పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : తారకుడు దండై పోవుట

శ్రీరామ

వీరభద్ర విజయము
ద్వితీయాశ్వాసము

తారకుడు దండై పోవుట

2-1-క.
శ్రీ కైలాస నగేంద్ర
ప్రాటసానుప్రదేశ హువనరాజీ
వారగంధ సమేత
శ్రీరవిభవాభిరామ! శ్రీగిరిధామా!

టీక :-
ప్రాకటము = ప్రసిద్ధము; సానువు = కొండనెత్తము (విశాల సమ ప్రదేశము); రాజీవాకరము= సరోవరము; శ్రీకరము = శుభప్రదమైన; విభవము =ఐశ్వర్యము; అభిరామ= మనోహరమైన; ధామా = నివాసముగా గలవాడా.
భావము :-
శ్రీ కైలాస పర్వతశ్రేష్ఠము సానువుల పై గల అనేక వనములు మఱియు తామరకొలనుల సువాసనలతో కూడిన శుభప్రదమైన వైభవముతో మనోహరమైనవాడా! శ్రీశైలవాసా! శివా!

2-2-వ.
పరమఙ్ఞానభావుం డగు వాయుదేవుం డ మ్మహామునుల కిట్లనియె.

టీక :-
భావుడు= విద్వాంసుడు.
భావము :-
పరమ జ్ఞానమూర్తి యైన వాయుదేవుడు ఆ మహామునులతో ఇలా అన్నాడు.

2-3-మ.
ణన్ ఘోరతపంబు చేసి చెలువారం బ్రహ్మ మెప్పించి లో
ము లెల్లం బరిమార్చి నట్టి వెఱపుం ర్పంబుఁ దేజంబు వి
క్రసైన్యంబును లక్ష్మియుం బడసి సంగ్రామంబులోఁ దారకుం
రేంద్రాదులు గెల్చి వత్తు నని దండై పోయె నత్యుగ్రుఁడై

టీక :-
రమణన్ = ప్రీతితో; చెలువాఱు= ఒప్పు; పరిమార్చు= చంపు; వెఱపు= భీతి; దర్పము = గర్వము; విక్రమము = పరాక్రమవంతము; దండైపోవు = దండెత్తిపోవు; ఉగ్రుడు = భయంకరుడు.
భావము :-
తారకుడు ప్రీతితో ఘోరతపస్సు చేసి బ్రహ్మను ఒప్పించి, మెప్పించి జగాలన్నింటిని నాశనం చేయు భీకరము, గర్వము, తేజస్సు, పరాక్రమవంతమైన సైన్యమును, సంపదలను పొందాడు తారకుడు ఇంద్రుడు మొదలైనవారిని గెలుచుటకు భయంకరుడై దండెత్తి వెళ్ళెను.

2-4-వ.
ఇట్లు పోయి.
భావము :-
అలా వెళ్ళి.

2-5-సీ.
లంబులో నింద్రు నాలంబుగావించి
హ్నికిఁ దన కోపహ్ని చూపి
యంతకుఁనకు దాను నంతకమూర్తి యై
సురకు నసుర యై లవు మెఱసి
నీరధీశ్వరు పెంపు నీఱుగా నలయించి
గాలి బలం బెల్లఁ గాలిచేసి
నెఱయంగ ధననాథు నిర్ధనుఁ గావించి
రుని బలం బెల్ల తముఁ జేసి

2-5.1-తే.
మర గంధర్వ యక్ష రాక్షస పిశాచ
రుడ పన్నగ మానవ గ్రహ మునీంద్ర
యము నెల్లను బలుమాఱు చంపి శౌర్య
భాసురుం డగు నత్తారకాసురుండు.

టీక :-
ఆలము = యుద్ధము; ఆలముకావించు = ఆగడముచేయు; వహ్ని= అగ్ని; అంతకుడు = యముడు; అంతకమూర్తి= మరణరూపుడు; అసురుడు = నైఱుతి; అసురుడు = రాక్షసుడు; అలవు = బలము; నీరధీశ్వరుడు = వరుణుడు; నీఱుగాన్ = నీరగునట్లు, నశించునట్లు; అలయించు = శ్రమపెట్టు, ఆయాసపెట్టు; గాలి= వాయుదేవుడు; గాలిచేయు = నిందించు; నెఱయు = వ్యాపించు; ధననాథుడు = కుబేరుడు; హరుడు = ఈశానుడు; హతముచేయు = పోగొట్టు ; చయము = సముదాయము; శౌర్యభాసురుడు= శూరుడు.
భావము :-
తారకుడు యుద్ధములో ఇంద్రుని అల్లరిపట్టించాడు. అగ్నికి తన రోషాగ్నిని చూపాడు. యమునికి తాను యముడయ్యాడు. నైఋతికి తాను రాక్షసుడయ్యాడు. వరుణుని బలమును నీరుగార్చాడు. వాయుదేవుని మొత్తం బలాన్ని గేలిచేసాడు. కుబేరుని నిరుపేదగా చేశాడు. ఈశానుడి బలాన్ని నశింపచేశాడు. అలా సూర్యసమ శౌర్యవంతుడై తారకాసురుడు దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, గరుడులు, సర్పములు, మానవులు, గ్రహములు, మునీంద్రుల సమూహాలను అనేకమమార్లు సంహరించాడు.

2-6-చ.
తమ రాజ్య సంపదలు ద్దయుఁ జేకొని పోక వెండియున్
ముఁ బలుమాఱుఁ దారకుఁడు ల్లడపెట్టిన నింద్రుఁ డాదిగా
రులు లోకపాలురును నాపదఁ బొంది కలంగి బ్రహ్మలో
మునకుఁ బోయి పద్మభవుఁ గాంచి ప్రణామము లాచరించుచున్.

టీక :-
తద్దయు = మిక్కిలి; వెండియున్ = మఱియు, ఇంకా; తల్లడపెట్టు = బాధించు; లోకపాలురు= దిక్పాలురు ; కలంగి = కలతపడు.
భావము :-
తారకాసురుడు వారందరి రాజ్యసంపదలన్నీ తీసుకుపోయి అంతతో వదిలిపెట్టక, మరల మరల చాలాసార్లు వారిని బాధించసాగాడు. దానితో ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు కలతపడి, బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుడిని దర్శించి నమస్కరిస్తూ.....