పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : శంకరుఁడు వెలఁది యై శీతాచలంబునకు వచ్చుట

2-166-ఆ.
గౌరిమీఁదఁ బ్రేమ డు నంకురింపంగ
మ్మదంబుతోడ సంభ్రమించి
ద్రిరాజువీటి రుగుదునో యని
లఁచె దృఢముగాఁగ లహరుండు.

టీక :-
సమ్మదము = సంతోషము; సంభ్రమము = వేగిరపాటు; వీడు = పట్టణము; మలహరుడు= శివుడు.
భావము :-
శివుడు, గౌరిమీద ప్రేమ మొలకెత్తి చిగుర్లుతొడగగా సంతోషంతో వేగిరపడి, పర్వతరాజు పురమునకు వెళ్ళెదను యని నిర్ణయించుకున్నాడు.

2-167-వ.
ఇట్లు తలంచి.

టీక :-
తలచు = భావించు.
భావము :-
ఇలా ఆలోచించి.

2-168-క.
ఏ వెంట నరుగవచ్చును
యే వెంట లతాంగిఁ జూతు నిందువదనతో
నేవెంట మాటలాడుదు
నే వెంట మృగాక్షిఁ గదియ నెంతయు నొప్పున్.

టీక :-
వెంట = విధము; కదియు = చేరు; ఒప్పు = తగు.
భావము :-
ఏ విధంగా వెళ్ళను? ఏ విధంగా సన్నని చిన్నదైన ఆ గౌరీదేవిని చూడాలి? ఆ చంద్రముఖితో ఎలా మాట్లాడాలి ? ఏవిధంగా ఆ సుందరాక్షి దరిచేరితే బాగుంటుంది?

2-169-వ.
అని విచారించి.

టీక :-
విచారించు = ఆలోచించు.
భావము :-
అని రకరకాలుగా ఆలోచించి.....

2-170-సీ.
కాకోదరాధీశ కంకణంబులు దాఁచి;
శంఖకంకణములు చాలఁ దొడిగి;
సామజదనుజేంద్ర ర్మాంబరము దాఁచి;
మనీయ కనకాంబమును గట్టి;
గంగానిశానాధ లితజూటము దాఁచి;
కుఱువెండ్రుకలుగల కొప్పువెట్టి;
పావకరాజిత ఫాలభాగము దాఁచి;
తిలకంబుతో ఫాల మలరుఁ జేసి;

2-170.1-ఆ.
భూతి దాఁచి పసపు పూసి త్రిశూల హ
స్తంబు దాఁచి చేత జ్జ యమర
వెలఁదిమేనఁ గల్గు వీరుఁడు వెలఁదియై
యెఱుక యెఱుక యనుచు నేఁగుదెంచె.

టీక :-
కాకోదరము = సర్పము; సామజము = ఏనుగు; కనకాంబరము = పట్టు వస్త్రము; కుఱు = చిన్న; పావక = అగ్ని; భూతి = బూడిద; సజ్జ = బుట్ట; వెలది = స్త్రీ.
భావము :-
సర్పరాజ కంకణములు దాచి శంఖ కంకణములు చాలా తొడిగాడు; గజ చర్మాన్ని దాచి పట్టుబట్ట కట్టాడు; గంగ - చంద్రుడు యుండే జటాజూటాన్ని దాచి చిన్న వెంట్రుకలతో కొప్పు పెట్టాడు; అగ్నితో ప్రకాశించే నుదుటిని దాచి తిలకముతో అలంకరించాడు; బూడిదను దాచి పసుసు పూసాడు; త్రిశూలాన్ని దాచి ఆ చేతితో బుట్ట పట్టుకున్నాడు. అర్థనారీశ్వరుడు అయిన ఆ పరమశివుడు పూర్తి స్త్రీగా మారి (ఎఱుకలసాని) ఎఱుక ఎఱుక అంటూ బయలుదేరాడు.

2-171-వ.
మఱియను.
భావము :-
ఇంకనూ….

2-172-సీ.
డునొప్పు దిశలెల్ల నకంబు గావించు;
తాటంకరోచులు నరుచుండ
నుదోయిపైఁ గ్రాలు శంఖహారావళి;
య్యెదలోపల యలు దూఁగ
సందిట నిఱికిన జ్జయ రమ్యమై;
త్నపేటికభంగి మణ మెఱయ
న్నువయగు మధ్య ల్లలనాడంగ;
డుగిడ యానంబు డబడంగ

2-172.1-ఆ.
చిలుకపలుకు లొప్ప సేసముత్యము లొప్ప
తివరూపు దనకు చ్చుపడఁగ
మంచుకొండపురికి లహరుఁ డేతెంచె
నింతులార యెఱుక యెఱుక” యనుచు.

టీక :-
తాటంకరోచులు = చెవు కమ్మల ప్రకాశము; తనరు = అతిశయించు; క్రాలు = అల్లలాడు; సందు = చంక సందు; పేటిక = పెట్టె; రమణ = ఒప్పిదము; అన్నువ = సన్నని; యానము = నడక; సేస = పాపిట; అచ్చు= ప్రతిబింబం.
భావము :-
చక్కగా దిక్కులన్నింటినీ బంగారుమయం చేస్తూ చెవి కమ్మల ప్రకాశం అతిశయించగా, వక్షములపై ఊగే శంఖ హారములు పైటలోనుండి బయటకు కనిపిస్తుండగా, చంకలో ఇరికించిన బుట్ట అందముగా రత్నాల భరిణలా ఒప్పి మెరయుచుండగా, సన్నని నడుము అల్లల్లాడుతూ ఊగుతుండగా, నడుస్తుంటే తడబడుచుండగా, చిలుక పలుకులతో, పాపిట ముత్యాలతో, స్త్రీ రూపానికి ప్రతిబింబంగా హిమవంతుని పురమునకు శివుడు “పడతుతులారా! ఎఱుక ఎఱుక” అంటూ హిమవంచుని పురమునకు వచ్చెను.

2-173-వ.
ఇట్లు మాయావేషధారియై హిమవంతుఁబట్టణంబున కరుగుదెంచి యందు.

టీక :-
అరుగుదెంచు = వచ్చి.
భావము :-
ఈ విధంగా మారువేషంలో హిమవంతుని పట్టణమునకు వచ్చి, అక్కడ..

2-174-క.
హిలో జనములు వొగడఁగ
హువిధముల నెఱుకచెప్పి ప్రౌఢతనమునం
దుహినగిరి కరిగి చేరువ
విహితంబుగనెఱుకయనుచు వెలఁదిచెలంగెన్.

టీక :-
మహి = లోకము; ప్రౌఢతనము = నేర్పరితనము; తుహిన = మంచు; విహితము = తగిన; వెలది = స్త్రీ; చెలంగు = మసలు.
భావము :-
ఆ స్త్రీ లోకంలోని ప్రజలందరూ పొగడేలా నేర్పరితనంతో రకరకములుగా ఎఱుక చెప్పి, మంచుకొండ వద్దకు చేరి చక్కగా “ఎఱుక, ఎఱుక” యంటూ తిరుగసాగెను.

2-175-ఉ.
చంలనేత్రి గౌరి యొకసౌధముపై చెలిఁగూడి తా వినో
దించుచు నయ్యెలుంగు విని తేటపడంగ సఖీలలామతోఁ
బంశరారిఁ గూడఁగను భాగ్యము నాకు లభించునట్లుగా
వించునొ చూత మీ యెఱుకవల్లభ నే నడుగంగఁబోలునే.

టీక :-
చంచలనేత్రి = చలించే కన్నులు కలది; సౌధము = రాచగృహము, మేడ; ఎలుగు = కంఠధ్వని; తేటపడు = విశదమగు, చక్కగాతెలియు; పంచశరారి = శివుడు.
భావము :-
చంచలనేత్రి యైన గౌరీదేవి ఒక మేడమీద స్నేహితులతో కలసి వినోదిస్తూ ఆ కేక విని విశదపడగా స్నేహితులతో “శివుని కలిసే యదృష్టం నాకుందేమో ఈ ఎఱుకను అడగనా” యన్నది.

2-176-వ.
అని విచారించి.

టీక :-
విచారించు = ఆలోచించు.
భావము :-
అని ఆలోచించి.

2-177-ఉ.
మ్మదముం గుతూహలము సంభ్రమముం జనియింప నవ్వినో
మ్ములు గౌరి మాని యొక న్వి కరాబ్జమువట్టి తద్గవా
క్షమ్ములవెంటఁ జూచి రభసంబునఁ జేరువ రాజవీధులం
గ్రుమ్మరు ప్రౌఢ నా యెఱుకఁ గోరికఁ గన్గొనియెన్ లతాంగిదాన్.

టీక :-
సమ్మదము = సంతోషము; కుతూహలము = ఆసక్తి; సంభ్రమము = ఆశ్చర్యము; తన్వి = స్త్రీ; కరాబ్జము = పద్మము వంటి చేయి; గవాక్షము = కిటికీ; రభసము = వేగము; క్రుమ్మరు = సంచరించు.
భావము :-
సంతోషము, ఉత్సాహము, ఆశ్చర్యము కలుగగా యా వినోదములు మాని, గౌరి యొక చెలి చేతులు పట్టి కిటికీలనుండి రాజవీధుల సమీపంలో సంచరించే ఆ ప్రౌఢ యెఱుకను తొందరతొందరతో కోరికతో చూసెను.

2-178-వ.
అట్లు గాంచి.

టీక :-
కాంచి = చూసి.
భావము :-
అలా చూసి.....

2-179-ఉ.
 ముఖపంకజంబురుచు లీ నయనోత్పలపత్రనిర్మలం
బీ మెయిచాయ లీ నగవు లీ మురుపెంబులు నీ విలాసమున్
గామినులార! యెందు మఱిల్గఁగ నేర్చునె తొల్లి బాపురే!
సాజయాన యీ యెఱుకసానికిఁ దాఁ జెలుఁవింత యొప్పునే.

టీక :-
రుచిలు = కాంతులు; ఉత్పలపత్రము = కలువఱేకు; తొల్లి = పూర్వము; బాపురే = బళీ; సామజయాన = ఏనుగు వలె అందముగా నడచు యామె; చెలువు = అందము.
భావము :-
ఎఱుకలసానికా ఈ ముఖపద్మపు కాంతులు, ఈ కలువఱేకులవంటి నిర్మలత్వం గల కళ్ళు, ఈ శరీర కాంతి, ఈ నవ్వులు, ఈ మురిపెములు, ఈ విలాసములు కామినులారా! ఇంతకుముందు మరెక్కడైనా చూసామా? బలే! ఎంత చక్కటి గజయాన. ఈ ఎఱుకలసానికి ఇంత సొగసు తగునా?

2-180-క.
పిలువుఁడు ప్రౌఢ నిచటికిన్
 సందేహముల నడుగఁగావలయు వెసన్
లుగుట లేకుండుట నీ
వెలఁది గదా మన తలంపు వివరము సేయన్.

టీక :-
వెసనే = వేగమే.
భావము :-
తొందరగా పిలవండి ప్రౌఢనిక్కడికి అన్న సందేహాలూ అడగాలి. ఈమె మన మనసులో యున్నది (పరమశివుడిని కలియుట) తొందరలో జరుగుతుందో లేదో వివరిస్తుంది.

2-181-వ.
అని మఱియు నిట్లనియె.
భావము :-
ఇలా ఎఱుకసానిని పిలవమంటూ గౌరీదేవి ఇంకా ఇలా అంది.

2-182-క.
“వాలాయము పిలిపింపుఁడు
నీలాలకలార! రండు నేరుపుతోడన్
శైలేంద్రుఁ డెఱుఁగకుండగ
నీ లనామణిని గొనుచు నిచటికి వేగన్.”

టీక :-
వాలాయము = అనివార్యము, అవశ్యము; నీలాల+అలక = నల్లనిముంగురుల యువతి; శైలేంద్రుడు = పర్వతరాజు.
భావము :-
“నల్లని కురులుగల చక్కని చెలులారా! అవశ్యము పిలిపించండి. రండి. పర్వతరాజుకు తెలియకుండా నేర్పుగా ఈ చక్కటి ఎఱుకలసానిని ఇక్కడికి వేగముగా తీసుకొని రండి. “

2-183-చ.
వుఁడు నెందఱేని గమలాక్షులు వేగమపోయి వీధికిన్
ని “గిరిజాత యో యెఱుకసాని! నినుం బిలువంగఁ బంచె. వే
నివిను!” మన్నసందియము ల్కుచు నేఁగిన గౌరిపంపునన్
గొకొని కన్యకామణులు గొందఱు డగ్గఱనేఁగి యిట్లనున్.

టీక :-
అనవుడున్ = అనగానే; చని = వెళ్ళి; గిరిజాత = పార్వతి; వేన్ = వెంటనే; పనివిను = కొద్దివారు గొప్పవారితో వచ్చెదను పోయెదను అనుట; గొనకొను= ప్రయత్నించు; డగ్గర= సమీపము.
భావము :-
అనగానే కమలాక్షులు కొందరు వేగముగా పోయి వీధిలోనికి వెళ్ళి “ఓ! ఎఱుకలసానీ! పర్వతరాజ కుమార్తె మిమ్మల్ని పిలవమని ఆజ్ఞాపించెను, తొందరగా రండి” అనగా “ఏమి పనో చెప్పండి?” అంటూ సందేహంగా అడుగుతూనే వెళ్ళిపోతుంటే, పంపినది గౌరి కావున కొందరు కన్యకామణులు పూని దగ్గరగా చేరి ఇలా అంటున్నారు.

2-184-మత్త.
 పోయెదు నిల్వవో! ధరణీధ్రకన్యక పిల్వఁగాఁ
బోలునే? యిటు ద్రోచిపోవఁగ. బోకు మొక్కటి చెప్పెదన్
చాలు నంతయు నీవుకోరిన సంపదన్గ గరుణించు నీ
కాలు నొవ్వఁగఁ బ్రోలిలోఁ దిరుగంగ నేటికిఁ జెప్పుమా?

టీక :-
ధరణీధ్రము = కొండ; ప్రోలు = పట్టణము.
భావము :-
“ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆగు! పర్వత రాజ కుమార్తె పిలిస్తే ఇలా కాదని వెళ్ళిపోవచ్చునా? వెళ్ళిపోకు. ఒకటి చెప్తాను విను. చాలినంత, నీవు కోరినంత సంపదను రాకుమారి ఇస్తుంది. నీ కాళ్ళు నొప్పి పుట్టేలా పట్టణంమంతా తిరగడమెందుకు చెప్పు?” అన్నారు చెలులు.

2-185-వ.
అనవుడు నక్కపట గామిని యిట్లనియె.

టీక :-
కపటము = మాయ; కామిని = ఆడుది.
భావము :-
చెలికచ్చెలు అలా అనగా విని ఆ మాయా ఎఱుకలసాని ఇలా అన్నది.

2-186-ఉ.
రాగృహాంతరంబులను రాజతనూజ కెఱుంగఁ జెప్పఁగా
రాజును రాజసుందరియు రాజనిభాననలార! నన్నునే
యోజఁ దలంతురో యనుచు నూరక పోయెదఁగాక గౌరి నం
భోదళేక్షణన్ గదియుపుణ్యము చాలదె వేయునేటికిన్.

టీక :-
రాజసుందరిస = రాణి; నిభము = సమానము; ఓజ = విధము; అంభోజదళేక్షణ = తామరరేకులవంటి కన్నులు కలది; కదియు = దగ్గరకు వచ్చు.
భావము :-
“ఓ చంద్రముఖులారా! రాజ అంతఃపురములలో రాజ కుమార్తెలకు ఎఱుక చెప్పడానికి, రాజు, రాణి నన్ను యెందుకు పిలుస్తారులే యనుకుని వెళ్ళిపోతున్నాను కానీ; వేయేల? ఆ పద్మాక్షిని దరిచేరడమనే పుణ్యము చాలదా ఏమిటి!”

2-187-వ.
అని మఱియు నరుగుదెంచు సమయంబున.

టీక :-
అరుగుదెంచు = వచ్చు.
భావము :-
అంటూ తిరిగి వస్తున్న సమయంలో.

2-188-చ.
వెవగ వద్దు నీకు నరవిందనిభానన! యేను బిల్వఁగా
వెవక రమ్ము! నాతలఁపు వేగమె చెప్పిన మెచ్చువెట్టెదన్
ఱియు నభీష్ట సంపదలు మానుఁగ నిచ్చెద నిశ్చలంబుమై
నెఱుకలసాని! ర” మ్మనుచు నెంతయుఁ బ్రేమ భవాని పిల్వగన్.

టీక :-
వెరవక = భయపడకుండా; అరవింద = తామరపువ్వు; నిభము = సమానము; ఆనన = ముఖము; అభీష్టము = కోరబడిన; మెచ్చువచ్చు= ప్రశంస కలుగు; మానుగ = చక్కగా; నిశ్చలంబుమై = స్థిరమ కలిగి
భావము :-
భయపడవద్దు రా! నువ్వు తామరపువ్వుతో సమానమైన ముఖము కలదానా! నేను పిలుస్తున్నాను కదా ఇక భయపడకుండా రా. నా మనసులో యున్నదాని గురించి వేగముగా చెప్తే చక్కటి ప్రశంస దొరుకుతుంది. ఇంకా కోరిన సంపదలు చక్కగా ఇస్తాను. ఇది నిశ్చయము. వెంటనే రా! ఎఱుకలసానీ! రా!” అంటూ ఎంతో ప్రేమగా భవాని పిలువగా.

2-189-వ.
అరుగుదెంచి తదీయ హర్మ్యస్థానంబునకుం జని పార్వతీదేవిం గనుంగొని నిలిచియున్న యనంతరంబ.

టీక :-
హర్మ్యము = రాజగృహము.
భావము :-
ఆ ఎఱుకలసాని వచ్చి పార్వతీదేవిరాజగృహములోనికి వెళ్ళి ఆమెని చూసి నిలిచినది. పిదప.