పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2015 సెప్టంబరు, 05 - ద్వితీయ వార్షికోత్సవం

ద్వితీయ వార్షికోత్సవ ఛాయాచిత్రమాలిక – విశేషాలు – పండితాశీర్వాద పద్యాలు


2015 – సెప్టెంబరు, 05వ తారీఖున, భారతదేశం, హైదరాబాదు, రవీంద్ర భారతి సమావేశ వేదికపై తెలుగుభాగవతం.ఆర్గ్ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా, జయప్రదంగా జరిగింది.

భాగవతులు, మా బృంద సభ్యులు, రామక సత్యంగారు ప్రార్థనాగీతం ఆలపించారు. చిరంజీవి పర్వతం స్పందన ఆమె తమ్ముడు - గోపీ కృష్ణుని మీద గీతాలతో బహు చక్కని భరత నాట్యాలు చేసి సభను అలరించారు. ముగ్గురు చిరంజీవులు విష్ణుభట్ల కార్తీక్, విష్ణుభట్ల ప్రహర్షిత, గుణ్ణం తన్మయి- అత్యద్భుతంగా భాగవత పద్యాలను పఠించి సభికులను ఆనందంలో ఓలలాడించారు.

పరమ భాగవతులు చొప్పాకుల సత్యన్నారారాయణగారు - సంస్కృత కళాశాలలో పదవీవిరమణ చేసిన ఆచార్యులు, మహా పండితులు, జాలజనులు అతిథిగా విచ్చేసి ఆశీర్వదించారు; భాగవతులు చింతా రామకృష్ణారావుగారు – ప్రముఖ కవి, ప్రముఖ అవధాని ప్రముఖ బ్లాగరు, జాలజనులు; భాగవతులు రేవళ్ళ వేంకట కృష్ణశాస్త్రిగారు - ప్రముఖ సంస్కృత తెలుగు ఉభయ భాషా పండితులు, జాలజనులు; భాగవతులు సమన్ లతగారు - హిందీ విశ్వవిద్యాలయ ప్రముఖ ఆచార్యులు, తితిదే హిందీ వ్యాఖ్యాత; భాగవతులు తోటపల్లి అశోక్ గారు - ప్రముఖ సాఫ్టువేరు సంస్థ WISSIN info tech సిఇఓ అతిథులుగా విచ్చేసి తమ అమూల్య సందేశాలను ఇచ్చారు. తెలుగుభాగవతం.ఆర్గ్ సభ్యులు భాగవతులు భాగవత గణనాధ్యాయి, వేంకట కణాద, ఉమామహేశ్ తెలుగుభాగవతం.ఆర్గ్ జాలగూడు గురించి వివరించారు. అమెరికాలో ఉంటున్న సభ్యురాలు భాగవతులు మీనాగారు ప్రత్యక్షంగా రాలేకపోయినా, చరవాణిలో తన సందేశం వినిపించారు. భాగవతులు బాలాంత్రపు వేంకట రమణగారు వ్యాఖ్యాతగా సభను దిగ్విజయంగా, మనోహరంగా నిర్వహించారు.

అతిథి ప్రముఖులను శాలువాలతో సత్కరించి చిరు జ్ఞాపికను ఒసంగితిమి. అలరించిన బాలబాలికలకు ఒక్కొక్కరికి బొమ్మల భాగవతం పుస్తకాలు, చిరు నగదు-బహుమతి, జ్ఞాపిక చొప్పున బహూకరించాము.

భాగవతులు వింజమూరి వేంకట సుబ్బారావుగారు - ప్రముఖ పండితులు, జాలజనులు; భాగవతులు తెలుగు రథం కెపి శర్మగారు; మున్నగు ప్రముఖులుతో సహా సహృదయంతో సభికులు అందరూ విచ్చేసి సభను అలంకరించారు. తమ ఆదరాభిమాన సహకారాలతో సభను జయప్రదం చేశారు.

చక్కగా కార్యక్రమ నిర్వహణ చేసిన మా బండి శ్రీనివాస శర్మ అతిథులకు, సభికులకు, సాంస్కృతిక కార్యక్రమం అందించిన బాలబాలికలకు, వారి తల్లిదండ్రులకు, సహకారం అందించిన పాత్రికేయ మిత్రులకు, రవీంద్ర భారతి నిర్వాహకులు - తెలగాంణా సాంస్కృతికశాఖ అధికారులకు, మా బృంద సభ్యులకు, నిర్వాహకులకు - సభ జయప్రదం గావించిన అందరికి తెలుగుభాగవతం.ఆర్గ్ తరఫున ధన్యవాద సమర్పణ తెలియజెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా బృంద సభ్యులలో కొందరు ప్రత్యక్షంగా పాల్గొని, తమ సహాయ సహకారాలతో సభను జయప్రదం గావించారు. వారు:-

భాగవతులు సర్వశ్రీ

  • కాకినాడ నుండి - రాజా చంద్ర;
  • గురుగాం నుండి - భాగవత గణనాధ్యాయి ఊలపల్లి సాంబశివరావు, లలిత;
  • బేంగళూరు నుండి - డివిఎస్ ప్రసాద రావు
  • సాలూరు నుండి - కామేశ్వర రావు
  • హుజూరాబాదు నుండి – ఆదిత్య;
  • హైదరాబాదునుండి - వేంకట కణాద, బండి శ్రీనివాస శర్మ, ఉమామహేశ్, రామక సత్యం, ఘట్టి కృష్ణమూర్తి, కంది శంకరయ్య, చింతా రామకృష్ణా రావు, బాలాంత్రపు వెంకట రమణ, అన్నపురెడ్డి సత్యన్నారాయణ రెడ్డి;
  • గమనిక:- మహాకవి చింతా రామకృష్ణారావు గారు ఈ ద్వితీయ వార్షికోత్సవ వేదికపై తన ప్రసంగంలో పలికిన పండిత ఆశీర్వచన పద్యాలు క్రింద ఉన్నాయి చూడండి
    (http://andhraamrutham.blogspot.in/2015/09/blog-post_73.html)
    పరమభక్తాగ్రేసరుల, పండితవరేణ్యుల నోట పలుకులు వ్యర్థం కావు, సత్యమే అయి తీరతాయి అంటూ, పోతనగారు ఇలా అంతర్జాలంలో తెలుగు భాగవతం వస్తుందని హేలగా సూచించారు అని 2వ, 3వ పద్యాల చమత్కరించారించి; మా బృంద సభ్యులు కొందరు చేసిన చిరు యత్నాలను జోడించి, ఉత్పలమాలతో (6వ పద్యం) సత్కరించారు ఈ మహాకవి చింతావారు

    1) ఉత్పలమాల.
    శ్రీ వనీత మానస విశిష్ట గుణాఢ్యులు. సత్ కవీశ్వరుల్,
    మా ధనాఢ్యులున్, సుగుణ మంజుల వాఙ్మహనీయ భాగ్యులున్,
    జ్ఞా సుపూజ్యులున్, వినుత జాల సుసోదర సోదరీమణుల్
    నా నుడులన్ గ్రహించి, మది న్ను గణింప నమస్కరించెదన్.

    2) కందం.
    జాలోపలబ్ధ భగవత్
    శీముగా భాగవతము చేతికినొసగన్
    జాలుదురని తలపోసియె
    హేగ సూచించె భవిత నిట పోతనయున్.

    3) తేటగీతి.
    వందిమాగాధ సూత కైవార రవము
    సుమతీ సురకోటి దీనల మ్రోత,
    నుగమింపగ సతులు సౌధాగ్ర శిఖర
    జాలములనుండి ముత్యాల జాల మొలుక.
    (భాగవతం = 10.2-667)

    4) బహు కంద గీత గర్భ చంపకమాల.

    కవితాకృతిన్ తెలుగు భాగవతంబిల దీప్తమౌనుగా!
    భవులన్తటన్ వెలుగు భాగవతుల్మన పేరు నిల్పుగా!
    పు నవనీతులౌ సుకవి పుంగవులెల్లను శోభఁ దేలుఁగా!
    నవధాత్రిగాన్ సకల భాగ్య వసుంధర సంతసించుఁగా!

    5) తేటగీతి.
    నుపముఁడు భాగవతముడాట్టార్గుపతికి,
    మాన్యులైనట్టి తన్మిత్ర మండలికిని,
    భను గలయట్టి సన్మిత్ర రసులకును,
    వందనము సేతు శ్రీహరి క్తులకును.

    6) ఉత్పలమాల
    మంళమౌత భాగవత మాన్యుల బ్లాగుకు, నూలపల్లికిన్,
    మంళముల్ కణాదకు, యుమా శివ మూర్తికి, సద్దిలీపుకున్,
    మంళమౌత బండికిని, మంగళముల్ సభనున్నవారికిన్,
    మంళమౌత శ్రీహరికి, మంగళముల్ మన భారతాంబకున్.