పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ట్రస్టు - కార్యక్రమాలు : ట్రస్టు కార్యక్రమాలు

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

సంస్థ కార్యక్రమాలు
బహుళ విజ్ఞాన గని, విశాల సాహితీ ప్రపంచమూ అయిన పరమ పవిత్ర “భాగవతాన్ని”, ప్రణీతం చేసిన పరమ భాగవతోత్తముడు, ప్రజాకవి అయిన “బమ్మెర పోతనామాత్యుల వారి కృషినీ” జన బాహుళ్యంలోకీ, అంతర్జాల బాహుళ్యం లోకి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా తీసుకువెళ్లటానికీ; తెలుగుభాష వాడుకను నవ సాంకేతిక మాధ్యమాలలో విస్తృతంగా పెంచడానికీ; “భాగవత గణనాధ్యాయం” అనే కృషి 2007లో చేపట్టాను. ఔత్సాహికులు, సహృదయులు, భాగవత బంధువులు మున్నగు వారం మేం అందరం కలిసి ఈ కృషిని స్వచ్ఛంద సేవలు ద్వారా, వ్యాపారాత్మక రహితంగా నిర్వహిస్తున్నాం.
అలా ఆ నాటి నుండి పోతన తెలుగు భాగవతాన్ని యూనీకోడీకరించి, కంప్యూటరు దస్త్రాలు తయారు చేస్తున్నాం. ఇది అమృతాన్ని చిలికే నిరంతరంగా సాగే వ్యవసాయం.
భాగవత గణనాధ్యాయం లో భాగంగా : -

  1. తెలుగు భాగవతం జాలగూడు 2011 లో నిర్మించి నడిపాము. దానిని 2013 లోతెలుగుభాగవతం.ఆర్గ్ (http://telugubhagavatam.org/)గా పునర్వ్యవస్థీకరణ, పునర్నిర్మాణం చేసి 2013, కృష్ణాష్టమి నాడు చిలుకూరు బాలాజీ వారి దివ్య సమక్షంలో ఆవిష్కరించి జాతికి అంకితం చేశాం. ఆ విధంగా బమ్మెర పోతన తెలుగు భాగవతం ప్రతి పద టీక, ప్రతి పద్య ఆడియోల సహితంగా ససంపూర్ణంగా, ససమగ్రంగా ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నాము. మరియు తెలుగు భాగవతం ప్రణీతం చేసిన తెలుగుల పుణ్యపేటి మన పోతనామాత్యుల వారి రచనలు అన్నీ ఇంకా సంబంధిత విషయాలు అనేకం యూనికోడ్ లో అందిస్తున్నాం. అందిస్తూ ఉంటాం. తెలుగు వీక్షక దేవుళ్ళు చక్కటి ఆదర ప్రోత్సాహాలు అందిస్తున్నారు.
  2. నాటి నుండి నిర్వహిస్తున్న ఈ తెలుగుభాగవతం.ఆర్గ్" అనే ఈ జాలగూడుకి అనుసంధానంగా; తెలుగుభాగవతం.ఆర్గ్ కు ప్రతిబింబ జాలగూళ్ళు తెలుగుభాగవతం.కాం "; తెలుగుభాగవతం.నెట్ కూడ నిర్వహిస్తున్నాం. అలా “భాగవతం చదువుకుందాం; బాగుపడదాం మనం అందరం” అనే మా స్పూర్తిని జాలజనులకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్నాం. జాల జనులు అనేకులు హార్దిక ప్రోత్సాహాలు అందిస్తున్నారు.
  3. “ముఖ పుస్తకం”, “బ్లాగు”, “జిప్లస్సు”, “ట్విట్టరు”, “పింటరెస్టు” వంటి అంతర్జాల సాంఘిక మాధ్యమాలలో పోతన తెలుగు భాగవతం ప్రచారం చేస్తున్నాము, “భాగవతం చదువుకుందాం; బాగుపడదాం మనం అందరం” అనే మా స్పూర్తిని అందిస్తున్నాం. అసంఖ్యాకమైన సాంఘిక మాధ్యమ జీవులు ప్రోత్సాహం అందిస్తున్నారు.
  4. నవ తరం చరశీల చలనశీల తెలుగులకు పోతన భాగవతం; “చరవాణి, దూరవాణి” ఏప్పులు “వాట్సాప్”; “టెలిగ్రాం” అనేకం ద్వారా ప్రచారం విస్తృత చేస్తున్నాం. యువ రక్తం ముందుకు వచ్చి ఆస్వాదిస్తోంది. పోతన స్పూర్తిని అందుకుంటోంది.
  5. సాహితీ ప్రియులకు, భాగవత అభిమానులకు పోతన భాగవతం మరింత చేరువ చేయటానికి, పోతన తెలుగు భాగవతం ప్రచారం చేయటానికి సమావేశాలు నిర్వహిస్తున్నాం. పరమ భాగవతులు, సాహితీవేత్తలు, పండితులు, ఆదరిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు, సహాయాలు అందిస్తున్నారు.
  6. పోతన తెలుగు భాగవతం విస్తృతంగా ప్రచారం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో “తెలుగు భాగవత ప్రచార సంస్థ” అనే రిజిస్టరుడు ట్రస్టు (నం. 85/2015) హైదరాబాదు, తెలంగాణా, ఇండియాలో వ్యవస్థాపించి నిర్వహిస్తున్నాం. ఆంధ్రా బ్యాంకులో ఖాతా తెరచి నడుపుతున్నాం. “భాగవతం చదువుకుందాం; బాగుపడదాం మనం అందరం” స్పూర్తిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం.
  7. పోతన తెలుగు భాగవతం మరియు ఇతర రచనలు మున్నగు పాత బంగారం విలువలను, కొత్తొక వింత వంటి సరికొత్త నవ సాంకేతిక మాధ్యమాలు; ఉపకరణాలు; ద్వారా సులువుగా లోతుగా అధ్యయనం చేయుటకు వీలైన “గణనోపాఖ్యానం” అనే వినూత్న, అపూర్వ విధానంలో కంప్యూటరు వర్డు ఎక్సెల్ మాధ్యమాలు ఉపయోగించి చేసే అధ్యయనం చేస్తున్నాం.
  8. ఈ విధంగా పోతన తెలుగు భాగవతం మరియు పోతన ఇతర రచనలు మున్నగు పాత బంగారం విలువలను, కొత్తొక వింత వంటి సరికొత్త నవ సాంకేతిక మాధ్యమాలు; ఉపకరణాలు ద్వారా ప్రచారం చేస్తున్నాం. తద్వారా హైందవ సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఉన్నత విలువలు, జాతీయ సమగ్రతలు సుస్థిరం చేయటంలో మా వంతు కృషి చేస్తున్నాం.

ఈ కార్యక్రమాలలో ఎందరో ఔత్సాహికులు, సహృదయులు, భాగవత బంధువులు మున్నగు వారు స్వచ్చందంగా పాలుపంచుకుంటున్నారు. వారందరికీ వారి కుటుంబ సభ్యులకు మా నల్లనయ్య అనుగ్రహం అనంతంగా లభించు గాక.
ఎందరో మహానుభావులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, భాగవత అభిమానులు, సాహితీవేత్తలూ, భక్తులూ అందరూ అభిమానంగా ఆదరిస్తున్నారు. వారందరికీ వినయపూర్వక నమస్కార సహస్రాలు. వారందరిని, వారి కుటుంబ పరివార సభ్యులను మా నల్లనయ్య చల్లగా చూస్తూ ఉండు గాక.
- భాగవత గణనాధ్యాయి,
గురుగావ్, హర్యానా, ఇండియా122 001

-x-x-x-