పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : హిమవంతుడు స్తోత్రము చేయుట

1-174-ఉ.
" రిపాటి యెంత గల దిట్టి విధం బని నిర్ణయింపఁగా
నారమేశుఁ డైన కమలాక్షుఁడు నైన విరించి యైన వా
రోరు యిట్లు నిన్నెఱుఁగ నోపుదురే పరు లెల్ల నమ్మ నీ
రూము సర్వమున్ గలుగురూపము గాదె తలంపఁ జండికా!

టీక :-
పరిపాటి = సాధారణం; కమలాక్షుడు = విష్ణువు; విరించి = బ్రహ్మ; సర్వము = సమస్తము.
భావము :-
"చండికా! నీ ఈ రూపము ఎంత ఉన్నది, ఏ విధంగా ఉన్నది అని నిర్ణయించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకైనా తెలియదు. ఇతరులు నీ గురించి తెలుసుకోగలరా? తల్లీ! ఆలోచిస్తే నీ స్వరూపము సమస్తమూ నిండియున్న రూపము కదా. (చూ. శ్రీలలితా సహస్రనామం శ్లో52 - సర్వమయీ)

1-175-మ.
దేవాసురపూజితాంఘ్రియుగళా! నారాయణీ! శాంకరీ!
రుణాపూరితమానసా! త్రియనీ! ళ్యాణయుక్తా! నిశా
దర్పోన్నతిసంహరీ! సదమలా! చండార్చినీ! యోగినీ!
ణీ! యాగమవందితా! భగవతీ! ల్లీ! జగన్మోహినీ!

టీక :-
అంఘ్రి యుగళము = రెండు పాదములు; నారాయణి = నారాయణ శక్తి రూపిణి; శాంకరి = శంకరుని భార్య; త్రినయని = సూర్య చంద్ర అగ్నిలు మూడు కన్నులు గల యామె; కళ్యాణయుక్త= మంగళములతో కూడినామె; నిశాచరులు = రాత్రిపూట సంచరించేవారు(రాక్షసులు); దర్పోన్నతి = గొప్ప గర్వము; సంహరించు = చంపు; సదమల = మిక్కిలి నిర్మలమైన; చండార్చినీ = చండ (చండిక) యొక్క (అర్చ) విగ్రహము కలామె, చండికారూపిణి; తరణి = తరింప జేయునామె; ఆగమవందిత = వేదాలచే నమస్కరింపబడునామె.
భావము :-
తల్లీ! మానవులు, దేవతలు, రాక్షసులూ అందరిచేతా పూజింపబడే పాదములు కలామే! నారాయణీ! శంకరుని భార్యా! కరుణతో నిండిన హృదయము కలామే!సూర్య చంద్ర అగ్నులను మూడు కన్నులుగా తల్లీ! శుభకారిణీ! రాక్షసుల గర్వాపహారిణీ! మహానిర్మలా!చండికా రూప ధారిణీ! యోగినీ!భవబందాలనుండి తరింపచేయుతల్లీ! వేదములచే పూజింపబడునామే! భగవతీ! లోకాలన్నిటినీ మోహింపచేసే తల్లీ! గమనిక:- హిమవంతుడు,శ్రీలలితా సహస్ర నామ స్తోత్రములోని నామాలతో స్తుతిస్తున్నట్లు ఉంది. ఉదా: ధ్యానమ్ - సకల సురానుతామ్; శ్లో70 - నారాయణీ; శ్లో138 - సదాశివపతివ్రతా, శ్లో168 - సదాశివకుటుంబినీ; శ్లో95 - శ్రీనయనా; శ్లో133 - శుభకరీ; శ్లో72 - రాక్షసాగ్నీ; శ్లో145 - చండికా; శ్లో37 - కులయోగినీ, శ్లో129 - యోగినీ; శ్లో65 - భగవతీ; శ్లో1 - శ్రీమాతా.)

1-176-శా.
నాకుంగూఁతుర వైతి వీవు తరుణీ! నాభోక్త దా నెంతయో?
నాకుల్మెచ్చఁగ నింత దేవరకుఁ గళ్యాణిన్ సమర్పించి యా
శ్రీకంఠాంకున కిట్లు మామ యగునే శీతాచలుం డంచు ము
ల్లోకంబుల్ వినుతింపఁ గంటి నిపు డో లోలాక్షి! నీ సత్కృపన్.

టీక :-
తరుణి = యువతి; భోక్త = భోక్తృభోగ్యసంబంధములోని భోక్త; ఎంతయో = ఎంతటిదో;నాకులు = దేవతలు; ఇంత = ఈ సమస్తము; దేవర = శివుడు; శ్రీకంఠుడు =శివుడు; శీతాచలుండు = హిమవంతుడు; వినుతించు = కీర్తించు; లోలాక్షి = చంచలాక్షి (కదలెడు కన్నులు కలది); సత్ = ప్రశస్తమైన;కృప = దయ.
భావము :-
అమ్మా! నాకు కూతురయ్యావు. ఓ చంచలాక్షీ! పార్వతీదేవీ! నీప్రశస్తమైన దయ వలననే, దేవతలు మెచ్చేలా ఈసమస్తానికీ ప్రభువైన శివునకు కళ్యాణిని నిన్నువివాహము చేసి, పరమేశ్వరునకు హిమవంతుడు మామ అయ్యాడని ముల్లోకాలూ కీర్తించే భోగము అనుభవించే భోగ్యమునకు భోక్తనవుతాను. ఆ నా భోక్తృత్వం ఎంత గొప్పదో కదా!

1-177-క.
నీ యందె సకల గిరులును
నీయందె మహార్ణవములు నిలయున్ జగముల్
నీ యందె యుద్భవించును
నీయందే యడఁగియుండు నిరుపమమూర్తీ!

టీక :-
గిరులు = కొండలు; అర్ణవము = సముద్రము; ఉద్భవించు = పుట్టు; అడగించును = నశించును; నిరుపమ = సాటిలేని; మూర్తి = స్వరూపము
భావము :-
సాటిలేని స్వరూపము కలదానా! పార్వతీ! నీలోనే సమస్త పర్వతాలూ ఉన్నాయి. నీలోనే మహాసముద్రాలున్నాయి. లోకాలన్నీ నీ నుండే పుడుతున్నాయి. నీలోనే లీనమౌతున్నాయి.

1-178-క.
త్పత్తిస్థితిలయముల
కుత్పాదన హేతు వనుచు నూహించి నినున్
దాత్పర్యంబున మునులును
త్పురుషులు చెప్ప విందు దమలమూర్తీ!

టీక :-
ఉత్పత్తి =పుట్టుట; స్థితి = ఉనికి(ఉండుట); లయము = నాశనము; ఉత్పాదన = కలిగించు; హేతువు = కారణము; ఊహించి = ఆలోచించి ; తాత్పర్యము = భావము, అభిప్రాయము; సదమలము = మిక్కిలి నిర్మలమైన.
భావము :-
నిర్మల స్వరూపా! గౌరీ!లోకములపుట్టుక, స్థితి, నాశనములకునీవేకారణమని తర్కించి చూసిన మునుల, సత్పురుషుల భావమని చెప్పగా వింటున్నాము.

1-179-క.
న్నములకుఁ గడు సన్నము
నున్నతముల కున్నతంబు నొప్పిదములకున్
జిన్నెయన నొప్పు రుచులకుఁ
దిన్నన నీ చిన్ని గుణము దేవీ గౌరీ!

టీక :-
సన్నము = సూక్ష్మము; ఉన్నతము = ఎత్తైనది; చిన్నె= విలాసము; తిన్నన = యోగ్యత; చిన్ని= మనోజ్ఞత.
భావము :-
గౌరీ దేవీ! నీవుసూక్షంలో సూక్ష్మానివి. ఎత్తులకే ఎత్తైనదానివి. ఒప్పులకు విలాసంగా ఒప్పుదానివి. రుచులకు యోగ్యమైనదానివి. నీ గుణము మనోజ్ఞము.

1-180-క.
నిన్నుమహేశ్వరుఁ డెఱుఁగును
నెన్నమహేశ్వరుని నీవు నెఱుఁగుదు గౌరీ!
న్యుల కెల్లను దరమే
నిన్నును నీ నాథు నెఱుగ నిక్కము తల్లీ!

టీక :-
ఎన్న= ఎంచిచూడగా; ఎఱుగుట = తెలియుట; అన్యులు = ఇతరులు; తరమే = సాధ్యంకాదు; నిక్కము = నిజము.
భావము :-
గౌరీ! ఎంచిచూస్తే నీగురించిమహేశ్వరునకుతెలుసు. మహేశ్వరుని గురించి నీకు తెలుసు. నీగురించి, నీ భర్త గురించి ఇతరులకు తెలియడం సాధ్యంకాదు. ఇది నిజం తల్లీ.

1-181-క.
ధారుణి దివ్యాకారం
బాయ యొప్పిదము భంగి ది యిది యనఁగా
నేరు బ్రహ్మాదులు నిను
నేరుతునే నీదు మహిమ నీరజనేత్రా!"

టీక :-
ధారుణి = భూమి; దివ్యాకారం = గొప్ప ఆకారంతో ప్రకాశించేది; అరయు = తెలుసుకొను; ఒప్పిదము =తగిన; భంగి = విధము; కానేరరు = చూడలేరు; నేర్చు= తెలుసుకొనుట; నీరజనేత్ర= పద్మములవంటి కన్నులు కలది.
భావము :-
పద్మముల వంటి కన్నులు కలదానా! గౌరీదేవీ! బ్రహ్మాదులు గొప్ప ఆకారంతో ప్రకాశించే భూమినే తగిన విధంగా తెలుసుకొని చూడలేరు. నిన్నూ, నీ మహిమనూ తెలుసుకోగలరా!"

1-182-వ.
అని యనేక విధంబుల నుతించి మఱిఁయుఁ దుహినధరణీధర నాయకం డిట్లనియె.

టీక :-
నుతించుట = పొగుడుట; తుహినము = హిమము; ధరణీధరము = పర్వతము.
భావము :-
అంటూ చాలా రకాలుగా పొగిడి మరలా హిమపర్వత రాజు ఇలా అన్నాడు.

1-183-ఉ.
"పిన్నవు గమ్ము నీ మహిమ పెంపుఁ దలంపక తప్పుఁ జేసితిన్
న్నులపండు వయ్యె నినుఁ గంటిఁ గృతార్థుడ నైతిఁ జాలున"
మ్మన్నయటంచుఁ బర్వతుఁడు మానుఁగ మ్రొక్కినఁ జూచి కన్యయై
క్రన్నన నిల్చి తండ్రి మును న్నను ముద్దులుచేసె వేడ్కతోన్.

టీక :-
పిన్న = చిన్న; మానుగ = నిజముగా; క్రన్నన = వెంటనే; మును = ముందు.
భావము :-
అమ్మా! చిన్నగా మారి సాధారణ రూపంలో కనబడు. గొప్పదైన నీ మహిమ తెలియక తప్పు చేశాను. కన్నుల పండుగగా నిన్ను చూసి ధన్యుడనయ్యాను.చాలమ్మా" అంటూ హిమవంతుడు మనస్ఫూర్తిగా నమస్కరించాడు. అది చూసి వెంటనే అమ్మవారు హిమవంతుడు మునుపు చూసిన కన్యలా ముద్దులు గుమ్మరిస్తూ నిలుచుంది.

1-184-వ.
ఇట్లు ప్రసన్నయైయున్న న మ్మహీధరనాయకుం డిట్లనియె.

టీక :-
ప్రసన్నము = నిర్మలము ; మహీధరనాయకుడు= హిమవంతుడు.
భావము :-
అలా శాంతంగా నిలచిన తల్లితో ఆహిమవంతుడు ఇలా అన్నాడు.

1-185-శా.
"శ్రీలావణ్యవిశేషపుణ్య యనుచున్ జింతింపఁగాఁ గంటి శ్రీ
కైలాసాద్రి మహేంద్ర వల్లభునకున్ ణ్యుం డనం గంటి నీ
శ్రీలోలం బగు పాదపద్మ యుగమున్ సేవింపఁగాఁ గంటి నీ
వాలింపం బరమేష్ఠినిన్ దనిపి యిట్లర్థించితేఁ బార్వతీ!

టీక :-
శ్రీ లావణ్య విశేష పుణ్య = శ్రీమంతమైనచక్కదనములతో విశేషమైన పుణ్య స్వరూపము; కైలాసాద్రి మహేంద్రుడు = శివుడు
భావము :-
"పార్వతీదేవీ! నీ యొక్క శ్రీలావణ్యము విశేమైన పుణ్యవంతమైనదని స్మరించగరిగాను తల్లీ! ఆ కైలాస నాథుడైన పరమశివునిచే గౌరవింపవాడనగుటను పొందాను కదా తల్లీ! పరమ పవిత్రములైన నీ యోక్క పాదపద్మములను సేవించుకొను అదృష్టం కలిగింది కదా తల్లీ! నన్ను ఇలా కరుణించడానికి బ్రహ్మదేవుడిని కాని నీవు అడిగావా? తల్లీ!

1-186-సీ.
డు నెండిపోయిన న తటాకమునకు
యిది మహాద్భుతంబు యిందువదన!
న రాక తఱిఁ జూచి నజంబు లుబ్బంగఁ
బొలుపొంద నర్కుండు వొడిచినట్లు;
మలహీనం బైన మలాకరంబులోఁ
మలపుంజంబులు లిగినట్లు;
నతమఃపటలంబు ప్పిన మింటిపైఁ
దుది చంద్రబింబంబు దోఁచినట్లు;

1-186. 1-ఆ.
గిరులలోన నొక్క గిరి యైన నా పేరు
వెలయఁజేసి తిపుడు జలజనయన
నీకుఁదండ్రి నైతి నా కింత చాలదే
యిది మహాద్భుతంబు యిందువదన!

టీక :-
కడు = మిక్కిలి; ఎండిపోయిన = ఆరిపోయిన; ఘన =గొప్ప; తటాకము = చెఱువు; వారి =జలము; పూరము =పూర్తిగా; తఱి = సమయం ; వనజము =వనంలో, జలములో పుట్టునది (తామర); ఉబ్బు =వృద్ధిచెందు; పొలుపు = ఒప్పు; అర్కుడు = సూర్యుడు ; పొడిచినట్లు = ఉదయించినట్లు; కమలహీనంబైన = కమలములు లేని; కమలాకరంబులో = కమలములకు నివాసమైన చెఱువులో; పుంజములు =గుంపులు ;ఘన= గొప్పదైన ;తమః = చీకటి; పటలము = సమూహము; మింటి= మిన్ను; తుది =అంతము; తోచినట్టు =కనబడినట్టు; గిరి= పర్వతము ; వెలయించు =ప్రకాశింపచేయు ;జలజనయన = పద్మములవంటి కన్నులు కలదానా; అద్భుతము =ఆశ్చర్యము ; ఇందువదన = చంద్రుని వంటి ముఖము కలదానా.
భావము :-
బాగా ఎండిపోయిన పెద్ద చెఱువునకు నిండుగా నీరు వచ్చి చేరినట్లు, తను వచ్చే సమయాన్ని చూసి పద్మాలు వికసించేలా సూర్యుడు చక్కగా ఉదయించినట్లు, పద్మాలు లేని చెఱువులో పద్మాలు గుంపులు గుంపులుగా వికసించినట్లు, గొప్ప చీకటి ఆవరించిన ఆకాశంలో పైన చంద్రబింబం కనబడినట్లు, పద్మనేత్రా ! పర్వతాలలో ఒక పర్వతమైన నా పేరు ప్రకాశింపచేశావు. చంద్రముఖీ! పార్వతికి తండ్రిని అనిపించుకున్నాను. నాకీ అదృష్టము చాలదా? (చాలు).

1-187-క.
ఏ నీకుఁ దొల్లి కొడుకను
మానుగ నా కిపుడు నీవు హిఁ గూఁతురవై
మానిని! పుట్టితి విప్పుడు
భూనుతముగ నాకు నిట్టి పుణ్యము గలదే?"

టీక :-
ఏ = నేను; తొల్లి = పూర్వము; మానుగ= పొందుగా ; మహి= భూమి; మానిని = మానము గల స్త్రీ ; భూనుతము= ప్రసిద్ధము.
భావము :-
పూర్వము నేను నీకు కొడుకును. మానినీ! ఈ భూమిపై ఇప్పుడు నాకు నీవు చక్కగా కూతురిగా జన్మించితివి. భూమిపైవారంతా కీర్తించేలా ఇలాంటి అదృష్టాన్ని మించి నాకు యింకేముంటుంది ?"

1-188-చ.
నిగిరినాథుఁ డుబ్బికొనియాడుచుఁ గానక కన్నకూఁతురన్
వియముతోడ నెత్తుకొని వీటికి వేగమె యేగి యప్పు డ
ల్లతనయుండు రాజధవళాయము చొచ్చి కుమారిఁ జూపుడున్
నుఁగొని సొంపుతో నతని కామిని మేనక సంభ్రమంబునన్.

టీక :-
గిరినాథుడు = హిమవంతుడు ; ఉబ్బి = సంతోషించి; కొనియాడుచు = పొగడుచు; కానక = ఆలోచింపకుండగా; కన్నకూతురున్= కన్నకూతురును; వినయము = వినమ్రత ; వీడు= పురము ;యేగి= వెళ్ళి ; అల్లన = తిన్నగా ; రాజధవళాయము= రాజ అంతఃపురము ; చొచ్చి= వెళ్ళి; కనుగొని =చూసి; సొంపుతో = సంతోషముతో ; కామిని = భార్య; సంభ్రమము= ఆశ్చర్యము.
భావము :-
అంటూ హిమవంతుడు సంతోషంతో కీర్తిస్తూ వెంటనే కన్నకూతురును వినమ్రతతో ఎత్తుకొని పురమునకు వెళ్ళను. అప్పుడు తిన్నగా తాను నివసించే అంతఃపురానికి వచ్చి పుత్రికను చూపించెను. ఆయన భార్య మేనక చూసి సంతోషంతో ఆశ్చర్యంతో....

1-189-ఆ.
పాలయిండ్లమీఁది య్యెద వీడంగ
న్నసరము లలర బారసాచి
కౌఁగిలించి వేడ్కఁ మలాయతాక్షి తాఁ
గోర్కి పల్లవింపఁ గూఁతుఁ జూచి

టీక :-
పాలయిండ్లు = చన్నుదోయి; పయ్యెద= పైట; వీడంగ =ఊడగా; బన్నసరము = వివిధములగు మణులు గ్రుచ్చిన హారము; అలరు= ప్రకాశించు; బారసాచి = చేతులుచాచి; కౌగిలించి = హత్తుకొని; వేడ్క= వేడుకతో; కమలాయతాక్షి =పద్మములవంటి కన్నులు కలామె; తా = తాను; కోర్కి= కోరిక ; పల్లవింప = చిగురించు .
భావము :-
మేనకకు కూతురును చూడగానే ఆమె చనుదోయి పైనుండి పమిట జారిపోయింది. (మెడలోని) హారములు ప్రకాశించేలా చేతులు చాచి ఆ పద్మాక్షి (కూతురు కావాలన్న) తన కోరికలు చిగురించగా వేడుకతో కూతురును హత్తుకొంది.

1-190-సీ.
రాలోకసుందరి! రా జగన్మోహినీ!
గామినీలలామ గౌరి యపుడు.
రాకన్యకామణీ! రా రాజబింబాస్య!
రావమ్మ యౌవనరాజ్యలక్ష్మి!
రాఓ మహాకాళి! రా ఓ సరోజాక్షి!
రావమ్మ! భారతీమణవినుత!
రాఓ జగన్మాత! రా ఓ సదానంద!
రావమ్మ మత్తేభరాజగమన!

1-190. 1-ఆ.
నుచుఁ బెక్కుగతుల నంకించి యంకించి
గిలి మేనకాఖ్య న్నుఁ బిలువఁ
తండ్రి చెయ్యి డిగ్గి ద్దయు వేడ్కతోఁ
గామినీలలామ గౌరి యపుడు.

టీక :-
పెక్కు గతుల =ఎన్నో విధాలుగా; అంకించి = పూని, నుతించి ; తగిలి= సంబంధము కలిగించి ; ఆఖ్య= పేరు; డిగ్గి= దిగి ; తద్దయు = మిక్కిలి; వేడ్కతో =కుతూహలముతో ; కామినీలలామ= సౌందర్యవతి ; గౌరి = సమర్తాడని కన్యక.
భావము :-
"లోకములకెల్లా అందమైనదానా! రా! జగముల మోహింపచేసేదానా! రా! కైలాసరాజైన శివసతీ! రావమ్మా! కన్యలలో మణివంటిదానా! రా !చంద్రునివంటి ముఖము కలదానా! రా! యౌవన రాజ్యలక్ష్మీ! రా !ఓ మహా కాళీ! రా ! ఓ పద్మములవంటి కన్నులు కలదానా !రా !రావమ్మా భారతీదేవి భర్త యైన బ్రహ్మదేవునిచే స్తుతింపబడుదానా! జగత్తుకే తల్లివంటిదానా! రా !ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే శివానీ! రావమ్మా! మదగజము వంటి నడక కలదానా !" అంటూ పరిపరి విధాలుగా ఘనంగా నుతించి మేనక పూని తనను పిలువగానే తండ్రి చేయి దిగి మిక్కిలి కుతూహలంతో ఆ సౌందర్యవతి గౌరి యపుడు-..

1-191-సీ.
లహంసనడ లొప్ప ఘంటల రవ మొప్ప
రుణి జేరవచ్చె ల్లికడకు.
పాటించికట్టిన ట్టుచెందియ మొప్ప
బాల చన్నులమీఁద య్యె దొప్ప
కంఠహారము లొప్పఁ రకంకణము లొప్పఁ
గడకఁ గేయూరాది తొడవు లొప్ప
న్నపునడు మొప్ప వరైన పిఱుఁ దొప్ప
లితకనకకుండములు నొప్ప

1-191. 1-ఆ.
వాలుఁజూపు లొప్ప నీలాలకము లొప్ప
భూతితో నుదుటఁ ద్రిపుండ్ర మొప్పఁ
జిఱుత ముద్దు లొప్పఁ జెక్కిటమెఱుఁ గొప్పఁ
రుణి జేరవచ్చె ల్లికడకు.

టీక :-
నడలు= నడకలు; ఒప్పు= తగినది; రవము= శబ్దము; రంజిల్లు = అనురాగము పొందు; నూపురము= అందె; ఆరావము= సడి ; పాటించి =అలరించి ; చెందియ = వస్త్రము; పయ్యెద= పైట; కరకంకణము= చేతినగ (కడియము); కుండలములు =చెవినగలు (కమ్మలు). నీలాలకము= నల్లని వెంట్రుకలు; భూతి = విభూది; త్రిపుండ్రము = మూడు విభూతి రేఖలు; చెక్కిలి = కపోలము.
భావము :-
కలహంస నడకలతో, చిరుఘంటా రావముతో, అందెలు ఘల్లుమనుచుండగా, అలరించే పట్టు వస్త్రములతో, చిన్న స్తనములపై నున్న పైటతో, కంఠహారములు కరకంకణములు కేయూరము మొదలైన ఆభరణములతో, సన్నటి నడుముతో, సక్కనైన పిఱుదులతో, బంగారు తాటంకములతో, వాలు చూపులతో, నల్లని వెంట్రుకలతో, నుదుటి మీద త్రిపుండ్ర విభూది రేఖలతో, కపోలములపై మెఱుపుతో ముద్దులొలుకుతూ బాల పార్వతీదేవి తల్లి మేనక వద్దకు వచ్చింది. గమనిక:- బాల త్రిపురసుందరీదేవి స్పురిస్తోంది)

1-192-వ.
ఇట్లు పార్వతీమహాదేవి డాయ నేతెంచె.

టీక :-
డాయు= సమీపించు.
భావము :-
ఇలా మహాదేవి పార్వతి తల్లి మేనక వద్దకు వచ్చెను.

1-193-సీ.
"మనీయ మోహనాకారభారతి వచ్చె;
కౌఁగలించెను మేనక గౌరిఁ జూచి."
చాతుర్య గాంభీర్య గతి కన్నియ వచ్చె;
లాలితసంపదక్ష్మి వచ్చె;
భూరిలోకైకవిభూతిధారుణి వచ్చె;
మంగళపావనగంగ వచ్చె;
తెఱఁగొప్ప దేవాదిదేవవల్లభ వచ్చె
మానితంబగు మహామాయ వచ్చె;

1-193. 1-గీ.
ల్లి వచ్చెను నన్నేలుల్లి వచ్చె;
బాల వచ్చెను ప్రౌఢైకబాల వచ్చె;
బల కరుణింప నేతెంచె నుచుఁ దిగిచి
కౌఁగలించెను మేనక గౌరిఁ జూచి."

టీక :-
కమనీయ = మనోహరమైన ; మోహనాకార = మోహము కలిగించు ఆకారము కల; భారతి = సరస్వతి; చాతుర్యము= నేర్పు; గాంభీర్య= లోతైన భావము; భూరి= గొప్ప; విభూతి= ఐశ్వర్యము; తెఱగు= క్రమము; వల్లభ= భార్య; మానితంబగు =పూజింపబడు; బాల = బాలత్రిపుర సుందరి; ధారుణి= భూదేవి; దేవాధిదేవుడు = ఇంద్రుడు; ప్రౌఢ= ప్రౌఢత్వము.
భావము :-
"మోహింపచేసే మనోహరాకృతితో సరస్వతీదేవి వచ్చింది. నా మీద దయతో నను గన్న తల్లి వచ్చింది. మిక్కలి చాతుర్య, గాంభీర్యములుగల లోకేశ్వరీదేవి వచ్చింది. మిక్కిలి కాంక్షింపడే సంపదల లక్ష్మీదేవి వచ్చింది. గొప్ప లోకైక ఐశ్వర్యవతి యైన భూదేవి వచ్చింది. మంగళకరమైనది పావనమైనది యైన గంగాదేవి వచ్చింది. ఇంద్రుని భార్య యైన సచీదేవి వచ్చింది. పూజ్యురాలగు మహామాయాదేవి వచ్చింది. నా తల్లివచ్చింది. నన్నేలు తల్లి వచ్చింది. బాల త్రిపురసుందరీదేవి వచ్చింది. ప్రౌఢత్వపు పరాప్రకృతి బాల యై వచ్చింది. ఈ అబలను కరుణించడానికి వచ్చింది" అంటూ మేనక గౌరిని దగ్గరకు తీసుకుని గట్టిగా పొదవుకొంది. ;గమనిక;:- సకలదేవతా స్వరూపిణీ, సకల శక్తి స్వరూపాలు తానే యైన యమ్మ దుర్గ మా యమ్మ అని సూచిస్తున్నట్లు; సరస్వతి, లోకేశ్వరి, లక్ష్మి, భూదేవి, గంగాదేవి, మాయ, సచీదేవి, బాల, పరాప్రకృతి- మున్నగు దేవతలను స్మరించడం జరిగింది.

1-194-వ.
అప్పు డిట్లనియె.
భావము :-
పిమ్మట మేనక ఇంకా ఇలా అనెను.

1-195-శా.
"నీవాసర్వజనైకమాతవు సతీ! నిన్నున్ మహాభక్తితో
దేవేంద్రాదులు పూజసేయుదురు; నీ ధీరత్వమా యెవ్వరున్
భావింపం గలవారు లేరు; నిఖిలబ్రహ్మాండభాండావళుల్
నీవేసేయు మహేంద్రజాలతతులే; నీలాలకా! బాలికా!

టీక :-
సర్వజనైకమాత = సకల జనులకు మూల మాత; నిఖిలము= సర్వము; ఆవళులు= సమూహములు; మహేంద్రజాలము = మాయ; తతి =సమూహము; అలకము =వెంట్రుక.
భావము :-
"నల్లని వెంట్రుకలు కలదానా! ఓ బాలికా! సతీ దేవీ! నీవు లోకమాతవు తల్లీ. దేవేంద్రుడు మొదలైనవారు నిన్ను చాలా భక్తితో పూజిస్తారు. నీ ధైర్య సాహసాలను ఎవరూ ఊహించలేరు. ఈ సమస్త బ్రహ్మాండ భాండములన్నీ నీ అద్భుత మాయాకృతములే నమ్మా.

1-196-సీ.
చిలుకలకొల్కివే; శృంగారగౌరివే;
న్య! యిట్లు భోక్త లదె నాకు?
రమేశు నమ్మినట్టంపుదేవివే;
మిన్నేటిసవతివే మెలఁత! నీవు
నాతపఃఫలమవే న్నేలుశక్తివే;
నాముద్దుపట్టివే నాతి! నీవు
మూఁడులోకములకు మూలంపుమూర్తివే;
వ్వలతల్లివే తివ! నీవు

1-196. 1-ఆ.
మ్మ! నిన్నుఁ గన్న యంతనుండియు నాకు
లసి కోర్కు లెల్లఁ ల్లవించెఁ
గోమలాంగి! నీవు కూఁతుర వైతివి
న్య! యిట్లు భోక్త లదె నాకు?

టీక :-
చిలుకలకొల్కి = చిలుక కొలికి వంటి అందమైన కొలుకులు గల స్త్రీ (కొలికి నేత్ర మూలము); మిన్నేరు= (మిన్ను - ఆకాశంలోని; ఏరు -నది) గంగ ; మగువ, మెలత, నాతి, అతివ = ప్రియమైన / జాగరూకత, మెలకువ గల / జ్ఞానముగల / పుణ్యవతియైన స్త్రీ; కోమలాంగి= మృదువైన అవయవములు కల స్త్రీ; భోక్తము = భోగములు అనుభవించుట.
భావము :-
"ప్రియమైన సతీదేవీ! నీవు చిలుకలకొల్కివి, శృంగారపు గౌరివి, మము గన్న తల్లివి. ఓ మెలతా! పరమేశ్వరుడు నమ్మిన పట్టపు రాణివి, గంగాదేవికి సవితివి తల్లీ నీవు. ఓ నాతీ! నా తపః ఫలానివి. నన్నేలు శక్తివి. నా ముద్దుల పట్టివి తల్లీ నీవు. ఓ యతివా! ముల్లోకములకు మూలపుటమ్మవు. తల్లులకు తల్లివి తల్లీ నీవు. అమ్మా! నిన్ను చూసినప్పటి నుండి నా కోరికలు చిగురిస్తున్నాయి. కోమలాంగీ! కన్యాకుమారీ! నీవు నా కూతురయ్యావు. నాకింతకంటె గొప్ప భోగం (భోగానుభవం) ఇంకేముంటుంది తల్లీ?"

1-197-క.
నియిట్లు మేనకాంగన
ముగ నిచ్చలును దగిలి గౌరవమున మ
న్నసేయుచు భాషించుచుఁ
బెనుపున గౌరీకుమారిఁ బెనుచుచు నుండెన్.

టీక :-
నిచ్చలు = ఎల్లప్పుడూ ; తగిలి =ఆసక్తితో; మన్నన= మర్యాద; భాషించు= మాట్లాడు; పెనుపు =పెంచు ; పెనుచుచు= పోషిస్తూ.
భావము :-
అంటూ మేనకాదేవి గౌరీదేవిని గొప్పగా, నిరంతరం ఆసక్తితో, గౌరవంతో, మర్యాదతో సంభాషిస్తూ పెంచిపోషిస్తూ ఉండెను.

1-198-ఆ.
ట్లు గౌరిదేవి హిమశైలపతి యింట
మర ముద్దుబాల యై చరించి
కొంతకాలమునకుఁ గోమలి వెలుగొందె
కల జనులు దన్ను న్నుతింప.

టీక :-
అమరు= పొందికపడు; చరించి =తిరిగి; కోమలి = చక్కదనము గల స్త్రీ ; సన్నుతింప= చక్కగా స్తోత్రము చేయు.
భావము :-
ఈ విధంగా ఆ గౌరీదేవి హిమవంతుని యింటిలో పొందికైన గారాలకూతురిగా మెలగుతూ కొంతకాలమునకు సర్వజనులూ తనను స్తోత్రం చేసేలా చక్కదనము గల స్త్రీగా ప్రకాశించింది.

1-199-సీ.
కనాఁటి కొకనాఁటి కొక్కొక్క మిక్కిలి
బంచముఖుని" ననుచుఁ లుకుచుండు.
నొరగింపఁ గరఁగింప నొక్కొక్క వన్నియ
లుగుచు నున్న బంగారు కరణి
నాఁడునాఁటికిఁ బోవవకంబుఁగొను చెల్వు
గంగాప్రవాహంబుఁ దొంగలింపఁ
నుదోయి క్రిక్కిరి సౌరభ్య తనువుతో
నొప్పులకుప్ప యై యుప్పతిల్ల

1-199. 1-తే.
నుదినంబును నొకచంద మతిశయిల్ల
మ్మహాదేవి యభివృద్ధి నలరుచుండె
"పొందఁ గల్గు నొక్కొ భూతేశు భువనేశుఁ
బంచముఖుని" ననుచుఁ లుకుచుండు.

టీక :-
మాడ్కి= వలె; ఒరగించు = వంచు; కరగించు = పుటంపెట్టి ద్రవీకరించు; కరణి= వలె; నవకంబు = మృదుత్వము, సుకుమారము; చెల్వు= అందము; క్రిక్కిరి= నిండి; సౌరభ్య = ఒప్పిదము. భూతేశుడు= భూతనాధుడైన శివుడు; త్రిభువనేశుడు= భూలోక, స్వర్గలోక, పాతాళలోకములు అను ముల్లోకములకు అధిపతియైన శివుడు; పంచముఖుడు= సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనే ఐదు ముఖములు కల శివుడు.
భావము :-
రోజు రోజుకూ పెరిగే శుక్ల పక్ష చంద్రరేఖలా బాల పెరుగుతోంది. బంగారాన్ని పుటంపెట్టి కరిగిస్తున్నపుడు ఒక్కొక్క వన్నె బయటపడినట్లుగా శరీరఛాయ పెరుగుతోంది. నానాటికీ గంగా ప్రవాహ మిసమిసలా ఆమె అందమునకు మృదుత్వ సౌకుమార్యాలు అంకురిస్తున్నాయి. చనుదోయి నిండి సౌందర్యమైన శరీరంతో ఒప్పల కుప్ప వలె రోజుకొక అందం పెరుగుతూ ఆ మహాదేవి పెరుగుతోంది. అలా పెరుగుతూ "ఆ భూతేశు, త్రిభువనేశు, పంచముఖుడైన శివుని పొందగలనో లేదో" అంటూ ఉండేది.

1-200-శా.
"రంగత్స్ఫార మనోరథభ్రమరికల్ మ్యాననాంభోజముల్
నింగింగ్రాలెడు లేఁతనవ్వునురువుల్ సేవింపఁ బెంపారు దో
ర్భంగంబుల్ తనరారు శంకరమహాద్మాకరం బందు నా
యంగంబంగజకేళిపూరమున నోలాడించు టిం కెప్పుఁడో."

టీక :-
రంగత్ = రంగైన, వన్నె; స్ఫారము = వికాసము; మనోరథము= కోరిక ; భ్రమరము= తుమ్మెద; రమ్య= అందమైన; ఆననము= ముఖము; అంభోజములు = పద్మములు; నింగి= ఆకాశము; క్రాలు = ఒప్పు, సంచలించు; నురువు= నురుగ; తనరారు= అతిశయించు; భంగము = అల; పద్మాకరం= సరస్సు; పంకజకేళి =మన్మధకేళి; పూరము = ప్రవాహము.
భావము :-
"వన్నెచిన్నెల వికాసాలతో కూడిన కోరికలనే తుమ్మెదలు ఆ అందమైన ముఖ పద్మాల్ని, ఆకాశంలో ప్రకాశించే లేత నవ్వుల నురుగుల్ని సేవించేదెప్పుడో? బాహుదండములనే అలలతో అతిశయించెడి శంకరుడనే మహా సరస్సునందు నా దేహాన్ని మన్మథకేళీ ప్రవాహములో ఓలలాడించడం ఎప్పుడో కదా!"

1-201-వ.
ఇవ్విధంబున.
భావము :-
ఈ విధముగా ఆలోచిస్తూ..

1-202-సీ.
శృంగారములుసేయ శృంగారి యొల్లదు
యుగ్రతాపంబు సైరింప కున్నఁ జూచి.
లుకంగనేరదు లుకనేరనిభాతిఁ
జంచలత్వము నొందుఁ జంచలాక్షి
రసులఁ గ్రీడింప రసిజానన వోదు
మౌనంబుతోఁ గుందు మానవిభవ
గంధంబు వూయదు గంధవారణయాన
చెలువలఁ బిలువదు చెలులచెలియ

1-202. 1-తే.
ముకుర మే ప్రొద్దుఁ జూడదు ముకురవదన
రుణి మఱియును సర్వకృత్యములు మఱచి
రుని తోడిదె గొండాటయైలతాంగి
యుగ్రతాపంబు సైరింప కున్నఁ జూచి.

టీక :-
శృంగారము = అలంకరణ; శృంగారి =సౌందర్యవతి; ఒల్లదు= ఒప్పుకోదు ; తురుము= కొప్పులో పెట్టుకొను ; పువ్వుబోడి = పూవు వలె సుకుమారమైన స్త్రీ; భాతి= వలె ; చంచలత్వము= స్థిరత్వము లేకపోవడము ; చంచలాక్షి= చంచలములైన కన్నులు కల స్త్రీ; సరసిజానన = పద్మము వంటి ముఖముగల స్త్రీ; మానవిభవ= అభిమానము సంపదగా కల స్త్రీ; గంధవారణయాన= గజగమనము కల స్త్రీ; ముకురము= అద్దము ; గొండాట= ఊపిరి తీసుకొనుటకు కూడా తీరికలేని పని; సైరించు = ఓర్చుకొను .
భావము :-
ఆ పార్వతీ శృంగారి అలంకరణలను అంగీకరించుట లేదు.ఆ పూబోడి పువ్వులను తలలో ముడుచుకొనుట లేదు. మాటలు రాని మూగదాని వలె మాట్లాడదు. ఆ చంచలాక్షి స్థిరచిత్తముతో యుండదు. ఆ పద్మముఖి సరస్సులలో క్రీడించడానికి వెళ్ళదు. ఆ అభిమానవతి మౌనంగా మనసులోనే బాధపడుతుంది. ఆ గజగామిని గంధములు పూసుకోదు. ఆ చెలికత్తెలకు కూరిమి చెలి సుందరీమణులను పిలువదు. అద్దం వంటి ముఖం కలిగిన ఆమె ఎన్నడూ అద్దం చూసుకోదు. సతీసుందరి అన్నీ మరచి ఊపిరి తీసుకొనుటకు కూడా తీరిక లేకుండా పరమేశ్వరుని ధ్యానిస్తూ యుండేది. అలా అధికమైన తాపాన్ని భరించలేకపోతున్న ఆ లతాంగిని చూసి..... గమనిక:- భాగవతములోని తిలక మేటికి లేదు తిలకినీతిలకమా-. 1-269-సీ. పద్యము; మఱియు మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ;- 10.1-1732-సీ." పద్యములకు పోలిక ఈ పద్యము నందు కనబడుతోంది.

1-203-ఆ.
కూడి యాడుచున్న కోమలిజనములు
శిశిరవిధులఁ గొంత సేద దీర్చి
శైలరాజుఁ గానఁ నుదెంచి యతనికి
వెలఁదు లివ్విధమున విన్నవింప

టీక :-
శిశిరవిధులు = శీతల ఉపచారములు (గంధము పూయుట, చల్లని పూ సెజ్జపై పరుండబెట్టుట, మొదలైనవి); వెలదులు = వనిత; విన్నవించు= తెలియపరచు.
భావము :-
కలిసి యాడుతున్న చెలికత్తెలు శీతలోపచారములతో కొంత సేద తీర్చి, హిమవంతుని వద్దకు వెళ్ళి అతనికి ఈ విషయాలన్నీ తెలియచేయగా...

1-204-క.
తఁడంతయు నప్పుడు దన
తియగు మేనకకుఁ జెప్పి య్యన గౌరీ
తిఁగానవచ్చి యయ్యెడ
తిమంతుఁడు పల్కెఁ దియ్యమాటలు వెలయన్.

టీక :-
చయ్యన = వెంటనే; వెలయు= ప్రసన్నతపొందు.
భావము :-
అప్పుడు హిమవంతుడు తన భార్య యైన మేనకకు ఈవిషయం చెప్పి, వెంటనే గౌరీ సతి వద్దకు వచ్చి, ఆ బుద్ధిశాలి గౌరి ప్రసన్నత పొందేలా ఈవిధంగా మాట్లాడాడు.