పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : హిమవంతుడు తన యింటికి గూతుం గొనిపోవుట

2-163-శా.
అంతన్ గొండలరాజునెమ్మనములో నా వార్తయాలించి వే
సంతాపంబునఁ జిన్నవోయిచని తా ర్వేశ్వరుం గాన క
త్యంతాదోళ విచారయైన తనయన్ దా వేగఁ గొంపోయె న
క్కాంతారత్నము తండ్రి దోకొనిచనంగా నేఁగె శీతాద్రికిన్.

టీక :-
నెమ్మనము = నిండు మనసులో; ఆలించి = విని; సంతాపము = దుఃఖము; చిన్నబోవు = నిరుత్సాహపడు, సిగ్గుపడు; ఆందోళన = చలించు.
భావము :-
అంతట హిమవంతుడు మనసులో యా వార్తవిని దుఃఖముతో నిరుత్సాహపడి వెళ్లి శివుడు కనబడక మిక్కిలి చలించి విచారము పొందిన కుమార్తెను తాను వెంటనే తీసుకువెళ్తాననగా ఆ పార్వతీదేవి తండ్రితో హిమాచలమునకు వెళ్ళెను.

2-164-క.
ప్రదంబునఁ దలిదండ్రులు
లాక్షికిఁ జెలుల నిచ్చి గౌరతసేయం
హివంతుపట్టణంబునఁ
లానన గౌరి కొంతకాలము గడపెన్.

టీక :-
ప్రమదము = సంతోషము.
భావము :-
సంతోషంగా తల్లిదండ్రులు కమలాక్షికి చెలులనిచ్చి గౌరవించగా హిమవంతుని పట్టణంలో కమలము వంటి ముఖముగల గౌరి కొంతకాలము గడిపింది.

2-165-వ.
అంత నొక్కనాఁడు, పరమేశ్వరుండు కైలాసంబున సుఖంబుండి గౌరీదేవిం దలంచి ప్రేమచేసి యుండు టెఱింగి నిజాంతర్గతంబున.

టీక :-
ప్రమదము = సంతోషము.
భావము :-
అంతట ఒకనాడు శివుడు కైలాసంలో సుఖముగానుండి గౌరీదేవిని తలచుకొని ప్రేమకలిగి యున్నట్లు మనసులో గుర్తించాడు.