పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : కందర్పుఁడు రతీదేవికి తా నరిగిన వృత్తాంతంబు చెప్పుట

2-67-క.
 నాథుఁడువచ్చుటగని
వియంబుననెదురువచ్చి విభుచిహ్నముఁ దాఁ
నుఁగొని పెదవులు దడపుచుఁ
 పతికి రతీలతాంగి దా నిట్లనియెన్.

టీక :-
విభుడు = భర్త; చిహ్నము = గుఱుతు.
భావము :-
తన భర్త రాకను గమనించి వినయంగా ఎదురువచ్చి భర్త (ముఖ కవళికలు) గుర్తులు తాను తెలుసుకొన్నది. పెదవులు తడుపుకొంటూ భర్తతో రతీ లతాంగి యిలా అన్నది.

2-68-సీ.
చిత్తసంభవ! నీదు శృంగారవారాశి;
మూఁగియున్నదిగాని మ్రోఁతలేదు;
కందర్ప! నీముఖమలముకళ యెల్ల;
నెక్కడఁజొచ్చెనో యెఱుఁగరాదు;
దన! నీతియ్యని మాటలు చెలరేఁగి;
వింతలై పలుమాఱు వినఁగరావు;
అంగజ! నీలోచనారవిందంబులు;
సురిఁగి యున్నవి గాని సొంపులేదు;

2-68.1-ఆ.
ట్టిపనికిఁ దలఁచె నే మని పంపెనో
భూధరారి నిన్ను బుజ్జగించి
విబుధు లెల్ల బంప వెఱ్ఱివై యే పనుల్
సేయనియ్యకొంటి చెప్పవయ్య!”

టీక :-
చిత్తసంభవుడు = మన్మథుడు; వారాశి = సముద్రము; మూగియుండు = మూగగానుండు; కళ = కాంతి; సురుగు = చలించు; భూధరారి = పర్వతముల శత్రువు, ఇంద్రుడు; విబుధులు= వేలుపులు, దేవతలు; ఇయ్యకొను = ఒప్పుకొను.
భావము :-
“చిత్తసంభవా! నీ శృంగార సముద్రం మూగవోయెను. ఏ సడీ లేదు. కందర్పా! నీ ముఖకమల కాంతి యంతా ఎక్కడకు పోయెనో తెలియదు. మదనా! ఆశ్చర్యంగా నీ తియ్యని మాటలు విజృంభించి పదేపదే వినబడుటలేదు. అంగజా! నీకన్నులు చలించుచున్నవి గాని సొంపు లేదు. ఎటువంటి పనికి నిన్ను తలచాడో? ఏమని పంపాడో ఆ ఇంద్రుడు? దేవతలు లాలించి చెప్పడంతో వెఱ్ఱివాడిలా ఏపనులు చేయనొప్పుకొంటివయ్యా? చెప్పవయ్యా!.”

2-69-వ.
అని పలికినఁ బ్రాణవల్లభ వదనంబాలోకించి పంచబాణుం డిట్లనియె.

టీక :-
ఆలోకించి = చూసి; పంచబాణుడు = మన్మథుడు.
భావము :-
అని పలికిన భార్య ముఖంలోకి చూసి మన్మథుడు ఇలా అన్నాడు.

2-70-సీ.
నాతి! యిక్కడనుండి నాకంబుకుంబోయి;
మరావతీపురం మరఁజేరి
దేవకాంతలు రెండుదెసలఁ జూచుచునుండ;
దేవేంద్రుమొగసాలఁ దేరుడిగ్గి
పోయి నేమ్రొక్కినఁ బొలుపారమన్నించి;
నాకాధినాథుండు న్నుఁజూచి
బాలేందుమౌళికిఁ బార్వతికన్నియఁ;
గూర్పంగఁబుట్టెడు కొమరుచేత

2-70.1-ఆ.
దారుణాత్మకుండు తారకదైత్యుండు
వేఁగుననుచుఁజెప్పి వీడుకొలిపె
నిత పంపు పూని చ్చితి నింక దం
డెత్తిపోవలయును నీశుమీఁద”

టీక :-
నాతి = స్త్రీ; అమరజేరి = తిన్నగావెళ్ళి; మొగసాల = ముఖమండపము, ముంగిలి; తేరు = రథము; డిగ్గి = దిగి; పొలుపార = నిండుగా; కొమరుడు = కుమారుడు; వేగు = దగ్ధమగు.
భావము :-
“రతీ! ఇక్కడనుండి స్వర్గానికి వెళ్ళి, తిన్నగా అమరావతీపురం చేరాను., దేవకాంతలు ఇరుప్రక్కలా చూస్తుండగా, దేవేంద్రుని ముఖమంటపం వద్ద రథము దిగి, వెళ్ళి నేను నమస్కరించాను. నిండుగా గౌరవించి, ఇంద్రుడు నాతో “శివునితో పార్వతిని కలిపితే పుట్టే కుమారుని చేతనేదుర్మార్గుడైన తారకాసురుడు చనిపోతాడు”. అనిచెప్పి పంపారు. ఆ బాధ్యత ఒప్పుకొని వచ్చాను. ఇంక ఈశ్వరునిపై దండెత్తి వెళ్ళాలి.” అన్నాడు మన్మథుడు.