పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : ధక్షాధ్వర ధ్వంసంబు

4-139-చ.
రిమురి నన్నిదిక్కులకు నాలములోపలఁ జొచ్చి భీతు లై
చుటఁ జూచి మాధవుఁడు పాఱకుపాఱకుఁ డేను గల్గఁగా
వెవఁగ నేల రం డనుచు వేల్పుల నందఱ నిల్పి మొత్తమై
వెవక నిల్చి బీరమున వీరునకున్ గిరివోలె నడ్డ మై.

టీక :-
అరిమురి = వెంటనే; ఆలము = యుద్ధము; పఱచు = పరుగెత్తు; ఏను = నేను; బీరము = పరాక్రమము.
భావము :-
యుద్ధములో వీరభద్రుని చూసి భయపడిన దేవతలు వెంటనే అన్ని దిక్కులకూ పారిపోతుంటే విష్ణువు పారిపోకండి. నేనుండగా భయమెందుకు రండియంటూ దేవతలందరినీ నిలిపి అందరూ కలసి భయపడక పరాక్రమంతో వీరభద్రునకు అడ్డుగా కొండవలె నిలిచారు.

4-140-వ.
ఇవ్విధంబున.

4-141-ఉ.
ము సేయఁ బూని కడు నాయితమై హతశేషు లైన దే
వాళియు సేన యై నడువ నార్చుచు పన్నగవైరి వాహుఁడై
వ్రాలుచు భద్రుపైఁ గవిసె వారిజనాభుఁడు వాసుదేవుఁ డా
భీవిహారి యై మృగము బెబ్బులి నుగ్రత చేరునాకృతిన్.

టీక :-
ఆలము = యుద్ధము; ఆయతము = సిద్ధపడు; హతశేషులు = చనిపోగా మిగిలినవారు; ఆర్చుచు = గట్టిగా అరుస్తూ; పన్నగము = పాము; కవియు = తిరుగబడు; ఆభీల = భయంకరమైన; మృగము = లేడి; బెబ్బులి = పెద్దపులి; ఉగ్రత = తీక్షణము.
భావము :-
యుద్ధము చేయుటకు సిద్ధపడి చనిపోగా మిగిలిన దేవతలు సేనయై నడువగా గట్టిగా అరుస్తూ గరుడ వాహనుడై కమలనాభుడు వాసుదేవుడు భయంకరంగా విహరిస్తూ లేడి కోపముగా పెద్దపులిని చేరిన విధముగా వీరభద్రునిపై తిరుగబడెను.

4-142-వ.
తత్సమయంబున.