర త్నకంకణములు
దొడగదు నీ కేలఁ దొడిఁగి కాని;
పుష్కరానన పట్టుఁబుట్టంబుఁ గట్టదు
డకఁతో నీ కటిఁ ట్టి కాని;

1-220. 1-ఆ.
హితలోలనేత్ర మాటాడ దెప్పుడుఁ
గొంచమేని నిన్నుఁ గోరి కాని;
యింత పిదప నిప్పు డేమియు నొల్లదు
నిన్నె కాని దేవ! నిశ్చయంబు.

టీక :-
కుసుమదామములు= పూలమాలలు; కోమలి= సుకుమారి; మౌళి = కొప్పు; నిభ= సమానము; మేను= శరీరము; అలదు =పూయు; రాజీవదళనేత్ర= కమలముల రేకుల వంటి కన్నులు కలికి; కేలు =చేతులు ; పుష్కర= తామరపువ్వు; ఆననము= ముఖము; కడక= ప్రయత్నించు; కటి =మెల. మహిత = గొప్పదైన; లోలనేత్ర = కదలెడి కన్నులు కలది; పిదప= తరువాత; ఒల్లదు= ఒప్పుకోదు.
భావము :-
"దేవా! ఈ సుకుమారి గౌరి పూలమాలను నీ కొప్పుపై పెట్టాకనే తన తలలో తురుముకుంటుంది. గజగమన నీ శరీరానికి పూసాకనే తన మేనికి గంధము అలదుకుంటుంది. ఈ పద్మపత్రనేత్ర నీ చేతులకు రత్న కంకణాలు తొడిగాకనే తాను అలంకరించుకుంటుంది. ఈ పద్మముఖి కోరి నీ మొలకు పట్టుబట్ట కట్టాకనే తాను కట్టుకుంటుంది. ఈ చంచలాక్షి నీ గురించి తప్ప మాట్లాడదు. ఎప్పటికైనా సరే ఈమె నిన్ను మాత్రమే వరిస్తుంది. ఇది నిశ్చయము" అంటూ హిమవంతుడు శివునకు తెలియచేశాడు.