పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : బ్రహ్మ వీరేశ్వరునకు రథము తెచ్చుట.

4-143-సీ.
లిత నానాయుధాలంకార మగుదాని
గోరాజుపడగచేఁ గొమరుదాని
నిలవేగములగు రులుగట్టినదాని
మరాద్రియునుబోలె మరుదాని
దినపబింబముభంగిఁ దేజరిల్లెడుదాని
హనీయ కాంచన ణులదాని
దుందుభి ఘంటికా తూర్య ధ్వనులదాని
దృగ్గోచరంబు నై తోఁచుదాని

4-143.1-తే.
నొక్కరథము శంభుఁ డుగ్రతఁ బుత్తేరఁ
ద్మభవుఁడువీరద్రుకడకుఁ
దెచ్చి కేలుమొగిచి తివిరి యిట్లని విన్న
వించె భక్తితోడ వెఱవుమెఱయ.

టీక :-
పడగ = ధ్వజము; కొమరు = అందమైన; అనిలుడు = వాయువు; హరులు = గుఱ్ఱములు; అమరాద్రి = మేరుపర్వతము; దినపతి = సూర్యుడు; కాంచనము = బంగారము; దుందుభి = భేరి; ఘంటిక = చిరుగంటలు; తూర్యము = వాద్యము; దృగ్గోచరము = కంటికి కనబడేలా; ఉగ్రత = తీవ్రత; పుత్తెంచు = పంపు; పద్మభవుడు = బ్రహ్మ; తివిరి = ప్రయత్నించి; వెఱవు = ఉపాయము.
భావము :-
శివుడు పంపగా బ్రహ్మ వీరభద్రుని వద్దకు యొక రథమును తెచ్చాడు. ఆరథము అనేక ఆయుధాలతో అలంకరించబడి అందమైన వృషధ్వజముతో వాయువేగముతో పరుగెత్తే గుర్రాలు కట్టబడి సూర్యకాంతిలా మెరుస్తూ బంగారము మణులు పొదిగిన భేరి చిరుగంటలు మొదలైన వాద్యముల సాధనాలతో ఒప్పారుతోంది. ఆ రథమును వీరభద్రునికిచ్చి, చేతులు ముడిచి నమస్కరించి పూని భక్తితో ఇలా విన్నవించాడు.

4-144-శా.
! వీరాగ్రణి! యాతపోవనములో నున్నాఁడు శంభుండు యా
దేవిం దాను సురవ్రజంబు గెలువన్ దేరిప్డు పుత్తెంచె రా
జీవాక్షుండును వీఁడె కయ్యమునకుం జేరెన్ రథారూఢుఁడై
వేవేగన్ రిపు గెల్తు గాక కడిమిం వీరప్రతాపాంబుధీ!

టీక :-
వ్రజము = సమూహము; తేరు = రథము; రిపు = శతృవు; కడిమి = పరాక్రమము.
భావము :-
"ఓ వీరాగ్రా! వీరభద్రుడా! ఆ తపోవనములో పార్వతీపరమేశ్వరులు ఉన్నారు. దేవతా సమూహములను గెలుచుటకు వారు ఈ రథము పంపించారు. విష్ణువు యుద్ధమునకు వస్తున్నాడు. ఈ రథమెక్కి తొందరగా నీ పరాక్రమంతో శత్రువుని జయించు.

4-145-ఉ.
రాధరుండు తొల్లి ద్రిపురంబులపైఁ జనునాఁడు వేదముల్
వాజిగణంబు లై పఱవ వారక రొప్పుటఁ జేసి దైత్యు ఘో
రాజిని గెల్చె నీశ్వరుఁడు మ్యత నీకును నేఁడు దేరికిన్
వాజులు రొప్పెడిం గడిమి వైరుల గెల్వుము వీరవారిధీ!

టీక :-
రాజధరుడు = చంద్రమౌళి; తొల్లి = పూర్వము; వాజి = గుఱ్ఱము; పఱవ = వేగము; వారక = ఎడతెగక; రొప్పుట = పరుగెట్టించుట; ఆజి = యుద్ధము.
భావము :-
పూర్వము శివుడు త్రిపురములపై దండెత్తినపుడు వేదములు గుర్రాలై వేగముగా ఎడతెగక పరుగెట్టించటం వలన ఆ ఘోరయుద్ధములో గెలిచాడు. వీరుడా! నేడు నీ రథమున యున్న గుర్రాలను పరుగెట్టించి పరాక్రమంతో శతృవులను గెలువు.

4-146-వ.
దేవా! యీ దివ్యరథారూఢుండ వై సమరకేళీవిహారంబు సలుపుదువు గాక” యని విన్నవించిన “నగుంగాక" యని యుదయ ధరణీధర శిఖరంబు ప్రవేశించు దినరాజు చందంబునఁ దన మనోరథంబునకుహితమైన దివ్యరథం బెక్కి యుక్కుమిగిలి గణయూథంబు లిరుగెలంకుల యందును నందందవీరభేరీ మృదంగ శంఖ కాహళ నిస్సాణాది వాద్యంబులు చెలంగ నిలింపశ్రేష్ఠుం డగుపరమేష్ఠి దనకు సారథియై చరియింప నకంపిత విక్రముం డై ప్రళయకాల భైరవుండునుం బోలెసింహనాదంబులు సేయుచు దేవగణంబుల మనంబులు వ్రయ్యలై పగులునట్లుగా శంఖంబు వూరించి కుంభినీధరంబుపైఁ గవయు దంభోళిధరుని చందంబై పురందర గోవిందాదులం గదిసి వీరభద్రేశ్వరుండు.

టీక :-
ఉక్కుమిగులు = అతిశయించు; కెలంకు = ప్రక్క; కాహళము = బాకా ఊదెడు కొమ్ము; నిస్సాణము = పెద్ద జంట తబలా; నిలింప = దేవత; పరమేష్ఠి = బ్రహ్మదేవుడు; వ్రయ్య = ముక్క; కుంభిని = భూమి; దంభోళి = వజ్రాయుధము; పురందరుడు = ఇంద్రుడు; గోవిందుడు = విష్ణువు.
భావము :-
“దేవా! ఈ దివ్యరథమెక్కి యుద్ధముచేయుము" యని బ్రహ్మదేవుడు చెప్పగా వీరభద్రుడు సరేనని ఉదయ పర్వతం పైన ప్రవేశించే సూర్యునిలా తన మనసుకు నచ్చిన ఆ దివ్య రథాన్ని ఎక్కి బయలుదేరాడు. గణయూథములు ఇరు ప్రక్కలా అతిశయించి నడువసాగారు. వీర భేరీ మృదంగ శంఖ కాహళ నిస్సాణము మొదలైన వాద్యములు మ్రోగుతున్నాయి. బ్రహ్మదేవుడు సారధియై రథం నడుపుతున్నాడు. అలా బయలుదేరి, వీరభద్రుడు ప్రళయకాల భైరవుని వలె సింహనాదము చేస్తూ దేవతల గుండెలుపగిలేలా శంఖము పూరించి పర్వతాలపై పరాక్రమించే ఇంద్రునిలా, దేవేంద్ర విష్ణువాదులను యుద్ధమున తాకేడు.

4-147-ఉ.
న్ననిలోనఁ దాఁకి ఘన దారుణబాణము వేయు వెన్నునిం
న్నుల నిప్పు లొల్కఁ గని ర్జితసింహకరాళమూర్తి యై
యెన్నఁగ నొక్కవింట వడి నెక్కడి టంకృతి చేసి బాణముల్
న్నగశాయిపైఁ బఱపె భాసుర సంగరకేళి నొప్పుచున్.

టీక :-
అని = యుద్ధము; కరాళ = భయంకరమైన; టంకృతి = వింటినారి యొక్క ధ్వని; భాసురము = ప్రకాశించునది.
భావము :-
తనను యుద్ధములో ఎదుర్కొని గొప్ప దారుణమైన బాణము వేయుచున్న విష్ణువును చూసి కళ్ళు నిప్పుల్ని రాలుస్తుండగా భయంకరంగా సింహము వలె గర్జిస్తూ విల్లు పట్టి వేగముగా నారి సారించి విష్ణువుపై బాణాలు వేస్తూ యుద్ధక్రీడ ప్రారంభించాడు.

4-148-ఉ.
గ్రక్కున విష్ణుఁడుం గదిసి య్యమునన్ వెనువెంట నార్చుచున్
బెక్కుశరావళుల్ దొడిఁగి బింకముతో గణనాథు నేనెఁ బెం
వెక్కి గణాధినాయకుఁడు నేసెను వెన్నుని నంత లోపలన్
జిక్కిన లావుతో మెఱసి శ్రీపతి నేసిన నేనె వెండియున్.

టీక :-
కదిసి = సమీపించి; బింకము = ధైర్యము; లావు = సామర్ధ్యము; వెండియు = మరియు.
భావము :-
వెంటనే మొదలైన ఆ యుద్ధములో, విష్ణువు ఒకగానివెంట మరొకటిగా చాలా బాణములు వేసాడు. వీరభద్రుడు కూడా ధైర్యముగా వెన్నునిపై బాణములు వేసెను. అంతలో మరలా శ్రీపతి వేసెను. భద్రుడుకూడా వేసెను..

4-149-మ.
రిమున్నేసిన కోపమంది వితతాహంకారుఁ డై బాణముల్
పొరిసంధించి లలాట మేనె నతనిన్ పుంఖానుపుంఖంబులై
దొరఁగన్ దీవ్రత నేనె నేనె హరియుందోర్దండ శౌర్యోన్నతిన్
బెయన్ భద్రుభుజంబు బాణమున నొప్పించెం సురల్ పొంగఁగన్.

టీక :-
మున్ను = ముందు; వితత = విస్తరించబడిన; పొరి = మళ్ళీ; లలాటము = నొసలు; తొరగు = విడుచు.
భావము :-
హరి ముందుగా బాణం వేయడంతో కోపం వచ్చి భద్రుడు చాలా గర్వముతో మరలా సంధించి బాణములు హరి లలాటం పైకి వేసాడు. దానితో హరి శౌర్యంతో భద్రుని భుజాలకు నొప్పి కలిగేలా తీవ్రంగా బాణాలు వేయడంతో దేవతలు ఆనందించారు.

4-150-వ.
అంత.

4-151-క.
వీరావేశముతోడను
బోరున రుద్రుండు విష్ణు భుజములు గాఁడన్
ఘోశరంబులఁ బఱపిన
బీరంబులు మాని దేవ బృందము స్రుక్కెన్.

టీక :-
బోరున = శీఘ్రముగా; గాడ = అక్కడ; పఱపు = బాణము ప్రయోగించు; బీరములు = డంబము, బిగువు, అహంకారములు; స్రుక్కు = భయపడు.
భావము :-
చాలా కోపముతో వెంటనే రుద్రుడు విష్ణువు భుజములపైకి బాణములు ప్రయోగించగా అహంకారము తగ్గి దేవతలు భయపడ్డారు.

4-152-వ.
మఱియు నయ్యవసరంబున జగంబులఁ బెన్నుద్దులైన బలుమింటి జోదు లిద్దరు నొండొరులంగైకొనక గెలుపు తలంపులు గైకొని మదంబునఁ దమతమ లాఘవంబుల మెచ్చక మత్సరంబులురెట్టించి బెట్టిదంబు లగు పంతంబులు పలుకుచు; నగణితగుణఘోషంబుల దిగంతరాళంబులు దిగులు కొలుపుచు గుడుసువడి యుండఁ; గోదండంబులఁ దెగటార్చుచు సుర సిద్ధ సాధ్యసంఘాతంబులకు భయంబు బుట్టించుచు; మహితమార్గంబు నిండ నభోమండలంబున మంట లెగయించుచు మర్మంబులు గాఁడిపార ననేకదివ్యబాణంబులు పఱపుచు సంహరించుచు నన్యోన్య శరీరజాలంబులు తుత్తుమురు సేయుచు నిప్పునిప్పును గరిఁగరియును ధరణిధరణియును మహార్ణవము మహార్ణవంబును గిరీంద్రము గిరీంద్రంబును బ్రహ్మాండము బ్రహ్మాండంబునుం దాఁకి తనివిచనక పోరాడు చందంబున సములై యసమాన రణవిహారంబులు సలుపుచు; కాలసర్పంబులుం బోలె మ్రోగుచు, కంఠీరవంబులుం బోలె గర్జించుచు, జలధరంబులుంబోలె శరజాలంబుల భూమండలంబుఁ గప్పుచు, కాలరుద్రులుంబోలె నడరుచు; ధారధరంబులుంబోలెఁ గప్పుచుఁ; దారౌటఁ దెలుపుచుఁ; బరస్పరభల్లభగ్నాంగు లై మూర్ఛిల్గుచుఁ; దెలియుచు; సింహనాదంబులు సేయుచు; బిట్టల్కనట్టహాసంబు సేయుచు; నార్చుచు; నిజపాయకంబుల నభోభాగ భూభాగంబులు వెల్లివిఱియించుచు; నజాండభరితంబు లగు హుంకారంబు లొనరించుచుఁ; దుహిన దహన వరుణాంధకార గంధవాహంబు లనంగల ఘోరశరంబులు ప్రయోగించుచు; నిరువురుఁ గరలాఘవంబులఁ బరిభ్రమించుచుఁ; బుంఖానుపుంఖంబుగా వేయుచు నదల్చుచు; నతిభయంకరంబుగా సంగరంబు సేయుచుండి రయ్యవసరంబున.

టీక :-
పెన్నుద్ది = పెద్ద ఆటగాడు; లాఘవము = బాగు; మత్సరము = క్రోధము; బెట్టిదము = బింకము; గుడుసువడు = కలగబాఱు; కోదండము = విల్లు; మహిత = గొప్ప; గాడికట్టు = పాదుకొను; తుత్తుమురు = పొడిపొడి; కరి = ఏనుగు; అడరు = అతిశయించు; ధారాధరము = మేఘము; భల్ల = బల్లెము; బిట్టు = అధికమైన; ఆర్పు = అఱచు; సాయకము = బాణము; తుహిన = మంచు.
భావము :-
ఇంకనూ ఆ సమయంలో జగములో మహాపెద్ద ఆటగాళ్ళ వలె ఆ గొప్ప యోథులిద్దరూ ఇతరములేమీ పట్టించుకోక గెలుపు తలంపుతో గర్వముతో ఎదుటువారి బాగులు మెచ్చక క్రోథము రెట్టింపై బింకముగా పంతాలు పలుచూ యుద్దం తాయసాగారు. లెక్కింపలేనన్ని బాణ ధ్వనులతో దిక్కులన్నీ దిగులు పడి కలతచెందసాగాయి. దేవతల సిద్ధుల సాధ్యుల సమూహాలకు భయం పుట్టిస్తూ బాణములతో సంహారం చేస్తూయున్నారు. మహాకాశమంతా నిండా మంటలు ఎగజిమ్ముతున్నాయి, అనేక దివ్యమైన బాణములు వేస్తూ; సంహారం చేస్తూ; ఒకరికొకరు శరీరములను పొడిపొడి చేయుచు; నిప్పు నిప్పుతో, పర్వతము పర్వతముతో, బ్రహ్మాండము బ్రహ్మాండముతో, తాకి తనివి తీరక పోరాడుతున్న విధముగా, సమానులై సాటిలేని రణవిహారం చేయుచు; కాలసర్పములవలె బుసకొడుతూ; సింహములవలె గర్జిస్తూ; మేఘములవలె బాణములతో భూమండలాన్ని కప్పుతూ; కాలరుద్రులవలె అతిశయిస్తూ; ఒకరినొకరు బల్లెములతో గాయపరచుకుంటూ; మూర్ఛిల్లుతూ; తెలివి తెచ్చుకుంటూ; సింహనాదాలు చేస్తూ; గట్టిగా అట్టహాసంగా నవ్వుతూ; అణచివేస్తూ; తమ బాణములతో భూమ్యాకాశాలు నింపుతూ; అజాండములకు ప్రతిధ్వనించేలా హూంకరిస్తూ; హిమ, అగ్ని, వరుణ,తామిశ్ర, అనల, వాయ్వాది ఘోరమైన అస్త్రములను ప్రయోగిస్తున్నారు. ఈ విధంగా ఒకరినొకరు వారివారి నేర్పులతో నిరంతరంగా బాణాలు వేస్తూ అతి భయంకరంగా యుద్ధం చేస్తున్న సమయంలో.

4-153.క.
లినంపకయ్య మప్పుడు
సొయక బలుమేటివింటి జోదులు వెలుచన్
లుపఁగ నెచ్చెలువమునకు
వెయగఁ బెల్లార్చిరపుడు వేలుపు లెల్లన్.

టీక :-
నలి = అత్యంతమైన; అంపకయ్యము = బాణయుద్ధము; వెలుచు = నడపు; చెలువము = విధము; పెల్లు = అధికము; ఆర్చు = అరచు.
భావము :-
వింటి జోదులు అప్పుడు చేస్తున్నబాణయుద్ధమునందు సోలిపోక యుద్ధము చేయడం చూసి ఆ తీవ్రతకు దేవతలంతా గట్టిగా బొబ్బలు పెట్టారు.

4-154-క.
దేత లార్పులు పొడఁగని
వావిరిఁ గోపించి కడఁగి వాఁడిశరంబుల్
వేవేగ భద్రుఁ డేసిన
నావిష్ణుని యురము గాఁడి వనిం బడియెన్.

టీక :-
ఆర్పులు = అరుపులు; పొడగని = చూసి; వావిరి = అధికముగా; కడగు = ప్రయత్నించి; ఉరము = రొమ్ము; అవని = భూమి.
భావము :-
దేవతల కేకలు విని చాలా కోపముతో వాడియైన బాణములు వెంటవెంటనే భద్రుడు వేయడంతో విష్ణువు వక్షస్థలానికి తాకి అతను నేలపై పడెను.

4-155-మ.
డియున్ వేగమె తేరి శౌరి పఱుపన్ బాణంబు లెన్నేనియున్
డుమం ద్రుంచె గణాధిపుండు కడఁక న్నారాయణాస్త్రంబుఁ దాఁ
డిమిన్ మాధవుఁ డేసె నేయుటయు వేగన్ వీరభద్రాస్త్రమున్
వెలించెన్ వడిఁ ద్రుంచి వైచెఁ బొడిగా వీరుండు దద్బాణమున్.

టీక :-
తేరి = తేరుకుని; కడిమి = పరాక్రమము.
భావము :-
పడిన వెంటనే విష్ణువు తేరుకొని చాలా బాణములు భద్రునిపై వేయగా గణాధిపుడు వాటిని మధ్యలోనే త్రుంచివేసెను. పరాక్రమంతో మాథవుడు నారాయణాస్త్రం వేయగా ఆ బాణమును వీరభద్రుడు వీరభద్రాస్త్రంతో వేగముగా త్రుంచివేసెను.

4-156-మ.
ఱియుం భద్రుఁడు తీవ్రబాణతతులన్ మానాథుకోదండమున్
విఱిచన్ దార్క్ష్యుని ఱెక్కలన్ దునిమినన్ విష్ణుండు రోషించి య
త్తఱి నత్యుగ్రుల శంఖచక్రధరులన్ ర్పాఢ్యులన్ వీఁకఁ గొం
ఱఁబుట్టించె దహించె వారి శిఖనేత్రజ్వాలలన్ భద్రుఁడున్.

టీక :-
తతి = సమూహము; కోదండము = విల్లు; తార్క్షుడు = గరుడుడు; తునుము = ఖండించు; అత్తఱి = ఆ సమయము; వీక = పరాక్రమము; శిఖ = అగ్ని.
భావము :-
ఇంకనూ భద్రుడు తీవ్రమైన బాణసమూహాలచే కోదండమనే హరి విల్లు విరిచి గరుడుడి ఱెక్కలను ఖండించగా విష్ణవు కోపముతో ఆ సమయంలో అతి భయంకరమైన శంఖచక్రధరులై గర్వము పరాక్రమము కల కొందరిని పుట్టించగా వీరభద్రుడు తన అగ్ని నేత్రంతో వారిని కాల్చివేసాడు.

4-157-వ.
అయ్యవసరంబున.

4-158-క.
వమున నిజచక్రము
బాహాటోపమున భద్రు పై నటువైవన్
సాసమున భద్రుండును
హాయెట వైచె దింక నవుడు భీతిన్.

టీక :-
ఆహవము = యుద్దము; ఆటోపము = తొందర; అనవుడు = అనగా.
భావము :-
ఆ యుద్దములో బాహుదర్పముతో విష్ణువు భద్రునిపై తన చక్రాయుధము ప్రయోగించబోగా భద్రుడు ధైర్యంగా "ఆహా! ఇంకెక్కడ వేస్తావులే." అనగా భయంతో.

4-159-ఉ.
పున నేయఁగా వెఱచి యెత్తిన చక్రముతోడభీతి ల
క్ష్మీతి సింహమున్గదిసి చిక్కిన యేనుఁగుఁ బోలె నేలపైఁ
జూపులు చేర్చి చేడ్పడినఁ జూచి దిగీంద్రులు డాయకుండఁగాఁ
గోము నొంది భద్రుఁడును క్రూర శరంబుల నేసె నుగ్రుఁడై.

టీక :-
ఏపు = అతిశయము; కదియు = చేరు; చేడ్పడు = బాధపడు; దిగీంద్రులు = దిక్పతులు; డాయు = సమీపించు.
భావము :-
అతిశయంగా చక్రప్రయోగం చేద్దామని చెయ్యెత్తి కూడా భయముతో హరి సింహమునకు చిక్కిన ఏనుగు వలె నేల చూపులు చూస్తూ భయపడుచుండెను. అది చూసి దిక్పతులు సమీపించబోగా భద్రుడు తీవ్రమైన బాణాలతో వారిని అడ్డుకున్నాడు.

4-160-వ.
మఱియు నయ్యవసరంబున నిర్వికారనిశ్చేతనుండై విరథుండై యున్న మాధవుం జూచి యవ్వీరుండు తన బాణజాలంబుల నతిని ప్రాణంబులు గొన సమకట్టి, యీశ్వరప్రియుం డని మనంబునం దలంచి, ప్రమథగణంబులచేత నచ్చక్రంబు నులిమి తెప్పించి తదనంతరంబ.

టీక :-
నిర్వికారము = మార్పు లేని; నిశ్చేతనము = చలనము లేని.
భావము :-
ఇంకనూ ఆ సమయంలో చేష్టలుడిగి విరథుడై యున్న మాధవుని చూసి ఆ వీరుడు బాణములతో చంపాలనుకొని మనసులో ఇతనీశ్వర ప్రియుడుగదా అని తలచి వదలిపెట్టాడు. ప్రమథగణములచే ఆ చక్రాన్ని ఒలిపించి తెప్పించాడు. అటు పిమ్మట.