పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : వీరభద్రవిజయ ప్రకారంబు

శ్రీరామ

వీరభద్ర విజయము
చతుర్థాశ్వాసము

వీరభద్రవిజయ ప్రకారంబు

4-1-ఉ.
శ్రీమణీయవీర! సరసీగణరంజితసోమ! వాసవాం
భోరుహసంభవప్రముఖ భూరినిలింపభుజాబలప్రతా
పోరుమహాంధకారపటలోగ్ర విఖండన చండభానుగం
భీగుణాభిరామ! రణభీమ! వినిర్జితకామ! శంకరా!

టీక :-
శ్రీ = విషము; రమణీయ = ఒప్పిదమైన; సరసీ = కొలను; గణము = సమూహము; రంజిల్లు = ఒప్పు; వాసవ = ఇంద్రుడు; అంభోరుహ సంభవుడు = బ్రహ్మదేవుడు; ప్రముఖ = మొదలైన; నిలింప = దేవత; ఉరు = గొప్పదైన; విఖండన = ఖండించు; చండ = తీవ్రమైన; భానుడు = సూర్యుడు; నిర్జిత = గెలవబడిన.
భావము :-
విషముతో ఒప్పే వీరుడా! కమల సమూహములను రంజింపచేసే చంద్రుని ధరించినవాడా! ఇంద్రుడు బ్రహ్మదేవుడు మొదలైన గొప్ప దేవతల భుజబల ప్రతాపమనే మహాంధకారమును ఖండించే తీవ్రమైన సూర్యుని వంటి గంభీరమైన గుణములు కలవాడా! యుద్ధమునందు భయంకరుడా! కామమును పూర్తిగా గెలిచినవాడా! శంకరా!

4-2-వ.
పరమజ్ఞానభావుం డగు వాయుదేవుం డమ్మహామునులతో "మీ రడిగిన యర్థంబు లెల్ల సవిస్తారంబుగా నెఱింగించితి; మునీంద్రులారా! వీరభద్రేశ్వరుని విజయప్రకారంబు నిజంబు వర్ణింప బ్రహ్మదేవునకు నలవిగా దైనను నాకుం దోచిన విధంబున విన్నవించెద. వినుం" డని యిట్లనియె.

టీక :-
అర్థము = విషయము.
భావము :-
మహాజ్ఞానియైన వాయుదేవుడు ఆ మహామునులతో "మీరడిగిన విషయాలన్నీ వివరంగా తెలిపాను. నిజానికి వీరభద్రుని విజయము వర్ణించడం ఆ బ్రహ్మదేవునకు కూడా సాధ్యం కాదు. అయినప్పటికీ, నాకు తోచిన విధముగా వివరిస్తాను. వినండి." అని ఇలా అన్నాడు.

4-3-క.
ఱివైవస్వతమన్వం
మున నొకకాలమందు క్షుఁ డదక్షుం
డురుతర పాపవిచక్షుఁడు
రఁగన్ జన్మించె ఘోర పాపాత్మకుఁ డై.

టీక :-
దక్షుడు = సమర్థుడు; అదక్షుడు = సమర్థుడు కానివాడు; ఉరుతర = మిక్కిలిగొప్ప.
భావము :-
వైవస్వత మన్వంతరములో ఒక సమయంలో దక్షుడనే అసమర్థుడు, పాపము చేయకూడదనే విచక్షణ అసలు లేనివాడు ఘోర పాపాత్ముడై జన్మించెను.

4-4-క.
ప్రాలేయాచల మందున
వేలుపులకు నేకతంబ విహరించుటకున్
మేలైన చోట భూమికి
వ్రాలిన యాకాశగంగ చ్చిన చోటన్.

టీక :-
ప్రాలేయాచలము = హిమాలయ పర్వతము; ఏకతము = ఒంటరిగా; వ్రాలు = దిగు.
భావము :-
దేవతలు ఏకాంతముగా విహరించుటకు అనువైన ప్రదేశమూ, ఆకాశగంగ భూమికి దిగి వచ్చిన ప్రదేశమైన హిమాలయమందు.

4-5-క.
శికరమై యుండెడుచో
శిదేవుని వేఱుచేసి శివకల్మషుఁ డై
దివిజులఁ బిలువం దొడఁగెను
హితమతి నశ్వమేధ యాగము సేయన్.

టీక :-
శివము = శుభము; కల్మషము = మలినము, పాపము.
భావము :-
దక్షుడు శివుని యందు పాపబుద్ధితో ఆ శుభకరమైన చోట శివుని విడిచిపుచ్చి అశ్వమేథయాగము చేస్తూ దేవతలనందరినీ పిలవసాగెను.

4-6-వ.
అంత.

4-7-సీ.
మరేంద్ర పావక మ దానవాధీశ
రుణాదినిఖిల ది గ్వల్లభులను
మార్తాండ మృగధర మంగళ బుధ గురు
మందాది గ్రహరాజ మండలంబు
కౌశిక గౌతమ ణ్వ మార్కండేయ
కాత్రి వసిష్ఠాదు లైన మునులు
క్రతుకమలోద్భవ శ్యపాంగీరస
పులహ పులస్త్యాది జలజభవులు

4-7.1-ఆ.
చ్యుతాదిదేవతానాయకులు యక్ష
సాధ్య సిద్ధ వసు భుజంగ రుద్ర
ణములాదిగాఁగఁ ల్గువారందఱు
క్షుమఖముచూడఁ గిలి చనిరి.

టీక :-
పావకుడు = అగ్ని; దానవాధీశుడు = నిఋతి; దిగ్వల్లభులు – అష్టదిక్పాలకులు; మార్తాండుడు = సూర్యుడు; మృగధరుడు = చంద్రుడు; మందుడు = శని; గ్రహమండలము = నవగ్రహములు; క్రతు = క్రతుపురుషుడైన విష్ణుమూర్తి; కమలోద్భవుడు = బ్రహ్మదేవుడు; జలజభవులు = నవబ్రహ్మలు.
భావము :-
దక్షుడు పిలవగా ఇంద్రుడు, అగ్ని, యముడు, నిఋతి, వరుణుడు మొదలగు అష్టదిక్పాలకులు; సూర్యుడు, చంద్రుడు, మంగళ, బుద, గురు, శనిమొదలైన నవగ్రహములు; విశ్వామిత్ర, గౌతమ, కణ్వ, మార్కండేయ, అత్రి, వశిష్ఠుడు మొదలైన మునులు; విష్ణుమూర్తి; బ్రహ్మదేవుడు; కశ్యపుడు; అంగీరసుడు, పులహుడు, పులస్త్యుడు మున్నగు నవబ్రహ్మలు; అచ్యుతుడు మొదలైన దేవతా నాయకులు; యక్షులు (కుబేరాదులు); సాధ్యులు; సిద్ధులు (విశ్వావసాదులు), వసువులు (అష్టవసువులు); సర్పములు (నాగదేవతలు); రుద్రగణములు మొదలైన వారందరూ దక్షుని ముఖము చూసి వెళ్ళారు.

4-8-వ.
ఇట్లు సకల దేవతలును జనుదెంచిన వారల నుచితోపచారంబుల సంభావించి వూజించి దక్షుండు మఖంబుం జేయందొడంగె నయ్యవసరంబున.

టీక :-
మఖము = యజ్ఞము.
భావము :-
ఈ విధముగా విచ్చేసిన సకలదేవతలను తగిన విధముగా గౌరవించి పూజించి యజ్ఞము చేయసాగెను. ఆ సమయంలో.

4-9-చ.
చెలువుగ వచ్చి వేదములు చెప్పినఠావుల నున్న నిర్జరుల్
సి మఖంబులోపలను భాగము లియ్య భుజింపఁ గోరుచో
హరురామిఁ దా నెఱిఁగి మాన్యులఁ దత్సభవారిఁ జూచి ని
శ్చతరవాక్య దోషతమచండమరీచి దధీచి యిట్లనున్.

టీక :-
చెలువు = అందము; ఠావు = స్థానము; మలహరుడు = శివుడు; నిశ్చల = కదలని; చండ = కోపి.
భావము :-
దధీచిమహర్షి తన నిష్కర్ష భాషణలతో దోషాలనే తిమిరం పాలిటి సూర్యుని వంటివాడు. వేదములు చక్కగా చెప్పిన స్థానములలో ఉన్న, దేవతలు యజ్ఞములో సమర్పించెడి భాగములను భుజించడానికి సిద్ధముగా యున్నారు. ఆ సమయములో శివుడు రాలేదని గ్రహించిన ఆ దధీచిమహర్షి, సభలోని పెద్దలతో ఇలా అన్నాడు.

4-10-క.
"పూజింపఁ దగినవారల
పూజింపక నేర్పుమాలి పూజన లిచ్చెన్
పూజింపఁ దగనివారికి
నీగమున నింత బుద్ధిహీనుఁడు గలఁడే.
భావము :-
పూజింపదగిన వానికి పూజ చేయడం మాని పూజింపదగని వారికి పూజలు చేస్తున్నాడు. ఈ లోకంలో ఇంతకన్నా బుద్ధిహీనుడుంటాడా?

4-11-క.
దిదుష్కృత మని యెఱుఁగఁడు
దిమిక్కిలి నింద్య మగుట యెంతయు నెఱుఁగం
డిదిగడవ దనుచు నెఱుఁగఁడు
దియేలనొ శంభుఁ బిల్వఁ డితఁడెబ్భంగిన్.

టీక :-
దుష్కృతము = చెడ్డపని, పాపము; నింద్యము = నిందించదగినది; భంగి = విధము.
భావము :-
ఈ దక్షునికి ఇది చెడ్డపని యనీ, ఇది చాలా నిందించదగ్గ విషయము యనీ, ఈ యజ్ఞము జరుగదనీ తెలియదు. లేకపోతే ఈ విధముగా శంభుని పిలవకుండా ఎందుకు ఈ యజ్ఞము చేస్తాడు?

4-12-క.
పొవులు తానై పొదలిన
పొవగు పరమేశు మఱచి పొరిఁ బాపములన్
బొవై జీవచ్ఛవముల
పొవుగఁ బూజించు వెఱ్ఱి భూమిం గలఁడే.

టీక :-
పొడవు = గొప్పతనము; పొదలు = ఉండు, వర్థిల్లు; పొరి = మిక్కిలి; జీవచ్ఛవము = బ్రతికి యున్న శవము; పొడవు = గొప్పతనము.
భావము :-
గొప్పతనమే తానై ఉండే మహానుభావుడు పరమేశ్వరుడు. అతనిని విడిచి పాపములు ఎక్కువగా కల జీవచ్ఛవములను గొప్పగా పూజించే వెర్రివాడు ఈభూమిపై యుంటాడా?

4-13-ఆ.
యాగకర్తలేని యాగంబు చెల్లునే
లయనంగమెల్లఁ లిగి యున్న
శిరములేనితనువు చెలరేఁగి యాడునే
పొలయుఁగాక నేలఁ గలయుఁ గాక.

టీక :-
కలయన్ = అన్నికలసి యున్న; అంగములు = శరీరభాగములు; చెలరేగు = మిక్కిలి విజృంభించు, హెచ్చరిల్లు; ఆడు = సంచరించు; పొలయు = ప్రవేశించు, చేరు.
భావము :-
యాగకర్త శివుడు. అతను లేని యాగము చెల్లుతుందా? శరీరంలోని మిగతా అవయవాలు అన్ని కలసి యున్నప్పటికీ, తలలేని శరీరం భూమిలో కలసిపోతుంది తప్ప, హెచ్చరిల్లి సంచరిస్తుందా ఏమిటి?".

4-14-వ.
అనిన విని యతండు తదీయాలాపంబులు కర్మవశంబునఁ దన మనంబు చొరక శూలంబులై తాఁకిన నదరిపడి సదస్యుల నాలోకించి "మహాత్ములారా! భవదాగమన కారణంబునఁ గృతార్థుండనైతి;" నని పలికి పూజించి పిలువఁ దొడంగి నాఁ; డితఁడు "శంకరదేవుఁడు లేనిజన్నము నెయ్యడలఁ గలదె వేదములారా!" యని మఱియును.

టీక :-
సదస్యుడు = సభికుడు; జన్నము = యాగము.
భావము :-
అని దధీచి అన్న మాటలు విన్నా కర్మ వశమున ఆ మాటలు దక్షుని చెవికి ఎక్కలేదు. ఆమాటలు శూలాల్లా తాకి అదిరిపడి సభలోనున్నవారితో "మహాత్ములారా! మీరు రావడం వల్ల కృతార్థుడనయ్యా"నంటూ సన్మానించుట కొనసాగించాడు. ఈ దధీచిమహర్షి "వేదములారా! శంకరుడు లేని యాగమెక్కడైనా ఉందా?" అని అడిగి, ఇంకనూ....

4-15-క.
"మొలుండ నచటఁ బోయక
తుదిగొమ్మలు నీటఁ దడుపఁ దుద నిష్ఫలమై
పొలుంగా కది ప్రబలునె
పడి శివరహితమైన లముం గలదే.

టీక :-
తుద = చివర; పొదలు = చిగురించు; పదపడి = మరియు.
భావము :-
చెట్టు మొదలున్నచోట నీరు పోయడం మానేసి చివరి కొమ్మలు తడిపితే శ్రమ దండుగవుతుంది తప్ప చెట్టు హెచ్చరిల్లదు. అలాగే శివుడు లేని యజ్ఞము కూడా ఫలించదు.

4-16-చ.
చెలువుగ సర్వదైవములఁ జేసినదైవము నాదిదైవముం
బిలువక నన్యదైవములఁ బిల్చియుఁ బూజలు చేసి జన్నముల్
లుపఁ దొడంగినాఁడితఁడు శంకరదేవుఁడు లేని జన్నమున్
లఁపఁగ నెయ్యెడంగలదె థ్యము వేదము లందుఁ జూడరే.

టీక :-
చెలువు = అందము; జన్నము = యాగము; తథ్యము = యదార్థము.
భావము :-
దేవతలందరినీ సృష్టించిన దైవము, ఆది దేవుడు శివుడు. అతనిని పిలువక ఇతర దేవతలను పిలిచి పూజలు చేసి యాగము చేస్తున్నాడితను. శంకరుడు లేని యాగము యెక్కడైనా అనుకోడానికైనా యున్నదా? యదార్థమేదో వేదములలో చూసి తెలుసుకోరాదా."

4-17-వ.
అని పుణ్యచక్షుం డగు దధీచి పాపచక్షుం డగు దక్షున కిట్లనియె.

టీక :-
చక్షువు = దృష్టి.
భావము :-
అని పుణ్యాత్ముడైన దధీచి పాపాత్ముడైన దక్షునితో ఇలా అన్నాడు.

4-18-శా.
"యీదక్ష! యిదేమి యీతెఱఁగు దా నూహింప లోకంబులో
నేయాచారము యెట్టి ధర్మచరితం బేవేదమార్గంబకో
యాచారము యెట్టి ధర్మచరితం బేవేద మందైన నే
ధీయుక్తిం బరమేశుఁ బిల్వఁ దగదో తెల్లంబుగాఁ జూడుమా.

టీక :-
తెఱగు = విధానము.
భావము :-
“ఓయీ దక్షా! యిదేమి పద్ధతి? శివుని పిలవకూడదని లోకములో యే యాచారము చెప్పింది, అలా చెప్పేది ఎటువంటి ధర్మము, ఏ వేదమార్గము ఇలా చెప్పింది? ఏ ఆచారములో నైనా ఎట్టి ధర్మశాస్త్రములోనైనా లేదా ఏ వేదములోనైనా ఇలాజెప్పినట్లు ఉన్నదా? తరచిచూసి సరిగ్గా తెలుసుకో.

4-19-ఉ.
దేరకన్ను లై వెలుఁగు ధీరులఁ బావకసూర్యచంద్రులన్
దేరలెంకలౌ మునుల దేవరభృత్యులఁ గేశవాదులన్
దేత లాదిగాఁ బిలిచి దేవపితామహుఁ డైన శ్రీ మహా
దేవుని బిల్వఁగాఁ దగదె దివ్యవిచారము లై దలంపుమా.

టీక :-
పావకుడు = అగ్ని; లెంక = అనుచరుడు, భటుడు; భృత్యులు = సేవకులు.
భావము :-
ఆ శివుని కన్నులై వెలిగేవారు అగ్ని, సూర్యుడు, చంద్రుడు. ఆదేవుని అనుచరులు మునులు. ఆ దేవర సేవకులు విష్ణువుడు మొదలైన వారు. అలాంటప్పుడు, దేవతలందరినీ పిలిచి దేవతలకు ఆదిపురుషుడైన శ్రీ శంకరదేవుని పిలువరాదా? చక్కటి వివేచనతో ఆలోచించవయ్యా దక్షా!.

4-20-ఉ.
భీయదేవు నొండొరులు బిల్వ నెఱుంగరు గాక ఋగ్యజు
స్సాయధర్వణాది శ్రుతి సంఘములోఁ బరికించినాఁడ వీ
భూమిఁదలంపఁగాఁ దగిన ప్రోడవు నీవు శివుండు రామికిన్
నీదిఁ జూడుమా ఫలము నిష్ఫల మొందునొ నిన్నుఁ జెందునో.”

టీక :-
భీమయదేవుడు = శివుడు; ఒండొరులు = ఇతరులు; శ్రుతి = వేదము; ప్రోడ = వివేకి; రామి = రాకపోవడము.
భావము :-
శివుని పిలవాలని ఇతరులకు తెలియకపోవచ్చు. కానీ ఋగ్యసామ అధర్వణ వేదాలు శృతులు అన్నీ చదివిన వాడవు, ఈ భూలోకంలోనే ఎన్నదగ్గ వివేకివి. నీకు తెలియకపోవడం ఏమిటి. మనసుపెట్టి ఆలోచించి చూడు శివుడు రాని ఈ యాగ ఫలము నీకు దక్కుతుందో! లేదో! నీకే తెలుస్తుంది."

4-21-వ.
అనవుడు దక్షుం డతులిత కోపాతురుం డై యిట్లనియె.
భావము :-
అని దధీచి అనగా విని సాటిలేని కోపముతో ఇలా అన్నాడు.

4-22-క.
"రుద్రుండంచును నీ వొక
రుద్రుని జెప్పెదవు గాకరుద్రాక్షధరుల్
ద్రత నేగురు నార్గురు
రుద్రులు గల రింక నొక్కరుద్రుని నెఱుఁగన్.

టీక :-
ఏగురునార్గురు = ఐదుగురు + ఆరుగురు, పదకొండుమంది.
భావము :-
"రుద్రుడంటూ నీవొక రుద్రుని గురించి చెప్తున్నావు. కానీ నాకు పదకొండుమంది రుద్రులు తెలుసు. ఇంకొక రుద్రుని గురించి నాకు తెలియదు.

4-23-మ.
దెమా యాగము నందు దేవతలు నయ్యంభోజనాభుండునుం
ద్రిశేంద్రుండును నున్నవారు గడు సంప్రీతిం దగన్మంగళ
ప్రమొందన్ విధిమంత్ర పూజిత హవిర్భాగంబు లేనిచ్చెద
న్విదితం బై శ్రుతివూర్వమై తనరఁ గావింతున్ మఖంబున్నతిన్."

టీక :-
అంభోజనాభుడు = విష్ణువు; త్రిదశపతి = ఇంద్రుడు; మఖము = యాగము.
భావము :-
మా యాగంలోయదిగో దేవతలు, విష్ణువు, ఇంద్రుడు మంగళప్రదంగా యున్నారు. నేను యథావిధిగా మంత్రపూర్వక హవిర్భాగములు ఇస్తాను. శృతిపూర్వకంగా యాగాన్ని గొప్పగా జరిపిస్తాను."

4-24-వ.
అనవుడు దధీచి దక్షున కిట్లనియె.

టీక :-
అనవుడు = అనగా విని.
భావము :-
అనగా విని దధీచి ధక్షునితో ఇలా అన్నాడు.

4-25-క.
"ఈ విష్ణుం డీ బ్రహ్మయు
నీవిబుధేశ్వరులు మఱియు నీ రుద్రులు నే
దేవేశువలనఁ బుట్టిరి
భావింపఁగ నేరవీవు పాపవిచారా!

టీక :-
విబుధేశ్వరుడు = ఇంద్రుడు.
భావము :-
"దక్షా పాపపు ఆలోచనము చేసే నీకు, ఈ విష్ణువు ఈ బ్రహ్మ ఈ ఇంద్రుడు మరియు ఈ రుద్రులు ఏ దేవేశువలన పుట్టారో తెలియదనుకుంటాను.

4-26-సీ.
రఁగ నే దేవుండు ప్రళయకాలంబున
నెందఱు బ్రహ్మల యేపు మాపె
వెలయ నే దేవుండు విలయావసరమున
నెందఱు విష్ణుల యేపు మాపె
డియకే దేవుండు సంహారవేళల
నెందఱు నింద్రుల యేపు మాపె
రయంగ నేదేవుఁ డంత్యకాలములోన
నెందఱు రుద్రుల యేపు మాపె

4-26.1-ఆ.
ట్టిదేవదేవు నభవు వ్యయు నీశుఁ
మలజాండనాథు గౌరినాథు
నిఖిలలోకనాథు నిందింపఁగా రాదు
పాతకంబు దక్ష! పాపచక్ష!

టీక :-
ఏపుమాపు = చంపు; అవ్యయుడు = నాశరహితుడు; పాతకము = పాపము.
భావము :-
ఏ దేవుడు ప్రళయకాలములో ఎంతమంది బ్రహ్మలను సంహరించాడో, ఏ దేవుడు కల్పాంత సమయంలో ఎందరు విష్ణువులను సంహరించాడో, భయపడక ఏ దేవుడు సంహారవేళల ఎందరు ఇంద్రులను జయించాడో, సృష్టి అంతములో రుద్రులను రూపుమాపాడో అటువంటి దేవదేవుని, పుట్టుక అన్నది లేని వాడిని, నాశము కాని వాడిని, ఈశ్వరుని, విష్ణువునాథుని, గౌరీపతిని సర్వలోకనాయకుని నిందింప తగదు. పాపవర్తనుడా! పాపమయ్యా దక్షా!

4-27-క.
మూఁడేసి కండ్లు కలిగిన
పోడిమితో రుద్రు లంచుఁ బొగడెడువారిన్
మూఁడేసి కండ్లు నిజమో
పోడిమియొ తలంచిచూడ పోలిక యొక్కో.

టీక :-
పోడిమి = లక్షణము.
భావము :-
మూడేసి కళ్ళుగల లక్షణము చూసి వీరిని రుద్రులని పొగుడుచున్నావు. ఈ మూడూ నిజమైన నేత్రాలో అందం కోసం పెట్టకున్న నేత్రాలో చూడు.

4-28-క.
న్నులు గానక ప్రేలెదు
క్రొన్నెలధరు వేరుచేసి కొలిచెద వీవున్
నిన్నును నీ తర మెఱుఁగవు
యిన్నిజగంబులకుఁ దండ్రి యెవ్వఁడు చెపుమా?

టీక :-
క్రొన్నెల = కొత్తనెల (బాలచంద్రుడు).
భావము :-
కళ్ళు కనబడక ప్రేలుతున్నావు. నీవు చంద్రధరుని విడిచి ఇతరులను కొలుస్తున్నావు. నిన్నూ నీ సామర్థ్యాన్నీ తెలుసుకోలేక పోతున్నావు. ఇన్ని లోకాలకూ తండ్రి ఎవరో చెప్పు.

4-29-వ.
అదియునుం గాక.

4-30-సీ.
మర నీ రుద్రులే రి నమ్ముగాఁ జేసి
యిలఁగూలఁ ద్రిపురంబు లేయువారు
నెరయ నీ రుద్రులే నిఖిలంబుఁ జెరగొన్న
యంధకాసురుఁ బట్టి ణఁచువారు
లసియీ రుద్రులే ప్రళయకాలునిబట్టి
ఖండించి మునిరాజుఁ గాచువారు
దసియీ రుద్రులే రళంబుగుదియించి
కంఠకోణము నందుఁ ప్పువారు

4-30.1-ఆ.
నయఁజదువులెల్ల యెఱుఁగుదు జెప్పుమా?
యిట్టి రుద్రమహిమ యిజ్జగంబు
ట్టిరుద్రు మహిమ యెఱుఁగంగ నలవియె?
థాత కైన నతని తాత కైన.

టీక :-
అమ్ము = బాణము; ప్రణయకాలుడు = యముడు.
భావము :-
నువ్వు చూపే ఈ రుద్రులా హరిని బాణముగా చేసి త్రిపురములనూ నేల కూల్చినవారు? ఈ రుద్రులేనా లోకాలను చెరబట్టిన అంధకాసురుని అణచినవారు? ఈ రుద్రులేనా యముని ఖండించి మార్కండేయుని కాపాడినవారు? ఈ రుద్రులేనా గరళమును చిన్నదిగా చేసి కంఠమున నిలిపినవారు? వేదాలన్నీ తెలిసినవాడివికదా చెప్పు. ఇటువంటి రుద్రమహిమను తెలుసుకోవడము చెప్పడము బ్రహ్మకైనా వాని తాతకైనా సాధ్యమా?

4-31-క.
రుద్రులఁ బదివేలను
గావమునఁ బూజసేయ క్రతుఫల మది తాఁ
జేరునె నిన్నును రోయుచు
నీసమగుఁగాక క్రతువు నిష్ఫలగతులన్.

టీక :-
రోయు = అసహ్యించుకొను.
భావము :-
ఇలాంటి రుద్రులను పదివేల మందిని పూజ చేసినా యజ్ఞఫలం నీకు దక్కుతుందనుకుంటున్నావా? క్రతువు నిన్ను అసహ్యించుకొని వ్యర్థమై ఉపయోగం లేకుండా పోతుంది.

4-32-ఉ.
నీరియించు నోమునకు నీవు ప్రియంబునఁ గొల్చురుద్రు లే
నీచులు వీరు చాలుదురె నీకు ఫలం బొకటైనఁ జెప్పుమా
యీతురాననాదులకు నేడుగడల్ భువిఁ దానయైన తా
రాలనాథు నీవెఱుఁగ బ్బునె పొందునె దక్ష! యీ యెడన్.

టీక :-
చతురాననుడు = బ్రహ్మదేవుడు; ఏడుగడ = గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత యనెడి ఏడుగురు రక్షకులు.
భావము :-
నీవాచరించే నోమునకు నీవు ఇష్టముతో కొలిచే ఈ రుద్రులా నీకు ఫలాన్నిచ్చేవారు? దక్షా! ఒకటి చెప్పు. ఈ బ్రహ్మాదులకు రక్షకుడై యుండే దేవదేవుని తెలుసుకోవడం నీ తరమా?

4-33-క.
దేవుఁడు నాకంబునకును
దేవుఁడు త్రిత్రింశకోటి దేవావలికిన్
దేవుఁడు లోకంబులకును
దేవుండీశ్వరుఁడె కాక దేవుఁడు గలఁడే?

టీక :-
నాకము = స్వర్గము.
భావము :-
ఈశ్వరుడు స్వర్గమునకు దేవుడు; ముప్పది మూడుకోట్ల దేవతలకూ దేవుడు; లోకాలన్నింటికీ దేవుడు. ఈశ్వరుడు కాక వేరే దేవుడున్నాడా?

4-34-ఉ.
మేరువు వింటికమ్మి యట మేదిని తేరటసూర్యచంద్రు లిం
పారఁగ బండికండ్లట ననంతుఁడు నారట బ్రహ్మవిష్ణువుల్
సాథియున్ శరంబులట సామచయం బట గుఱ్ఱముల్ మనో
జారికి నెవ్వ రీడు? త్రిపురాసురవైరికి నన్యదైవముల్.

టీక :-
మేదిని = భూమి; అనంతుడు = శేషుడు; మనోజారి = మన్మథుని వైరియైన శివుడు.
భావము :-
త్రిపురాసుసంహారం చేసే పరమశివునికి మేరు పర్వతం వింటిబద్ద; భూమి రథం; సూర్యచంద్రులు బండి చక్రాలు’ శేషుడు వింటినారి; బ్రహ్మ సారథి; విష్ణవు బాణము; నాలుగు వేదాలూ గుఱ్ఱాలు ఇటువంటి మన్మథవైరికి, త్రిపురాసుర వైరికి తక్కిన దేవతలు సమానమా?

4-35-ఉ.
చెచ్చెర బ్రహ్మ తొల్లియును శ్రీపతియుం దమలోనవాదమై
చ్చరకించి పాదములు మౌళియుఁ గానఁగఁ బూని గర్వులై
చ్చుగ మిన్నుమన్నుఁగన హంసయుఁ బందియు నై కడంకతోఁ
గ్రచ్చరఁ ద్రవ్వి యీశ్వరుని గానఁగఁ జాలిరొ యేపు దూలరో.

టీక :-
చెచ్చెర = శీఘ్రముగా; మచ్చరము = పట్టుదల; మౌళి = సిగ; అచ్చుగ = ఒప్పుగా; కడంక = యత్నము; క్రచ్చర = అంతయు; ఏపు = గర్వము.
భావము :-
పూర్వము బ్రహ్మ, విష్ణువు వాదించుకొని పట్టుదలగా శివుని పాదములు, మౌళి చూడాలని గర్వముతో పూని భూమిలో పాదములు వెతకడానికి విష్ణువు వరాహ రూపములో తవ్వుకుంటూ వెతికాడు. బ్రహ్మ హంసయై ఆకాశంలో మౌళి కోసం వెతికాడు. వారి గర్వమణిగింది కానీ శివుని చూడగలిగారా?

4-36-క.
ని యొక గురి సేయఁగ
నాని నొక కొలఁదిసేయ గునే తమలో
నీతియెఱుంగక వారలుఁ
చేతోమోదంబుతోడఁ జిక్కులఁ బడరే?

టీక :-
చిక్కు = సంకటము.
భావము :-
పరమశివుని వేలెత్తిచూపడానికికానీ, అతనిని తక్కువ చేయడానికికానీ ఎవరితరం? నీతి తెలియనివారు తోచింది చేసి సమస్యలు తెచ్చుకుంటారు.

4-37-క.
పంతంబులాడి శంకరు
నెంయుఁ బొడగానవలయు నియును దమలోఁ
జింతింపఁ జిక్కువడ్డవి
యెంయు వేదంబు, లొరుల కెఱుఁగఁగ వశమే?
భావము :-
శంకరుని ఎలాగైనా తెలుసుకోవాలని వేదాలు తమలో తాము చర్చించుకొని చిక్కులు పడ్డాయి. ఇంక ఇతరుల వల్ల ఏమౌతుంది?

4-38-క.
గౌరీమనోహరునకున్
థారుణి బ్రహ్మాదిసురలు దాసులు గారే
నారాయణుఁ డరయంగా
మారారికిఁ బ్రియుఁడు కాఁడె? తకరిదక్షా!

టీక :-
మతకరి = మాయావి; మారారి = మన్మథవైరి, శివుడు.
భావము :-
గౌరీపతికి బ్రహ్మాది దేవతలు దాసులు కారా! విచారించగా నారాయణుడు మన్మథవైరికి ఇష్టుడు కాదా? మాయావైన దక్షా!

4-39-క.
లాధిపతికి శివునకు
లంకున కమితమతికి భవున కిలలో
నొపేదవేల్పు సరియే
ప్రటింపఁగఁదగదు పరమ పాపము దక్షా!

టీక :-
అకలంకుడు = మచ్చలేనివాడు; అభవుడు = పుట్టుక లేనివాడు.
భావము :-
శివుడు సర్వేశ్వరుడు, కళంకరహితుడు, బ్రహ్మజ్ఞాని, పుట్టుకలేనివాడు. అలాంటి పరమశివునకు ఒకపేద వేల్పు సరియౌతాడా? చెప్పనుకూడా చెప్పకూడదు. ఇది మహా పాపం.

4-40-క.
త్తిల్లి క్రొవ్వినాఁడవు
చిత్తంబున సరకుగొనవుశివుఁ డటు నిను ను
వ్వెత్తుగఁ గొనవచ్చిన నీ
పొత్తగువా రెవ్వ రెందుఁబోయెదు? చెపుమా.

టీక :-
మత్తిల్లి = మదించి; సరకుగొను = లక్ష్యపెట్టు; పొత్తు = స్నేహము.
భావము :-
మత్తెక్కి క్రొవ్వుపట్టి యున్నావు. మనసున లక్ష్యపెట్టుట లేదు. శివుడు కనుక ఒక్కసారిగా దండెత్తి వస్తే నీకు దన్నుగా వచ్చేవారెవరు? ఎక్కడికి పోతావు చెప్పు?

4-41-క.
దు శశిఖండభూషణుఁ
జెలువుగఁ బిలిపించి పూజ సేయుము ప్రీతిన్
వదు చెప్పితి ననినను
రుచు నప్పలుకు వాఁడు హాస్యము చేనెన్.

టీక :-
చెలువుగ = అందముగా; వలవదు = వద్దు; అలరు = ఒప్పు.
భావము :-
"చంద్రశేఖరుని చక్కగా పిలిచి ప్రీతితో పూజచేయి. వద్దు వద్దని చెప్తున్నాను. నామాట వినుకో" అని దధీచి చెప్పాడు కానీ, ఆమాటలను దక్షుడు అపహాస్యం చేశాడు.

4-42-వ.
పుణ్యమానసుం డగు దధీచి కోపమానసుం డై నయనంబుల వాని వీక్షీంచి యమ్మఖంబున నతని దగ్ధంబుగా శపింప గమకించి "నాకున్ వేగిరపడ నేల యిక్కార్యంబునకుం గైలాసవాసుండున్నవాఁడు గదా" యని దేవతల మొగం బై యిట్లనియె.

టీక :-
మఖము = యాగము.
భావము :-
పుణ్యమానసుండయిన దధీచి ఆ సంఘటనతో కోపమానసుడై కళ్ళారా దక్షుని చూసి ఆ యాగమునూ, అతనిని దగ్ధమయ్యేలా శపించవలె ననుకపని, "నేనెందుకు తొందరపడడం ఈ పనికి ఎలాగూ కైలాసనాథుడున్నాడు కదా!" అని దేవతలతో ఇలా అన్నాడు.

4-43-ఉ.
"న్నుగ మీర లందఱును పాలసముద్రము తొల్లి ద్రచ్చుచోఁ
గ్రన్నన నుద్భవించి మిముఁ గాలుచుచో నభయంబు లిచ్చి తా
న్నుతిఁ జిచ్చు మ్రింగఁ జెయిసాచిన దేవరకీయ రాని యీ
న్నములోనఁ జేతు లిటు చాతురె దేవతలార! కష్టులై.

టీక :-
పన్నుగ = ఒప్పునట్లుగ; త్రచ్చు = మధించు; క్రన్నన = వెంటనే.
భావము :-
"దేవతలారా! పూర్వము మీరంతా పాలసముద్రము చిలుకుతుంటే పుట్టిన ఆ హాలాహలము యను కాలకూట విషం మిమ్మల్ని కాలుస్తుంటే మీరు శివుని ప్రార్థించారు. మీకు అభయమిచ్చి ఆ చిచ్చును మ్రింగుతాను ఇవ్వండని చేయిచాపిన దేవుని చేతబెట్టని ఈ యీగ హవిర్భాగంకొరకు మీరు చేతులు చాపుతారా?

4-44-ఉ.
చ్చట నుండఁగావలవదిందుశిఖామణి లేనిచోట మీ
చ్చుటచేటు నా విమలవాక్యము దప్పదు లీలఁగామునిం
జెచ్చెరఁ గూల్చి యున్న పెనుజెట్టి శివుం డిటు వచ్చెనేని మీ
చ్చుట తెల్ల మో యమరసంఘములార! వినుండు చెప్పితిన్."

టీక :-
చేటు = అశుభము; జెచ్చెర = వేగిరపాటు; జెట్టి = మల్లుడు.
భావము :-
చంద్రశేఖరుడు వల్దనినచోట ఇక్కడ యుండరాదు. మీరు వస్తే కీడు తప్పదు. నా మాటలు నిజము. లీలగా మన్మథుని చటుక్కున కూల్చిన మహాశూరుడైన శివుడిటు వచ్చాడంటే మీరంతా చావటం తథ్యము. ఓ దేవతలారా! నా మాట వినండి."

4-45-క.
నిపలికి నిర్మలాత్మకుఁ
నుపమగుణుఁ డచట నుండ విరళబుద్ధిన్
మున రోయుచుఁ జనియెను
నుటం గనుగొనుచుఁ బాసి నరై రమరుల్.

టీక :-
అనుపమగుణుడు = సాటిలేని గుణము కలవాడు; అవిరళము = దట్టమైన; రోయు = అసహ్యించుకొను.
భావము :-
అని పలికి మంచి మనసు కలవాడు, సాటిలేని గుణము కలవాడైన దధీచి అక్కడ నిలవక స్థిర నిశ్చయంతో మనసులో అసహ్యించుకుంటూ వెడలిపోయెను. అది చూసి కూడా అమరులు వెళ్ళలేదు.

4-46-ఆ.
క్షుఁ బాయ రైరి లపోయలేరైరి
యిక్షుచాపవైరి నెఱుఁగరైరి
నింద్యులైరి సురలు నిఖిలలోకంబులఁ
మకువచ్చుచేటు లఁపరైరి.

టీక :-
ఇక్షుచాపవైరి = చెరకు విల్లుగల మన్మథుని వైరి, శివుడు
భావము :-
దక్షుని వదలలేకపోయారు. యుక్తాయుక్తములు తెలుసుకొన లేకపోయారు. శివుని సామర్థ్యం తెలుసుకోలేకపోయారు. దేవతలు నిందింతులయ్యారు. జగతిలో తమకు వచ్చే కీడును ఊహించలేకపోయారు.