పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : పార్వతి తపముసేయ వనమునకు నేగుట

2-237-సీ.
రినీలములఁబోని లకలజడ లల్లి
హితరుద్రాక్షదాములు చుట్టి
బాలచంద్రురుఁబోని ఫాలస్థలంబున
స్మత్రిపుండ్రంబు రఁగఁ దీర్చి
రుణవల్లియుఁబోని నువల్లినిండారఁ
దనిచ్చిపలుచని స్మ మలఁది
కాముచక్రముఁబోలు టిచక్రతలములఁ
నరుకాషాయవస్త్రంబుఁ గట్టి

2-237.1-ఆ.
బిసముబోలికేల నెసగఁ గమండలు
దండ పుండరీక నుకళాస
ములు ధరించి భువనమోహనశ్రీ యగు
గౌరి తపసివేషధారి యయ్యె.

టీక :-
హరినీలము = ఇంద్రనీలము; పోని = పోలిన; అలకలు = ముంగురులు; మహిత = గొప్ప; దామము = హారము; ఫాలము = నుదురు; పరగ = ఒప్పుగా; తరుణ = లేత; వల్లి = తీగ; తనువు = దేహము; పదనిచ్చు = తడిచేయు; కటిచక్రము = మొల; తనరు = అతిశయించు; బిసము = తామరతూడు; కేలు = చేయి; ఎసగించు = ఒప్పు; పుండరీకము = పులి; కళాసము = చర్మము; శ్రీ = అలంకరణము.
భావము :-
ఇంద్రనీలాలవంటి ముంగురులు జడలల్లి; గొప్పవైన రుద్రాక్ష హారములు చుట్టి; బాలచంద్రుని వంటి నుదుటిపై విబూది రేఖలు మూడు ఒప్పుగా పెట్టి; లేతతీగవంటి తనూలతనిండుగా తడిచేసిన పలుచని విబూది రాసి; కాము చక్రము వంటి మొలకు అతిశయించే కాషాయవస్త్రము కట్టి; తామరతూళ్ళవంటి చేతులతో కమండలము, దండము, పులితోలు ధరించి భువనమోహన అలంకరణతో గౌరీదేవి తపసి వేషము ధరించెను.

2-238-వ.
ఇట్లు వివిధ విలసిత విచిత్రత పోవేషధారియై తన సఖీజనంబులు దానును తలిదండ్రుల మనంబులు సంతసిల్ల వీడ్కొని వనవాసప్రయాణంబై పోయి; కతిపయిదూరంబున నకాలపల్లవఫలభరితశాఖాలోకవిరాజిత మందార, మాతలుంగ, చందన, పున్నాగ, తిలక, కేసర, కదళీ, జంబీర, కదంబ, నింబ, తమాల, రసాల, హింతాళ ప్రముఖ నానాభూజాతసంఘాత విలసితంబును; నిర్మల సరోవరజనిత ఫుల్లసల్లలిత కమలప్రసూన బంధురగంధవాహ ధూత బల పరాగధూళిపటల దశదిశాలంకృంతంబును; ననంత లతాసిత సంఫుల్ల పరిమళమోద మారుతసమ్మిళిత దూరదేశంబును; మరాళ, శారికా, కీర, మధుకర, కోకిలాది నానావిహంగ మృదుమధురవచన ప్రమోదితంబునునై సకలతపోవనరాజ్యలక్ష్మీశోభిత వైభవంబనం బొల్చు నొక్క వనంబుఁ గాంచి సంతసించి దరియంజొచ్చి సంభ్రమంబున.

టీక :-
విలసిత = ప్రకాశింపబడిన; విచిత్రము = చక్కగా చిత్రించబడినది, ఆశ్చర్యకరము; కతిపయ = కొంత, కొన్ని; అకాలము = సరికాని కాలము, ఆ ఋతువునకు ఉండని; పల్లవము = చిగురు; శాఖ = చెట్టుకొమ్మ; అలోకము = చూడబడనిది; విరాజిత = ప్రకాశింపబడిన; మాతలుంగ= మాదీఫలపు చెట్టు; తిలక = బొట్టుగు చెట్టు; కేసర = పొగడచెట్టు; కదళి = అరటి; జంబీర = నారింజ; కదంబ = కడిమిచెట్టు; నింబ = వేపచెట్టు; తమాల = ఉలిమిరి చెట్టు; రసాల = మామిడి; హింతాళ = గిరక తాడిచెట్టు; భూజము = చెట్టు; ఫుల్ల = వికసించిన; లలిత = మనోజ్ఞము; ప్రసూన = ఫలము, పుష్పము; పటలము = గుంపు; ప్రమోదము = సంతోషము.
భావము :-
ఇలా నానావిధ ప్రకాశమానమైన అద్భుతమైన తపో వేషధారియై తన చెలులతో కలసి పార్వతీదేవి, తల్లిదండ్రుల మనసులు సంతోషించగా వీడ్కొని వనవాసమునకు బయలుదేరింది. కొంత దూరములో ఒక వనము అకాలంలో కూడా చిగురించి ఫలించే గుబురుగా యుండే చెట్లకొమ్మలు కలిగిన మందార, మాదీఫల, చందన, పున్నాగ, బొట్టుగు, పొగడ, అరటి, నారింజ, కడిమి, వేప, ఉలిమిరి, మామిడి మొదలైన చెట్లతో నిండి ప్రకాశిస్తున్నది; మరియు, నిర్మల సరోవరముమునందు పుట్టి వికసించిన మనోజ్ఞమైన కమలముల సుగంధము, పరాగరేణువులు దశదిశలా వ్యాపింపచేజేసే గాలులు కలిగి ఉంది; ఇంకా, హంసలు, నెమళ్ళు, కోయిలలు, చిలుకలు మొదలైన పక్షుల కలకలారావములతో నిండి యున్నది. సకల తపోవన రాజ్యలక్ష్మియైన ఆ వనమును చూసి సంతోషంగా ప్రవేశించి ఆశ్చర్యంతో...

2-239-ఉ.
 నధారుణీరుహము లెంతయు వింతఁ దనర్చి యుండునే
యీ నపుష్పవల్లికల కింత సుగంధవిభూతి యొప్పునే
యీ నజాంతరాన్వితము నేమని చెప్పఁగవచ్చు బాపురే!
యీ నశోభితంబు దివి నింద్రువనంబునకైన గల్గునే.

టీక :-
ధారుణి = భూమి; భూరుహము = చెట్టు; తనరు = అతియించి, కలిగి; అన్వితము = కూడియున్న.
భావము :-
ఈ వనములోని చెట్లు ఎంత వింతగా ఉన్నాయి? ఈ వనంలోని పూలతీగలకింత సుగంధమా? ఈ వనములో ఉన్నవాటి గురించి ఏమని చెప్పగలము? బళా! ఈవనశోభ స్వర్గములోని ఇంద్రుని వనానికైనా ఉంటుందా ?

2-240-క.
అంజుఁ డివ్వనమునఁ గల
భృంగంబులఁ గూడుకొనిన బిరుదై కడిమిన్
భంగించుఁగాక మదమరి
గంగాధరుకంటిమంటఁ గ్రాఁగునె తలఁపన్.

టీక :-
అంగజుడు = మన్మథుడు; భృంగములు = తుమ్మెదలు; బిరుదు = శూరుడు; కడిమి = అతిశయించు; భంగించు = భంగపరచు; మదము = గర్వము; క్రాగు = కాలు.
భావము :-
మన్మథుడు ఈ వనములోని తుమ్మెదలతో కలసి తిరిగి ఉంటే, శూరుడై అతిశయించేవాడు. ఆలోచించిచూస్తే అప్పుడు, మదనుడు గంగాధరుని భంగపరిచేవాడు తప్పించి అతని కంటిమంటలకు కాలిపోయేవాడు కాదు కదాజా!

2-241-ఆ.
 వనంబులోని యేపారు పుష్పంబు
లేయ మఱచెఁ గాక యేసెనేని
కాముచేత నాఁడు కామారి చిక్కఁడే
కలమైనవారు సంతసిల్ల.

టీక :-
ఏపారు = అతిశయించు; కామారి = శివుడు.
భావము :-
మదనుడు ఈ వనములోని పూలతో పూలబాణము వేయడం మరచాడేమో! అలా వేసియుంటే ఆనాడు అందరూ సంతోషించేలా మన్మథుని చేత శివుడు చిక్కేవాడే కదా!

2-242-వ.
అని మఱియు ననేక ప్రకారంబుల నవ్వనలక్ష్మిఁ గీర్తించి, చెలులనందఱి నాలోకించి వారివారిందగులాగున వర్తింప నియోగించి స్థలశోధనంబులాచరించి సర్వాంగ విభూతిస్నానయై చెలువు మిగల తపంబు సేయందొణంగె నిరుపమ నిర్మలత్వంబున.

టీక :-
ఆలోకించి = చూసి; శోధన = వెదకు; చెలువు = అందము; నిరుపమ = సాటిలేని.
భావము :-
ఆ సతీదేవి ఇంకనూ అనేక విధాలుగా ఆ వనమును పొగిడినది. చెలులను అందరినీ వారికి తగిన పనులకు నియోగించినది. సరియగు స్థలము వెదకి ఒంటినిండా విభూతి స్నానము చేసి అందముగా, సాటిలేని నిర్మలత్వముతో తపము చేయడం ప్రారంభించింది.

2-243-ఆ.
బాల చంద్రమౌళిపాదాంబుజంబుల
విమలహృదయకమలవీథి నిల్పి
నీరజాతనేత్ర నిష్కళంకాత్మయై
చెలువుమిగిలి తపము సేయఁ దొడఁగె.

టీక :-
విమల = పాపములేని, స్వచ్ఛమైన; నిష్కళంక = మచ్చలేని.
భావము :-
శివుని పాదములను నిర్మలమైన తన హృదయ కమలములో నిలిపి ఆ పద్మనేత్రి, సతీదేవి పరిశుద్ధాత్మతో ఒప్పుగా తపముచేయసాగింది.

2-244-క.
నాలుగుదిక్కుల మంటలు
గ్రాలఁగ వినువీథినున్న గ్రహపతి కెదురై
ఱాపయి నిలిచి వేసవి
కాము తపమాచరించెఁ న్నియ ప్రీతిన్.

టీక :-
వినువీధి = ఆకాశము; గ్రహపతి = సూర్యుడు.
భావము :-
నాలుగు దిక్కులలోనూ మంటలు కాలుతుండగా సూర్యునికెదురుగా ఱాళ్ళపై నిలబడి వేసవి కాలములో ఇష్టముతో పార్వతీ కన్నియ తపము చేసెను.

2-245-క.
పిడుగులు మెఱుపులు నురుములు
రఁగ మేఘములు జలము నిశము గురియ
న్గడుఁ దొడగి వానకాలము
డియుచుఁ బెనుబయలఁ జేసె దారుణ తపమున్.

టీక :-
అడరు = వ్యాపించు; అనిశము = ఎడతెగని; తొడంగు = పూను, ప్రయత్నించు; బయలగు = బహిరంగ ప్రదేశం.
భావము :-
పిడుగులు, మెరుపులు, ఉరుములు వ్యాపించి మేఘములు ఎడతెగక వర్షము కురిపిస్తుండగా. పూనికతో వానాకాలంలో తడుస్తూ పెద్ద బహిరంగ ప్రదేశంలో భయంకరమైన తపము చేసెను.

2-246-క.
నీ మెడమునుఁగుబంటిని
జారితల మంచుగురియఁ లికాలము మి
న్నేటి దరిఁ దలఁచువెచ్చని
చోటును సుఖమున్నభంగి సుందరి గడఁకన్.

టీక :-
జాటి = కొరడా; అరి = నేర్పు; మిన్నేరు = గంగ, పెద్ద ఏఱు; కడక = పూనిక.
భావము :-
కొరడాలా కరకుగా మంచు కురిసే చలికాలములో, మెడలోతు నీటిలో నిలబడి, పెద్దకాలువ దగ్గర వెచ్చని చోట సుఖముగా యున్నట్లు తలుస్తూ ఆ సుందరి పూనికతో తపము చేసెను.

2-247-క.
ది పగలని యిది రేయని
యిది చలి యిది యెండ వాన యిదియని సతి దా
దిఁ దలపోయక యీక్రియఁ
పడి కాలంబు సలిపె రమతపంబున్.

టీక :-
పదపడి = తర్వాతి; సలుపు = చేయు.
భావము :-
ఇది పగలు, ఇది రాత్రి, ఇది చలి, ఇది ఎండ, ఇది వాన యని సతి (తన మనస్సలో తలపోయక) పట్టించుకోక ఈ విధంగా తర్వాతి కాలమంతా గొప్ప తపము చేసెను.

2-248-వ.
అంతఁ దదీయ దివ్యతపోమహత్వంబులన్నియు నవలంభించి ఆవరణ ఘోరంబై.

టీక :-
తదీయ = ఆయొక్క.
భావము :-
అంతట ఆయొక్క గొప్పదైన తపస్సు చేసే పద్ధతులన్నీ అవలంబించి చేసిన ఆ ఘోర తపస్సుకు.....

2-249-శా.
లంఘించెం గమలోద్భవుండు మదిఁ దాక్షించి తద్దేవతా
సంఘం బెల్లఁ గలంగె మేలుకొనియెం క్రాయుధుం డంత వే
గం ఘీంకారములిచ్చె దిగ్గజములుం గైలాసశైలంబు దు
ర్లంఘ్యంబైన గణాళితోఁ గదలి దొర్లంబాఱె నల్లాడుచున్.

టీక :-
కమలోద్భవుడు = బ్రహ్మదేవుడు; లక్షించు = చూచు; కలంగు = కలవరపడు; చక్రాయుధుడు = విష్ణువు; లంఘనము = దాటుట.
భావము :-
బ్రహ్మ ఎగిరి గంతేశాడు. ఆ తపస్సును చూసి దేవతలంతా కలవరపడ్డారు. విష్ణువు మేలుకొన్నాడు. దిగ్గజములు బిగ్గరగా ఘీంకరించాయి. కైలాస పర్వతం ఎదిరింపరానిదైన ప్రమథ గణాలతో సహా కదలి వణకసాగింది.

2-250-ఆ.
 కైలాసముమీఁదను
శ్రీకరముగనున్నయట్టి శ్రీకంఠుఁడు దా
నాకతముఁ దెలిసి తనలోఁ
బ్రాకటముగ నుబ్బి చెలఁగెఁ రిణామముతోన్.

టీక :-
శ్రీకరము = లక్ష్మీప్రదమైన; శ్రీకంఠుడు = గరళ కంఠుడు, శివుడు; కతము = వృత్తాంతము; ప్రాకటము = అధికము; చెలఁగు = ఒప్పు; పరిణామము = ఆనందము.
భావము :-
ఆ కైలాసములో సుభకరముగానున్న శివుడు తాను ఆ వృత్తాంతమంతా తెలిసికొని తనలోతాను సంతోషంతో బాగా పొంగిపోయి ఒప్పెను.

2-251-సీ.
పముసేయకకాని న్నువరింప?
శృంగారి తపముసేయంగ నేల
నుఁగవయఁగఁ గోరి పముసేయుచునున్న
నుఁ గూర్చి యీనిష్ట నకు నేల
న్నుఁ బాయనిప్రేమఁ లపోసి యలరంగఁ
పమున డయ్యంగఁ నక నేల
యే నొక్కవింతయే యే నొక్క బ్రాఁతియే
యిందీవరాక్షికి నింత యేల”

2-251.1-ఆ.
ని శశాంకజూటుఁ డానందచిత్తుఁడై
రుణతోయరాశి రముమెఱయ
చిన్ననగవు లేఁత చెక్కులఁ దొలఁకాఁడ
నీశ్వరుండు పార్వతీశ్వరుండు.

టీక :-
కవయు = జతగూడు; అలరు = సంతోషించు; డయ్యు = కృశించు; ఇందీవరము = నల్లకలువ; తోయరాశి = సముద్రము; కరము = అత్యంతము.
భావము :-
“తపము చేస్తేనేగాని తనను వరించనా! ఆ శృంగారి గౌరీదేవి తపము చేయడ మెందుకు? తనను జతగూడుట కొరకు నేను తపము చేస్తుంటే, నన్నుగూర్చి ఈ నిష్ఠ తన కెందుకు? తనను విడువని ప్రేమతో నేను తలచుచుండగా, తపముతో కృశించుట తన కెందుకు? నేనొక వింతా! నేనొక భ్రాంతా! ఇందీవరాక్షికి ఇంతెందుకు?” అని శివుడు ఆనందించి కరుణాసముద్రుడై చిరునవ్వు చెక్కిలిపై కదలాడగా ఈశ్వరుడైన పార్వతీశ్వరుడు......