పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : వీరేశ్వరుండు దేవతలను సంహరించుట.

4-101-వ.
ఇట్లు వేదంబులు వివరించుటయును, వేల్పులు వినకుండుటయును, వెంగలి యైన దక్షుండువిరోధించుటయును, వీరభద్రుండు వీక్షీంచి తత్సభవారల కిట్లనియె.
భావము :-
ఈ విధముగా వేదములు వివరించినా దేవతలు వినకపోవడము, మూఢుడైన దక్షుడు కాదనడము వీరభద్రుడు చూసి ఆ సభవారితో ఇలా అన్నాడు.

4-102-శా.
కాధ్వంసుఁడు సర్వతంత్రములకున్ ర్తారుఁ డంచున్ శ్రుతి
స్తోమంబుల్ వినిపింప నేఁడు వినమిన్ దుర్వృత్తి నున్నారిలన్
స్వామిద్రోహులు మీరు మిమ్ముఁ గడిమిం సంగ్రామరంగస్ధలిన్
వేమాఱుం బరిమార్చి వైతు నిఁక దోర్వీర్యం బవార్యంబుగన్.

టీక :-
స్తోమము = సమూహము; వృత్తి = నడవడిక; కడిమి = పరాక్రమము; వేమారు = మాటిమాటికి; అవార్యము = అడ్డగింప శక్యము కానిది.
భావము :-
మన్మథవైరి యైన పరమశివుడు సర్వతంత్రములకూ కర్త యని వేద సమూహము వినిపించినా నేడు వినక చెడు నడవడితో ఇలా ఉన్నారు. మీరు స్వామి ద్రోహులు. మిమ్మల్ని పరాక్రమంతో యుద్ధరంగంలో నివారింపరాని వీరత్వంతో చంపివేస్తాను.

4-103-వ.
అని పలికి.

4-104-సీ.
జంకించి మైవెంచి శంఖంబు వూరించి
గనభాగంబెల్ల లయఁ దిరిగి
నికి సంరంభించి యార్పులఁ జెలగించి
బ్రహ్మాండభాండంబుఁగులఁ జేసి
భుజశాఖ లడలించి భూస్ధలి నంకించి
లువిడి నాయుధంబులు ధరించి
రుల గుండెలు చించి డిదంబు ఝలిపించి
ర్పించి సింహనాదంబుఁ జేసి

4-104.1-ఆ.
తికరాళ భృకుటితాస్యుఁడై కన్నుల
నిప్పులొలుక సురలు నెఱిఁ దలంక
వీరగణవిభుండు విలయకాలానల
రౌద్రమూర్తి వీరభద్రమూర్తి.

టీక :-
జంకించు = బెదిరించు; మై = శరీరము; అని+కి = యుద్ధమునకు; సంరంభించు = సిద్ధపడుచ, వేగిరపాటుచూపు; ఊర్పులు = శ్వాసలు, నిట్టూర్పులు; చెలగించు = విడుచు; భుజశాఖలు = చేతులు; అడలు = చలించు; అంకించు = ముట్టుకొను; అరి = శతృవు; అడిదము = ఖడ్గము; కరాళ = వెఱపు పుట్టించే; భృకుటి = నొసలు; ఆస్య = ముఖము; నెఱిన్ = పూర్తిగా; తలంకు = భయపడు.
భావము :-
వెరపు పుట్టించే కనుబొమలతో కళ్ళ నిప్పులు కురిపించే ముఖము కలవాడై దేవతలు మిక్కిలి భయపడేలా ఆ వీరగణనాయకుడైన వీరేశ్వరుడు ప్రళయకాలాగ్ని వంటి రౌద్రముతో, బెదిరిస్తున్నాడు, శరీరాన్ని పెంచుతున్నాడు, శంఖం పూరిస్తున్నాడు, ఆకాశభాగమంతా కలియదిరిగుతున్నాడు, సంగరక్రీడకు వేగిరిపాటు చూపుతున్నాడు, నిడుపైన నిట్టూర్పులు విడుస్తున్నాడు. బ్రహ్మాండభాండము పగిలేలా పెనుబొబ్బలు పెడుతున్నాడు, చేతులు అదిలిస్తున్నాడు,వంగి భూమిని తాకుతున్నాడు, అతిశయించి ఆయుధాలు ధరిస్తున్నాడు, శత్రువుల గుండెలు పగిలేలా కత్తిని ఝలిపిస్తున్నాడు, గర్వించి సింహనాదము చేస్తున్నాడు,

4-105-వ.
ఇట్లు మహావీరావేశంబున భేరీ ఢంకార నినాదంబులు గగన మండలంబు నిండి చెలంగ వెండియునిట్లనియె.

టీక :-
వెండియు = మరియు.
భావము :-
ఇలా గొప్ప వీరావేశముతో భేరీ ఢంకార నాదములు చెలరేగి ఆకాశమంతా నిండుతుండగా, వీరేశ్వరుడిలా అన్నాడు.

4-106-ఉ.
కంక మైన యాగ మిది గౌరిశివార్పణ మంచు నార్పు మి
న్నంటఁగ నగ్గణంబులకు నందఱికిం జెయి సన్నఁజేసి తా
మంలకన్ను విచ్చి మఖమండపశాలలు నీఱు చేసిమున్
మింమిణుంగురుల్ మెఱియ మేదిని యెల్లఁ గణంగి ఘూర్ణిలన్.

టీక :-
కంటకము = విరుద్ధము; సన్న = సంజ్ఞ; నీఱుచేయు = బూడిదచేయు; మిణుగురులు = అగ్ని కణములు; కణగి = యత్నించి; ఘూర్ణిల్లు = తిరగబడు.
భావము :-
భద్రుడు “లోకకంటకమైన ఈ యాగం గౌరీశివార్పణం” అంటూ గట్టిగా బొబ్బపెట్టాడు. వీర గణములందరికీ చేతితో సంజ్ఞచేసాడు. తాను కంటిమంటలను తెరచి ముఖమండపాలుగా ఉన్న యాగశాలలు బూడిదచేసాడు. అంత యాకాశమంతెత్తు అగ్ని కణములు చెలరేగాయి. భూమి యంతా దద్దరిల్లింది..

4-107-క.
నంబున రోషాగ్నులు
వెదఁజల్లుచు ఘోరవీరవైశ్వానరుఁ డై
పడి నానాగతులను
విళించెన్ వీరభుఁడు వేల్పులమూకన్.

టీక :-
వైశ్వానరుడు = అగ్ని; పదపడి = మరియు; విదళించు = చించి చెండాడు.
భావము :-
ముఖమున కోపాగ్ని వెదజల్లుతూ ప్రచండాగ్నివలె మరియు అనేక విధాలుగా దేవతా సమూహాలను చీల్చి చెండాడాడు.

4-108-వ.
మఱియుఁ; బ్రళయకాల నీలజీమూతపటలంబులంబోలి పోనీక వెనుతగిలి పలుదెసలం బాఱి విసరువెనుగాడ్పు చందంబునఁ జరాచర జంతుసంఘంబుల మండలీభూతసముద్ధండ కోదండుం డై వైభవాడంబరంబగు బ్రహ్మాండంబుల నొండొండఁ జేర్చి చెండాడెడు ఘోరాడంబరుం డగు నఖండదండధరవైరి విధంబున దివిరాసి యరితూల యడుగుల పయింబడి యంకిలి లేక దరికొని గరలి వడిగాలిదోఁడుగాఁ గల్గు విలయకాలానలంబు కైవడిఁ గవిసి గిరిగహ్వర గహన గుహాంతర్గతశయన సుప్తంబులైన మదగంధగజ యూథంబుల ఘీంకారంబుచేత ప్రబోధింతబై వాని వెనుదవిలి కుంభస్థలమాంసంబు నఖదంష్ట్ర్రంబులం జించి చెండాడు సింగంబు పగిది మహార్ణవాంతరంగంబున మత్స్య కచ్ఛప కర్కటక తిమి తిమింగిలాది జంతుసంతానంబు లాగున పయఃపారావార మధ్యంబున నమృతాహరణార్థంబు దిరుగు మహామందరంబు తెఱంగున మహాభీకరంబుగాఁగఁ గలసి కరాళించి విలయసమయ విజృంభిత జీమూత నిర్ఘాత ప్రచండ ఘనరవ భయంకరంబుగా శంఖంబుఁ బూరించి విడంబించి యెక్కడఁ జూచినఁ దానయై హరి పురందర విరించాదులు దిగులుకొని బెదరిబెదరి పఱవఁ బోనీక యదరంటం దాఁకి గుడుసువడి వీఁకమై వెఱచఱచి పఱచునట్లుగా దేవగణంబుల మూకలకులికి యగ్గణరాజకంఠీరవుం డగ్గలిక మెఱయ బలువిడిఁ గడువడి కెరలి పిడుగులం బోలిన బాణాజాలంబులు పఱపుచు, శూలంబులఁ బొడుచుచు, నేలపాలు చేయుచుఁ, గఠారంబులఁ బొడుచుచుఁ, గుఠారంబుల ఖండించుచుఁ, బరశువుల నఱకుచు, నత్తళంబుల నొత్తుఛుఁ, జక్రంబులఁ ద్రెంచుచు, భిండివాలంబుల ఖండించుచుఁ, జంచువుల విజృంభించుచు, నఖంబులఁ జీరచు, పాదంబులఁ జవురుచు, పిడికళ్ల రువ్వుచు, నరచేతులం బాదుచుఁ, దూపులఁ బఱపుచుఁ, గవిసియుఁ దనివిఁ గొనక వెండియు; నానావిధ పదఘట్టనంబుల మహీమండలంబులఁ గప్పుచు, మార్తాండ మండలంబు తెఱంగున నతని వెయి చేతుల విడంబించి యఖండ వివిధ విలసితవిశిఖవ్రాతంబుల నందఱకు నన్ని రూపులై తోఁచి గొడుగులు విఱుచుచుఁ, జామరంబులఁ బొడిసేయుచు, శిరంబులు గూల్చుచు, శిఖలు వెఱుఁకుచు, వదనంబులు ద్రుంచుచు, నూరువులుఁ బదంబులు వ్రచ్చుచు, గళంబులు గోయుచు, భుజంబులు విడిపించుచు, నాలుకలు గోయుచు, ముక్కులు జిదుముచు, చెక్కులు గమకించుచు, ప్రేఁగులు ద్రెంచుచు, కన్నులు బెఱుకుచు, చెవులు ద్రెంచుచుఁ, గీరీటంబులు పదతాడనంబున రాల్చుచు, కండలు చెండుచు, రక్తంబులుగ్రోలుచు, నెముకలు రాల్చుచుఁ, బడద్రోచి పండ్లు పీఁకుచుఁ, గొందఱ హోమగుండంబులనిండను వ్రేల్చుచు, నుదరంబులు ఖండించుచు యిట్లు మఱియుం; గలంచుచు, గుదించుచుఁ, గోలాహలంబు సేయుచు, యేపుమాపియుఁ జమరియుఁ జక్కడిచియు నెఱి చఱచియు నేలపాలొనర్చియు; ననంత సమర కేళీవిహారం బొనరింప; దేవసంఘంబులు సైరింపంజాలక నలంగియుఁ, దొలంగియు, నొచ్చియుఁ, జచ్చియుఁ, జర్జరితులై మూర్ఛిల్లియుఁ జెల్లాచెదరై పాఱియు, నొండొరువులఁ జొచ్చియు నున్నం గనుంగొని వీరభద్రేశ్వరుండు.

టీక :-
జీమూత = మేఘము; సముద్దండ = తీవ్రమైన; ఒండొండ = క్రమక్రమముగా; దండధరుడు = యముడు; దండధరవైరి = పరమశివుడు; అంకిలి = అడ్డము; కైవడి = పోలిక; గహ్వర = అడవి; గహనము = గుహ; సుప్త = నిద్రించిన; నఖము = గోరు; దంష్ట్రము = కోరపళ్ళు; ఆర్ణవము = సముద్రము; మత్స్యము = చేప; కచ్ఛపము = తాబేలు; కర్కటకము = ఎండ్రకాయ; తిమి = నూరు యోజనముల పొడవు గల చేప; తిమింగలము = తిమిలను మ్రింగునది; పయఃపూరము = నీటి ప్రవాహము; పారావారము = సముద్రము; విడంబనము = అనుకరించుట; పురందరుడు = ఇంద్రుడు; విరించి = బ్రహ్మ; పఱచు = పారిపోవు; గుడుసు = గుండ్రము; వీక = విజృంభణము; ఉలికిపడు = ఆకస్మిక భయముచే కంపించు; కంఠీరవము = సింహము; అగ్గలము = అధికము; కడువడి = వేగము; కెరలజేయు = వ్యాపించు;కఠారము = వంకర కత్తి; కుఠారము = గొడ్డలి; పరశు = గండగొడ్డలి; భిండివాలము = బరిస; తూపు = బాణము; పఱపు = బాణము ప్రయోగించు; కవియు = వ్యాపించు; వ్రాతము = సమూహము; కలంచు = కలతపెట్టు; కుదించు = అణచు; ఏపు = బాధించు; చమరు = కొట్టు; చక్కడచు = చంపు; నెఱి = పరాక్రమము; సైరించు = ఓర్చు; జర్జరితము = శిధిలము.
భావము :-
సంగరకేళిలో వీరభద్రుడు ప్రళయకాలపు నల్లని మేఘసమూహముల వలె, ఎటూపోనీక వెంబడించి అన్నివైపులనుండీ వీచే పెనుగాలి వలె, కవిసాడు. సకలచరాచర జంతు సమూహాలను వేటాడే భయంకర మైన విల్లు కలవానివలె, బ్రహ్మాండంబులను క్రమక్రమముగా చెండాడే మహా ఘోరమైన యముని సంహరించిన శివుని వలె విజృంభించాడు.స్వర్గమును కప్పే ఆకాశము వెంబడి అడ్డులేక వెళ్ళే సుడిగాలివలె,  ప్రళయకాలాగ్ని వలె, కొండలు అరణ్యాలు గుహలు గుహాంతరాలలో నిద్రించు మదపుటేనుగుల ఘీంకారములు విని వానిని వెంబడించి కుంభస్థల మాంసము కొరకు గోళ్ళు కోరలతో చీల్చి చెండాడు సింహము వలె, మహాసముద్రాలలో చేపలు, తాబేళ్ళు, ఎండ్రకాయలు,తిములు, తిమింగలాలు మొదలైన జలజంతుసమూహము వలె, సముద్రపు నీటి మధ్యలో యమృతము కొరకు తిరిగే మహా మందర పర్వతము వలె, మహా భయంకరంగా వెఱపు పుట్టించే ప్రళయకాల మేఘ గర్జనలవలె శంఖము పూరించి అతిశయించి ఎక్కడచూసినా తానే అయ్యి చెలరేగాడు. విష్ణువు ఇంద్రుడు బ్రహ్మ మొదలైనవారు భయపడసాగారు. పారిపోతున్నవారిని పోనీక ఎదురుగా తాకుతున్నాడు. అక్కడంతా గుండ్రముగా వేగముగా పరాక్రమంతో భీకరంగా తిరిగేస్తున్నాడు. దేవతా సమూహాలు ఉలికి పడేట్లుగా ఆ గణరాజలను ఆక్రమించే సింహములా వ్యాపిస్తున్నాడు. పిడుగుల వంటి భాణములను వేస్తూ, శూలములతో పొడుస్తూ, నేలపాలు చేస్తూ, వంకర కత్తులతో పొడుస్తూ, గొడ్డళ్ళతో ఖండిస్తూ, గండగొడ్డళ్ళతో నరుకుతూ, నత్తళములతో ఒత్తుచూ, చక్రములతో తెంచుతూ, బరిసెలతో ఖండిస్తూ విజృంభిస్తున్నా.డు గోళ్ళతో చీరుతూ, పాదాలతో తన్నుతూ, పిడికిళ్ళతో గుద్దుతూ, అరచేతులతో బాదుతూ, బాణములను వేయుచూ ఇంకా తనివి తీరక అనేకరకాలుగా కాళ్ళతో తొక్కుతూ, భూమండలము కప్పేస్తూ, సూర్యమండలము వలె అతని వేయి చేతులతో దేవతల సమూహాలందరకూ యన్ని రూపులుగా తోస్తున్నాడు. గొడుగులు విరుస్తూ, వింజామరలను పొడిచేస్తూ, తలలు రాలుస్తూ, సిగలు కత్తిరిస్తూ, ముఖములు తెగగొడుతూ, తొడలు పాదములు చీలుస్తూ, కంఠములు కోస్తూ, భుజములు నరుకుతూ, నాలుకలు కోస్తూ, ముక్కులు త్రుంచుతూ, ప్రేగులు తెంచుతూ, కన్నులు ఊడబెరుకుతూ, చెవులు తెంచుతూ, కాళ్ళతో తన్ని కిరీటములను పడగొడుతూ, కండలు చీలుస్తూ, రక్తములు త్రాగుతూ, ఎముకలు రాలుస్తూ, పడదోసి పళ్ళుపీకుచున్నాడు. కొందరను హోమగుండముల నిండా వ్రేల్చుస్తున్నాడు. కడుపులు ఖండిస్తూ మరియు కలతపెడుతూ, అణుస్తూ, కోలాహలము చేస్తూ యున్నాడు. బాధిస్తూ, కొడుతూ, చంపుతూ, పరాక్రమంతో చరుస్తూ, నేలపాలు చేస్తూ అనేక రకాలుగా రణరంగములో యుద్ధకేళీ విహారం చేస్తూయున్నాడు. అంత దేవ సమూహాలు ఓర్వలేక అలిగి, తొలగి, బాధపడి, చచ్చి, శిధిలమై, మూర్ఛిల్లి, చెల్లాచెదరై పాఱిపోయి, ఒకరివెనుక మరొకరు దూరుతూ పారిపోతునారు., అది చూసి వీరభద్రుడు.

4-109-సీ.
పోకు నాముందఱ పోరాదు దేవేంద్ర!
పోయినఁబోవునే భుజగశయన!
యెటుపోయె? దెటుపోయె? దెందుఁబోయెద? వగ్ని!
నిలు నిలునిలు నిలు నీరజాప్త!
బంటుతనముగాదు పాఱకు యమరాజ!
వమాన! యెక్కడఁ బాఱె దింక?
పందవైతివి యేమి చందురమగవాఁడ
ణమునఁ బాఱెదే రాజరాజ!

4-109.1-ఆ.
వీరులైనవారు వెనుకకుఁబోదురే
గతనంబు విడువఁ గునె వరుణ!
పోకుఁడింక మీరు పోయినఁబోకున్నఁ
బోటు సిద్ధమెల్ల యోజ లందు.

టీక :-
నీరజాప్తుడు = సూర్యుడు; బంటుతనము = శౌర్యము; పవమానుడు = వాయుదేవుడు; పంద = పిరికి; రాజరాజు = కుబేరుడు; పోటు = యుద్ధము, దెబ్బ.
భావము :-
అలా పారిపోతున్న దేవతలను చూసి వీరభద్రుడు ఇలా అంటచున్నాడు “పోకు. పారిపోకు, పోరాదు దేవేంద్రా! పారిపోతే సరిపోతుందా విష్ణూ! ఎటుపోతావు? ఎక్కడికి పోతావు? అగ్నీ! నిలు. నిలు. సూర్యా! శౌర్యము కాదు పాఱిపోకు. యమరాజా! వాయువా! ఎక్కడకు పారిపోతావింక? పిరికివాడివయ్యావేమి? వీరుడైన చంద్రుడా! రణరంగములోనుంచి ఎవరైనాపారిపోతారా కుబేరా? వీరులైనవారు పారిపోతారా? మగతనం వదిలిపెట్టవచ్చా? వరుణా! పోకింక! మీరు పారిపోయినా పోకపోయినా ఏవిధముగానైనా పోటు తప్పదు.

4-110-వ.
అని ముదలకించి యవ్వీరభద్రుండు రౌద్రోద్రేకంబునఁ బ్రళయకాలరుద్రుండై.

టీక :-
ముదలకించి = ఎత్తిపొడుచు.
భావము :-
అంటూ ఎత్తిపొడిచి ఆ వీరభద్రుడు కోపోద్రేకమున ప్రళయకాల రుద్రుడై.

4-111-క.
పొడువైనకొండశిఖరము
విడువక పగులంగ పిడుగు వ్రేసినభంగిన్
పుమిఁ బడి మన్ను గఱువఁగ
సుడివడ దేవేంద్రుఁ దన్నె సురసుర స్రుక్కన్.

టీక :-
సుడివడు = చుట్టుకొను; స్రుక్కు = భయపడు.
భావము :-
ఎత్తైన పర్వత శిఖరాన్ని పట్టుకొని పగులగొట్టడానికి పిడుగును వేసిన విధంగా, భూమిపై పడి మన్నుకరచేటట్లు, దేవతలు రాక్షసులు భయపడునట్లు వీరేశ్వరుడు దేవేంద్రుని తన్నెను.

4-112-క.
చెన్నార నీవు సన్నగఁ
న్నగధరు విడిచి వచ్చి పాపాత్ముఁడ వై
యున్నాఁడ వనుచు సూర్యునిఁ
న్నిన రక్తంబుఁ గ్రక్కె దారుణవృత్తిన్.

టీక :-
చెన్నారు = చక్కగా, అందముగా; పన్నగధరుడు = పరమశివుడు; దారుణము = భయంకరము.
భావము :-
నీవు శివుని విడిచి వచ్చి పాపాత్ముడవై యున్నావంటూ సూర్యుని తన్నగా అతను భయంకరముగా రక్తము కక్కెను.

4-113-ఉ.
రి దక్షు నింటఁ జని వ్యములం దిను చేతు లేవి నీ
నాలుక లేవిరా దహన నాకు మొఱంగిన నేఁడు పోదురా
వాలునఁ ద్రెంతు నంచుఁ గరవాలు మిణుంగులురాలఁ బట్టి తా
నాములోనఁ ద్రుంచె వడి గ్ని కణంబులు ఘోర జిహ్వలన్.

టీక :-
ఆలరి = దుశ్శీలుడు; దహన = అగ్ని; మొఱగు = దాగు; వాలున = అతిశయించి; ఆలము = ఉపేక్ష.
భావము :-
"దుష్టుడైన దక్షునింటికి వెళ్ళి హవ్యములను తినే నీ చేతులు, నాలుక ఏవిరా అగ్నీ! నీవు దాగినా నేడు వదలను. అతిశయించి తెంచుతానురా!" అంటూ మెరుస్తున్న కత్తితో ఉపేక్షించక వేగముగా వెళ్ళి భద్రుడు అగ్ని ఘోర నాలుకలను త్రుంచెను.

4-114-ఆ.
దండధరుని బట్టి మకించి పడవైచి
ముష్టిఘాతపాత వృష్టిముంచి
ఱొమ్ము ద్రొక్కి నిలిచి రూపించె ఘన బాహఁ
దండలీల మెఱయ దండివేల్పు.

టీక :-
దండధరుడు = యముడు; దమకించు = చలించు, ఊపు; రూపించు = నిరూపించు, అగపరచు; దండ =  చేదండ, భుజబలము.
భావము :-
వీరభద్రుడు యముడిని పట్టుకొని ఊపు ఊపేసి క్రిందపడవేసి, ఱొమ్ము త్రొక్కి నిలిచి, తన గొప్పభుజబలం నిరూపిస్తూ, ముష్టిఘాతముల వాన కురిపించెను.

4-115-క.
బాగ్నులొలుకఁ జూపులఁ
డుమిడుగురు లెగయఁ బేర్చి దయెత్తి వడి
న్సుడివడ నైరృతి వ్రేసెను
ధీశుని వరుణుఁ గాంచి గతిం గూలన్.

టీక :-
జడధీశుడు = సాగరములకు ప్రభువు.

భావము :-
భద్రుడు బడబాగ్నులొలికే చూపులతో అగ్ని కణపుంజములు ఎగయుచుండగా గదయెత్తి వేగముగా తిప్పి నిఋతిపై వేసాడు. వాడు కడలికి ప్రభువైన వరుణుని చూస్తూ నేలపై కూలెను.

4-116-క.
నియని కోపదవాగ్నులు
మునుమిడి దరికొల్ప వీరముఖ్యుఁడు గడిమిన్
యార్పులచేఁ గాల్చె
న్మునుకొను నసురాది యక్ష మూకల నలుకన్.

టీక :-
తనియు = తృప్తిపడు; మునుమిడి = చక్కగా; దరికొలుపు = కాల్చు; కడిమి = పరాక్రమము; ఆర్పులు = సింహనాదములు; మునుకొను = ముందుపడు.
భావము :-
వీరభద్రుడు నిరృతియాదులను కొట్టిడంతో తృప్తి చెందని కోపాగ్నితోనూ, పరాక్రమంతో కూడిన సింహనాదములతోనూ ఎదురుపడిన అసుర, యక్ష మూకలను అందరిని కాల్చెను.

4-117-క.
“రుద్రుఁడు శంకరుఁ డుండఁగ
రుద్రుల మని ప్రేలుచున్న రుద్రులె?” యంచున్
రౌద్రత నెత్తురుఁ గ్రక్కగ
రుద్రులఁ గట్టలుకఁ బొడిచె రోషముచేతన్.

టీక :-
ప్రేలు = వదరు; కట్టలుక = (కడు అలుక) చాలా ఎక్కువ కోపము.
భావము :-
“రుద్రుడు శంకరుడుండగా తాము రుద్రులమని వదరుతే రుద్రులౌతారా?” యంటూ రుద్రులను రోషముతో మిక్కలి కోపముతో రక్తం కక్కేలా రౌద్రంగా పొడిచాడు.

4-118-క.
“హరుఁడఖిలగురుం డని యు
ర్వమ్రోయఁగ నిచటి కేల చ్చితి చెపుమా
ద!” యనుచుఁ దుదిగోరున
సాకృతివాణిముక్కు య్యనఁ జిదిమెన్.

టీక :-
తుదిగోరు = చిటికెనవేలి గోరు; వాణి = సరస్వతి; సయ్యన = ఒక్కసారిగా; చిదుము = గిల్లు.
భావము :-
“పరమేశ్వరుడు సమస్తానికీ గురువని లోకమంతా మార్మోగుతుంటే ఇక్కడికెందుకొచ్చావు తల్లీ! వరదా! చెప్పు” యంటూ చిటికెన వేలి గోరుతో అందమైన సరస్వతి ముక్కు ఒక్కసారిగా గిల్లాడు.

4-119-క.
ఱి రాహుచేత మధ్యము
రువంబడి యున్న వూర్ణ మలారిగతిన్
గళుఁడు ముక్కుఁ జిదిమినఁ
దెవకు భారతికి మోము ధృతి నొప్ఫారెన్.

టీక :-
కమలారి = సూర్యుడు; తెఱవ = స్త్రీ; ధృతి = ధరించబడినద.
భావము :-
వీరభద్రుడు చిదిమిన ముక్కుతో, సరస్వతిదేవి ముఖము రాహుగ్రస్త నిండు గ్రహణకాలపు సూర్యుని పోలియున్నది.

4-120-క.
నెత్తురు ధారలు మొగమునఁ
జొత్తిల్లఁగ నగ్నిదేవు సుందరి ముక్కున్
వృత్తస్తనశిఖరంబులు
త్తరి తుదిగోరఁ ద్రుంచి వ్వల వైచెన్.

టీక :-
జొత్తిల్లు = స్రవించు, ఎర్రనగు ; అత్తఱి = ఆ సమయమున ; తుదిగోరు = చిటికెనవేలి గోరు.
భావము :-
ఆ సమయంలో అగ్నిదేవుని భార్య యైన స్వాహాదేవి ముక్కును, స్తనమొనలను తుదిగోరుతో తుంచి ఆవల వేసెను. అప్పుడురక్తధారలు ఆమె ముఖముపై చిప్పిల్లాయి.

4-121-క.
నితలచనులకు నీడైఁ
నియెడు నని పంచశరుఁడు క్కవదోయిం
గొముక్కులు కోసిన క్రియఁ
నుముక్కులు దనరె వహ్నితికి రణోర్విన్.

టీక :-
ఈడు = సమానము ;పంచశరుడు = మన్మథుడు ;జక్కవ = చక్రవాకము ;దోయి = పోలిక ;తనరు = అతిశయించు
భావము :-
ఆడువారి చనులకు సమానమై యుండేచక్రవాక ముక్కులను మన్మథుడు కోసినట్లు ఆ రణములో చనుమొనలు తెగిన స్వాహాదేవి కనబడుతోంది.

4-122-మ.
గునిన్ గూఁకటిఁ బట్టి నిష్ఠురగతిన్ బండ్లూడ నోరంతయుం
గులన్ వ్రేసి కుదించుచుం బదరుచుం బాపాత్మునిం దక్షునిన్
వే చూచిన కన్ను లేవి యనుచుం ట్టించి లీలాగతిన్
గుకన్నుల్ వెఱికెన్ సురల్ బెగడఁగా ద్రుండు రౌద్రాత్ముఁ డై.

టీక :-
కూకటి = పిల్లజుట్టు, పిలక; వదరు = ప్రేలు; ధట్టించు = గదమాయించు; బెగడు = భయపడు.
భావము :-
భగుని జుట్టు పట్టుకొని కఠినంగా పళ్ళూడేలా నోరంతా పగులగొట్టి అణగగొడుతూ తిడుతూ పాపాత్ముడైన దక్షుని చూసిన కళ్ళేవంటూ గదమాయిస్తూ దేవతలు భయపడేలా భద్రుడు రౌద్రుడైభగుని కళ్ళు పీకసాడు.

4-123-శా.
యోషాగాధలు పల్కు మంత్రములు దానెచ్చోటికిం బోయెరా
పూషాదిత్య! దురాత్మ యంచుఁ బెలుచన్ భూమిం బడన్వైచి ని
ర్దోషుండాతనిపండ్లు డుల్చె నది హేతుఖ్యాతి గా థాత్రిలో
భాషల్తప్పులు వోయె నాతనికిఁ దాభాషించుచో నెప్పుడున్.

టీక :-
యోష = స్త్రీ; పూష = ద్వాదశాదిత్యులలో ఒకడు; పెలుచన =కోపము.
భావము :-

”పూషుడా! నీవు పలికే ఆడుమంత్రాలు ఎక్కడికి పోయేయిరా? దురాత్మా!” యంటూ కోపముతో నేలపై పడవేసి పండ్లూడగొట్టెను. ఆ కారణంగా పండ్లు లేని అతను మాట్లాడేటప్పుడు ఎప్పుడూ భాషలో తప్పులు పలుకుతాడని పేరుపడ్డాడు.

4-124-శా.
చంద్రా!నిన్నుధరించియున్న పరమున్ ర్వేశ్వరుంబాసి యీ
యింద్రాదిత్యులభంగి నేఁడు భువిపై నేతెంచి యిచ్చోట మ
త్సాంద్రక్రోధహతుండ వైతి” వనుచుం జంకించి పాదంబులం
జంద్రుం భూగతుఁ జేసి ప్రామె చిదుకన్ సంగ్రామరంగంబునన్.

టీక :-
పరము =శ్రేష్టము; సాంద్ర = దట్టమైన; జంకు = భయము; పాము =రుద్దు.
భావము :-
“చంద్రా! నిన్ను ధరించిన పరమేశ్వరుడైన సర్వేశ్వరుని వదలి యీ ఇంద్రుడు ఆదిత్యుల వలె నేడు భూమిపైకి వచ్చి యిక్కడ మా కోపానికి గురౌతున్నావంటూ బెదిరించి, ఆ రణరంగములో వీరేశ్వరుడు అతనిని నేలపై పడవేసి పాదముల క్రిందవేసి చితికిపోయేలా రాసెను.

4-125-వ.
తదనంతరంబ.

4-126-చ.
పెనిమిటిఁ బ్రాముచోఁ బురుష భిక్షము వెట్టు మటంచుఁ దారకాం
లరుదెంచి మ్రొక్కు క్రియఁ గ్రక్కుననొత్తి శశాంకుఁ ద్రొక్కఁగా
నమునొంది పెల్లగసి ర్వజనంబునకున్ విచిత్ర మై
యొరఁగ భద్రుపాదముల నొవ్పె సుథాజలబిందుసంఘముల్.

టీక :-
పెనిమిటి = భర్త; ప్రాము = రాయు; గ్రక్కున = ఒక్కసారిగా; సుధ = అమృతము.
భావము :-
భద్రుడు భర్తనునేలరాస్తుంటే పతిభిక్ష పెట్టమంటూ తారకలు వచ్చి మ్రొక్కినట్లు ఒక్కసారిగా శశాంకుని నలిపితే అమృతబిందువులు భద్రుని పాదముల నిండా పడి అందరకూ ఆశ్చర్యం కలిగించింది.

4-127-వ.
మఱియు; సముచితాలాపంబులు పలుకు యుగాంతకాల రుద్రుండునుం బోలె నట్టహాసంబు సేయుచు; మహితమందర మహీధ్రమథిత మహార్ణవ కల్లోలచయంబునుం బోలె శోషించుచు; కంఠీరవంబునుంబోలె గర్జించుచు; మదాంధసిందురబునుం బోలె మ్రోయుచు; వర్షాకాలమేఘంబునుం బోలె శరవృష్టిగురియుచు; రాహుమండలంబునుం బోలె నొడియుచు; గంతులు ద్రొక్కుచుఁ దాండవంబాడుపురారాతియునుం బోలె వింతగతుల రణవిహారంబు సలుపుచుఁ; బెనుగాలియుం బోలెఁ దూలుచు; బడబాగ్నియునుం బోలె నార్చుచు; నంధకారంబునుం బోలెఁ గప్పుచు; నేలయు నింగియు నొక్కటియై “పొడువుపొడువు” “పోనీకుఁ బోనీకు” “చంపు చంపు” మని యెఱింగించుచు; దశశతకోటిసహస్రలక్షానేకకోటిసంఖ్యలై దేజరిల్లుచు; యూపంబులఁ బెఱుకుచు; నాచార్యుల నడచుచు; హోతలప్రాణంబులు హోమంబులకు నాహుతులు గావించుచు; పశువుల నసువులు బాపుచు; గంధర్వుల కంధరంబులు ద్రెంచుచు; సిద్ధసాధ్యచయంబుల ధట్టించుచు; సూర్యులం దూలించుచు; తాపసుల విదారించుచు; మునిజనులం దండకమండల యజ్ఞోపవీతములు తుత్తుమురులుసేయుచు; బ్రహ్మ శిరంబుఁ గుదియించుచు; సురాసురజాతంబుల నెరియించుచు; నిప్పులులొలుకు చూపుల నందఱం గప్పి తలలు కోసి కుప్పలు పెట్టుచుఁ; బ్రేవులు పోగులువైచుచు; కండలు చెండి కొండలుగా వైచుచు; పీనుఁగుపెంటల నడుమ నెత్తురుటేఱులు గావించుచు; దేవభటుల మాంసంబు లిచ్చి భద్రకాళి మెప్పించుచు; భూతప్రేతపిశాచగణంబులం దనుపుచు; వీరజయలక్షీ విలాసుం డై ప్రజ్వరిల్లుచు వీరభద్రేశ్వరుండు.

టీక :-
శోషించు = ఎండిపోవు; సింధురము = ఏనుగు; ఒడియు = పట్టుకొను; తూలు = చలించు, పడు; ఆర్చు = ధ్వనించు; యూపము = యజ్ఞపశువును కట్టు స్తంభము; అసువులు = ప్రాణములు; కంథరములు = కంఠములు; ధట్టించు = గదమాయించు; తూలించు = పడగొట్టు; తుత్తుమురాడు = పొడిచేయు; జాతము = సమూహము; ఎరియించు = బాధించు; చెండు = ఖండించు; పీనుగు = శవము; తనుపు = తృప్తిపరచు.
భావము :-
ఇంకనూ వీరభద్రుడు ప్రళయకాల రుద్రుని భీకర పలుకుల వలె గట్టిగా నవ్వుతున్నాడు; మందర పర్వతము పాలసముద్రాన్ని అల్లకల్లోలం చేసినట్లు శతృమూకల శోషింపజేస్తున్నాడు సింహములా గర్జిస్తున్నాడు; మదపుటేనుగులా ఘీంకరిస్తున్నాడు; వర్షాకాల మేఘము వలె శరవృష్టి కురిపిస్తున్నాడు; రాహువు వలె పట్టుకుంటున్నాడు; తాండవమాడు శివుని వలె రకరకాలుగా రణవిహారం చేస్తున్నాడు; పెనుగాలిలా తిరుగుతున్నాడు; బడబాగ్నిలా బొబ్బలెడుతున్నాడు; అంధకారము వలె కప్పుతున్నాడు; భూమ్యాకాశాలు ఏకనయ్యేలా, ‘పొడువు పొడువు’, ‘పోనీకు పోనీకు’, ‘చంపు చంపు’ అంటూ గణసేనలను బెచ్చరిస్తున్నాడు; ఒక్కడయ్యూ పదులు వందలు వేలు లక్షలు కోట్ల సంఖ్యల్లో వలెతేజరిల్లుతున్నాడు; యూపస్తంభాలను పీకేస్తున్నాడు; ఆచార్యులను అణగద్రొక్కుతున్నాడు; హోతల ప్రాణములను హోమములకు ఆహుతులుగావిస్తున్నాడు; పశువుల ప్రాణాలు తీస్తున్నాడు; గంధర్వుల కంఠములను తెంచుతున్నాడు; సిద్ధ పాధ్య సమూహాలను గదమాయిస్తున్నాడు; సూర్యులను పడగొడుతున్నాడు; తాపసులను చీలుస్తున్నాడు; మునుల దండ, కమండల, యజ్ఞోపవీతములను ముక్కలుముక్కలు చేస్తున్నాడు; బ్రహ్మ శిరస్సులను అణగద్రొక్కుతున్నాడు; దేవతల రాక్షస సమూహములను కాల్చుతున్నాడు; నిప్పులొలుకు చూపులతో అందరినీ కప్పివేస్తున్నాడు; తలలు కోసి కుప్పలు పెడుతున్నాడు; పేగులు పోగులుపెట్టుతున్నాడు; కండలు నరికి కొండలుగా వేస్తున్నాడు; శవాలపెంటలమధ్య రక్తపుటేరులు పారిస్తున్నాడు;  భూతప్రేతపిశాచ గణములకు తృప్తి కలిగిస్తున్నాడు;దేవతావీరుల కండలు భద్రకాళికి యిచ్చి మెప్పిస్తున్నాడు: ఈవిధం వీరుడై వీరభద్రుడు మిడుగుతున్నాడు. అప్పుడు...

4-128-లగ్రా.
నిక్కిగణనాథుఁ డొక యక్కజపు విల్లు వడి;
నెక్కిడి గుణధ్వనుల దిక్కులొగి మ్రోయన్
గ్రక్కున మిణుంగురులు గ్రక్కబలుభూతములు;
క్కదొడఁగే యనగ వెక్కసము దోఁపన్
లెక్కలకుదాఁటి చని యొక్కట సురాదులను;
జక్కడచెనప్పు డతి చిక్కువడిమ్రొక్కన్
డొక్కడువునిక్కుఁ డను దిక్కురులనాదములఁ;
జుక్కలురలం ధరణి గ్రక్కదలుచుండన్.

టీక :-
నిక్కి = పైకెత్తు; అక్కజము = ఆశ్చర్యము; చక్క = దుఃఖపడుట; మిణుంగురులు = అగ్ని కణములు; వెక్కసము = దుర్లభము; జక్కడచు = చంపు; దిక్కురలు = దిక్కులు+ఉరలు, దిక్కులు అదురు; ఉరలు = రాలు, పిక్కటిల్లు.
భావము :-
అలా ప్రజ్విలిస్తున్న గణనాథుడైన వీరభద్రుడు అద్భుతమైన విల్లును వేగముగా ఎక్కుపెట్టి దిక్కులు దద్దరిల్లేలా నారి మ్రోగించాడు; అగ్ని కణముల వెదజల్లబడ్డాయి; రకరకాల భూతములు చక్కగా మొదలెట్టాడు అనుకునేలా వాటి ఆకలికి ఎక్కువయ్యోలాగ, లెక్కకు మించిన దేవతలు మొదలైనవారిని చంపాడు. వారు బాగా చిక్కులుపడి వీరేశ్వరునికి మ్రొక్కుతున్నారు; డొక్కలో “పొడవండి”. “రెచ్చిపోండి” అని దిక్కులు పిక్కటిల్లేలా బొబ్బలు పెడుతున్నాడు.; చుక్కలు దొర్లి పడపతున్నాయి. దానితో భూమి కంపిస్తున్నది.

4-129-వ.
మఱియు వీరావేశంబున.
భావము :-
ఇంకనూ చాలా అధికమైన ఆవేశముతో.

4-130-సీ.
ట్టిసంబులఁ ద్రుంచి, లుబాణముల నొంచి,
ముసలాయుధంబుల మోది మోది,
లుగుల నాటించి, రచేతులను వ్రేసి,
ముష్టిఘాతంబుల ముంచి ముంచి.
త్తుల నెఱయించి, దల క్రుళ్లణగించి,
భూరిశూలంబులఁ బొడిచి పొడిచి,
క్తులఁ దూలించి, క్రాలఁ బరిమార్చి,
టు నారసంబులఁ ఱపి బఱపి,

4-130.1-తే.
పెనఁచి నరములు వ్రేగులు వెఱికిఁబెఱికి,
చెనఁకి మేనులపట్టలు చీరిచీరి,
డాసి చెక్కులు ముక్కులు గోసికోసి,
వీరభద్రుండు వేల్పులఁ దోలఁదొడఁగె.

టీక :-
పట్టిసము = అడ్డకత్తి; ముసలము = రోకలి; అలుగు = గడ్డపార; ఎరయించు = వ్యాపించు; చెనకి = తాకి; పట్ట = తోలు; డాయు = సమీపించు.
భావము :-
అడ్డకత్తులతో ఖండించి; పలు బాణములతో వంచి; రోకళ్ళతో మోది; గునపాలతో నాటించి; అరచేతులను తెగేసి; పిడికిళ్ళతో ముంచి ముంచి; కత్తులతో చెరిగి; గదలతో కుళ్ళబొడిచి; పెద్ద శూలములతో పొడిచి పొడిచి; శక్తి ఆయుధములతో పడగొడుతూ; చక్రాలతో చెణకుతూ; ఇనుపబాణాలతో గుచ్చిగుచ్చి నరాలను పేగులను పెరుకుతూ; పట్టుకొని శరీర చర్మాలను చీరి; చెంపలు ముక్కులు కోసి; ఇలా రకరకాలుగా వీరభద్రుడు వీరావేశంతో దేవతలను తోలసాగాడు.

4-131-శా.
వీచున్నెత్తురు గమ్ముదేరనణఁచున్ వీరంబు దోరంబుగా
వైచున్ నింగికి నేలకున్ దిశలకున్ జ్రప్రహారంబులన్
దాఁచుం గూల్చు నదల్చు నేర్చుఁ గరముల్ ఖండించి హోమాగ్నిలోఁ
ద్రోచుంగూఁకటి బట్టి మొత్తి సురలన్ దుర్వారగర్వోద్ధతిన్.

టీక :-
గమ్ము = నిశ్శబ్దము; తోరము = అధికము; ప్రహారము = దెబ్బ; దాచు = మరుగుపరచు; అదల్చు = భయపెట్టు; ఉద్ధతి = అహంకారము.
భావము :-
రక్తాలు పారిస్తున్నాడు; మారు మాట్లాడకుండా అణచివేస్తున్నాడు; అతిశయించిన వీరత్వముతో నింగికి నేలకు దిశలకు విసిరేస్తున్నాడు; నివారింపరాని గర్వము అహంకారములతో గట్టి దెబ్బలు నాటుకొనేలా వేస్తూన్నాడు; కూలుస్తున్నాడు; భయపెడుతున్నాడు; చేతులను కోసి హోమాగ్నిలో వేస్తున్నాడు; జుట్టుపట్టి మొత్తుతున్నాడు.

4-132-శా.
నిక్కున్ఠాంకృతిసేయఁగాఁజెలఁగు భృంగీఘోషఘోషంబుగాఁ
ద్రొక్కున్సర్వవసుంధరావహుఁ డనంతుండెంతయున్ రోజఁగాఁ
జొక్కున్భీకర మైనహుంకృతులచేఁ జుక్కల్ వెసన్ రాలఁగా
దిక్కుల్మ్రోయ నజాండభాండములు భీతిన్ బెల్లు ఘూర్ణిల్లఁగన్.

టీక :-
చెలగు = చెలరేగు; భృంగము = తుమ్మెద; రోయు = నిందించు; చొక్కు = కలవరము.
భావము :-
మించిన అతిశయంతో వింటినారిని ఠామమని వాయించి చెలరేగుతుంటే. అది తుమ్మెదరొదలా ధ్వనిస్తూ యున్నది; అలా పాదాలతో తొడతొక్కుతుంటే, భూమిని మోసే అనంతుడు రొప్పుతున్నాడు; భీకరమైన హుంకార ధ్వనులచే కలవరపడుతున్నాడు; చుక్కలు రాలుతున్నాయా అన్నట్లు దిక్కులు అదిరేలా హుంకారాలు చేస్తున్నాడు; అజాండభాండములు భయముతో తిరుగుళ్ళు పడుతున్నాయి.

4-133-సీ.
కమాటు కత్తుల నొరలంగఁ గుత్తుకల్
విడిపించితనతోటి వెలఁదికిచ్చు
నొకమాటు హోతల కుఱికిమధ్యంబులు
ఖండించి భూతసంముల కిచ్చు
నొకమాటు నఖముల నూరుస్థలంబులు
వ్రచ్చి బేతాళక వ్రజముకిచ్చు
నొకమాటు గదలచే నూరుతలంబులు
మరియించి మృగసంఘములకు నిచ్చు

4-133.1-ఆ.
క్కమాటు గముల నొక్కటఁజెండాడు
నొక్కమాటు సురల నొల్లఁబుచ్చు
వీరభద్రురణము వేఱెవ్వరిని బోల్ప
చ్చు నతనిఁ బోల్పచ్చుఁగాక.

టీక :-
వెలది = స్త్రీ; ఊరువులు = తొడలు; వ్రజము = సమూహము; మరించు = చంపు; గములుకొను = గుంపుగొను; ఒల్లబుచ్చు = మూర్చిల్లజేయు.
భావము :-
ఒకమాటు కత్తులతో కుత్తుకలను కోసి తన భార్యకిచ్చును. ఒకమాటు హోతల మధ్యకురికి నడుములు ఖండించి భూతముల కిచ్చును. ఒకమాటు గోళ్ళతో తొడలుగీరి బేతాళ సమూహమునకు ఇచ్చును. ఒకమాటు గదలచే తొడలు విరుగగొట్టి జంతు సమూహములకిచ్చును. ఒకమాటు గుంపుతో ఒక్కడే పోరాడును. ఒకమాటు దేవతలను మూర్చిల్లచేయును. వీరభద్రుని యుద్ధముతో వేరెవరినీ పోల్చలేము.

4-134-వ.
ఇట్లు రణంబు సేయుచు నవ్వీరజనచూడామణి యగు వీరభద్రుండు దక్షు నుపలక్షించి.

టీక :-
చింతామణి = శ్రేష్ఠవాచకము; ఉపలక్షించు = చూచు.
భావము :-
ఈ విధముగా యుద్ధము చేస్తూ ఆ పరమవీరశ్రేష్ఠుడైన వీరభద్రుడు దక్షునితో ఇలా అన్నాడు...