పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

   బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహా పురాణానికి మూలాధారమైనది వ్యాస ప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఇది సంస్కృతములో రచింపబడినది; వ్యాసులవారు శ్రీమద్భారత ఇతిహాస, అష్టాదశ పురాణాలను అనుగ్రహించిన మహర్షి. అంతటివారు భారత రచన పిమ్మట రాబోయే తరాలకు అందించవలసిన జ్ఞానం అందించుటలో తృప్తి కలుగలేదు, మనోవ్యాకులత తగ్గటం లేదని చింతించారు. నారదోద్భోదతో శ్రీమద్భాగవతాన్ని రచించి కృతకృత్యులయ్యారు. ఇమ్మహాపురాణం కాలక్రమేణా సకల ప్రాంతీయ అంతర్జాతీయ భాషలలోనూ వెలసింది.
  ఆ శ్రీమద్భాగవతము ఇక్కడ ఆస్వాదించగలరు, మఱియు నిది పారాయణ చేయుటకు అనుకూలమై ఉండును