పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : దక్షుఁడు దివిజులఁ బిలుచుట

1-96-క.
రితపనరాజ కమలజ
రిశిఖి యమ దనుజ వరుణ వాయు కుబేరే
శ్వకిన్నర మునివర సుర
రుడోరగ సిద్ధ సాధ్య చరులఁ బిలిచెన్.

టీక :-
హరి = విష్ణువు, ఇంద్రుడు; తపనుడు = సూర్యుడు, రాజు = చంద్రుడు, కమలజుడు = బ్రహ్మదేవుడు; శిఖి = అగ్నిదేవుడు; దనుజుడు = నైరృతి, ఉరగము = పాము, ఖేచరులు = ఆకాశగమనులు.
భావము :-
దక్షుడు - విష్ణువు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరృతి, వరుణదేవుడు, వాయుదేవుడు, కుబేరుడు, కిన్నరలు, మునులు, దేవతలు, గరుడులు, సర్పరాజులు, సిధ్ధులు, సాధ్యులు, ఖేచరులను పిలిచాడు.

1-97-క.
పిలిచిన సౌరభములతో
రుచుఁ జనుదెంచి వార ప్పుడు దమకున్
నగు ఠావుల నుండిరి
కలమై వివిధ నిగమ నరవ మొదవన్.

టీక :-
సౌరభము = పరిమళము; అలరు = వికసించు, సంతోషించు; వలను = అనుకూల్యము; ఠావు = స్థానము; నిగమఘనరవము = వేదఘోష; ఒదవన్ = కలుగగా.
భావము :-
దక్షుడు పిలవగానే వారంతా ఆనందంగా సర్వాభరణాలనూ అలంకరించుకొని వచ్చారు. వచ్చి, కలకలారావములు, వివిధ వేదఘోషలు వినిపిస్తుండగా వారివారి స్ధానములో ఉన్నారు..

1-98-క.
ల్లుండ్రఁ గూఁతు లందఱఁ
బొల్లమితిం బిలిచితెచ్చి పూజనలిడుచున్
ల్లతనంబున దక్షుఁడు
చెల్లింపఁ దొడంగెఁ గ్రతువు శివరహితముగన్.

టీక :-
బొల్లు =అసత్యము; అమితన్ = అదికముగా; కల్లతనము = అబద్ధము, చెడ్డనడత,. వంచన.
భావము :-
దక్షుడు మిగిలిన అల్లుళ్ళనీ, కూతుళ్ళనీ పిలిచి గౌరవించాడు. శివుడు లేని అబద్ధపు యజ్ఞాన్ని చేయడం ప్రారంభించాడు.

1-99-క.
అంట నారదముని దా
నంయుఁ గని నవ్వి దేవతారాఢ్యుఁడు దా
నెంయు నిచ్చట లేఁ డని
సంసమునఁ జనియె రజతశైలముకడకున్.

టీక :-
దేవతారాధ్యుడు = దేవతలచే ఆరాధింపబడువాడు, శివుడు
భావము :-
అప్పుడు నారదుడు వచ్చి, చూసి, నవ్వుకొన్నాడు. సకలదేవతారాధ్యుడు శివుడు ఇక్కడలేడని సంతోషంగా వెండికొండకు వెళ్ళాడు.