పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

4-135-సీ.
"ఱిఁగితే మనములో నీశానుతత్త్వంబు
నెఱిఁగింతు నిచ్చోట నెఱుఁగ వేని
యిఁకనైన నిచ్చె దే యీశ్వరుభాగంబు
వెంగలి కొల్వులో వేల్పు లెల్ల
పాట్లు పడియెద రీక్షించిచూడరా
యాలింపరా యోరి! బేల! యనుచు
లుగుల నాటించి ఖిల శూలంబులఁ
గ్రొమ్మెఱుంగులు వెసఁ గ్రుమ్మఁబట్టి

4-135.1-ఆ.
క్షు బంధుజనుల క్షునికూఁతులు
మోదుకొనుచు బిట్టు మొఱలువెట్ట
క్షుశిరముఁ ద్రుంచి గ భద్రకాళిచే
మ్మదమునఁ గేలి లుప నిచ్చె.

టీక :-
వెంగలి = మూఢుడు, అవివేకి; ఈక్షించు = ఆలోచించు; అలుగు = ఆయుధము, ఖడ్గము; క్రొమ్మెరుగు = కొత్తమెరుగు; వెస = వేగము; బిట్టు = మిక్కిలి; కేలిసలుపు = ఆడుకొను.
భావము :-
“నీ మనసునకు ఈశ్వర తత్వం తెలిసివచ్చిందా? తెలియకపోతే ఇప్పుడు ఇక్కడే తెలియచేస్తాను. ఇప్పుడైనా ఈశ్వర భాగం ఇస్తావా? మూఢులకొలువులో దేవతలంతా ఎలా బాధలు పడుతున్నారో జాగ్రత్తగా చూడరా! వినరా! ఓరీ! బేలా!” అంటూ ఆయుధాలతో, సకల శూలములతో గ్రుచ్చి దక్షుని బంధువులు కూతుళ్ళు మిక్కిలి మొరలు పెడుతుండగా దక్షుని శిరము త్రుంచి సంతోషంగా భద్రకాళికి బంతాట ఆడుకోడాని కిచ్చెను.

4-136-వ.
అంత భద్రకాళియు మహాకాళియుం బోలెఁ గరాళించి దారుణాభీల శూలహస్త యై రణంబున మాఱులేకతిరుగుచు వీరభద్రుం డిచ్చిన దక్షుని మస్తకంబు గని మహాభయంబున.

టీక :-
కరాళించి = సకిలించి; అభీల = భయంకరమైన; మస్తకము = తల.
భావము :-
అప్పుడు భద్రకాళి మహాకాళి వలె అట్టహాసంగా నవ్వి భయంకరమైన శూలము చేతియందు ధరించినదై ఎదురులేక తిరుగుతూ వీరభద్రుడిచ్చిన దక్షుని తలను చూసి మహా భయంకరముగా.

4-137-మ.
ప్రియుఁజూచుం దలయూచు నారుచులకుం బిల్చున్ నగున్వేడుకం
లం బాఱఁగ వైచు నేచు నడుమన్ బంతంబుతోఁ బట్టుటన్
లీలన్ గబళించు దంచు దివిపై నాడించుఁ దూలించు ని
ర్భతం దక్షుశిరంబు కందుక గతిన్ ద్రాణి వేభంగులన్.

టీక :-
ఆరుచులు = ఆటలు; బయలు = ఆకాశము; ఏచు = విజృంభించు; కబళించు = పట్టుకొను; దంచు = అదుము; తూలించు = పడగొట్టు, విసురు; కందుకము = బంతి.
భావము :-
భగ్రకాళి భర్తను చూస్తుంది. దక్షుని తలను చూస్తుంది. బంతాటలు ఆడడానికి పిలుస్తుంది. వేడుకగా ఆకాశం వైపు విసురుతుంది. విజృంభించి మధ్యలోనే పంతంతో పట్టుకుంటుంది. లీలగా పట్టుకుంటుంది. స్వర్గంపై ఆడిస్తుంది. పడగొడుతుంది. ఆ భద్రాణి భయంలేకుండా అనేకరకాలుగా దక్షుని తలతో బంతాట ఆడుతోంది.

4-138-వ.
తత్సమయంబున నయ్యాగపురుషుండు మాయామృగాకారుం డై తిరిగి పోవుటం గనుంగొని పోకు పోకునిలు నిలు మింక నెటు బోయెదు మత్కోపబడబానలంబు బాఱిఁ బడితివి గాక యని విల్లుమోపెట్టి బెట్టిదం బగు నయ్యర్థచంద్రబాణంబుఁ దొడిగి కడువడి నతని శిరంబుఁ బుడమింబడనేసి కూల్చి బిట్టార్చి చిక్కన మూకలపైఁ గవియుచుండ భయంపడిన దేవజనంబు లెల్లను నార్తారావంబుల మహాదైన్యంబున.

టీక :-
మృగము = లేడి; మోపెట్టు = ఎక్కుపెట్టు; బెట్టిదము = కఠినము; బిట్టు = అధికము; ఆర్చు = సింహనాదముచేయు, అరచు; కవియు = వ్యాపించు, మీదకు వచ్చు; ఆరావము = ఆక్రందనము; దైన్యము = దీనత్వము.
భావము :-
ఆ సమయంలో యజ్ఞపురుషుడు మాయాలేడిగా మారి పారిపోవుట గమనించి “పారిపోకు! పోకు! నిలు! నిలు! మాయొక్క కోపమనే బడబాగ్నిలో పడ్డాక ఇంకెక్కడికి పోతావు?” అంటూ విల్లు ఎక్కుపెట్టి కఠినమైన అర్థచంద్రాకార బాణమును ప్రయోగించి వేగముగా అతని తల భూమిపై పడవేసి గట్టిగా సింహనాదం చేసాడు. తమ సేనా సమూహాలపైకి వస్తుండగా భయపడిన దేవతలు అందరూ దీనంగా ఆక్రందించారు.