పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పోటీలు : భాగవత సంస్కృతి పోటీలు - 2018


EMBLEM

; తెలుగు భాగవత ప్రచార సమితి
హైదరాబాద్, తెలంగాణా, ఇండియా.
(85/2015 సంఖ్యతో నమోదైన సంస్థ; Regd. Trust wide no. 85/2015)
చరవాణి: +91 9959 61 3690; +91 9000 00 2538; +91 8826 33 3690;

హైదరాబాద్,
2018-03-18,

నమోదు (రిజిస్ట్రేషన్) కు లింకు:

2018 కృష్ణాష్టమి పోటీలు : : భాగవత సంస్కృతి (ఒక అధ్యయనము) 
2వ ఆవృత్తి
దరఖాస్తులకు ఆహ్వానం:
చివరి తేదీ: 18- జూలై, 2018. (పొడిగింపు 31-07-2018 వరకు)

పరివాజ్రకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ అమృతానంద సరస్వతి స్వామి, శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతి , (జోతిషామ్నాయ ద్వారకా పీఠం) వార్ల దివ్యాశీసులతో
భాగవత ప్రచార సమితి 2018 కృష్ణాష్టమి పోటీలు "భాగవత సంస్కృతి (ఒక అధ్యయనము)" అను పేర సవరణల పోటీలు నిర్వహిస్తున్నది. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థులు http://www.telugubhagavatam.orgలో భాగవతము చదివి అందులోని (పద్య, గద్య, టీకా, తాత్పర్యాలలో) తప్పొప్పులు వెతికి (అచ్చు తప్పులు కాని, వ్యాకరణ దోషాలు కాని ఇంకేవైనా సరే) వాటిని, వాటికి సూచించే సవరణలను తెలుగు భాగవత ప్రచార సమితి వారికి (bhagavatapracharasamiti@gmail.com కు ), లేదా (vsrao50@gmail.com కు ) email పంపాలి. అత్యధిక తప్పులు గుర్తించి పంపిన వారికి మంచి బహుమతులు, ఆదిశంకరాచార్య ప్రతిష్ఠిత జ్యోతిషామ్నాయ ద్వారకా పీఠం నుండి - వారికి జయపత్రాలు, పాల్గొన్న వారందరికి ధృవపత్రములు ఉన్నాయి.

నియమాలు:

 1. పోటీలో పాల్గొనే వారు ఈ వెబ్ సైటులో (online) లో నమోదు (రిజిష్టర్) చేసుకోవాలి ;
 2. ప్రపంచంలో ఏ ప్రాంతము వారైనా భాగవత సంస్కృతికి నమోదు చేసుకుని పోటీలో పాల్గొనవచ్చు;
 3. నమోదు పూర్తిగా ఉచితము;
 4. నమోదు పట్టిక (ఫారం) లో అన్ని గడులు నింపాలి;
 5. పోటీ 18- మార్చి, 2018 నుండి 18 - జూలై, 2018 వరకు అమలు లో ఉంటుంది;
 6. జూలై 18, 2018 లోపు అభ్యర్థులు వారు నమోదు చేసిన వివరాలు (bhagavatapracharasamiti@gmail.com కు ), లేదా (vsrao50@gmail.com కు ) email పంపాలి; (సవరణలను సమర్పించుటకు చివరి తేదీ 31-జూలై వరకు పొడిగించబడింది.)  

 7. అభ్యర్థులు వారు గుర్తించిన తప్పోప్పుల వివరాలు క్రింద చూపిన నమూనా పట్టిక రూపంలో మాత్రమే పంపాలి;
 8. ప్రతి సవరణకు

  స్కంధము :
  పద్య సంఖ్య,
  1) సవరించవలసిన పాఠం,
  2) సూచించిన సవరణ పాఠం
  3) అవసరమైతే ఆథారం

 9. గడువులోగా అందిన దరఖాస్తులను పండిత కమిటీ మూల్యాంకన చేస్తుంది;
 10. పండితకమిటీ అధ్యక్షులు పరివాజ్రకాచార్య శ్రీ శ్రీ శ్రీ అమృతానంద సరస్వతి స్వామివారు, (జోతిషామ్నాయ ద్వారకా పీఠం);
 11. అత్యధిక సవరణల ప్రతిపాదనలు చూపిన ముగ్గురు ఎంపిక చేయబడతారు;
 12. ఎంపికైన వారికి క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పరివాజ్రకాచార్య శ్రీ శ్రీ శ్రీ అమృతానంద సరస్వతి స్వామివారి ద్వారా జయపత్రము అందచేయబడును;
 13. పాల్గొన్న వారందరికీ ధృవ పత్రం అందజేయబడును;
 14. ప్రథమ బహుమతి రూ. 5000 + ఎంపికైన ప్రతి సవరణ ప్రతిపాదనకు 2 రూపాయల చొప్పున;
 15. ద్వితీయ బహుమతి రూ. 2000 + ఎంపికైన ప్రతి సవరణ ప్రతిపాదనకు 2 రూపాయల చొప్పున;
 16. తృతీయ బహుమతి రూ. 1000 + ఎంపికైన ప్రతి సవరణ ప్రతిపాదనకు 2 రూపాయల చొప్పున.
నమోదు (రిజిస్ట్రేషన్) కు లింకు: