పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : శంకరుఁడు ప్రత్యక్షం బగుట

2-289-క.
ములు కొలఁకులు గిరులును
వినువీథియు ధరయు నొక్క వెలుఁగై వెలుఁగన్
మునుమిడి పువ్వులవానలు
గొకొని కురియంగ సురలు కోర్కులఁదేలన్.

టీక :-
కొలకులు = సరస్సులు; వినువీథి = ఆకాశం; ధర = భూమి; మునుమిడి = చక్కగా; గొనగొని = గమకించి.
భావము :-
అడవులు, సరస్సులు, పర్వతాలు, ఆకాశం, భూమి యంతా ఒక వెలుగు నిండిపోయింది. దేవతలు కోర్కెలలో తేలియాడుతూ గమకించి పూలవర్షం కురిపించారు.

2-290-సీ.
పై నొప్పఁబెట్టిన ద్రదంతావళ
తోలుతో మొలపులితోలుతోడ
మనీయమైనట్టి కంబుకంఠముతోడ
బొలుపారు నెఱపూత భూతితోడఁ
నతరంబగు నాగ కంకణంబులతోడఁ
నరారు శూలాయుధంబుతోడఁ
టుజటావలిలోని బాలచంద్రునితోడ
యతోడ నభయహస్తంబుతోడ

2-290.1-ఆ.
లీలనందినెక్కి లేనవ్వుదొలుకాడఁ
డతిఁ కభయమీయఁ ల్లవించి
క్తబాంధవుండు వుఁడు ప్రత్యక్షమై
శైలరాజపుత్రి మ్రోల నిలచె

టీక :-
దంతావళము = గజము; కంబు = శంఖము; పొలుపారు = ఒప్పారు; నెఱ = నిండైన; తనరు = అతిశయించు; తొలుకు = కురియు; మ్రోల ఎదురు.
భావము :-
చక్కగా కట్టుకున్న భద్రగజ చర్మముతో, మొలకు కట్టిన పులి తోలుతో, అందమైన శంఖము వంటి మెడతో, నిండుగా పూసిన విభూతితో, గొప్ప నాగ కంకణములతో, అతిశయించే శూలాయుధముతో, జటాజూటములోని బాల చంద్రునితో, దయతో, అభయహస్తంతో నంది యెక్కి చిరునవ్వు కురిపిస్తూ గౌరీ పడతికి అభయమీయడానికి భక్త బాంధవుడైన భవుడు ప్రత్యక్షమై ఎదురుగా నిలచెను.

2-291-క.
నిచినఁ గనుఁగొని భయమునఁ
జెలు లందఱు నన్నిదిశలఁ జేరిరి వేగం
పోయ వడుగు శివుఁడై
వెలుఁగుటకును జాలబెగడి విస్మయమతులై.

టీక :-
బెగడు = భయపడు, బెదురు.
భావము :-
అలా నిలువగా చూసి భయముతో చెలులందరు వేగముగా అన్నివైపులకూ చెదిరి పారిపోయారు. వడుగు శివుడై ప్రకాశించటంతో బాగా బెదిరిపోయి ఆశ్చర్యపోయారు.

2-292-వ.
ఆసమయంబున.
భావము :-
అ సమయములో.

2-293-మత్త.
దేవి దేవరఁజూచె దేవర దేవిఁజూచెను నంతలో
భాజన్ముఁడు దోఁచియేసెను భావబంధములొందఁగా
నేమైఁ దొలిఫాలలోచను నేయఁజంకిన పుష్పబా
ణాళుల్ జతగూర్చి భర్గుని ప్పుడేసెఁ జెలంగుచున్.

టీక :-
భావజుడు = మన్మథుడు; నేవము = మిష.
భావము :-
అమ్మవారు అయ్యవారిని చూసింది. అయ్యవారు అమ్మవారిని చూసాడు. అంతలో మన్మథుడు ఒక కారణముచే పూర్వము శివునిపైకి వేయడానికి జంకిన పుష్ప బాణముల వరుసలను కూడా చెలరేగి శివునిపైకి భావబంధములు కలిగేలావేసెను.

2-294-క.
ను వలచు శివుఁడు ముందటఁ
కుం బ్రత్యక్షమైనఁ ద్దయువేడ్కన్
నుమధ్య చూచుచుండెను
నువునఁ బులకాంకురములు ళుకొత్తంగన్.

టీక :-
తద్దయు = మిక్కిలి; వేడ్క = వినోదము; పులకాంకురము = గగుర్పాటు; తళుకు = కాంతులీను.
భావము :-
తాను ప్రేమించే శివుడు తనముందే ప్రత్యక్షమవడంతో, పార్వతీదేవి మిక్కిలి వినోదంగా శరీరం గగుర్పాటుచెందగా కాంతులీనగా తాను చూచుచుండెను.

2-295-చ.
చుఱుకులు దట్టముల్ మెఱపు చుక్కలు తీరగు చెక్కులుగ్రముల్
మెఱుపులు కాముబాణములు మించులతీవెలు చంచలావళుల్
కులుమోహబంధములు కాముశరంబులపుట్టినిళ్ళు కి
న్నెరులువెడందలందములు నీరజలోచనచూపుచందముల్.

టీక :-
చెక్కులు = చెక్కిళ్ళు.
భావము :-
చురుక్కుమనే దట్టమైన మెరుపు చుక్కలవలె తీరైన చెక్కిళ్ళు, తీక్షణమైన మెరుపులు కామబాణములను మించి కదలెడి తీగెల వరుసల్లా ఉన్నాయి. ఆ పద్మనేత్రి చూపులు పరుషవాక్యాలైనా మోహబంధం కలిగించేలా, కాముని బాణములకు పుట్టినిల్లుగా కిన్నెరలు భయపడేంత అందముగా ఉన్నాయి.

2-296-ఉ.
కామిని చూచు చూపులకుఁగాక కలంగి శివుండు పాంథుఁడై
కామునిఁ దొల్లిగెల్చిన మగంటిమి యెల్లఁ దలంకలోలతన్
గామినిఁ జూచుచుండె మఱికామినియున్ మదనాస్త్రపాతయై
కావిరోధి చూపులకుఁ గాక తలంకె మనఃకళంకయై.

టీక :-
కలంగి = కలతచెంది; పాంథుడు = బాటసారి, గ్రహణంపట్టినసూర్యుడు; మగంటిమి = శౌర్యము; తలంక = తలకు; తలంకు = భయపడు; లోలత్వము = చాంచల్యము.
భావము :-
పూర్వము పార్వతీదేవి చూసిన చూపులకే కదా శివుడు గ్రహణం పట్టిన సూర్యునిలా తేజస్సు కోల్పోయి, పూర్వము మన్మథుని గెలిచిన శౌర్య మంతా తొలగిపోయి, చాంచల్యముతో పార్వతీ కామినిని చూసెను. పార్వతీదేవి కూడా మదనాస్త్రములకు లోనై శివుని చూపులకే కదా మనసు చిన్నబోగా కలత పడుతోంది.

2-297-వ.
మఱియును.

2-298-మత్త.
చూచుఁ జింతనసేయు నోరగఁ జూచు వర్ణనసేయఁగా
జూచుచుం దమకించు సిగ్గునఁ జొక్కుఁ బ్రార్థనసేయఁగా
జూచు నంతన డయ్యుఁ దన్మఱచున్ ముదంబున వెండియున్
జూచుఁ జేష్టలులేక యంబిక సోమశేఖరు నీశ్వరున్.

టీక :-
తమకించు = చలించు; చొక్కు = పరవశము; డయ్యు = తగ్గు, అలయు.
భావము :-
పార్వతీదేవి పరమశివుని ఒకమారు చూస్తోంది. ఆలోచిస్తోంది. మరల ఓరగా చూస్తోంది. వర్ణించుదామనుకుంటోంది. తత్తరపడుతోంది. సిగ్గుతో పరవశిస్తోంది. ప్రార్థన చేద్దామనుకుంటోంది. అంతలోనే నెనక్కితగ్గుతోంది. సంతోషంతో తనను తాను మరచిపోతోంది. మరల నిశ్చేష్టిత యై చూస్తూ ఉంటోంది.

2-299-వ.
ఇవ్విధంబున.
భావము :-
ఈ విధముగా

2-300-ఉ.
ఒండొరుసుందరాంబువుల నోలిమునింగియుఁ దేలి తెప్పలై
యొండొరుఁ బాయలేకునికి నున్మదు లై నిజబోధవీథి నొం
డొంన దెప్పలై గుణగణోన్నతి కూటమిఁ జేర్చి శంభుఁ డా
కొంలరాజుకూఁతునకుఁ గూరిమి నిట్లనియెన్ ప్రసన్నుఁడై.

టీక :-
ఓలి = వరుస; ఉన్మాదము =వెఱ్ఱి, ప్రియ వియోగ విభవభ్రంశాదులచే చేతనాచేతనముల యందు సమానముగా బ్రవర్తించుట; ఒండొండ = క్రమముగా; కూటమి = కలయిక; కూరిమి = ప్రేమ.
భావము :-
ఒకరికొకరు ఎదుటివారి అందాలనే జలాలలో వరుసగా మునిగి తేలుతున్నారు. ఒకరినొకరు విడువలేక వియోగపువెఱ్ఱి పట్టినవారై తమ జ్ఞానవీథిలో క్రమమున తేలువారై పిమ్మట గుణాతిశయము చేత కలసిరి. అప్పుడు శివుడు ప్రసన్నుడై ప్రేమతో పార్వతితో ఇలా అన్నాడు.

2-301-శా.
 వామేక్షణ! యోకురంగనయనా! యో కాంత! నీయిష్టమై
నీవా నన్నునునేలుకొంటివి. సతీ! నీ వాఁడనేనైతి ని
చ్చో ద్దింకను నందినెక్కి గడఁకన్ శోభిల్లగాఁ బ్రీతితో
రావే పోదము వెండికొండకు మనోరాగంబుతోఁ గన్యకా!”

టీక :-
వామాక్షి = సుందరి, గౌరీదేవి; కురంగనయన = లేడికన్నులచిన్నది, గౌరీదేవి; ఇచ్చో = ఈ ప్రదేశంలో; కడక = పూనిక యత్నము; శోభిల్లు = ప్రకాశించు; ప్రీతి = సంతోషము; మనోరాగము = మనసునందు అనురాగము.
భావము :-
“ఓ సుందరమైన చూపులు కలదానా! ఓ లేడి కన్నుల వంటి కన్నులు కలదానా`! ఓ కాంతా! సతీదేవీ! నీ ఇష్టంతో నువ్వే నన్నేలుకున్నావు. నేను నీవాడను అయ్యాను. ఇక్కడ ఇంక ఉండ వద్దు. సంతోషంగా పూని నందినెక్కి మనోరాగంతో వెండికొండకు పోదాము రా.”

2-302-చ.
వుఁడు సంతసిల్లి తరలాయతలోచనబోంట్లు నేర్పుతో
వియములొప్ప మ్రొక్కఁగను విశ్వవిభుండు కృపాకటాక్షుఁడై
నుఁగొనియుంటఁజూచి కరకంజములంజలిచేసి “దైవమా!
రిన విన్నపంబు లవధారు. ప్రసన్నతి నాదరింపవే.

టీక :-
తరల = కదలునది; ఆయత = వెడల్పైన; బోంట్లు = చెలికత్తెలు; కంజము = తామర; తనర = పూర్తిగా; అవధారు = వినిము; ఆదరించు = మన్నించు.
భావము :-
శివుడు అలా అనేటప్పటికి సంతోషించి చెలికత్తెలు నేర్పుతో వినయంగా మ్రొక్కగా జగదీశ్వరుడు కరుణతో నిండిన కన్నులు కలవానిడయ్యాడు. అది గమనించి చేతులు జోడించి ”దైవమా! మా విన్నపాన్ని పూర్తిగా వినండి. ప్రసన్నులై ఆదరించండి.

2-303-ఉ.
వే పురాణశాస్త్రములు విస్తుతి నిన్నును జేయలేవు బ్ర
హ్మాదులుఁ గానలేరు సనకాదులుఁ గానఁగలేరు నిర్జరేం
ద్రాదులుఁ గానలేరు ధనదాదులుఁ గానఁగలేరు లక్ష్మినా
థాదులకైన నీదు మహిమాతిశయంబుఁ దలంప శక్యమే?

టీక :-
నిర్జరులు = దేవతలు.
భావము :-
వేదాలు, పురాణాలు,శాస్త్రాలు నిన్ను వివరంగా స్తుతించలేవు. బ్రహ్మాదులు, సనకాది మహర్షులు, ఇంద్రాదిదేవతలు, కుబేరాదులు నిన్ను చూడలేరు. మహా విష్ణువుకైనా నీ మహిమాతిశయాన్ని తెలుసుకోవడం సాధ్యంకాదు.

2-304-చ.
రులు నీ మహామహిమ యింతని చెప్పఁగ నెంతవారుమా
నితరమైన నీమహిమ నీవె యెఱుంగుదు వట్టినీవు మా
తికి దయాపరుండవును న్నిధివైతి విదేమి పుణ్యమో!
తము శైలవల్లభుఁడు ల్పిన నిష్ఠఫలించెశంకరా!

టీక :-
మానిత = పూజింపబడిన; సన్నిధి = చేరువ; శైలవల్లభుడు = హిమవంతుడు.
భావము :-
ఇంక ఇతరులు నీ మహామహిమ ఇంతయని చెప్పడానికెంతవారు? కొనియాడబడే నీ మహిమను నీవే ఎఱుగుదువు. అటువంటి నీవు మా సతికి దయతో దగ్గరైనావు. శంకరా! అదేమి పుణ్యమో కాని హిమవంతుడు చేసిన నిష్ఠ ఫలించింది.

2-305-క.
 జయ కరుణాంభోనిధి!
 జయ దేవాధిదేవ! యచంద్రధరా!
 జయ భక్తమనోహర!
 జయ శ్రీనీలకంఠ! య పురవైరీ!

టీక :-
అంబోనిధి = సముద్రము; మనోహరుడు =మనస్సును ఆకర్షించేవాడు.
భావము :-
కరుణా సముద్రుడా! దేవాధిదేవా! చంద్రధరా! భక్తమనోహరా! శ్రీ నీలకంఠా! త్రిపురాసుర వైరీ నీకు జయము, జయము.

2-306-క.
న్నగకంకణ! నీకయి
చెన్నుగ ధరణీధ్రవిభుఁడు చేసినతపముల్
న్నుతిఁ దలఁపఁగ వలదే
న్నింతురుగాక యేలి న్నన నతనిన్.

టీక :-
చెన్నుదనము = అందము; ధరణీధ్రము = కొండ.
భావము :-
నాగ కంకణా! నీ కొరకు కొండలరాజు చక్కగా చేసిన తపములను, స్తోత్రములను తలచుకోవలెను కదా! ఏలికగా అతనిని మన్నింతురు గాక.

2-307-మత్త.
పంజాననఁ బుట్టినింటికిఁ బంపి యీకృపఁ జూచి మా
వం మేలు దలంచుచున్ హిమవంతు నింటికి మీర లే
ణాంశేఖర! కొందఱన్ విమలాత్ములన్ కమలాక్షికై
యుంకు వీదగువారిఁ బంపుట యొప్పునయ్య. మహేశ్వరా!

టీక :-
ఏణాంకుడు = చంద్రుడు; విమలాత్ములు = నిర్మలమైన మనస్సు కలవారు; ఉంకు = సమ్మతి.
భావము :-
చంద్రశేఖరా! పంకజముఖిని పుట్టినింటికి పంపి, మహేశ్వరా! దయచేసి మా మేలు తలచి హిమవంతుని ఇంటికి మీరు కొందరు సత్పురుషులను కమలాక్షి కొరకు సమ్మతి కోరుతూ పంపడం మంచిది.

2-308-వ.
అనిన విని యప్పరమేశ్వరుండు చెలుల విన్నపం బవధరించి శైలకన్యకాతిలకంబు నవలోకించి యిట్లనియె.

టీక :-
అవధరించి = విని; అవలోకించి = చూసి.
భావము :-
అనగా విని ఆ పరమేశ్వరుడు చెలుల విన్నపాన్ని మన్నించి గిరిజను చూసి ఇలా అన్నాడు.

2-309-క.
మీ తండ్రియున్నచోటికిఁ
బ్రీతిగ నిన్నడుగఁ దగిన పెద్దల వేగం
బాతిగతిఁ బుత్తెంతుఁజు
మీ లపోయ వలదింక మీననిభాక్షీ!

టీక :-
ఆతతము = విరివియైనది; పుత్తెంచు = పంపు; నిభము = సమానము.
భావము :-
మీ తండ్రి వద్దకు సంతోషంగా నిన్నడగడానికి తగిన పెద్దలను శీఘ్రంగా పెద్దతనంగా పంపిస్తాను. మీనాక్షీ! ఉమాసతీ! ఇంకేమీ ఆలోచించనవసరం లేదు సుమా!.

2-310-ఆ.
నిన్నుఁ బాసి నిలువ నేర్తునే నేర్చిన
లఁపులెట్లు నిలుచుఁ రలనయన!
లఁపు నిలిచెనేని నుమధ్య యొంటమై
ప్రాణమెట్లు నిల్చుఁ బంకజాక్షి!

టీక :-
తనుమధ్య = సన్నని నడుము కల స్త్రీ; ఒంటమి = భేదము, వేరమి.
భావము :-
కదలెడి కన్నులు కలదానా! గౌరీదేవీ! నిన్ను విడిచి నేను నిలువగలనా? నేను నిలిచినా ఆలోచనలెలా నిలుస్తాయి? తలపులు నిలిచినా వేరిమి పొంది ప్రాణమెలా నిలుస్తుంది?.

2-311-వ.
అని మఱియు తగినలాగున నమ్మహాదేవిని మన్నించి రజతధరణీధరంబునకు నీశ్వరుండు వేంచేసె ననంతరంబ యక్కాంతాతిలకంబగు గౌరీదేవియుఁ దన్ను మహేశ్వరుండు మన్నించిన మన్ననలకు నత్యంత ప్రమోదంబు నొంది తన సఖీజనంబులుం దానును దపోవనవాసంబు చాలించి తుహినాచలశిఖరంబుఁ బ్రయాణంబుచేసె" ననిచెప్పి.

టీక :-
రజతధరణీధరము = వెండికొండ, కైలాసము; ప్రమోదము = సంతోషము; తుహినాచలము = మంచుకొండ, హివంతము.
భావము :-
అని తగిన విధముగా ఆ పార్వతిని అనుగ్రహించి ఈశ్వరుడు కైలాసానికి వెడలిపోయెను. ఆ తరువాత ఆ గౌరీదేవి కూడా తనను మహేశ్వరుడు అనుగ్రహించినందుకు చాలా సంతోషించి తన చెలులు, తాను తపోవనవాసము చాలించి మంచుకొండ శిఖరమునకు ప్రయాణం చేశారు.” అని వాయుదేవుడు నైమిశారణ్యంలో దీర్ఘసత్రము వేదిక వద్ద మునులకు చెప్పి....