పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : అమరావతీ వర్ణనము

2-31-సీ.
కొమరొంది పొడవైన గోపురంబులచేతఁ;
నరారు దివ్యసౌములచేత
హురత్నకాంచన ప్రాసాదములచేతఁ;
మనీయ విపణిమార్గములచేత
పుణ్యజనావళి బృందారకాప్సరో;
గంధర్వకిన్నర ణముచేత
హువిమానములచే హువాద్యములచేత;
హువనాంతరసరః ప్రతతిచేత

2-31.1-ఆ.
సిఁడికొండమీఁద హువైభవమ్ముల
లితదేవరాజ్యక్ష్మిమెఱసి
కలభువనభవన చారుదీపంబైన
ట్టణంబు వజ్రిట్టణంబు.

టీక :-
కొమరొంది = అందగించి; తనరారు = ఉన్నతమైన; ప్రాసాదము = రాజగృహము, నగరు; కమనీయ = మనోహరమైన; విఫణిమార్గము = అంగడివీధి; పుణ్యజనాళి = పుణ్యవంతులు; బృందారక = వేల్పు; ప్రతతి = సమూహము; బంగారుకొండ = మేరు పర్వతము; లలిత = మనోజ్ఞమైన; చారు = అందమైన; వజ్రి = ఇంద్రుడు.
భావము :-
అందమైన ఉన్నతమైనగోపురములచేతా, ఉన్నతమైన దివ్యమైన భవనముల చేతా, పలు రకాల రత్నములు పొదిగిన బంగారు ప్రాసాదములచేతా, మనోహరమైన అంగడి వీధుల చేతా, పుణ్యవంతులు, దేవతలు, అప్సరసలు, గంధర్వులు, కిన్నెరల సమూహాలచేతా, దివ్య విమానములచేతా, రకరకాల వాయిద్యముల చేతా, పలు వనాలలోని సరస్సులు చేత, మేరుపర్వతముపై సకల వైభవాలతో దేవతల రాజ్యలక్ష్మి, ఇంద్రుని పట్టణమూ ఐవ అమరావతీ పట్టణము సకలలోకాలలోని పట్ఠణములకు దీపమై ప్రకాశిస్తోంది.

2-32-వ.
కనుంగొని యనంతవైభవంబున నన్నగరంబు ప్రవేశించి గోవిందనందనుం డసమానసుందరుండై చనుదెంచుచున్నసమయంబున.

టీక :-
అసమాన = సమానము కాని.
భావము :-
అతి సుందరుడైన కృష్ణుని కుమారుడు అలా అమరావతిని చూస్తూ మిక్కిలి వైభవంతో ఆనగరంలోనికి ప్రవేశించి వెళ్తున్న సమయంలో...

2-33-ఉ.
లి నలంకరించుకొని యొండొరు మెచ్చనివైభవంబునన్
గ్రాలుచు మేడలెక్కి యమరావతిలోఁ గలకన్నెలందఱున్
సోలుచు జాలకావలులఁ జూచుచు నో సతులార! యీరతీ
లోలునిఁ గంటిరే యనుచు లోలత నప్పుడొకర్తొకర్తుతోన్.

టీక :-
ఓలి = వరుస; యొండొరులు = ఒకరినొకరు; క్రాలుచు = సంచరిస్తూ; సోలుచు = పరవశించుచు; జాల = కిటికీ; లోలత = మిక్కిలిఆశ.
భావము :-
వరుసగా ఒకరిని మించి ఒకరు అలంకరించుకొని వైభవంతో సంచరిస్తూ మేడలెక్కి అమరావతిలోని కన్యలందరూ పరవశిస్తూ కిటికీలలోనుండి బయటకు చూస్తూ “ఓ సతులారా! ఈ రతీలోలుని చూశారా?” అని ఒకరితో ఒకరు అంటూ.....

2-34-సీ.
మనీయసంఫుల్లమలాక్షి! యీతఁడే
కామినీమోహనాకారధరుఁడు
లలితసంపూర్ణచంద్రాస్య! యీతఁడే
బిరుదుగ గండరగండ వాఁడు
నతరమదమత్తజయాన! యీతఁడే
పంచబాణంబుల హుళయశుఁడు
కొమరారునవపుష్పకోమలి! యీతఁడే
గువలమగలను లచుజెట్టి”

2-34.1-ఆ.
నుచుఁ జూచిచూచి యంగజునాకార
రసిలోనమునిఁగి జాలిఁగొనుచు
నొనరగోడ వ్రాసినట్టిరూపంబుల
రణినుండ్రి దివిజకాంతలెల్ల.

టీక :-
సంఫుల్ల = పూర్తిగా వికసించిన; కమలాక్షి = కమలములవంటి కన్నులు కలది; ఆస్యము = ముఖము; గండరగండ = శూరులకెల్ల శూరుడు; జెట్టి = శ్రేష్టుడు; అంగజుడు = మన్మథుడు; ఒనర = గట్టిగా; దివిజకాంతలు = దేవకాంతలు.
భావము :-
ఓ సుందరాంగీ! అందమైన పూర్తిగా విచ్చుకున్న కమలములవంటి కన్నులు కలదానా! ఇతడే కామించే మోహనాకారము కలవాడు, మనోజ్ఞమైన పూర్ణ చంద్రుని వంటి ముఖము కలదానా! ఇతడే శూరులలోకెల్లా శూరుడనే గండరగండడు బిరుదు కలవాడు, మత్తగజమువంటి నడక కలదానా! ఇతడే పంచబాణముల మన్మథుడు, గొప్పకీర్తి గలవాడు, నవనవలాడే పూల కోమలత్వం కల అందమైనదానా! ఇతడే మగువలనూ మగవారినీ మరిగించే యోథుడు” అంటూ మరల మరల చూసి దేవకాంతలందరూ మన్మథుని ఆకారమనే సరస్సులో మునిగి మనోబాధతో గోడపై వ్రాసిన చిత్రాల్లా కదలకుండా యున్నారు.

2-35-వ.
అంత నద్దేవేంద్రుమందిరంబు చేరంబోయి.

టీక :-
అంతను = అప్పుడు.
భావము :-
మన్మథుడు, అప్పుడు దేవేంద్రుని మందిరానికి వెళ్ళి...

2-36-ఉ.
సండిఁగోయిలల్ నడువ సందడి వాయుచుఁ జంచరీకముల్
మంళగీతముల్ చదువ మానుగ రాజమరాళసంఘముల్
చెంటరాఁగ వాసవుని శ్రీమొగసాల రథంబుడిగ్గి యా
యంభవుండు చొచ్చె నమరాధిపుకొల్వుఁ బ్రమోదమగ్నుఁడై.

టీక :-
సంగడి = పార్శము; వాయు = పాయు, విడుచు; చంచరీకములు = తుమ్మెదలు; మానుగ = పొందుగా, అందముగా; మరాళము = హంస; చెంగట = సమీపము; వాసవుడు = ఇంద్రుడు; శ్రీ = గౌరవవాచకము, శ్రీమంతమైన; మొగసాల = ముఖమండపము (అంతఃపుర ప్రాంగణము); డిగ్గి = దిగి; అంగభవుడు = మన్మథుడు; ప్రమోదమగ్నుడు = సంతోషములో మునిగినవాడు.
భావము :-
గోలచేయడం మాని, వెంట కోయిలలు నడుస్తుండగా, తుమ్మెదలు మంగళగీతాలు పాడుతుండగా, అందమైన రాజహంసలలు వెంటవస్తుండగా మన్మథుడు దేవేంద్రుని శ్రీమంతమైన సభా ప్రాంగణమున రథము దిగి, ఆ ఇంద్రసభలోనికి సంతోషంగా వెళ్ళెను.

2-37-వ.
ఇట్లు దివ్యాస్ఠానమంటపంబు దరియంజొచ్చి.

టీక :-
తఱియ = సమీపము; చొచ్చి = ప్రవేశించి.
భావము :-
ఇలా మన్మథుడు ఆస్థాన మంటపం దగ్గరకి వెళ్ళి...

2-38-సీ.
తిమోహనాకారుఁ డై వెలింగెడువాని;
భినవశృంగారుఁ డైనవాని
డిమిమై నాకలోకంబునేలెడువాని;
నొడలెల్లఁ గన్నులై వెలయువాని
పొలుపారఁ గేలఁ దంభోళి యొప్పెడువాని;
త్యంతవైభవుం డైనవాని
కేయూరకంకణాంకిత బాహువులవాని;
నిమ్మైన మణికిరీటమ్మువాని

2-38.1-ఆ.
రుడసిద్ధసాధ్య గంధర్వకిన్నర
భుజగపతులు గొలువ పొలుపుమిగిలి
తేజరిల్లువాని దేవేంద్రుఁ బొడఁగాంచి
మ్మదమున నంగసంభవుండు.

టీక :-
అభినవ= వినూత్న; కడిమి = పరాక్రమము; నాకలోకము = స్వర్గము; పొలుపారు = ఒప్పు; కేలు = చేయి; దంభోళి = వజ్రాయుధము; కేయూరము = భుజకీర్తి (దండకడియము); కంకణము = (ముంజేతి ఆభరణము) కడియము; బాహువులు = చేతులు; ఇమ్ము = ఇంపు; అంగసంభవుడు = మన్మథుడు.
భావము :-
మిక్కిలిగా మోహింపచేసే ఆకారముతో ప్రకాశించేవాడూ, వినూత్నమైన శృంగార లక్షణములు గలవాడూ, శౌర్యముతో స్వర్గమునేలువాడూ, శరీరమంతా కన్నులు కలవాడూ, ఒప్పుగా చేతియందు వజ్రాయుధము ధరించినవాడూ, వైభవంతో అలరారేవాడూ, దండకడియాలు ముంజేతి కడియాలు గల చేతులు గలవాడూ, ఇంపైన మణికిరీటము గలవాడూ, గరుడులు సిద్ధులు సాధ్యులు గంధర్వులు కిన్నెరలు నాగేంద్రములు సేవిస్తుండగా సంశోభిల్లి ప్రకాశించు వాడూ అయిన దేవేంద్రుని మన్మథుడు దర్శించి సంతోషంతో......

2-39-వ.
ఇట్లు పొడఁగాంచి నిరుపమ నయవినయభయజనిత మానసుండై నమస్కారంబు చేసిన కుసుమసాయకుం గనుంగొని విపుల ప్రమోదంబున నెదురువచ్చి వలదు తగదని బాహుపల్లవంబుల నల్లన యెత్తి పలుమాఱు నందందఁ గౌఁగలించుకొని దేవేంద్రుఁడును నతులిత తేజోమహిమాభిరామ కనకమణిగణాలంకార సింహాసనాసీనుం జేసి మఱియు నొక్క దివ్యహారంబు సమర్పించి మహనీయ మధురవచనముల నిట్లనియె.

టీక :-
పొడగాంచి = చూసి. కనుగొని, దర్శించి; నిరుపమ = సాటిలేని; నయ = పొందికైన; వినయ = వినమ్రత; విపుల = విరివియైన; ప్రమోదము = సంతోషము; బాహుపల్లవములు = ముంజేతులు; అల్లన = మెల్లగా; అతులిత = సాటిలేని; అభిరామ = ఒప్పు,మనోజ్ఞమైన.
భావము :-
ఇలా దేవేంద్రుని దర్శించి సాటిలేని పొందికైన వినమ్రతతో భయముతూ నమస్కరించిన మన్మథుని చూసి చాలా సంతోషంతో ఎదురు వచ్చి వద్దు, కూడదు అంటూ ముంజేతులతో మెల్లగా ఎత్తి పదేపదే కౌగిలించుకొని దేవేంద్రుడు సాటిలేని తేజస్సుతో యొప్పే మణులుతాపిన బంగారుసింహాసనంపై కూర్చుండజేసాడు. ఇంకా ఒకదివ్యమైన హారమును కానుకగా యిచ్చి మిక్కిలి మధురమైన పలుకులతో ఇలా అన్నాడు.

2-40-క.
“చనుదెంచితె కుసుమాయుధ!
నుదెంచితె పంచబాణ! శంబరవైరీ!
నుదెంచితె కందర్పక!
నుదెంచితె యెల్లపనులు న్మోదములే.

టీక :-
చనుదెంచు = వచ్చు.
భావము :-
“వచ్చేవా! పూవులు ఆయుధముగా కలవాడా! వచ్చేవా! పంచబాణములువాడా! శంబరుని శతృవా! వచ్చేవా! కందర్పుడా! మన్మథుడా! వచ్చేవా! అన్ని పనులు సంతోషంగా సాగుతున్నాయా?.....

2-41-వ.
అని మహేంద్రుం డడిగిన నంగసంభవుం డిట్లనియె.

టీక :-
అంగసంభవుడు = మనస్సు నుండి పుట్టేవాడు, మన్మథుడు.
భావము :-
అని మహేంద్రుడు అడుగగా మన్మథుడు ఇలా అన్నాడు.

2-42-ఉ.
 హితప్రతాప! భువనోన్నత! మీరుగలంత కాలమున్
నేమికొఱంత సమ్మదము నిప్పుడు నన్నుఁదలంపఁ గారణం
బేమి సురేంద్ర! నీతలఁచునంతఁ గృతార్థుఁడనైతిఁ జాలదే
నీ దిలో ననుందలఁప నేఁడొక కార్యము నీకుఁ గల్గెనే.”

టీక :-
మహితప్రతాప = గొప్ప ప్రతాపము కలవాడు, ఇంద్రుడు; భువనోన్నత = సకల భువనములలో ఉన్నతమైనవాడు, ఇంద్రుడు; సమ్మదము= సంతోషము.
భావము :-
ఓ! దేవేంద్రా! గొప్పదైన ప్రతాపము గలవారు, భువనములలో ఉన్నతమైనవారు అయిన మీరున్నంతకాలము నా సంతోషమునకు ఏమి లోపము? ఇప్పుడు నన్ను తలచుకోవడానికి కారణమేమి? సురేంద్రా! మీరు తలచుకోవడంతోనే కృతార్ధుడనయ్యాను. అది చాలదా? నీకు మనసులో నన్ను తలుచుకోవడానికి, నేడొక పని కలిగినదా?....”

2-43-వ.
అనిన విని పురందరుం డిందిరానందనున కిట్లనియె.

టీక :-
ఇందిరానందనుడు = లక్ష్మీదేవి పుత్రుడు) మన్మథుడు.
భావము :-
అనగా విని ఇంద్రుడు మన్మథునితో ఇలా అన్నాడు.

2-44-ఉ.
నీ భుజదండ విక్రమము నీమహిమాతిశయాభిరామమున్
శోభితకీర్తిమైఁగలుగఁ జోకిన గార్యము మమ్ము జోకెఁబో
నారమైన కార్యముల నారయ నెవ్వరిభార మయ్య యో
శోభితమూర్తి యో భువనసుందర యో గురుధైర్యమందరా.

టీక :-
అభిరామము= రమ్యమైన; మైఁ = తోన్; జోక = జతపడినది; జోకెన్ = ఉత్పాహపఱచెను; భరమైన = భారమైన, బరువైమ, గొప్పదైన; ఆరయ= విచారించగా; శోభితమూర్తి= వస్త్రభూషణాదులచే గలుగు కాంతి కలవాడు; గురు = గొప్ప.
భావము :-
నీ పరాక్రమము, నీ రమ్యమైన మహిమాతిశయము, ప్రకాశవంతమైన యశస్సుతో ఉండునట్లు జతపడిన పని మమ్మల్ని ఉత్సాహపరుస్తుంది కదా. ఆలాంటి బరువైన పనిని చేయగలవారెవరయ్యా? ఓ శోభితమూర్తీ! ఓ సకలభువనాలలోకెల్లా అందమైనవాడా! ఓ మందర పర్వతము వంటి గొప్ప ధైర్యము కలవాడా!..

2-45-క.
నీకును భారముగాదేఁ
జేకొని యొనరింతుఁ గాక చెప్పెద నొకటిన్
లోకంబులవారలకును
నాకులకును నీవు మేలొర్చుట సుమ్మీ.

టీక :-
నాకులు= దేవతలు; కాదేన్ = కాదులే?.
భావము :-
నీకిది కష్టము కాదులే. ఒక పని చెబుతాను. ఇది చేయడంవలన లోకులకు, దేవతలకు నీవు మేలుచేసిన వాడవౌతావు.

2-46-క.
వారిజగర్భుని వరమున
దాకుఁ డను దానవుండు ద్దయుఁ గడిమిన్
గారించె నఖిలజగములు
పోరం గడతేరఁ డెట్టి పురుషులచేతన్.

టీక :-
వారిజగర్భుడు = (నీటినుండి పుట్టిన కమలములోనుండి పుట్టినవాడు) బ్రహ్మదేవుడు; తద్దయు = అత్యంత ; కడిమిన్ = అతిశయముతో; కారించు = బాధించు.
భావము :-
బ్రహ్మగారి వరము బలంతో తారకుడనే రాక్షసుడు సకలలోకాలనూ ఎంతో బాధిస్తున్నాడు. ఎటువంటి పురుషులచేతా అతను యుద్ధములో చావడు.

2-47-క.
పుహరునకు నద్రిజకును
రఁగం బ్రభవించునట్టి లియుఁడు వానిం
రిమార్చు నద్రికన్యకఁ
బుహరునకుఁ గూర్చి కీర్తిఁ బొందుము మదనా!

టీక :-
పురహరుడు = శివుడు; అద్రిజ = పార్వతి; పరగ = ఒప్పుగా; ప్రభవించు = పుట్టు.
భావము :-
శివునకు, పార్వతికి ఒప్పుగా జన్మించే బలవంతుడే వానిని చంపగలడు. మదనా! పురహరుని, అద్రిజను కలిపి కీర్తిని పొందుము.

2-48-సీ.
ది యెంతపని నీకు నిందిరానందన! ;
లఁపులోపలఁ బేర్మిఁ లఁతుగాక
లఁచి నీభుజదండ ర్పంబుశోభిల్ల;
గొనకొని మము వీడుకొందుగాక
కొనిన బలంబులు కొమరారఁగాఁగొల్వ;
భూతేశుపై దండు బోదుగాక
పోయి విజృంభించి పొరినారిసారించి;
తీపులవిల్లెక్కు దీతుగాక

2-48.1-ఆ.
తిగిచి పువ్వుటమ్ము తెఱఁగొప్పసంధించి
విశ్వనాథుమీఁద విడుతుగాక
విడిచి కలఁచి నేర్చి విశ్వేశు మృడు కేళి
యేర్పడంగ గిరిజ కిత్తుఁ గాక.”

టీక :-
తలపు = హృదయము; పేర్మి = ప్రేమ; కొనకొని = ప్రయత్నించి; వీడుకొను = వదలివెళ్ళు; కొమరారు = అందముగానుండు; దండు = యుద్ధము; పొరి = దృఢమైన; తీపులవిల్లు = చెఱకువిల్లు; పువ్వుటమ్ము = పూలబాణము; తెఱగొప్ప = ఒప్పేవిధంగా; కలచి = కలతపఱచి; మృడుడు = సుఖింపచేయువాడు, శివుడు; కేళి= స్త్రీ పురుషుల శృంగారచేష్ట; గిరిజ= పార్వతీదేవి.
భావము :-
లక్ష్మీపుత్రా! మన్మథా! ఇదెంతపని నీకు. మనసులో నిన్ను ప్రేమగా తలచుకుంటూనే ఉంటాము. పూని నీ పరాక్రమము శోభిల్లేలా ప్రయత్నించుటకు మము విడిచి వెళ్ళెదవు గాక. నీ సైన్యాలు మనోజ్ఞంగా సేవిస్తుండగా శివునిపై యుద్ధమునకు వెళ్ళెదవు గాక. వెళ్ళి విజృంభించి నారిని దృఢంగా సారించి నీ చెఱకువిల్లు ఎక్కుపెడుదువు గాక. ఎక్కుపెట్టి పూలబాణమును ఒప్పేవిధంగా (గురిచూసి) సంధించి విశ్వనాథుని మీదకు విడుతువు గాక. విడిచి కలతపడడం నేర్పి విశ్వేశ్వరుడైన మృడునికి కామము పుట్టేలా చేసి పార్వతికి ఇత్తువు గాక.”

2-49-వ.
అని ప్రియంబులు పలుకుచున్న పురందరుం గనుంగొని కందర్పుం డిట్లనియె.

టీక :-
ప్రియము = తియ్యగా.
భావము :-
అంటూ తియ్యగా మాట్లాడుతున్న ఇంద్రునితో మన్నథుడు ఇలా అన్నాడు.

2-50-శా.
హోయీపని నన్నుఁ బంపఁ దగవా యూహింప నాకున్ శివ
ద్రోహం బిమ్మెయిఁజేయఁగాఁ దగునె? యీ ద్రోహంబు గావింపఁగా
నాహావద్దని మాన్పఁబట్ట కిది చేన్మీరు పొమ్మందురే?
మోహాతీతుఁడు శంభుఁ డాతనికి నే మోహంబు లే దెమ్మెయిన్.

టీక :-
ఇమ్మెయి= ఈ విధంగా; ఎమ్మెయిన్= ఏవిధముగానూ.
భావము :-
ఓహో! ఈ పనికి నన్ను పంపవచ్చునా? ఆలోచిస్తే నాకు ఇలా శివద్రోహం చేయడం తగిన పనా?. నేను ఈ ద్రోహం చెయ్యబోతే “ఆహా వద్దు” అని మాన్పించకుండా మీరే వెళ్ళమంటున్నారా? శివుడు మోహానికి అతీతుడు. ఏవిధంగా చూసినా అతనికి ఏ మోహం లేదు.

2-51-ఆ.
కొలఁది లేదు పేర్చి కోపించెనేని వి
రించినైన శిరము ద్రెంచికాని
విడువకున్న బిరుదు విన్నాఁడ వెన్నాడ
భవు జేరవెఱతు మరనాథ!

టీక :-
పేర్చి = విజృంభించి; విరించి = బ్రహ్మ; వెన్నాడ = వెంబడించడానికి; అభవుడు = పుట్టువు లేని వాడు, శివుడు.
భావము :-
శివుని కోపానికి హద్దులేదు. విజృంభించి కోపిస్తే బ్రహ్మనైనా శిరసు త్రుంచకుండా వదలడని బిరుదు విన్నాను. వెంబడించి ఆ శివుని చేరాలంటే భయంగా యున్నది అమరనాథా!.......

2-52-క.
లఁపులు మఱపులు దమలో
 మఱచి విరాళవృత్తిఁ రమేశుఁడు దాఁ
లఁడని లేఁడని యెఱుఁగరు
సులఁ గడచినట్టివాఁడు సొరఁ జొరవేదీ.

టీక :-
విరాళవృత్తి = విరళముగా, స్పష్టంగా; సొరు = చొరు, చొచ్చు; గడచు = మీరు, మించు; చొరవ= తెగువ, సాహసము.
భావము :-
శివుడు దేవతలను మించినవాడు. వారు తెఱుపులోగాని మఱుపులోగాని తమను తాము మఱచినా శివుడు ఉన్నాడని కాని, లేడని కాని స్పష్టంగా ఎఱుగలేరు. అలాంటి శివుని వద్దకు చొచ్చుకు వెళ్ళేటంత సాహసం నాకు ఎక్కడిది?......

2-53-క.
య నేకాంతస్థలిఁ
జేరంగారాదు నాకుఁ జేరఁగ దరమే
య నేకావస్థలఁ
జేరి వెలుంగొందు నాకుఁ జేరందరమే.

టీక :-
ఆరయ = ఆలోచించగా; ఏకాంతస్థలి = ఒక్కడే ఉండే ప్రదేశమున ఉండువాడు, ఎక్కటి, కేవలుడు; ఏకావస్థలు = ఏక (ఒకే) అవస్థలో ఉండువారు, నిర్వికారులు.
భావము :-
తఱచిచూస్తే, కేవలుడూ, నిర్వికారుడూ యైన శివుని వద్దకు వెళ్ళడం నా తరమా?

2-54-వ.
అదియునుంగాక.
భావము :-
అదీకాక.

2-55-సీ.
పుండరీకాక్షుని పుత్రుండనైనేను;
నిభచర్మధరునిపై నెట్లువోదు
పోయిననద్దేవు భూరిప్రతాపాగ్ని;
నెఱయంగ నాతేజ మెందుమోచు
మోచిన పరమేశుమూర్తియేఁ గనుఁగొని;
యెదిరివిజృంభించి యెట్లువత్తు
చ్చిన మాతండ్రి వావిరిఁగోపించి;
యే చూపుచూచునో యేనువెఱతు

2-55.1-ఆ.
వెఱతునయ్య యెన్ని విధములఁజెప్పిన
కొలఁదిగాదు నాకగోచరంబు
నిక్కమివ్విధంబు నీయాన దేవేంద్ర!
మృగకులేంద్రు నోర్వ మృగమువశమె.”

టీక :-
పుండరీకాక్షుడు = విష్ణుమూర్తి; ఇభ = ఏనుగు; భూరి = మిక్కిలి గొప్ప; ఎఱయుట = వ్యాపింటుట, అంతట సేన వ్యాపించుట; మోచు = భరించు; వావిరి = అధికముగా; ఏను = నేను; వెఱతు = భయపడెదను; కొలది = శక్యము, తరము; అగోచరము = మనస్సుచేతను, ఇంద్రియములచేతను గ్రహింపరానిది; ఆన = ప్రమాణము, ఒట్టు; మృగకులేంద్రుడు = సింహము; మృగము = లేడి.
భావము :-
విష్ణువు కుమారుడనైన నేను గజచర్మధరుడైన శివుని పైకి ఎలా వెళ్ళగలను? వెళ్ళినా ఆ దేవుని మిక్కిలి గొప్పదైన ప్రతాపం చుట్టుముట్టితే నా ప్రతాపమెలా భరించగలదు? భరించినా ఆ పరమేశ్వర రూపాన్నినేను కనుగొని ఎదిరించి విజృంభించుట ఎలా చేయగలను? చేయగలిగానా మా తండ్రి, విష్ణుమూర్తి కరకరా కోపించి చూస్తాడేమో అని నేను భయపడుతున్నాను. దేవేంద్రా! నీమీద ఒట్టు సింహాన్ని జయించడం లేడికి సాధ్యమా? ఎన్ని రకాలుగా చెప్పినా నా వల్లకాదయ్యా!. భయమేస్తోందయ్యా! నాకేమీ పాలుపోవడంలేదయ్యా. ” అని మన్మథుడు అన్నాడు.

2-56-వ.
అనవుడు రతీమనోహరునకు శచీమనోహరుం డిట్లనియె.

టీక :-
రతీదేవి = మన్మథుని భార్య; శచీదేవి = ఇంద్రుని భార్య.
భావము :-
అలా మన్మథుడు అనగా విని ఇంద్రుడిలా అన్నాడు.

2-57-ఆ.
పొందుగాని పనికి పొమ్మందునే నిన్ను
నింతచింత యేల యిట్టిపనికి
ర్పచిత్తుఁడైన తారకాసురుచేతి
బాధమాన్పి కీర్తిఁడయు మయ్య!

టీక :-
పొందుగాని = తగని; దర్పము = అహంకారము.
భావము :-
“తగని పనికి వెళ్ళమంటానా నిన్ను? ఇంత ఆలోచన యెందుకీ పనికి? అహంకారముతోనున్న తారకాసురుని నుండి రక్షించి కీర్తిని పొందవయ్యా!.....

2-58-సీ.
గములోపలఁగల జంతురాసులఁబట్టి;
నసులఁగలచు నీ హిమమహిమ
నాటుచోగంటు గానఁగరాక వాడియై;
రిలేకనాటు నీ రముశరము
రమేష్టి సృష్టి లోలి పురుషులకెల్ల;
దీపమైవెలుఁగు నీ రూపు రూపు
ఖిలంబు నెందాఁక నందాఁక నందమై;
పృథుతరంబైన నీ బిరుదుబిరుదు

2-58.1-ఆ.
శూలినైనఁ దాపసులనైన బాధింతు
గాలినైన నెట్టి నులనైన
లదె నీదుపేర్మి నత తక్కొరులకు
నిన్నుఁ బోలవశమె నిరుపమాంగ!

టీక :-
గంటు = గాయము; వాడి = పదును; అఖిలము = ఈ సృష్టి యంతా; పృథుతరము = మిక్కిలి గొప్పదైన; శూలి = శివుడు; పేర్మి = గౌరవము; ఒరులు = ఇతరులు; నిరుపమాంగ = సాటిలేని అంగములు కలవాడు. మన్మథుడు.
భావము :-
లోకములోని సమస్త జీవరాసులయొక్క మనసులను కలచివేసే నీ గొప్పదనమే గొప్పదనం. నాటినా గాటును కనబడనీయని పదునుగా యుండి సాటిలేని నాటును నాటే నీ బాణమే బాణము. పరమేశ్వరుని సృష్టిలోని పురుషులందరికీ దీపమై వెలిగే నీరూపమే రూపము. ఈ సృష్టి ఎంత యున్నదో యంతవరకు అందమైనవాడివని గొప్పదైన నీ బిరుదే బిరుదు. శివుడినైనా, తాపసులనైనా, గాలినైనా, ఎంతటి గొప్పవారినైనా బాధించగలవు. మన్మథా!నీకున్నంత గౌరవము, గొప్పదనము ఇతరులకు ఉన్నదా? నిన్ను సరిపోలుట ఎవరితరం?....

2-59-క.
ప్పనిపని కేఁ బంపను
ప్పుగఁ బుష్పాలపూజ లొనరించుగతిన్
ప్పుము దేవర శిరమును
నిప్పుడు నీపుష్పశరము లింతే చాలున్.

టీక :-
ఒప్పు = తగు; ఒనరించు = చేయు.
భావము :-
తగని పనికి నేను పంపను. ఉచితమగు రీతిని పూలతో పూజ చేసిన విధముగా శివుని శిరస్సును యిప్పుడు నీ పుష్ప బాణాలతో కప్పుము. అంతియే చాలును.

2-60-శా.
లోకాధీశుఁడుశూలి నిన్నుఁ గనినన్ లోకోపకారార్థియై
యీ కాత్యాయనిఁ దన్నుఁగూర్పఁ దనపై నేతెంచినాఁడంచు దా
నే కీడుం దలపోయకుండు నలుగండీ మాటసిద్ధంబు నీ
కీ కార్యం బవలీలగా నెఱుఁగుమీ యేపారఁగం దర్పకా!

టీక :-
లోకాధీశుడు = లోకేశ్వరుడు,శివుడు; శూలి = శివుడు; కనిన = చూసినచో; ఏతెంచు = వచ్చు; కీడు = అపకారము; తలపోయు = భావించు; అలుగడు = కోపముచేయడు; సిద్ధము = రూఢమైనది, యదార్థము; ఏపారు= విజృంభించు.
భావము :-
లోకేశ్వరుడైన శివుడు నిన్ను చూసినా లోకోపకారం కోసం యీ కాత్యాయనిని తనను కలుపుటకు తనపైకి వచ్చావని తా నేకీడును తలపెట్టడు. కోపగించుకోడు. ఇది రూఢి యైన మాట. నీ వీ పనిని అవలీలగా చేయగలవని తెలుసుకొని విజృంభించు మన్మథుడా!...

2-61-క.
ట్టి విధంబులు చెప్పిన
నెట్టన నినుఁబోఁటివాఁడు నెరబిరుదైనన్
ట్టనఁగావించెదనని
బెట్టిదములు పలుకుఁగాక పిఱికియునగునే.

టీక :-
నెట్టన = అనివార్యముగా; నెర = నేర్పరి; ఘట్టన = అణచివేయు; బెట్టిదములు = నిష్టుర వచనములు.
భావము :-
ఇన్ని రకాలుగా చెబితే తప్పనిసరిగా నీలాంటివాడు నేర్పరియైన బిరుదు కలవాడు (తారకాసురుని) అణచివేస్తానని గొప్పలు చెబుతారు కానీ పిఱికివారౌతారా?

2-62-క.
ఎం పనియైన మైకొని
పంతంబునఁ జేయు నీవు యమున నకటా
చింతించెదు పలుమాఱును
చింతించుటనీకుఁ దగదు చిత్తజ! వినుమా.

టీక :-
మైకొని = సమ్మతించు, ఇయ్యకొను; అకటా= అయ్యో; చిత్తజుడు= (మనసునుండి పుట్టినవాడు) మన్మథుడు.
భావము :-
ఎంత పనైనా ఒప్పుకొని పంతముగా చేసే నీకు భయమా? అయ్యో! ఇన్ని సార్లు ఆలోచిస్తావా? వినవయ్యా మన్మథుడా! చింతించుట తగదయ్యా!.

2-63-సీ.
లకంఠగణముల లనాదములతోడఁ;
లహంసనాదంబులుఁ గడలుకొనఁ
రయ డాకాలిపెండెరము నాదమ్ముతో;
ఝంకారనాదంబు డికొనంగ
భూరి సుందరరాజకీర నాదములతో;
వెడవింటినాదంబు సుడిగొనంగ
నందంద చెలరేఁగి యార్చునాదములతో;
రవేదనాదంబు డలుకొనఁగ

2-63.1-తే.
లిసి వెన్నెలగాయంగఁ మ్మగాలి
యెలమి వీవంగఁ బూవింటి యెక్కి ద్రోచి
రముసంధించి యేయుచో శంకరుండు
లఁగు నంగజ! మమ్మెల్ల గావుమయ్య!”

టీక :-
కల = అవ్యక్త మధురమైన ధ్వని; కడలుకొను = వ్యాపించు; అరయ = విచారింపగా; డాకాలు = ఎడమకాలు; పెండెరము= గండపెడెరము, కాలికి ధరించు పెండెముగం; జడికొను = రొదజేయు; కీరము = చిలుక; వెడవింటి = మన్మథుడు; (వెడ = అల్పము, వింత;) సుడిగొను = చుట్టుకొను; ఆర్చు = ధ్వనించు; జడలుగొను = పెనవేసుకొనిపోవు; ఎలమి = ఆనందము; కలగు = కలతపడు; అంగజుడు = మన్మథుడు.
భావము :-
కోకిల గుంపులు చేసే మధురమైన ధ్వనులతో కలహంసనాదాలు కలసి వ్యాపించగా, ఎడమకాలి గండపెండెర నాదముతో ఝంకారనాదము కలసి సందడిచేయగా, బాగా అందమైన రామచిలుకల రవములతో వింతైన మన్మథుని వింటి నాదములు చుట్టుముట్టగా, ఉండిఉండి పెట్టే బొబ్బలతో శరవేగ శబ్దము పెనవేసుకోగా, వెన్నెల కాయుట, కమ్మనైన గాలి ఆహ్లాదముగా వీచుటజతచేసి పూలవిల్లును ఎక్కుపెట్టి బాణము వేస్తే శంకరుడు కలతచెందును. మన్మథా! మమ్మల్నందరినీ కాపాడవయ్యా.”

2-64-వ.
అని మఱియును బ్రియంబును కఱకును దొరల నాడు దేవేంద్రు వచనంబులకు విహ్వలీకృతమానసుండై కొంతప్రొద్దు విచారించి యెట్టకేలకు నొడంబడి “సురేంద్రా! భవదీయ మనోరథంబు సఫలంబుఁజేసెద” నని పల్కి మఱియు నిట్లనియె.

టీక :-
విహ్వలీకృతము = భయముచేత అవయవముల స్వాధీనము తప్పుట,.
భావము :-
ఇంద్రుడు అలా మిక్కిలి ప్రియముగాను, నిష్టురముగానూ మాట్లాడిన దేవేంద్రుని వచనములకు మిక్కిలి బెదిరి, కొంత తడవు ఆలోచించుకొని చివరకు ఒప్పుకొని “సురేంద్రా! మీ యొక్క కోరికను తీరుస్తాను.” అనిచెప్పి ఇంకా ఇలా అంటున్నాడు.

2-65-ఉ.
బంటుతనంబు పెంపెసఁగఁ చ్చని కార్ముకమెక్కువెట్టి యా
యొంరి యైనయట్టి శివయోగసముద్రము నాదుకోలలన్
రెంలుచేసి శీఘ్రమున నిక్కముగాఁ జలికొండకూతు పు
ట్టింటికి గౌరివెంటఁ జన నీశునితోఁ బఱతున్ సురాధిపా!

టీక :-
బంటుతనము = శూరత్వము; పచ్చనివిల్లు = చెఱకువిల్లు; ఐనయట్టి = అయినది; కోల = బాణము; రెంటలు చేయు = బద్దలుకొట్టు; చలికొండకూతు = హిమపర్వతుని కూతురు, పార్వతీదేవి.
భావము :-
“నా శూరత్వము అతిశయించగా చెఱకువిల్లు ఎక్కుపెట్టి యొంటరివాడైన పరమశివుని యొక్క యోగసముద్రమును నా బాణాలతో బద్దలుకొడతాను. శీఘ్రమే పార్వతివెంట ఆమెపుట్టింటికి శివుడు వెళ్ళేలా చేస్తాను.దేవేంద్రా!.”

2-66-వ.
అనిన విని పురందరాది దేవగణంబులు బహుప్రకారంబుల నంగజాతుని వినుతించి వీడ్కొల్పిన నత్యంతకర్మపాశబద్ద మానసుండై నిజమందిరంబునకుం జనియె.
భావము :-
మన్మథుడు అలా అనగా విని, ఇంద్రాది దేవతలు రకరకాలుగా స్తుతించి పోయి రమ్మనిరి. ఆ అనంగుడు బాధ్యతకు మిక్కలిగా కట్టుబడిన మనసుతో తన యింటికి వెళ్ళెను.