పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : శంకరుండు బ్రహ్మచారి యై వనమునకు వచ్చుట

2-252-ఉ.
గ్రక్కున భూతియున్ నొసలిన్నును బెబ్బులితోలుచీరయున్
చుక్కలరేనిజూట మునుజొక్కపు గంగయు మేనఁబాములున్
చిక్కనిశూలలాతములచేతులు రెండును పుఱ్ఱెకుండ దా
క్కఁగ దాఁచివచ్చె నెఱజాణుఁడు శంభుఁడు సంభ్రమంబునన్.

టీక :-
గ్రక్కున = వేగముగా; నొసలికన్ను = నదుటిపై యుండే కన్ను; బెబ్బులి = పులి; చుక్కలరేడు = చంద్రుడు; లాతము = సన్యాసులు చేతబట్టెడి దండము; నెఱజాణడు = మిక్కిలి సమర్థుడు; సంభ్రమము = ఉత్సాహము.
భావము :-
వేగముగా విభూతిని, నుదుటిపై యుండే కన్నుని, పులితోలు వస్త్రమును, చంద్రరేఖతో గంగతో యుండే జటాజూటమును, శరీరంపై అలంకారాలుగా యుండే పాములను, కఠినమైన శూలము - లాతము కలిగిన రెండుచేతులు, పుఱ్ఱెకుండను తాను చక్కగా దాచి శివుడు ఉత్సాహంగా మిక్కిలి నెఱజాణయై వచ్చెను.

2-253-సీ.
తనర ముమ్మాఱుచుట్టిన దర్భముంజితోఁ
గ్రొమ్మెఱుంగువలంతి గోఁచితోడ
మొలనున్నధవళంపు ముద్దుపేలికతోడ
నిమ్మైన కృష్ణాజినమ్ముతోడ
వెలపలఁబెట్టిన వెలిజన్నిదముతోడ
మ్యభస్మ త్రిపుండ్రములతోడ
క్షమాలికతోడ నా చిన్నికూకటి
జుట్టుతోమేథావి బొట్టుతోడ

2-253.1-ఆ.
నెడమకేలఁ దనదు పొడవు దండమువ్రేల
నుంగరమును దర్భయును వెలుంగ
గొడుగువట్టి వటువుకుఱ్ఱఁడై చనియెను
శూలి మంచుకొండచూలికడకు.

టీక :-
తనరన్ = ఒప్పుగా, చక్కగా; ముమ్మారు = మూడుసార్లు; దర్భముంజి = బ్రహ్మచారి కట్టుకొనెడి దర్భలతో చేసిన మొలత్రాడు; క్రొమ్మెఱుగు = కొత్తమెఱుగు; వలంతి = వలఁతి అనగా అనుకూలమైనది ఐన; ధవళము = తెల్లని; పేలిక = గుడ్డముక్క; కృష్ణాజినం = నల్లలేడి చర్మం; వెలి = దేహము యొక్క బహిఃప్రదేశము; జన్నిదము = యజ్ఞోపవీతం; అక్షమాలిక = జపమాల; కూకటి = పిల్లజుట్టు; మేధావి = ధీమంతుడు; కుఱ్ఱడు = బాలుడు.
భావము :-
పూర్తిగా చక్కగా చుట్లు చుట్టిన దర్భలతో పేనిన మొలత్రాడుతో, కొత్తగా మెరుస్తున్నఅనువైన గోచితో, మొలనున్న తెల్లని గుడ్డపేలికతో, చక్కని నల్లలేడి తోలుతో, బయటకు పెట్టిన తెల్లని జంధ్యంతో, అందమైన భస్మ త్రిపుండ్రములతో, జపమాలతో, చిన్ని పిలకజుట్టుతో, నుదుట బొట్టుతో, ఎడమ చేతిలో తనంత పొడవైన దండం(కట్టె) వ్రేలాడుతుండగా వ్రేలికి ఉంగరము, దర్భ కలిగి గోడుగు పట్టుకొని బాలవటువుగా మహామేధావి శివుడు పార్వతి వద్దకు వెళ్ళెను.

2-254-ఆ.
ట్లు పోవునప్పు మ్మహాతేజంబు
వేడ్కతోడ నెట్టివిధము నైన
పాయ దమృత కోటి భానుబింబంబుల
ప్రభల గ్రేణిసేయు రిత మగుచు.

టీక :-
పాయు = విడుచు; భాను = సూర్యుడు; అమృత = తరుగుటలేని, మాయని; ప్రభ = వెలుగు; క్రేణిచేయు = పరిహసించు.
భావము :-
అలా వెళ్ళుతున్నపుడు కోటి సూర్య బింబాల వెలుగును పరిహసించే అతని మాయని మహాతేజము ఏవిధముగానూ దాచబడటంలేదు.

2-255-వ.
అంత నయ్యవసరంబున.

టీక :-
అయ్యవసరంబున = ఆ సమయంలో.
భావము :-
అప్పుడా సమయంలో.

2-256-చ.
మలమైనవాఁడు కడు క్కనిరూపమువాఁడు కాంతిచేఁ
బొలిన మోమువాఁడు మెయి భూతినలందినవాఁడు దివ్యమై
యొవిన బ్రహ్మచారిగతి నొప్పినవాఁ డిటు వచ్చుచున్నవాఁ
దె యొకగుజ్జుతాపసుఁ డహావనితామణులార! కంటిరే.”

టీక :-
సదమలము = మిక్కిలి నిర్మలము; పొదలు = ప్రకాశించు; ఒదవు = వర్థిల్లు; గుజ్జు = పొట్టి.
భావము :-
“మిక్కిలి నిర్మలమైనవాడు, చాలా అందమైన రూపము కలవాడు, కాంతిచే ప్రకాశించే ముఖము కలవాడు, శరీరమంతా విభూదిని పూసుకున్నవాడు, దివ్యంగా వర్థిల్లే బ్రహ్మచారి వలె తగినవాడు అదిగో ఇటే వస్తున్నాడు! ఒక పొట్టి తాపసుడు. అహో! వనితామణులారా! చూశారా!”

2-257-వ.
అని యివ్వింధంబున

టీక :-
ఇవ్విధము = ఈ విధము.
భావము :-
అంటూ ఈవిధముగా.

2-258-మత్త.
కాం లవ్వలనం గనుంగొని ట్టుకూఁతురి నెచ్చలుల్
విం లీలల నవ్వనంబున వే చరించుట మాని యు
న్నం నూతనయౌవనాంచిత ద్రికన్నియఁ జేరఁగా
సంసంబునఁ బోయి రయ్యెడ గ్గునన్వటువేషితోన్.

టీక :-
వలనన్ = వైపు; గట్టుకూతురు = అద్రిపుత్రిక, పార్వతి; వే = వేగము.
భావము :-
కాంతలు, పర్వతరాజ కుమార్తె సతీదేవి చెలులు ఆ వైపు చూసి , వేగముగా ఆ వటువేషధారితో కలసి వింతగా ఆ వనంలో సంచరించటం మాని నవయౌవనవతి యైన పార్వతీదేవి వద్దకు సంతోషంగా చేరారు.

2-259-ఉ.
ల్లనఁ జేరవచ్చి సతు ర్చన చేసెదమన్న నన్నియుం
జెల్లును చాలుచాలు నని చేతుల సన్నలుచేసి నిక్కమే
ల్లలితంపుఁ దాపసుని చాడ్పున నిల్చి శివుండు లోల సం
పుల్లసరోజనేత్రియగు పొల్తుక నంబికఁ జూచి యిట్లనున్.

టీక :-
అల్లన = తిన్నగా; సన్న = హస్తాదులచే చేసెడు సంజ్ఞ; లలిత = మనోజ్ఞమైన; చాడ్పున = విధమున; లోల = కదలునది; ఫుల్ల = వికసించిన; పొల్తుక = స్త్రీ.
భావము :-
సుఖులు తిన్నగా వటువు వద్దకు వచ్చి పూజలు చేస్తామంటే అన్నీ ఐపోయాయి. చాలుచాలు అని చేతులతో సంజ్ఞలు చేసి నిజమైన మనోజ్ఞమైన తాపసుని వలె నిలచిన శివుడు వికసించిన పద్మముల వంటి కదలెడి కన్నులు గల స్త్రీ యైన అంబికను చూసి ఇలా అన్నాడు.

2-260-ఉ.
నీ లిదండ్రులెవ్వరొకొ నీరజలోచన! యెవ్వ? రీవు నీ
వీ పమేల? చేసెద వదెవ్వడొకో? నిను నేలువాఁడు దా
నో రుణీలలామ! భువనోన్నత మోహనమూర్తిరాజ సం
కేము మాని యీ యడవికేఁగి తపం బిటుసేయ నేటికిన్.”

టీక :-
సంకేతము = ఏర్పాటు.
భావము :-
“పద్మాక్షీ! నీ తల్లిదండ్రులెవరు? నీవెవరు? ఈ తపమెందుకు? ఎవరికోసం చేస్తున్నావు? నిన్నేలువాడెవడు? నీవా వయసులో ఉన్నదానివి. భువనములలోకెల్లా అందమైనదానివి. రాణీవాసాన్ని విడచి ఈ అడవికి వచ్చి తపము చేయడమెందుకు?.”

2-261-వ.
అనిన నమ్మాయావటునకు నబల చెలు లిట్లనిరి.

టీక :-
వటువు = బ్రహ్మచారి.
భావము :-
అని అడుగగా ఆ మాయా బ్రహ్మచారితో పార్వతి చెలులిలా అన్నారు.

2-262-మత్త.
ల్లి మేనకపుణ్యకామిని తండ్రికొండలరాజు యీ
మొల్లగంధికి గౌరి నామము మూఁడుకన్నులదేవరన్
ల్లభుం డని కోరిసేయును వారిజాక్షి తపంబు మే
మెల్ల దాసులమై చరించెద మింతికిన్ మునివల్లభా!”

టీక :-
మొల్లగంధి = మొల్లపూల వాసన గలది.
భావము :-
“ఓ! ముని వల్లభా! ఈమె తల్లి మేనక. పుణ్యాత్మురాలు. తండ్రి పర్వతరాజు. ఈ మొల్లగంధి పేరు గౌరి. ఈ వారిజాక్షి శివుని భర్తగా కోరి ఈ తపస్సు చేస్తోంది. ఈ ఇంతికి మేమంతా చెలికత్తెలము.”

2-263-వ.
అనవుడు నక్కపటతాపసుం డిట్లనియె.

టీక :-
కపటము = మాయ.
భావము :-
అనగా ఆ మాయా తాపసి ఇలా అన్నాడు.

2-264-ఉ.
 గుమోము లీయలక లీతెలికన్నులు నీసుధాధరం
బీ నునుమేనికాంతియును నీచనుకట్టును నీకరాంబుజం
బీ డు మీనితంబమును నీతొడ లీపదపల్లవంబు లే
మానిని యందుఁ గానము సగ్రమనోహరరూపసంపదన్.

టీక :-
అలకలు = ముంగురులు; తెలికన్నులు = ప్రకాశించే కళ్ళు; నితంబము = పిరుదు.
భావము :-
ఈ నవ్వు ముఖము, ఈ ముంగురులు, ఈ ప్రకాశించే కళ్ళు, ఈ అమృతాన్ని చిందించే పెదవులు, ఈ నున్నని శరీర కాంతి, ఈ చనుకట్టు, ఈ పద్మ హస్తాలు, ఈ నడుము, ఈ నితంబములు, ఈ తొడలు, ఈ చిగురు వంటి పాదాలతో సమగ్ర మనోహరమైన అందముతో యుండే రూప సంపద ఇంకే స్త్రీ యందూ కనలేము.

2-265-ఉ.
 పువుబోఁడి నీమగువ నీతరలాయతచారులోచనన్
దాసి జేసి పొమ్మనుచు ధైర్యము నిల్పి వనాంతరంబునన్
చాలనేత్రలార! సతివ్వన మారడిబుచ్చ జెల్లరే!
తాసవృత్తి నుంచు నలదైవము నే మననేర్తు నక్కటా!

టీక :-
తరల = చలించు; ఆయత = వెడల్పైన; చారు = అందమైన; ఆరడిపుచ్చు = వ్యర్థముజేయు.
భావము :-
అయ్యో! ఈ పూవు వంటి శరీరము కలది ఈ మగువను, వెడల్పైన అందమైన కదలాడే కన్నులు కలామెను తాపసిగా చేసి ధైర్యముగా వనాలకు పొమ్మంటారా? కదలెడి కన్నుల కన్నెలలారా! అయ్యో! అయ్యయ్యో! ఈ సతి యౌవనమంతా వ్యర్థము జేస్తూ ఇలా తాపసవృత్తిలో ఉంచిన ఆ దైవాన్ని ఏమనాలి?.

2-266-వ.
అదియునుంగాక.
భావము :-
అదీ కాక.

2-267-సీ.
పొలుచు మైఁదీగెతోఁ బొల్చు టింతియకాక
యీ వన్నెగలరేఖ యెందుఁగలదు
యింతిపాలిండ్లతో నీడుసేయుటగాక
యీ చక్కనైన బా గెందుఁగలదు
పూఁబోఁడిమోముతోఁ బురుడుసేయుటగాక
యీ నిర్మలపుఁగాంతి యెందుఁగలదు
తికనుదోయితో సాటిసేయుటగాక
యీ మోహరుచిజాల మెందుఁగలదు

2-267.1-ఆ.
లిగెనేనితెగని కాముబాణములందుఁ
గందులేని యిందు నందుఁ బసిడి
గరిశిరంబులం దచిరముండు మెఱుపుల
యందుఁగాక తక్కు నెందుఁగలదె?.

టీక :-
పొలుచు = ప్రకాశించు; రేఖ = రూపు రేఖలు; ఈడుసేయ = పోల్చు; పురుడుసూపు = ఉదాహరించు; రుచి = కాంతి; కందు = నలుపు.
భావము :-
ప్రకాశించే ఈమె శరీరమును తీగతో పోల్చడమే కానీ ఈ రంగుగల రూపురేఖలు ఎక్కడుంటాయి? ఈ ఇంతి పాలిండ్లతో పోల్చడమే కానీ ఈచక్కదనానికి తగిన చక్కదనమెక్కడుంది? ఈమె ముఖముతో పోల్చడమే కానీ ఈ నిర్మలపు కాంతి ఎక్కడుంది? ఈమె కనులజంటతో పోల్చడమే కానీ ఈ మోహనకాంతి ఎక్కడుంది? ఉంటే కాముని బాణంలో, నలుపు(మచ్చ) లేని చంద్రునిలో, బంగారంలో, ఏనుగు తలలో, స్థిరంగా యుండే మెరుపులోనే కానీ మరెక్కడా కనపడదు.

2-268-ఉ.
చూచితి నాగకన్నియలఁ జూచితి దానవదైత్యకన్యలన్
జూచితిదేవకన్నియలఁ జూచితి ఖేచరసిద్ధకన్యలన్
జూచితిమర్త్యకన్నియలఁ జూచితి సాధ్యమునీంద్రకన్యలన్
జూచితిఁగాని యేయెడలఁ జూడ గిరీంద్రజఁబోలుకన్యలన్.

టీక :-
దానవులు = కశ్యపునికి దనువు యందు పుట్టినవారు, వారి సంతతివారు; దైత్యులు = దితి పుత్రులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, వారి సంతతివారు.
భావము :-
నాగ కన్యలను చూశాను. దానవ, దైత్య కన్యలను చూశాను. దేవ కన్యలను చూశాను. ఖేచర, సిద్ధ కన్యలను చూశాను. మానవ కన్యలను చూశాను. ముని కన్యలను చూశాను. కానీ ఎక్కడా ఈ గిరిజ వంటి కన్యను చూడలేదు.

2-269-వ.
అని పలికి గౌరీదేవి నుపలక్షించి యల్లనల్లన యిట్లనియె.

టీక :-
ఉపలక్షించు = చూచు, ఉద్దేశించు; అల్లనల్లన = మిక్కిలి మెల్లగా
భావము :-
అని చెప్పి గౌరీదేవిని చూసి మిక్కిలి మెల్లగా ఇలా అన్నాడు.

2-270-ఉ.
కొంలరాజుగారవపుఁగూతుఁర వై నవయౌవనాంగివై
నిండినలక్ష్మితోఁ జెలులు నిచ్చలు గొల్వఁగఁ గేలిమై సుఖం
బుండుటమాని సౌఖ్యములనొల్లని జంగమువానిఁ గోరి యీ
కొంకువత్తురే వనఁటఁ గుందుదురే యిచటం దలోదరీ!

టీక :-
నిచ్చలు = ఎల్లప్పుడూ; కేలి = విలాసము; ఒల్లని = ఇష్టపడని; కుందుట = దుఃఖించుట; తలోదరి = పలుచని ఉదరము కల స్త్రీ.
భావము :-
ఓ! తలోదరీ! గౌరీదేవీ! కొండలరాజు గారాల కూతురువు.నవయౌవనంలో ఉన్నదానివి. సంపదలతో నిండినదానివి. చెలులు ఎల్లప్పుడూ సేవిస్తుండగా విలాసంగా, సుఖంగా ఉండటం మాని సుఖాలిష్టపడని జంగమువానిని కోరి ఈ కొండకు వచ్చి వనాలలో ఇక్కడ బాధపడతారా?.

2-271-వ.
అదియునుంగాక యీ జగములన్నియుఁ జూచితిఁగాని యెయ్యెడన్.

టీక :-
జగము = లోకము.
భావము :-
అదీకాక ఈ లోకాలన్నీ చూశాను. కానీ ఎక్కడా….

2-272-ఉ.
క్కడ భర్గుఁడుంట యిట నెక్కడ నీ తపముంట కన్యకా
చుక్కలరాజమౌళిఁ దొలి చూచినదానవొ కాక యూరకే
యెక్కడ నాతనిన్ వలచియేఁగిన భామలఁగానఁ జెల్లరే!
నిక్కము చెప్పితిన్ మగువ నేరుపుఁ దప్పితివీవు జాణవే!

టీక :-
చుక్కలరాజు = చంద్రుడు; నిక్కము = నిజము; జాణ = నేర్పరి.
భావము :-
శివుడెక్కడుంటాడు? ఇక్కడ నీ తపమా? కన్యకా ఇంతకు ముందు ఆ చంద్రమౌళిని చూశావా లేక ఊరికేనా అతనిని వలచి వెళ్ళిన భామలను నేనెక్కడా చూడలేదు. యదార్థము చెప్తున్నాను. నీకు జాణతనము లేదు. నీవు నేర్పరివి కాదు.

2-273-సీ.
రళాక్షి! యాతండు నవంతుఁడందమా
కోరివేడినగానిఁ గూడులేదు
చిన్నారి! వయసున చిన్నవాఁడందమా
యెన్నటివాఁడొకొ యెఱుఁగరాదు
కారసంపద తిమేటియందమా
యాకారమెట్టిదో రయరాదు
కులగోత్రములురెండుఁ దెలియుదమందమా
లిదండ్రులెవ్వరు రణిఁలేరు తరళాక్షి!

2-273.1-ఆ.
తిరిపరొంటిగాఁడు దేవుండు చూడఁడే
మాయమందు కపట మంత్రములను
గువ! నిన్నుయెటుల రగించుకొన్నాఁడొ
కాని తగినవాఁడు కాఁడు కాఁడు.

టీక :-
తరళాక్షి = ప్రకాశవంతమైన కన్నులు కలది; కూడు = అన్నము; అరయు = తెలిసికొను; తిరిప = బిచ్చగాడు; మరగించు = మోహింపచేయు.
భావము :-
ప్రకాశవంతమైన కన్నులు కలదానా! సతీదేవీ! అతను ధనవంతుడు అందామా అంటే అడుక్కుంటే కానీ అన్నము లేదు. వయసులో చిన్నవాడా అంటే ఎప్పటివాడో తెలియదు. రూపములో గొప్పవాడా అంటే అసలు ఆకారమెలా ఉంటుందో తెలుసుకోలేము. తరళాక్షీ! కులగోత్రాలు రెండూ తెలుసందామా అంటే భూమిపై తలిదండ్రులెవరూ లేరు. బిచ్చగాడు.ఒంటరివాడు. మగువా! మాయతోనో, మందుతోనో, మంత్రములతోనో నిన్ను ఎలా మోహింపచేశాడో కానీ అతను నీకు తగినవాడు కాడంటే కాడు. ఆ దేవుడు చూడడా?.

2-274-వ.
 అని మఱియు నిట్లనియె.

టీక :-
.
భావము :-
అని ఇంకా ఇలా అన్నాడు.

2-275-క.
అంటినఁ గందెడు యొడ లీ
వెంటన్ గుదియింపవలదు విను! మాతని నీ
వంటెద నని తలఁచెద వతఁ
డండు నిను సర్వభంగు లందుఁ గుమారీ!

టీక :-
కందు = వాడు, కందిపోవు; ఒడలు = శరీరము; కుదియించు = అణగకొట్టు; భంగి = విధము.
భావము :-
కుమారీ! ముట్టుకుంటే వాడిపోయే శరీరం నీది. దానిని అణగగొట్టకు, నామాట వినుము. అతనిని నీవు తాకుదామనుకున్నా ఏ విధముగానూ నిన్నుఅతను తాకడు.

2-276-మత్త.
 తాంగి! యెఱుంగవాతఁడు నొక్కజాలరికన్యకున్
లోలుఁడై జడలిచ్చినాఁడట లోకమెల్ల యెఱుంగ నీ
వే చింతనసేయ వక్కట! యీతఁడొక్కఁడె కాని నీ
లాకా కనలేరె దేశము నందులోనమగల్మఱిన్.

టీక :-
లోలుడు = ఆసక్తుడు; నీలాలక = నల్లని కురులు కలది.
భావము :-
లత వంటి శరీరము కలదానా! నీకు తెలియదు. ఒక జాలరి కన్యయైన గంగకు ఆసక్తుడై జడలనిచ్చినాడట. లోకానికంతా తెలుసు. అయ్యో! నీవెందుకు ఆలోచించవు? నీలాలకా! సతీదేవీ! ఇతనొక్కడే కానీ మరింక దేశంలో మొగుళ్ళే దొరకరా?

2-277-సీ.
చీనాంబరంబులు చెలువొప్పఁ గట్టఁడు
దసింధురేంద్రచర్మంబుఁగాని
త్నకంకణములు మణమైఁ దొడగఁడు
ణిలోకరాజకంణముగాని
చందనగంధంబు జాణఁడై పూయఁడు
దపంచబాణభస్మంబుఁగాని
పువ్వులుదండలు భోగియై తురుమఁడు
వెలయింతలేనిరేవెలుఁగుగాని

2-277,1-ఆ.
యూరనుండనొల్లఁ డొలుకులలోఁగాని
యెనసిహయమునెక్కఁ డెద్దుగాని
చెలువ! యేమిచెప్ప సిగ్గయ్యెడిని వెఱ్ఱి
యనఁగ నెపుడు శివుని వినవె చెపుమ.

టీక :-
చీనాంబరములు = పట్టు వస్త్రములు; సింధురము = ఏనుగు; ఫణి = పాము; పంచబాణుడు = మన్మథుడు; వెలలేని = ఏ మాత్రం కాంతిలేని; రే వెలుగు = చంద్ర కాంతి; ఒలుకులు = శ్మశానభూమి; హయము = గుఱ్ఱము.
భావము :-
మద గజ చర్మము తప్ప పట్టు వస్త్రములు కట్టడు. పాములనే కంకణాలుగా ధరిస్తాడు కానీ అందముగా రత్న కంకణాలు ధరించడు. మన్మథుని బూడిదే కానీ నేర్పుగా చందన గంధములు పూసుకోడు. ఏమాత్రం విలువ లేని చంద్రునే తప్ప భోగి వలె పూలదండలు తురుముకోడు. శ్మశానంలోనే కానీ ఊరిలో ఉండడు. ఎద్దునే కానీ గుఱ్ఱమునెక్కడు. ఏమని చెప్పను? చెప్పడానికే సిగ్గుగా ఉంది. శివుడిని వెఱ్ఱివాడంటారు. వినలేదా? చెప్పు.

2-278-మత్త.
కంతుఁ జంపినవాఁడు వెండియు కంతు కెయ్యెడ లోఁబడం
డిం సిద్ధము గామ్య మొల్లఁడు యేల యీ యడియాస నీ
వం కంతకు నిష్ఠమై నవయంగ నేల మహాటవిన్
సంసంబునఁ గొంచుఁబోయెదఁ క్క రమ్ము కుమారికా!

టీక :-
కంతుడు = మన్మథుడు; కంతు = మదనావస్థ; సిద్ధము = యదార్థము; కామ్యము = కోరిక; ఒల్లడు = ఒప్పుకోడు; అడియాస = వ్యర్థమైన ఆశ; నవయు = శుష్కించు; అటవి = అడవి; కొంచు = తీసుకొను; కుమారి = కన్య.
భావము :-
మన్మథుని చంపినవాడు ఇంక మదనావస్థకెలా లోబడతాడు ఇది నిజం. కోరికలు ఉండవు. ఎందుకీ వ్యర్థమైన ఆశ నీకు? నీవింత నిష్టతో ఈ మహారణ్యములో శుష్కించి పోవుటెందుకు? కుమారికా! చక్కగా రా. సంతోషంగా తీసుకుపోతాను.

2-279-చ.
వుగ సర్వలోకముల నేలెడువాఁడ మహేంద్రనిర్జరే
శ్వతతిలోనఁ బేరు గలవాఁడ జగంబులఁ బెద్దవాఁడ ఖే
గతి నొప్పువాఁడ సహచారిణిదుఃఖము లేనివాఁడ శ్రీ
రునకు బ్రహ్మకున్మొదలివాఁడ జుమీ యలినీలకుంతలా!

టీక :-
ఇరవుగ = స్థిరముగా; నిర్జరులు = దేవతలు; తతి = సమూహము; ఖేచరము = ఆకాశంలో తిరుగ గలిగేది; శ్రీ వరుడు = విష్ణువు; అలినలకుంతల = తుమ్మెదల వంటి నల్లని తలవెంట్రుకలు కలయామె.
భావము :-
తుమ్మెదల వంటి నల్లని కురులు కలదానా! సతీదేవీ! స్థిరముగా అన్ని లోకాలనూ పాలించేవాడిని. మహేంద్రుడు, దేవతల సమూహంలో పేరు గలవాడిని. లోకాలన్నింటిలో పెద్దవాడిని. చక్కగా ఆకాశంగమనం గల వాడిని. భార్య పోరు లేనివాడిని. విష్ణువుకు, బ్రహ్మకు మొదటివాడిని సుమా.

2-280-ఆ.
ముదిమిలేనివాఁడ మోహనాకారుండఁ
రుణి నిన్ను నేలఁగినవాఁడ
న్నుఁ దగిలి నీవు నావెంటఁ జనుదెమ్ము
నటఁ గుందనేల నజనేత్ర!”

టీక :-
ముదిమి = ముసలితనము; తగిలియుండు = ఆసక్తమై యుండు; వనట = వనములో; కుందు = బాధపడు; వనజనేత్ర = తామరకన్నులయామె.
భావము :-
తరుణీ! ముసలితనము లేనివాడిని, అందమైన రూపము కలవాడిని, నిన్ను ఏలదగినవాడిని. నాపై ఆసక్తితో నీవు నా వెంట రా. వనజనేత్రా! వనములో బాధపడుటెందుకు?”

2-281-క.
నుడు “వినఁదగనిమాటలు
గొకొని వీఁడాడెనేని కూకటివేగం
బునఁ బట్టి వనము వెడలఁగ
నుపుం” డని చెలుల కంత యానతియిచ్చెన్.

టీక :-
గొనకొను = యత్నించు; కూకటి = జుట్టు; అనుపు = పోవునట్లు చేయు, పంపించు
భావము :-
అనగా విని “పూని వీడు వినకూడని మాటలు మాట్లాడితే వేగముగా జుట్టుపట్టి వనము పంపించేయండి.” అని చెలులకు పార్వతి ఆనతిచ్చెను.

2-282-క.
ని పలికిన చెలు లందఱు
నుఁ బట్టెదరని తలంచి త్తరపడఁగాఁ
నుఁగొని దండము ద్రిప్పుచు
నితలతో బ్రహ్మచారి టుఁ డిట్లనియెన్.

టీక :-
తత్తరపడు = తొందరపడు, కలవరపడప.
భావము :-
అని పార్వతి పలుకగా చెలులందరు తనను పట్టుకుంటారని గమనించి కలవరపడి దండము తిప్పుతూ ఆ వనితలతో బ్రహ్మచారి ఇలా అనెను.

2-283-శా.
న్నున్ బట్టెడువారె మీవశమె యన్యాయంబుగా నిప్పుడున్
న్నున్ జిన్నగఁ జూడవద్దు వినుఁడా! నారాయణబ్రహ్మలున్
న్నున్ బట్టఁగలేరు చిక్కఁబడునే నాబోఁటి మీచేత మీ
న్నంబైన తలంపు వోవిడువుఁడో చంద్రాస్య! లింకియ్యడన్.

టీక :-
బోటి = వంటివాడు; సన్నము = అల్పము; చంద్రాస్యలు = చంద్రుని వంటి ముఖము కలవారు; ఎడ = చోటు.
భావము :-
“నన్ను పట్టేవారా? అది మీ వశమా? అన్యాయంగా నన్నిప్పుడు తక్కువచేసి చేసి చూడకండి. వినండి. ఆ నారాయణుడు, బ్రహ్మలే నన్ను పట్టుకోలేరు. నా వంటివాడు మీ చేత చిక్కుతాడా? ఓ చంద్రముఖులారా! ఇంక ఇప్పుడు మీ అల్పమైన ఆలోచనను విడవండి.

2-284-ఉ.
చ్చఁ గులంబు గోత్రమును నించుక లేని లతాంగికిన్ శిరం
బిచ్చి వరించినాఁడ నిపుడియ్యెడ నీ యువతీలలామ నా
కిచ్చినఁ జాలుఁగాని సతి కిప్పుడ మీరలు చూడ దేహమే
నిచ్చెదఁ గాంతలార! వరియింపఁగఁ గన్యకు బుద్ది సెప్పరే!

టీక :-
ఇచ్చ = కోరిక; శిరంబునిచ్చుట = మనసునిచ్చుట.
భావము :-
కులము, గోత్రము కొంచెము కూడా లేని లతాంగి కోరితే మనసిచ్చి వరించాను. ఇప్పడు ఇక్కడ ఈ యువతీ లలామను నాకిస్తే చాలు. కాంతలారా! మీరు చూస్తుండగా ఈ సతికి నా శరీరమే ఇస్తాను. వరించమని ఈ కన్యకు నచ్చచెప్పండి.

2-285-ఉ.
మాలువేయు నేమిటికి మానినులార! వినుండు చెప్పెదన్
పాలగంధి నాకుఁ దగు భామిని కేఁ దగుదున్ వరింప ని
చ్చోనె పెండ్లియాడెదను సుందరి యేరతి నాససేయునో
వాముగాఁగ నారతులవారక తేల్చెద నంచు బల్కగన్.

టీక :-
పాటలగంధి = పున్నాగ పుష్పము గంధము వంటి సువాసన కల స్త్రీ; వాటము = అనుకూలము.
భావము :-
“మానినులారా! వేయి మాటలెందుకు. చెప్తాను వినండి. ఈ స్త్రీ నాకు తగినది, ఈ భామినికి నేను తగినవాడను. ఆమె వరిస్తే నేను ఇక్కడే పెండ్లి చేసుకుంటాను. సుందరి ఏవిధముగా రతికి ఇష్టపడితే దానికి అనుకూలంగా నేను ప్రవర్తిస్తాను.” అంటూ వటుడు పలుకగా.

2-286-వ.
విని యమ్మహాదేవి యిట్లనియె.

టీక :-
మహాదేవి = పార్వతి.
భావము :-
విని పార్వతీదేవి ఇలా అన్నది.

2-287-ఉ.
వీఁ డఁట; బ్రహ్మచారియఁట; వీనుల బెట్టఁగరాని మాటలే
యాడుచునున్నవాఁడు; మదనాంధుఁడు వీఁడు నమశ్శివాయ యొం
డాడఁగవద్దు వీనిఁ గపటాత్ముని నిచ్చట నుండనీక పం
డ్లూడఁగవేసి ద్రొబ్బుఁ డని యుగ్రతఁ బల్కినఁ గాంత లందఱున్.

టీక :-
ద్రొబ్బు = పడద్రోయు; ఉగ్రత = తీవ్రత.
భావము :-
“ఇతనో బ్రహ్మచారట. వినరాని మాటలే మాట్లాడుతున్నాడు. కామంతో కళ్ళు మూసుకుపోయినవాడు. వీడు నమశ్శివాయ యని అననే వద్దు. ఈ మోసగాడిని ఇచ్చటుండనీయక పండ్లూడగొట్టి పడదోయండి” అని తీవ్రంగా పలుకగా, కాంతలందరూ....

2-288-సీ.
దండంబువిసరినఁ ప్పించుకొనిపోయి
పొలఁతులు కొందఱు పొదివిపట్టి
బాహుదండంబునఁ ట్టిన గొడుగును
లిమిమై నల్లంతఁ బాఱవైచి
రము బిగ్గనఁబట్టి ట్టిన యొల్లియ
నొడిసి వ్రాలినఁ గొఁచి విడిచిపుచ్చి
కూకటిఁ బలుమాఱుఁ గుదియించి కుదియించి
చేడియల్ నవ్వుచు శిరమువంపఁ

2-288.1-ఆ.
బిన్నవాఁడుపోలె పెనఁగులాడుచునుండి
బాలుఁడైన కపట బ్రహ్మచారి
మాయమయ్యె దోఁచె గువకు ముందటఁ
హితమైనచిత్ర హిమతోడ.

టీక :-
పొలతి = స్త్రీ; ఒల్లియ = ఉత్తరీయము; కూకటి = జుట్టు; కుదియించు = అణచు, కుదుపు; బిన్నవాడు = చిన్నపిల్లవాడు; తోచు = ప్రత్యక్షమగు.
భావము :-
వటుడు దండము విసిరితే తప్పించుకొని, కొందరు స్త్రీలు గుమిగూడి యొడిసి పట్టుకున్నారు; చంకలోనున్న గొడుగును బలంగా దూరంగా విసరివేసారు; చేతులు గట్టిగా పట్టుకొని, కట్టకున్న పై వస్త్రము, గోచి ఊడదీసి, జుట్టు పట్టుకొని పలుమార్లు కుదిపారు; వారంతా నవ్వుతూ అతని తలను వంచగా, చిన్నపిల్లవాడివలె పెనుగులాడుతూ ఆ కపట బాల బ్రహ్మచారి మాయమైపోయాడు. తన మహా మహిమతో మగువ ముందర ప్రత్యక్షమయ్యాడు.