పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : ప్రమథగణములతో వీరభద్రుఁడు దండెత్తుట.

4-79-క.
కొంఱు మొనలై నడువఁగఁ
గొంఱు పంతంబు పలుకఁ గొందఱుమూకల్
సండిఁ బాపఁగ మఱియును
గొంఱు దక్షుం దలంచి క్రోధింపంగన్.

టీక :-
మొన = సేనాముఖము.
భావము :-
ఆ వీరభద్రుని సేనలలో కొందరు సేనానాయకులుగా ముందుండి నడుస్తున్నారు; కొందరు పంతాలు పలుకుతున్నారు; కొందరు సమూహాలు కట్టి సందడి చేస్తున్నారు; మరికొందరు దక్షుని తలచి కోపిస్తున్నారు.

4-80-క.
గండఁడు శంభుద్రోహర
గండఁడు మహి నన్యధైవగండరులకుఁ దా
మిండఁడగు వీరభద్రుఁడు
దండెత్తె గణాళి గొల్వక్షునిమీఁదన్.

టీక :-
గండడు = శూరుడు; గండరులు = ముక్కలు ముక్కలు; మిండడు = అధికుడు.
భావము :-
శూరుడు, శివద్రోహులకు మల్లుడు, ఇతర దేవతా యోధులను మించిన అధికుడు, యైన వీరభద్రుడు గణములన్నీ సేవిస్తూ యుండగా దక్షుని పైకి దండెత్తెను.

4-81-వ.
ఇట్లు వీరరణ సైన్యాధిష్టితుండును; గోరాజ గమనుండును; భద్రేశ్వరీ సహితుండును; నారాచ గదా దండ భిండివాల త్రిశూల దివ్యబాణ నిశితాయుధ పరివృత బాహుదండుండును; రణదుందుభీ నిస్సహణ శంఖ కాహళ ఘంటికారావ భీకరుండును; నతులిత కోపాటోప సంరంభుండును; సమర సన్నాహుండును; వివిధ విలసిత వీరలక్ష్మీ విలాసుండును; వృషభకేతనాలంకారుండునునై పురంబులు సాధింప వసుంధరారూఢుండును గౌరీసమేతుండును నై యరుదెంచు పురారాతిచందంబున నతి సుందరుండై వీరభద్రేశ్వరుం డరుగు దెంచుచున్న సమయంబున.

టీక :-
నారాచ = ఇనుపబాణము; భిండివాల = ఇనుప అలుగు; నిశిత = సానపెట్టబడిన; దుందుభి = భేరి; కాహాళము = బాకా ఊదెడు కొమ్ము; ఘంటిక = చిరుగంట; వృషభము = ఎద్దు.
భావము :-
ఈవిధముగా రణవీరులుగల సైన్యమునకు అధినాయకుడును; నంది వాహనుడును; భద్రేశ్వరిజతగా కలవాడును; చేతులనిండా ఇనుప బాణము, గద, దండము, ఇనుప అలుగు, త్రిశూలము, దివ్యబాణము మొదలైన పదునైన ఆయుధములు కలవాడును; రణభేరి, మద్దెల, శంఖము, బాకా, గంటలు మున్నగువాని ధ్వనులతో భీకరమైనవాడును; సాటిలేని కోపము కలవాడును; యుద్ధమునకు సిద్ధమైనవాడును, బహువిధ ప్రకాశముల వీరలక్ష్మీ విలాసుండును, నందికేతనాలంకారుడును యయిన వీరభద్రుడు యతి సుందరముగా వీరభద్రుడు దక్షయజ్ఞశాలకు వస్తున్నాడు. అప్పుడతను పురములు సాధించడానికి భూమినెక్కి గౌరీ సమేతంగా వెళ్ళిన త్రిపురాసురసంహారి వలె యతిశయిస్తున్నాడు.

4-82-క.
పాదహతులచేతను
ణఁకి గిరుల్ తరులతోడ సుధం బడియెన్
ణఁగి వసుంధరగిరులును
ణిపతిపైఁ బడియెఁ గమఠతివైఁ బడియెన్.
భావము :-
వీరభద్ర గణములయొక్క పదఘట్టనలవలన అదిరిపడి పర్వతాలు చెట్లతో సహా భూమిపై పడ్డాయి. భూమి పర్వతాలుతోపాటు ఆదిశేషునిపై పడింది. ఆదిశేషుడు కూర్మావతారునిపై పడ్డాడు.

4-83-క.
లువిడి ప్రమథగణంబుల
ముల పెనుధూళి గగనభాగముఁ గప్పెన్
రఁగ రేణువుఁ గప్పెను
జెలువుగ రవి మింటనుండి చీఁకటి గప్పెన్.

టీక :-
అలరు = ఒప్పు; చెలువు = విధము.
భావము :-
ప్రమథగణముల కదలికలతో లేచిన దట్టమైన దుమ్ము ఆకాశాన్ని కప్పేసింది. సూర్యుడు యున్నా ఆకాశాన్ని చీకటి కప్పేసింది.

4-84-వ.
అంత నవ్వీరభద్రుండు తుహినాచలశిఖరంబు డాయంబోయి కతిపయ దూరంబున దక్షాధ్వరకలకలంబువిని గణంబుల కిట్లనియె.

టీక :-
కతిపయ = కొంత; అధ్వర = యజ్ఞము.
భావము :-
అంతట ఆ వీరభద్రుడు హిమాచల శిఖరము చేరుతుండగా కొద్ది దూరమునుండి దక్షయజ్ఞ సందడి విని తన గణములతో ఇలా అన్నాడు.

4-85-సీ.
"నులార! వింటిరే గనభాగం బెల్ల
హోమధూమముగప్పి యున్న భంగి
వినవచ్చెనే మీకు వేదమంత్రంబులుఁ
లికెడుహోతల లకలంబు
ల్లన యేతెంచు దె హవ్యములు గోరి
క్రందైన నిర్జర బృందరవము
ల్లదె పాపాత్ము ధ్వరంబొనరించు
క్రతుశాల దవ్వునఁ గానవచ్చె

4-85.1-ఆ.
నింకదవ్వు లేదు యేర్పడఁజూడుఁడో
శ్రీగిరీశు వేఱుచేసినాఁడు
క్రొవ్వినాఁడు వీని క్రొవ్వునణంపంగ
లయు దేవదైత్య రులతోడ."

టీక :-
హోత = ఋత్విక్కు; క్రందు = సందడి; అధ్వరము = యాగము; దవ్వు = దూరము; దైత్యులు = రాక్షసులు.
భావము :-
"ఘనులారా! ఆకాశమంతా హోమధూమము కప్పేసింది చూసారా!. విన్నారా! వేద మంత్రములు పలికే ఋత్విక్కుల సందడి? వినబడుతోందా! అదిగో! హవ్యము కోసం వస్తున్న దేవతా సమూహాల కలకలారావము. అదిగో! ఆ పాపాత్ముడు జరిపే యాగశాల దూరమునుండి కనిపిస్తోంది. ఇంక యెంతో దూరం లేదు. శివుని వేరు చేశాడు. కొవ్వెక్కి ఉన్నాడు. వాని క్రొవ్వు దేవతలు రాక్షసులతో సహా అణచాలి."

4-86-వ.
అని హెచ్చరించి మైవెంచి వీరజనచూడామణియగు వీరభద్రేశ్వరుండు.

టీక :-
మై = శరీరము.
భావము :-
అలా యాగశాల సమీపిస్తున్నాము అని హెచ్చరించి, వీరులలోకెల్లా మహావీరుడైన ఆ వీరభద్రుడు శరీరాన్ని పెంచి.....

4-87-సీ.
హుతంత్రములచేత భాసిల్లి యందంద
వేదనాదములచే వెలసి వెలసి
విదితవైభవముల విలసిల్లి విలసిల్లి
కలకలరవములఁ జెలఁగి చెలఁగి
హోతలపలుకుల నొప్పారి యొప్పారి
యాచార్యజనులచే మరి యమరి
పృథుసదస్సులచేతఁ బెంపారి పెంపారి
రయాగలక్ష్మిచే వ్రాలి వ్రాలి

4-87.1-ఆ.
వెలుఁగుచున్నయట్టి వేదిపైఁగూర్చుండి
బంధుకోటితోడ భాసురముగఁ
గొంతదనుకఁ గ్రతువు నంతయు వేల్చిన
క్షుఁ గనియె వీరదైవ మపుడు.

టీక :-
భాసిల్లు = ప్రకాశించు; వెలయు = ప్రసన్నతనొందు; విలసిల్లు = ఒప్పు; చెలగు = సంతోషించు; ఒప్పారు = తగినట్లుండు; అమరు = అంగీకరించు, చక్కగా నుండు; పృథు = పెద్ద; సదస్సు = సభ; పెంపారు = వర్ధిల్లు; వ్రాలు = అతిశయించు; భాసురము = ప్రకాశించు; దనుక = వరకు; వేల్చు = హోమము చేయు.
భావము :-
ఆ యజ్ఞవేదిక సకల యాగతంత్రములతో మిక్కలి ప్రకాశిస్తోంది; వేదపఠనాలచే మిక్కలి వర్తిల్లుతోంది; విజ్ఞానవైభవముములతో బహు ఒప్పుతోంది; సభికుల సందడితో యెంతగానో చెలరేగుతోంది; హోతల మంత్రపఠనాలతో మార్మోగిపోతోంది;, గురుదేవులతో బహు గౌరవప్రదంగా యున్నది; పెద్ద సభలతో పెద్దగా వర్థిల్లుతోంది; వరయాగలక్ష్మీకళతో మహాతిశయంగా యున్నది; ఆ యజ్ఞవేదికలో అప్పటిదాకా యాగ క్రతువులలో హవ్యములు వ్రేల్చిన దక్షుడు, ప్రకాశించే వేదికపై బంధువులతో కూడి కూర్చుని ఉన్నాడు.  అలా ప్రకాశిస్తున్న యాగమునూ, అలా వేదికపై కుర్చున్న దక్షుని వీరభద్రుడు చూసాడు.

4-88-వ.
ఇట్లు కాంచి తదీయ మందిరంబు గణంబులుం దానును జుట్టుముట్టి విపుల వీరావేశకోపాటోపోప సంరంభుఁడును గరాళ వదనుండును నై చెలంగి యార్చిన.

టీక :-
విపుల = విరివియైన; వీరావేశము = గొప్ప వేగిరపాటు; ఆటోపము = దర్పము; కరాళము = వెఱపు పుట్టించే; ఆర్చు = బొబ్బరించు.
భావము :-
ఇలా చూసిన వీరభద్రుడు అక్కజమైన వీరావేశంతో పట్టరాని కోపముతో భీకరమైన ముఖముతో  ఆ యాజమానశాలను తన గణములుతో చుట్టుముట్టి పెద్దగా బొబ్బలుపెట్టాడు.

4-89-శా.
కంధుల్ వండలి పిండుగాఁగలఁగె, ఘీంకారంబు రోదించె ది
గ్గంధేభంబులు, గ్రుంగె భూతలము, చుక్కల్ వ్రాలె, భూతంబులున్
మందీభూతము లయ్యెఁ, దప్పె రవి, బ్రహ్మండంబు భేదిల్లె, ది
క్సంధుల్ ద్రెళ్లెఁ, జగంబులుం బెగడె, వే శంకించె నా బ్రహ్మయున్.

టీక :-
కంధి = సముద్రము; వండలి = ఎండిన బురద; పిండుగాన్ = పిండి యగు; రోదించు = దుఃఖించు భేదిల్లు = బద్దలగు, చీలుచు; త్రెళ్ళు = తూలిపడు; బెగడు = భయపడు; వే = అధికముగ.
భావము :-
వీరభద్రుని పెనుబొబ్బకు సముద్రాలు ఎండి బురదలతో పిండైపోయాయి; దిగ్గజాలు బెదిరి ఘీంకరిస్తూ రోదించాయి; భూమి క్రుంగింది; భూమిపై చుక్కలు రాలాయి; మందుడై సూర్యుని గతి తప్పెను. బ్రహ్మాండం బద్దలయ్యింది; దిగంతాలు తూలి పడిపోయాయి; లోకాలు భయపడ్డాయి. బ్రహ్మదేవుడు ఏంతో శంకాన్వితుడు అయ్యాడు.

4-90-క.
కలము నొందు యాగము
వెవెలనై చిన్నబోయె వేల్పులమూఁకల్
గిరి ఋషి మునిముఖ్యులు
లుఁగింతయు లేక యుండి రెంతయు భీతిన్.

టీక :-
ఎలుగు = కంఠన్వరము.
భావము :-
భద్రుని బొబ్బల ఘోషకు, కళకళలాడే యాగభూమి వెలవెలబోయి చిన్నబోయింది. దేవతా సమూహాలు కలత చెందాయి. ఋషులు మునులు భయముతో నిరుత్తరులై యుండిపోయారు.

4-91-ఉ.
కొంఱు మూర్ఛవోయిరటఁ గొందఱు పాఱిరిభీతచిత్తులై
కొంఱు చచ్చి రచ్చటను గొందఱు దూరిరి శాశ క్రంతలన్
గొంఱుఁ బుద్ధి మ్రాన్పడిరి గుండెలు ఝల్లని తల్లడింపఁగాఁ
గొంఱు సృష్టిసంహర మొకో యని నివ్వెఱఁగంది రా ర్తులై.

టీక :-
పాఱుట = పారిపోవుట; శాశ = ? ఆర్తులు = దుఃఖముతో యున్నవారు.
భావము :-
వీరేశ్వరుని ఆ సింహనాదానికి, కొందరు మూర్ఛపోయారు; కొందరు భయపడి పారిపోయారు; కొందరక్కడే చనిపోయారు; కొందరు కొండ గుహలలోకి దూరారు; కొందరికి మతి చలించింది; గుండెలు ఝల్లుమనగా; కొందరు ప్రళయమేమోనని ఆర్తితో నివ్వెఱపోయారు.

4-92-వ.
ఇట్లు సింహనాదంబు చేసి విజృంభితుం డై యిం దెవ్వరేని పాఱిపోయెదరు వీరల మెదిలిపోనీకుండని రభసంబున నయ్యాగ మంటపంబు చుట్టును ఖడ్గ పరశు త్రిశూలహస్తులైన ప్రమథగణంబులఁ గాపు వెట్టి తానును వీరగణసేవితుండై యవ్వీరభద్రుండు దక్షముఖమంటపంబుఁ దరియం జొచ్చు సమయంబున వెఱిచియు వెఱవని చందంబున దక్షుఁడిట్లనియె.

టీక :-
రభసము = అల్లరి, కోలాహలము; తరియజొచ్చు = ప్రవేశించు, చొరబడు; చందము = విధము.
భావము :-
ఇలా సింహనాదము చేసి విజృంభించి ఎవరైనా పారిపోతారేమో వీరెవరిని కదలనీయకండని ఆ యాగ మంటపము చుట్టూ కత్తి గొడ్డలి త్రిశూలధారులైన ప్రమథగణములను కాపలాపెట్టాడు. వీరగణముల సేవలు అందుకుంటూ ఆ వీరభద్రుడు దక్షముఖమంటపము చొరబడుతున్నాడు. ఆ సమయములో భయపడికూడా భయపడనట్లు నటిస్తూ దక్షుడు ఇలా అంటున్నాడు.

4-93-క.
“ఇచ్చోటి కేల వచ్చెద
వెచ్చోటే యూరు నిన్ను నెవ్వఁడు పంపన్
చ్చితివి యేమికార్యము
చెచ్చెర వినుపింపు” మనినఁ జిత్తములోనన్.
భావము :-
దక్షుడు వీరభద్రుణ్ణి “ఇక్కడకు ఎందుకు వస్తున్నావు? ఎక్కడనుండి వస్తున్నావు? నీదేఊరు? ఎవడు పంపితే నువ్వొచ్చావు? నీకిక్కడేమి పనో చెప్పు? వెంటనే చెప్పు”మన్నాడు. అంత వీరభద్రుడు తన మనసులో....

4-94-ఆ.
వెఱ్ఱివాఁడు వీఁడు వెంగలి మూఢుండు
భాగమెల్ల నేఱుఱుపకున్న
ఱిగదాగణంగి ర్దించి వైచెద
నంచు నతనికనియె లఘుబలుఁడు.

టీక :-
వెంగలి = అవివేకి, వెఱ్ఱివెంగళప్ప; మఱిగ = రాచ్చిప్ప, రాతిగిన్నె; తాగడించు = నిర్భంధించు, బాధపెట్టు; మర్దించు = కొట్టు; అలఘు = ఎక్కువైన.
భావము :-
వీడో అవివేకి, మూర్ఖుడు. రాచ్చిప్పలోని హవ్యభాగమంతా ఇవ్వకపోతే, కట్టేసిమరీ మర్దిస్తాను అనుకుంటూ దక్షునితో ఆ మహాబలశాలి ఇలా అన్నాడు.

4-95-చ.
యగ దేవదేవుఁ డగు నీశ్వరదూతను వీరభద్రుఁడన్
నివిని నీదు జన్నమునఁ బాలుగొనం జనుదెంచినాఁడ భ
క్తినిశివుభాగ మేది యిటతెచ్చి సమర్పణ మీవు సేయుమా;
వినుననుఁ గూర్చి కుత్సితపు విద్యలు చేసినఁ బోదు వెంగలీ!

టీక :-
ఎనయు = ఒప్పు; పనివిను = ఆజ్ఞావశవర్తియగు; కుత్సితము = నికృష్ణము, కీడ్వడినది; ఏది = ఏదో యది; వెంగలి = మూఢుడు.
భావము :-
“దేవదేవుడగు శివునికి ఒప్పైన దూతను; వీరభద్రుడను. ఆయన ఆజ్ఞ ప్రకారము యీ యజ్ఞములోని తన హవ్యభాగము తీసుకుపోడానికి వచ్చాను. భక్తితో ఈశ్వరభాగమేదో అది యిచ్చెయ్యి. విను. మూఢుడా! నాగురించి యేదైనా నికృష్టపుపని చేయతలపెట్టావంటే కుదరదు సుమా.

4-96-మ.
లఁపన్ దుర్మతివై యొనర్చు నపరాధంబుల్ శివుంగూర్చియున్
వెన్నేనియుఁ దొల్లి నీ వలన నింకన్ వీరభద్రుం  డలం
తులఁబోనేరఁడు సైపనేరఁడు వృథా దుర్బుద్ధివై ప్రాణముల్
మున్ గోల్పడ నేల శంకరునకున్ భాగంబు దెప్పింపుమా”.

టీక :-
తొల్లి = పూర్వము; అలంతులు =అలతి, తేలిక; సైపు = ఓర్పు.
భావము :-
తలచుకుంటే పరమశివుని గూర్చి పూర్వము దుర్మార్గుడవై నీవు చేసిన యపరాధములు చాలానే యున్నాయి. ఇంకమీదట వీరభద్రుడు తేలికగా వదలి పోడు. ఒప్పుకోడు. అనవసరంగా దుర్భుద్ధివై ప్రాణములను యాగ ఫలమునూ పోగొట్టుకొనుటెందుకు కానీ, శంకరుని భాగం తెప్పించు.”

4-97-వ.
అనిన నవ్వి దక్షుం డిట్లనియె.

4-98-క.
“యాములోపల శివునకు
భాము గలదనుచు శ్రుతులు ల్కినచో నీ
భాము నీ కిచ్చెద నీ
యామములఁ దెలుపు మనిన తి వేగమునన్.

టీక :-
శ్రుతులు = వేదములు; ఆగమములు = వేదములు.
భావము :-
“యాగములో శివునకు భాగమున్నదని వేదాలు చెప్తే నీ భాగము నీకిస్తాను. ఈ వేదములను చెప్పమను” యని దక్షుడు అన్నాడు. వెంటనే...

4-99-వ.
అనిన విని ఋగ్యజుస్సామాధర్వంబులు మహావినయభీతచిత్తు లై లేచి తదీయమఖమంటపంబున నున్నసదస్యులం జూచి యిట్లనియె.
భావము :-
అలా దక్షుడు అనగా వినిన ఋక్, యజుర్, సామ, అధర్వణ అను చతుర్వేదములు యెంతో వినయము, భయములతో అక్కడ మంటపంలో యున్న సభికులను చూసి ఇలా అన్నాయి.

4-100-సీ.
"నిఖిలతంత్రములకు నీలకంఠుఁడు వేల్పు
భువినగ్రదైవంబు పూజసేయ
భాగ్యంబుకొఱఁతయే భావించిచూడుఁ డ
ర్మమానసులార! ష్టులార!
రమేశుతత్త్వంబుఁ రికింప రేమిటి
కీశానునిజతత్వ మెఱఁగరేల
రమోపదేశంబు రమంబు పరమాత్మ
శివుఁ డౌటయెఱుఁగరే సృష్టి”ననుచు

4-100.1-ఆ.
వేల్పులెల్ల మాట వినకున్నదక్షుండు
వినియువినని యట్ల కనలియున్న
చటనుండవెఱచి యాగమంబులుబోయె
బ్రహ్మలోకములకు యముఁ బొంది.

టీక :-
అకర్మ = శాస్త్ర నిషిద్ధమైన కార్యం; కష్టుడు = దుష్టుడు; కనలు = కోపగించు.
భావము :-
అన్ని తంత్రాలకూ నీలకంఠుడే దైవం. భూమిపై ఆయనదే అగ్రపూజ. అలా పూజించే భాగ్యంమనకు కొఱత యేముంది సరిగా! చేయకూడని పనులు చేసేవారా! దుష్టులారా! మీరు పరమేశ్వరుని తత్వాన్ని తెలుసుకోడం లేదేమిటి? ఈశ్వరుని నిజతత్వం తెలుసుకోరెందుకు? ఈ సృష్టిలో పరమాత్మ, పరమోపదేశము, పరము శివుడే అని తెలియదా!” అంటూ వేదములు చెప్పగా ఆ మాటలు దేవతలు వినలేదు. దక్షుడు వినీ విననట్లు యుండి, కోపంగా యున్నాడు.  దానితోభయపడిన చతుర్వేదములూ అక్కడినుండి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయెను.