పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : ఆశ్వాసాంతము

1-229-మత్త.
రాచందన కుంద శంఖ మరాళ హీర పటీర వి
భ్రాజితాంగ! మునీంద్రమానసద్మహంస! రమాంగనా
రానాయక! ధారుణీధరరాజనందననాయకా!
రారాజమనస్సరోజవిరాజితాంబుజనాయకా!

టీక :-
రాజచందనం= మంచిగంధం; కుంద =మొల్ల; మరాళము= హంస; హీరము= వజ్రం; పటీరము= కర్పూరము; విభ్రాజి = ప్రకాశించే; ధారణీధర= భూమి ధరించే పర్వతము; సరోజ= సరస్సున జనించునది, పద్మము; అంబుజనాయక = పద్మముల నాథుడైన సూర్యుడు; రాజరాజు = కుబేరుడు.
భావము :-
మంచిగంధం, మొల్ల, శంఖము, హంస, వజ్రము, కర్పూరముల వలె తెల్లగా ప్రకాశించే దేహం గలవాడా! మునీంద్రులమానసులనే పద్మములలోని హంసవంటి వాడా! లక్ష్మీదేవి భర్తైన విష్ణువుకు నాయకుడా! హిమవంతుని పుత్రికైన పార్వతికి నాథుడా! కుబేరుని మనస్సనే పద్మమున ప్రకాశించే సూర్యుడా!

1-230-మా.
నిమభువనదీపా! నిర్మలానందరూపా!
ణితగుణధీరా! ప్రతర్క్యప్రకారా!
నజలధిహారా! ఖండరాజద్విహారా!
ముగుదమదనమూర్తీ! యోగిహృద్యాంతవర్తీ!

టీక :-
నిగమము = వేదము; అప్రతి = సాటిలేని; అర్క్య = పూజింపబడు; ప్రకారా = విధము కలవాడా.
భావము :-
వేదశాస్త్రాలకు మార్గదర్శనుడా! నిర్మలానంద స్వరూపము గలవాడా! లెక్కలేనన్ని ధీరగుణములు గలవాడా! సాటిలేని విధమున పూజింపబడువాడా! ఆకాశము సముద్రము హారముగా గలవాడా! చంద్రరేఖ అలంకారముగా గలవాడా! అర్థనారీశ్వరా! యోగుల హృదయాలలో నివసించేవాడా!

1-231-గ.
ఇది శ్రీమన్మహామహేశ్వర యివటూరి సోమనారాధ్య దివ్యశ్రీ పాదప ద్మారాధక కేసనామాత్యపుత్ర పోతయనామధేయ ప్రణీతంబైన వీరభద్ర విజయం బను మహా పురాణకథ యందు దేవేంద్రాది దేవగణంబులు శివుని సందర్శనంబు సేయుటయు; దక్షయాగంబును దాక్షాయణి నారదు వలన విని శంభుని కెఱింగించుటయు; శంభుండు పనుప దివ్యరథా రూఢ యై పార్వతీదేవి దక్షు నింటికి వచ్చుటయు; దక్షుఁడు సేయు శివనింద వినఁజాలక యమ్మహాదేవి దేహంబు దొఱఁగుటయు; హిమవంతునికిఁ గుమారియై శాంకరి పొడచూపుటయు; తదీయ తపో మహత్త్వంబును; నగజ శివునకుఁ బరిచర్యలు సేయుటయు నన్నది ప్రథమాశ్వాసము.

టీక :-
శ్రీమన్మహామహేశ్వర= గొప్పవాడైన ఈశ్వరుడు; అమాత్య =మంత్రి ; ప్రణీతంబైన= చక్కగా రచింపబడిన; దొఱగుట =త్యజించుట.
భావము :-
ఇది గొప్పవాడైన యివటూరి సోమనారాధ్యుని పాదపద్మారాధకులైన కేసనమంత్రి పుత్రుడూ, పోతయ అనే పేరు గలవాడూ రచించిన వీరభద్రవిజయం అనే మహాపురాణ కథ యందు దేవేంద్రాది దేవగణములు శివుని దర్శించుటయు; దక్షయాగము గురించి దాక్షాయణి నారదుని వలన విని శంభునికి తెలియచేయడము; శంభుడు పంపగా దివ్యరథముపై పార్వతి దక్షునింటికి వచ్చుటయు; దక్షుని శివనింద భరించలేక ఆ మహాదేవి శరీరాన్ని త్యజించుటయు; శాంకరి హిమవంతుని కుమార్తెగా జన్మించి తపస్సులోనున్న శివునకు నగజ పరిచర్యలు చేయుటయు చెప్పెడి ప్రథమాశ్వాసము సమాప్తము.