పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : దక్షుడు రజతగిరి కరుగుట

1-81-క.
నుఁడగు శంభుఁడు గొలు వయి
రుట విని మునులు గొలువ క్షుఁడు వేగన్
నియె రజతాద్రి శిఖరికిఁ
యంతనె యజ్ఞనాధు ర్శింపంగన్.

టీక :-
తనరు - అతిశయము, విజృంభించుట; రజతాద్రి- = వెండి కొండ.
భావము :-
గొప్పవాడైన శివుడు కొలువై వున్నాడని విని మునులు సేవిస్తుండగా దక్షుడు తనంతట తనే, శివుని సేవించడానికి వెండికొండకు వెళ్ళాడు.

1-82-క.
నిగిరిమందిరు సన్నిధి
వియంబున నిల్చియున్న వేడుక నతఁడున్
మునులను సంభావించిన
నువునఁ దనుఁ గారవించె ప్పుడు కరుణన్.

టీక :-
గిరిమందిరుడు = కొండశిఖరము నివాసంగా కలవాడు, శివుడు.
భావము :-
అలా వెళ్ళి శివుని సన్నిధి వద్ద వినయంగా నిలుచున్నాడు దక్షుడు. అప్పుడు శివుడు ఇతర మునులను గౌరవించినట్లుగనే దక్షుని కూడా కరుణతో గౌరవించాడు.

1-83-వ.
ఇ ట్లఖిల భువనాధీశ్వరుండు గారవించిన.
భావము :-
ఈవిధంగా శివుడు గౌరవించగా....

1-84-ఉ.
ద్దిర! శంకరుండు వినయంబున నా కెదు రేగుదెంచి నా
పెద్దతనం బెఱింగి తగఁ బెద్దఱికం బొకయించు కైనఁ దా
గ్రద్దనఁ జేయఁడయ్యె మఱి గౌరియు మన్నన సేయ దయ్యె నీ
పెద్దలు నవ్వ లాతిమునిబృందము చాడ్పునఁ జేసి రిమ్మెయిన్.

టీక :-
అద్దిర = ఔరా భలే (అవ్య); పెద్దతనము = గొప్పతనము; పెద్దఱికము = గౌరవించుట; గ్రద్దన = శీఘ్రముగ; నవ్వు = అపహసించు; మన్నన = గౌరవము; లాఁతి = అన్యము; చాడ్పున = వలె; ఇమ్మెయిన్ = ఈ విధముగ.
భావము :-
“ఇదేమిటి? నా పెద్దతనం తెలిసినవాడు కనుక శంకరుడు వినయంగా త్వరగా నాకు ఎదురు వచ్చి తీసుకు వెళతాడనుకున్నాను. గౌరి కూడా గౌరవించ లేదు. పెద్దలు (విష్ణు, బ్రహ్మలు) పరిహసించేలా ఈవిధముగా ఇతర మునులకు చేసినట్లే చేసారు.” అని దక్షుడు తలచాడు.

1-85-క.
నితన పాలిటి కర్మము
పెనఁగొని తనుఁ జుట్టుముట్టి ప్రేరేపంగాఁ
జెనఁటి యగు దక్షుఁ డప్పుడు
మున గోపంబు నొంది లహరు విడిచెన్.

టీక :-
కర్మము = కర్మఫలము; పెనగొని = ముప్పిరిగొని; ప్రేరేపంగా = ప్రేరేపించగా; చెనటి = కుత్సితుడు; మలహరుడు = శివుడు, వ్యు. మల హృ అచ్. కృ.ప్ర. మలము (పాపమును) హరించువాడు..
భావము :-
అలా భావించిన దక్షుని తన కర్మఫలము తనని చుట్టుముట్టి ప్రేరేపించగా,.కుత్సితు డగు దక్షుడు మనసులో కోపము పెట్టుకొని శివుని విడిచిపెట్టెను.

1-86-వ.
ఇట్లు దేవదేవుని మహత్వంబుఁ దెలియక వృధావైరంబున దక్షుం డటువాసి చనియె, నంత న మ్మహేశ్వరుఁ గొల్వవచ్చిన దేవేంద్రాది బృందారక సంఘంబులు పునః పునః ప్రణామంబు లాచరించి చనిరి తదనంతరంబ.

టీక :-
వృథా = అనవసరముగా, వ్యర్థముగా; అటువాసి చను = అక్కడనుండి విడిచి పోవు; బృందారకులు = దేవతలు; పునఃపునః = మరలమరల
భావము :-
ఈ విధముగా మహాదేవుని గొప్పతనము తెలియక వృథా శతృత్వమును పూని దక్షుడు వెడలిపోయెను. పిమ్మట దేవేంద్రాదులు శివునికి మరలమరల నమస్కరములు చేసి వెడలిరి.

1-87-క.
క్కడ దక్షుం డరుగుచుఁ
బొక్కుచు స్రుక్కుచును సిగ్గు వొందఁగఁ గోపం
బెక్కువ గా నంతంతటఁ
జిక్కుచుఁ దలపోతఁ నొంది చిత్తము గలఁగన్.

టీక :-
బొక్కుచు = తలచుకొనుచు; స్రుక్కు = దుఃఖించు; చిక్కు = వశమగుచు; తలపోత = చింత కలగు, కలతపడు.
భావము :-
దక్షుడు అలా తిరిగి వెళ్తూ జరిగిన విషయాన్ని పదేపదే తలచుకుంటూ అవమానంగా భావిస్తూ దుఖించుచు,, కోపానికి వశుడై, చింతాగ్రస్తు డయ్యాడు మనసు కలతచెందగా….

1-88-క.
నాకులు వచ్చిన నిచటికి
నాకును రానేల నేఁడు నా కిందులకున్
రాకున్న నేమి కొఱఁ తగుఁ
బ్రాటముగ ధిక్కరింపఁ డితిం గాదే.

టీక :-
నాకులు = దేవతలు; ప్రాకటముగా = అందరికీ తెలిసేలాగ; ధిక్కరింపబడు = తిరస్కారింపబడు.
భావము :-
“కైలాసమునకు దేవతలు వచ్చారని తెలిసి, నేను ఇక్కడకు ఎందుకు వచ్చాను. రాకపోతే నాకేమి తక్కువ అవుతుంది? దీనివలన నేను అందరి ఎదుట అవమానింపబడ్డాను కదా.

1-89-క.
దేత లందఱుఁ దమ కొక
దేతవలె నంచుఁ దన్ను దేవర యంచున్
వావిరిఁ గొలిచిన నా కీ
దేర వల దనుచు మాఱు తెచ్చెద ననుచున్.
భావము :-
దేవతలందరూ నన్ను తమ దేవతలాగ కొలుస్తారు. ఈ శివుడు నాకు దేవుడాiగా వద్దు. నేను వేరే వారిని తెచ్చుకుంటాను.” అని దక్షుడు తలపోయసాగాడు.

1-90-ఆ.
జాలిఁబడుచు నలఁగి లోలోనఁ గుందుచుఁ
జిన్నవోయి మొగము జేవురింప
నింటి కరిగి యున్న నీక్షించి యిట్లని
లికె దక్షుఁ జూచి భార్య ప్రీతి.
భావము :-
దక్షుడు తనపై తానే జాలిపడుతూ, అలుగుతూ, లోలోన బాధపడుతూ, చిన్నబోయి, ముఖము ఎఱ్ఱబడగా ఇంటికి వెళ్ళెను. అది చూసిదక్షుని భార్య ప్రేమగా ఇలా అంది......

1-91-క.
యల్లుని మన బిడ్డను
నుగొంటిరె మంగళంబె రుణన్వారే
నిమిమ్ము గారవించిరి
వినిపింపుఁడు వీనులలర వినియెద ననినన్.
భావము :-
“మన అల్లుడిని, బిడ్డను చూశారా? వారు క్షేమమేనా? కరుణతో వారేవిధంగా మిమ్మల్ని గౌరవించారు? శ్రవణానందకరంగా వినిపించండి. వింటాను.” అన్నది.

1-92-వ.
దక్షుం డిట్లనియె.
భావము :-
అపుడు దక్షుడీవిధంగా అన్నాడు..

1-93-మత్త.
"మాకు మామ గదా యితం డని న్ననల్ దగఁ జేయఁ డే
లోనాథుఁడ నంచు గర్వము లోలతం బడి యున్నవాఁ
డీతంబుల నేమి చెప్పుదు నింతిరో! విను నాకునున్
నీకుఁగూఁతురు నైన గౌరియు నిక్క మేమియుఁ బల్కదే.
భావము :-
ఓ ఇంతీ! “నాకు మామగారు కదా ఇత”డని గౌరవించలేదు. లోకనాథుడననే గర్వం చాలా ఉంది. ఏమని చెప్పమంటావు? మన కుమార్తె గౌరి కూడా మాట్లాడలేదు.

1-94-మత్త.
కానింకను దీనికిం బ్రతికార మే నొనరించెదన్
బూనిచేసెద మేటియఙ్ఞముఁ బూజ చేసెదఁ గేశవున్
మౌనులున్ వసువుల్ దిగీశులు ర్త్యు లుండఁగ నొప్పుఁగాఁ
మానినీ! చనుదెంతు రిచ్చట మాటమాత్రనఁ బిల్చినన్.
భావము :-
కావున, మానినీ! నేను దీనికి ప్రతీకారం చేస్తాను. ఒక పెద్ద యజ్ఞం చేస్తాను. దానికి విష్ణువును పెద్దచేసి పూజిస్తాను. మునులు, వసువులు, దిక్పాలురు, మహారాజులు అందరూ నేను పిలిస్తే చాలు వారంతా చక్కగా ఇక్కడకి వస్తారు.

1-95-మత్త.
పిలుతు దివ్యుల నందఱిన్ వెలిబెట్టు దిప్పుడు భర్గునిన్
వెయ నిశ్చయ మిట్టి దంచును వేదవేద్యు మహత్వమున్
లఁపగోచర మైనఁ దొట్టిన దామసంబునఁ బొంగి యా
లుఁడు దక్షుఁడు పాపచక్షుఁడు ర్మదక్షుఁ డదక్షుఁడై.

టీక :-
దక్షుడు = సర్వసమర్ధుడు. కర్మదక్షుడు = ఏదో ఒక పని చేసి పెద్దల మెప్పును పొందేవాడు.
భావము :-
గొప్పవారందరినీ పిలుస్తాను. శివుని వెలివేస్తాను. ఇది నిశ్చయం.” అంటూ శివుని మహిమ తెలియక ఆ పాపి, మూర్ఖుడిలా కర్మదక్షునిలా, దక్షత లేనివానిలా వ్యవహరించాడు దక్షుడు.