పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : బృహస్పతి బ్రహ్మకుఁ దారకాసురుఁడుచేయు బాధలం దెలుపుట

2-7-వ.
సురాచార్యుండు బ్రహ్మదేవున కిట్లనియె.

టీక :-
సురాచార్యుడు = బృహస్పతి.
భావము :-
బృహస్పతి బ్రహ్మదేవునితో ఇలా చెప్పాడు.

2-8-లగ్రా.
ఆఁకొని కరాళగతి భీకరపుఁ జూపులను;
భేముల మూఁకలను వీఁకఁగని యాద
ర్వీరము మ్రింగుక్రియ నాకపులతో నిఖిల;
లోములు దారకుఁడు చేకొని హరింపన్
బ్రాటపుఁ గామినుల వీఁకఁ జెఱవట్టి మఱి
నాముఖపట్టణము లాఁకగొని యుండన్
డాకునుగాక యిటు నీకు వినిపింప ఘన
శోమున వచ్చితిమి గైకొను విరించీ!

టీక :-
ఆకొను = ఆకలిగొను; కరాళము = వెరపు పుట్టించునది; భేకము = కప్ప; వీకగొను = విజృంభించి; దర్వీకరము = పాము; నాకపులు హరించు = అపహరించు, కొల్లగొట్టు; నాకముఖపట్టణము = స్వర్గమునకు రాజదాని, అమరావతి; ప్రాకటము = ప్రసిద్ధము; వీక = విజృంభణము; డాక = శౌర్యము.
భావము :-
"ఆకలితో, భీకరమైన చూపులతో కప్పల గుంపును విజృంభించి మ్రింగు పామువలె, దేవతలతో సహా యన్నిలోకములను తారకాసురుడు కొల్లగొట్టుతున్నాడు. ప్రసిద్ధమైన దేవకాంతలను విజృంభించి చెరబడుతున్నాడు. అమరావతీ పట్టణాన్ని లాక్కున్నాడు. వానిని తట్టుకొను శౌర్యము లేక, తీవ్రమైన శోకంతో నీకు విన్నవించుకోవడానికి వచ్చాము. వినవయ్యా! విరించీ!.....

2-9-క.
తాసుల నెల్లఁ జంపెను
కోపంబున సురలఁ జెఱలుగొని వర్తిల్లెన్
పాపురక్కసునకు మీ
రేపారఁ ద్రిలోకవిజయ మిత్తురె? చెపుఁడా.”

టీక :-
మీరేపారన్ = మీరు ఏపారన్ (అతిశయంతో).
భావము :-
తారకుడు ఋషులందరినీ సంహరించాడు. కోపముతో దేవతలను చెఱపట్టాడు. ఆ పాపి తారకాసురునకు మీరు అతిశయముతో త్రిలోకవిజయాన్ని ఇవ్వచ్చా? చెప్పండి బ్రహ్మదేవా!" అని బృహస్పతి అడిగాడు.

2-10-వ.
అనవుఁడు దరహసిత వదనుండై రాజీవభవుం డిట్లనియె.

టీక :-
అనవుడు = అనగావిని; దరహసితము = చిరునవ్వు; రాజీవభవుడు = బ్రహ్మ.
భావము :-
బృహస్పతి పలుకులు విన్నబ్రహ్మ చిరునగవుమోముతో ఇలా అన్నాడు.

2-11-క.
“ఏను వరమీకయుండిన
వాని తపోవహ్ని జగము లగొని కాల్పున్
నే నేలవెఱ్ఱి నయ్యెదఁ
గా సురాధీశులార! లఁగకుఁడింకన్.

టీక :-
ఏను = నేను; వహ్ని = అగ్ని; వలగొని = చుట్టబెట్టి; కలగు = కలతపడు.
భావము :-
"నేను వరమీయకపోతే వానితపమువలన పుట్టిన అగ్ని లోకాలన్నింటినీ చుట్టబెట్టి కాల్చివేసి యుండెడిది. నేనేమైనా వెఱ్ఱివాడినా? దేవతలారా! ఇక కలతచెంద వలదు.”

2-12-వ.
అని మఱియును.
భావము :-
అని ఇంకా...

2-13-ఉ.
శూలికి శీతలాచలముచూలికిఁ గూరిమితోడఁబుట్టు న
బ్బాలుఁడుగాని దానవునిఁట్టి మహోగ్రతఁ గీటడంపఁగాఁ
జాలఁడు సిద్దమీపలుకు ర్వయుపాయములందు భావజున్
ఫాతలాక్షు నీక్షణమె ర్వతికన్యకఁ గూర్పఁ బంపుఁడా.

టీక :-
శూలి = శూలాయుధము ధరించినవాడు, శంకరుడు; చూలి = సంతానము; శీతాచలముచూలి = హిమవత్పర్వత పుత్రి కూతురు, పార్వతి; కీటడగించు = మదమణఁచు; భావజుడు = మన్మథుడు; ఫాలతలాక్షుడు = ఫాలమునందు కన్ను కలవాడు, శివుడు.
భావము :-
శివునకూ హిమవత్పుత్రి పార్వతీదేవికీ పుట్టినట్టి బాలుడు తప్ప ఆ రాక్షసుని మహోగ్రతను అణచివేయలేడు. అన్ని యుపాయములలోకీ ఇదే సరైనది. శివుని, పార్వతిని కలపడానికి తక్క్షణమే మన్మథుని ఏర్పాటుచేయండి."

2-114-వ.
అని కమలసంభవుండు విచారించి కార్యంబు తేటవడం బలికిన "నగుఁగాక" యని మహామోదంబున.

టీక :-
తేటపడు = విశదమగు.
భావము :-
అని బ్రహ్మదేవుడు చేయవలసిన పనిని గురించి విశదపరిచాక సరేనని ఇంద్రుడు చాలా ఆనందంతో...

2-15-క.
నిర్జరలోకము గొలువఁగ
నిర్జరనాథుండు చిత్తనిర్జరుఁడగుచున్
నిర్జరగేహిను లలరగఁ
నిర్జరపురికేఁగెఁ దాను నిర్జరమతియై.

టీక :-
నిర్జరులు = ముదిమి లేని వారు, దేవతలు; గేహినులు = ఇల్లాళ్ళు; అలరు = సంతోషించు; చిత్తనిర్జరము = నిర్జర (కొంచముకాని) చిత్తము, వికసించిని చిత్తము.
భావము :-
దేవతలందరూ సేవిస్తుండగా మహేంద్రుడు మనస్సును కుదుటపరచుకొని, దేవతా స్త్రీలు సంతోషించుచుండగా, తొణకని మనసుతో, వికసించిన చిత్తముతో అమరావతికి వెళ్ళెను.

2-16-వ.
అట్లేఁగినాకంబునందు.

టీక :-
నాకము = స్వర్గము.
భావము :-
అలా వెళ్ళి స్వర్గంలో..

2-17-శా.
మందా రోన్నతపారిజాతకదళీమాకందపుష్పావలీ
మందాలోలసుగంధమారుతమనోమాన్నిత్యసమ్మోదియై
నందాత్ముల్సురసిద్ధసాధ్యవిలసన్నాగేంద్రబృందంబు లిం
పొందం గొల్వ ననంతరాజ్యసిరిఁ గొల్వుండెన్ సురేంద్రుండొగిన్.

టీక :-
మందారము = మందార పర్వతము; ఉన్నత = ఎత్తైన; కదళీ = అరటి; మాకంద = మామిడి; ఆవలి = సమూహము; మందా= నిమ్మళముగా; ఆలోల= మెల్లగా కదలునది; మారుతము = వాయువు ; మనః+మానః+నిత్య+సమ్మోదము = మనసును రంజింపచేయుచూ నిత్యమూ సంతోషము కలిగుంచునది, (మనః = మనస్సు; మానః = చిత్తౌన్నిత్యము కలిగించునది; నిత్య = ఎల్లప్పుడూ ; సమ్మోదము= సంతోషము); నందాత్ములు =సంతోషమైన ఆత్మ కలవారు; విలసత్= ప్రకాశించు; ఇంపొందు= ఒప్పు;ఒగిన్= వరుసగా.
భావము :-
మందర పర్వతమంత ఎత్తైన మందార, పారిజాత, అరటి, మామిడి వృక్షములకు పూసిన పూలగుత్తుల సువాసనలతో నిండిన గాలి నిమ్మళముగా వీస్తూ నిత్యమూ చిత్తవికాస, మనోనందములను కలిగిస్తుండగా, ఆత్మానంద పూరితులైన సురలు, సిద్ధులు, సాధ్యులు, నాగులు చక్కగా సేవించుచుండగా అప్పుడు సురేంద్రుడు అనంత రాజ్యలక్ష్మీ వైభోగంతో కొలువు తీర్చి యుండెను.

2-18- వ.
అట్లు కొలువుండి
భావము :-
అలా కొలువుండగా…..

2-19-సీ.
భాసిల్లుపువ్వుల బాణపఙ్క్తులవానిఁ
గొమరారుకెందమ్మిగొడుగువానిఁ
లహంసశారికా లకంఠములవాని
వెలుగొందుతియ్యని వింటివాని
మందానిలలలామ దభృంగములవాని;
దెఱగొప్పుపువ్వుల తేరువాని
లుమీనుటెక్కంబు డగనొప్పెడువాని;
నామనిసారథి యైనవాని

2-19.1-ఆ.
అందమైనవాని కలంకశృంగార
విభవలక్ష్మిచేత వెలయువాని
మోదవృత్తివాని మోహనాకృతివానిఁ
గాముఁ దలఁచె నాకధాముఁ డపుఁడు.

టీక :-
భాసిల్లు= మిసమిసలాడు; పంక్తులు= వరుసలు; కొమరారు= మనోజ్ఞమైన; కెందమ్మి= ఎఱ్ఱదామర; శారిక= గోరువంక; కలకంఠము= కోకిల; తియ్యనివిల్లు= చెఱకువిల్లు; మందానిలము= మెల్లగా వీచు గాలి, మందమారుతము; లలామము = (ఉత్తరపదమైనచో) శ్రేష్ఠము; భృంగము= తుమ్మెద; తెఱగొప్పు= ఉచితరీతి; తేరు= రథము; మీను టెక్కెము = చేప గుర్తు గల ధ్వజము, మన్మథుని జండా; ఆమని= వసంతము; అకళంక= దోషములేని, స్వచ్ఛమైన; మోదము = సంతోషము; కాముడు =మన్మథుడు; నాకధాముడు = ఇంద్రుడు.
భావము :-
మిలమిలలాడు పూలబాణాలు (1. అరవిందము, 2. అశోకము, 3. చూతము, 4. నవమల్లిక, 5. నీలోత్పలము అను ఐదు పూవులు మన్మథుని బాణాలు) గలవానిని, మనోజ్ఞమైన ఎఱ్ఱతామర గొడుగుగా కలవానిని, హంసలు గోరువంకలు నెమళ్ళు గలవానిని, ప్రకాశించే చెఱకువిల్లు (మన్మథుని ఆయుధము) గలవానిని, శ్రేష్టమైన మందమారుతమూ మదమెక్కిన తుమ్మెదలు గలవానిని, ఉచితరీతిని పూలరథం (మన్మథుని రథం) కలవానిని, మీనధ్వజము (మన్మథుని జండా) గలవానిని, వసంతఋతువు సారథిగా గలవానిని, అందమైనవానిని, దోషములేని శృంగార వైభవముచే వెలుగువానిని, సంతోషమే వృత్తిగా కలవానిని, మోహింపచేసే రూపముగలవానిని, మన్మథుని అపుడు ఇంద్రుడు తలచుకొనెను.

2-20-వ.
అయ్యవసరంబున.
భావము :-
ఆ సమయంలో…

2-21-లగ్రా.
న్ను మదిలోన వెయికన్నులపురందరుఁడు;
న్నుతగతిందలఁప వెన్నునిసుతుండున్
చెన్నులువెసందలకి యున్నఁ గనితానతనిఁ;
దిన్నఁగనుఁ గౌఁగిటను నున్న రతికాముం
జిన్నతనమేల పెరగన్నియలనన్వలచి
న్ను మరువందగునె” యన్న మదనుండున్
నిన్ను వెలిగాసతుల నన్నులఁదలంతునె ప్ర
న్నమతితోటివిను నన్ని యెఱిఁగింతున్.

టీక :-
పురందరుడు = ఇంద్రుడు (వైవస్వత మన్వంతరము నందలి దేవేంద్రుని పేరు. ఇది ఇంద్రునికి సామాన్యనామముగా వాడబడును.) (పురందరుడు – వ్యు. పూర్+ధౄ(ణిచ్)+ఖచ్-ముమ్-నిపా, కృప్ర., శత్రువులను నశింపజేయువాడు, ఇంద్రుడు, శివుడు, పురారి, విష్ణువు, అగ్ని, చారుడు); సన్నుతగతి = అభివర్ణించే విధంగా; వెన్నుడు= విష్ణువు (ప్ర), వెన్నుడు (వి); చెన్ను = అందము; వెసన్ = వేగిరపాటు; పెర = అన్యము; వెలిగా = బహిష్కారము; ప్రసన్నమతి = నిర్మలమైన మనసు; ఎఱిగింతును = తెలియపరచెదను.
భావము :-
తనను మనస్సులో వేయికన్నులవాడైన ఇంద్రుడు అభివర్ణిస్తూ తలచుకోగానే విష్ణుతనయుడైన మన్మథుడు వేగిరపాటుతోనుండట రతీదేవి చూసినది. అప్పుడు అతని కౌగిలిలోనున్న ఆమె మన్మథునితో “చిన్నతనమెందుకు అన్యకాంతలను వలచి నన్ను మరచిపోదగునా?” అనగా మదనుడు “నిన్ను భార్యగా వదలి ఇతరులను తలుస్తానా? నిర్మలమైన మనస్సుతో విను. అన్నీ తెలియపరుస్తాను” అన్నాడు.

2-22-క.
“నను దేవేంద్రుఁడుదలఁచెను
నిగొని నేఁడేలదలఁచె పంకజనేత్రీ!
 కేకార్యముగలిగెనొ
నిలేక తలంపఁడతఁడు భామిని! నన్నున్.

టీక :-
పంకజనేత్రి= పద్మముల వంటి కన్నులు కలామె, రతీదేవి; కార్యము= పని; భామిని = క్రీడా సమయమునందు కోపము చూపెడి స్త్రీ, రతీదేవి.
భావము :-
“పంకజనేత్రి రతీదేవీ! నన్ను దేవేంద్రుడు తలచుకున్నాడు. పనిగట్టుకొని ఈనాడెందుకు తలచుకొన్నాడో? తన కేపని కలిగినదో? పనిలేకుండా తలచుకోడతను.

2-23-మ.
నా! పంపుము తన్నిమిత్త మరయన్ క్షింప నీప్రొద్దె పో
యున్ వజ్రి దలంచుచోట రమణీ! ర్ణింపఁగాఁ గార్యముల్
 వెన్నేనియు నన్న నా పనులెఱుంగంజెప్పుఁ డాలించెదన్
వెలఁదీ! ముగ్ధవుగాన రాచపనులుర్విన్ జెప్పఁగావచ్చునే?

టీక :-
లలన= విలాసవతియగు స్త్రీ; తన్నిమిత్తము= ఆకారణముచే; అరయన్= విచారింపగా; లక్షించు= చూచు; వజ్రి= ఇంద్రుడు; వెలది= నిర్మలమైన స్త్రీ; ముగ్ధ = కపటము లేనిది; ఉర్వి= భూమి.
భావము :-
విలాసవతీ! రమణీ! రతీదేవీ! నన్ను వెళ్ళనిమ్ము. ఇంద్రుడు తలచుకున్నాడు అంటే ఎన్నైనా పనులుంటాయి. ఆ పనులేమిటో తెలుసుకోవడానికి ఈప్రొద్దే బయలుదేరాలి.” అనగా రతీదేవి “ఆ పనులేమిటో తెలియచేయండి వింటాను“. అన్నది. “ఓ! రతీదేవీ! నీవు ముగ్ధవు కదా. లోకంలో ఎక్కడైనా ముగ్దకు రాచకార్యాలగురించి చెప్పవచ్చునా?.....

2-24-చ.
యఁగ సర్వలోకములు నేలెడురాజులరాజుగాఁడె యా
ని దెస భ్రాంతియే పనులు ప్పకపోయిన బుద్ధి” నావుడున్
పెనుపుగ నింద్రువీటికిని వేర్కొనిపోయెదవేని నేను నీ
వెనుకను వత్తు” నంచు సతి వేడుకఁ బల్కిన నల్లనవ్వుచున్.

టీక :-
ఎనయగ = పొందుగ; నావుడున్ = అని చెప్పగా; పెనుపుగ = గొప్పగా; వీడు = పట్టణము; వేర్కొని = కాదని; వేడుక= ఆనందం; అల్లన = మెల్లగా.
భావము :-
పొందుగా అన్నిలోకాలనూ పాలించే రాజాధిరాజు ఐన ఇంద్రుని విషయంలో పనులనగా వేళాకోళం కాదు. తప్పక వెళ్ళడమే తగిన పని.” అని మన్మథుడు చెప్పాడు. “కాదని గొప్పగా ఇంద్రుని పట్టణానికి వెళ్తానంటే, నేనూ నీ వెనుకే వస్తాను”. అని రతీదేవి వేడుకగా అనగా మన్మథుడు మెల్లగా నవ్వుతూ......

2-25-వ.
ఆయువతికి సుమసాయకుం డిట్లనియె.

టీక :-
సుమసాయకుడు = పుష్పములు బాణములుగా కలవాడు, మన్మథుడు.
భావము :-
రతీదేవితో మన్మథుడు ఇలా అన్నాడు.

2-26-శా.
ల్లాం డ్రైన కులాంగనల్ మగలతో నేతెంతురా తొల్లి శో
భిల్లంగాఁ దగనొప్ప రాట్సభలకున్ మీనాక్షి మున్నెన్న మా
యిల్లాం డ్రెవ్వరు ప్రాణవల్లభులతో నిట్లాడఁగా నేర్తురే
ల్లాలిత్యమె దేవతాసభలనన్ సంకేతశైలంబులే.

టీక :-
ఇల్లాండ్రు = భార్యలు; కులాంగనలు = కులస్త్రీలు; మగలు = భర్తలు; ఏతెంతురా = వస్తారా; తొల్లి = పూర్వము; శోభిల్లు = ప్రకాశించు; మీనాక్షి = చేపలవంటి కదలెడు కన్నులు కలామె, అందగత్తె; ప్రాణవల్లభులు = భర్తలు; ఇట్లాడగా = ఇలా అనగా; సల్లాలిత్యమె = చాలా సున్నితము; సంకేతము = ఏర్పాటు, గుర్తు; శైలము = కొండ; సంకేతశైలము = క్రీడార్థము నిర్మించిన కొండ.
భావము :-
పునిస్త్రీ కులాంగనలు భర్తలతో రాజాస్థానానికి వస్తారా? మీనాక్షీ! పూర్వమునుండీ స్త్రీలకు రాజసభలకు రావడం తగదు కదా. ఇంతకుముందు మా ఇల్లాండ్రెవరూ భర్తలతో ఇలా మాట్లాడలేదు. దేవతాసభలనగా లలితమైనవీ కాదు; ఆటల గుట్టలూ కాదు.

2-27-క.
వేలుపులరాచసభకును
బోదు నీరాక వినుము! పొసఁగదు నీవి
ల్లావు సురేంద్రుసభకును
నే” ని రతి నూరడించె నేచిన వేడ్కన్.

టీక :-
వేలుపులు = దేవతలు; పోలదు = సరికాదు, తగదు; పొసగదు = ఒప్పదు, కుదరదు; ఏచిన = నచ్చపెట్టెడి, నచ్చచెప్పెడి; వేడ్క= వేడుక యొక్క రూపాంతరము.
భావము :-
“దేవసభకు నీవు రావడం తగదు. విను. ఇల్లాలివి కదా ఇంద్రసభకు రావడం ఎందుకులే.” అంటూ నచ్చచెప్తూ రతీదేవిని వేడుకగా ఓదార్చాడు.

2-28-సీ.
పాటించి మృగనాభిపంకంబు మైఁబూసి;
ప్పురంబునఁ దిలకంబుఁ దీర్చి
కమ్మనిపువ్వుల సొమ్ములు ధరియించి;
లాలితమణికుండములు వెట్టి
వెన్నెలనిగ్గులై వెలుఁగుచీరలు గట్టి;
సిడిహంసావళి ట్టుఁ గట్టి
మాధవీమల్లికా మాలతీనవకుంద;
దామంబులింపార లను దురిమి

2-28.1-తే
పాంథజనములగుండెలు గిలి నిగుడ
మెరయు నందియ డాకాల మొరయుచుండ
గలమగువలఁ గరగించు మాయలాఁడు
లితశృంగారవైభవక్ష్మి మెఱసి.

టీక :-
పాటించి = ఆదరించి; మృగనాభిపంకము= మృగమదము, కస్తూరి; మై = శరీరము; కుండలములు = చెవికి ధరించు ఆభరణములు(కమ్మలు); నిగ్గు = ఉత్కృష్ట కాంతి, నిగారింపు, మెఱుగు; పసిడి = బంగారము; హంసావళి = హంసలవరుస; పట్టు = పట్టుబట్ట; కుంద = అడవిమల్లె; దామము = దండ; తురుము = తలలోపెట్టు, ముడుచు; పాంథజనములు = బాటసారులు; నిగుడు = చిప్పిల్లు; అందియలు = గజ్జెలు; డాకాలు = ఎడమకాలు; మొరయు = మ్రోయు (ధ్వనించు); మగల= మగవారిని; మగువల = ఆడువారిని; మెఱసి= ప్రకాశించి.
భావము :-
ఆదరముతో కస్తూరిని శరీరానికి పూసికొని, కర్పూరతిలకము దిద్ది, సువాసన కలిగిన పువ్వులు ఆభరణములు ధరించి, మనోహరముగా మణులతో చేయబడిన తాటంకములు చెవులకు పెట్టుకొని, వెన్నెల నిగారింపులతో ప్రకాశించే తెల్లని వస్త్రములు కట్టి, (వాటిపై) బంగారు హంసల వరుసల పట్టుబట్ట కట్టి, నవనవలాడే మాథవి మల్లిక మాలతి అడవిమల్లెల మాలలు అందముగా తలలో తురుముకొని, బాటసారుల గుండెలు పగిలిపోయేలా మ్రోగే మెఱుంగు అందియలు ఎడమకాలికి అలంకరించుకుని, స్త్రీపురుషులను కరిగించే మాయల మన్మథుడు మనోజ్ఞమైన శృంగార వైభవముతో మెఱసిపోతూ....

2-29-లగ్రా.
తుమ్మెదలు పెక్కు మురిపెమ్ముల వెసన్ముసరి;
జుమ్ము రని పద్మముకుళమ్ముల మహాశం
ఖమ్ములు భ్రమింప రసికమ్ము వెలయం బొగడు;
సమ్మదపుఁ జిల్కల రవమ్ములు చెలంగన్
గ్రమ్మి >కలకంఠములు నిమ్ముల మరాళములు
గ్రమ్మగను గాలి గడుఁ గమ్మనయి వీవన్
కమ్మనగు విల్లుఁ బువుటమ్ములను బట్టి వెల
యమ్మరుఁడు పువ్వులరథమ్ము వెసనెక్కెన్.

టీక :-
మురిపెము = విలాసము; వెస = వేగము, సంరంభము; ముకుళము = అరవిరిసిన మొగ్గ, మొగ్గ; సమ్మదము = సంతోషం; రవము = ధ్వని; చెలంగు = చెలరేగు; కలకంఠములు = నెమళ్ళు; ఇమ్ముగ = మనోజ్ఞముగా; మరాళములు = హంసలు; క్రమ్ము= చుట్టుకొను; వెలయు = అలరించు; మరుడు= మన్మథుడు.
భావము :-
తుమ్మెదలు రకరకాల విలాసాలతో పద్మం మొగ్గలు మహాశంఖారావములా యన్నట్లు ఝమ్మంటూ ముసురుతుండగా, చిలుకల ఆనంద రవమ్ముల రసజ్ఞత చెలరేగుచుండగా, నెమళ్ళు హంసలు ఇంపుగా క్రమ్ముకొనగా, గాలి మిక్కిలి కమ్మగా వీచుచుండగా, సువాసనలీను విల్లు పూలబాణాలు పట్టుకుని ఆ మన్మధుడు పూలతేరును సంరంభముగా ఎక్కెను.

2-30-వ.
ఇట్లగణ్య శృంగారవైభవాడంబరుండై రతీదేవి దీవెనలు గైకొనివీడ్కొని కదలి యక్కంధరుం డమరేంద్రపురంబునకుం బ్రయాణంబుచేసి గగనంబున వచ్చుచు.

టీక :-
అగణ్య= లెక్కింపరాని, అనంతమైన; కంధరుడు = మన్మథుడు.
భావము :-
ఈ విధంగా ఆ మన్మథుడు అమిత శృంగారవైభవంతో రతీదేవి ఆశీస్సులు తీసుకొని బయలుదేరి అమరావతికి ప్రయాణమై ఆకాశంలో వస్తూ....