పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వార్తా ఉల్లేఖనాలు : 2018-09-04 ఈక్షణంలో జయంత్యుత్సవాలు



ఈక్షణం
eekshanam.com
2018-09-04

తాజా వార్తలు
*[ September 4, 2018 ]
సింగపూర్‌లో ఘనంగా భాగవత జయంత్యుత్సవం.. అవీ.. ఇవీ..
Search for:
HOMEఅవీ.. ఇవీ..సింగపూర్‌లో ఘనంగా భాగవత జయంత్యుత్సవం..
September 4, 2018 eekshadmin అవీ.. ఇవీ.. 0

సింగపూర్‌లో ఘనంగా ‘భాగవత జయంత్యుత్సవం ఈక్షణం పత్రిక


ఈక్షణంలో పడిన ఛాయాచిత్రం

సింగపూర్: "తెలుగు భాగవత ప్రచార సమితి", "గణనాలయము" సంస్థలు సంయుక్తంగా సింగపూర్‌లో సెప్టెంబర్ రెండున కృష్ణాష్టమి సందర్భంగా భాగవత జయంత్యుత్సవం 2018 నిర్వహించాయి.సనాతన హిందూ ధర్మానికి తలమానికమైన "శ్రీమద్భాగవత" గ్రంధంలోని భక్తితత్వం ప్రతిఒక్కరికి అన్నికాలాలలోనూ ఆదర్శప్రాయము కావాలనే సంకల్పంతో, మన పోతన తెలుగు భాగవతం మరింత ప్రాచుర్యంలోనికి తెచ్చే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పిల్లలలో కూడా భాగవత తత్వం పట్ల ఆసక్తి పెంచేవిధంగా వారికి భాగవత ఇతివృత్తానికి సంబంధించిన చిత్రలేఖనము / కథల పోటీలను నిర్వహించారు.
శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతీ సంయమీంద్ర మహాస్వాములవారు విజేతలకు ధృవపత్రాలను పంపించి ఆశీర్వదించారు. పిల్లలకు పెద్దలకు కూడా అనువైనవిధంగా కార్యక్రమం రూపొందడంతో సింగపూర్ లోని తెలుగు వారందరూ అధిక సంఖ్యలో సకుటుంబంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమము అనంతరం పాల్గొన్న భక్తులు అందరికీ అన్నప్రసాద వితరణ గావించారు.



vs rao's Tweets
భాగవత పారాయణము, భక్తి పాటలు, పిల్లల పాటలు, ఆసక్తికరమైన సాంస్కృతిక కార్యక్రమాలతో కృష్ణాష్టమిని సింగపూర్ వాసులు అందరూ కలిసి వైభవోపేతంగా జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారు. భాగవతం లోని వివిధ పాత్రల వేషధారణలతో చిన్నారులు ప్రత్యేకంగా ఆహూతులను అలరించారు.

ముఖ్యఅతిథిగా ప్రముఖ వక్త, ఉపనిషత్తులలో పట్టభద్రుడు, తెలుగు ఉమ్మడి రాష్ట్రాలకు మాజీ డీజీపీ, డాక్టర్ కరణం అరవిందరావు పాల్గొన్నారు. స్ఫూర్తిదాయక ఆధ్యాత్మిక సందేశాన్నిచ్చారు.
భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో సంస్థ యొక్క 5వ వార్షికోత్సవాన్ని కూడా పురస్కరించుకుని ఈ ఏడాది హైదరాబాద్, సింగపూర్ లో ఒకేరోజున భాగవత జయంతి వేడుకలు నిర్వహించడం విశేషం. అన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడంవల్ల ప్రపంచ నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమం తిలకించారు.ఈ కార్యక్రమంలో భాస్కర్, విద్యాధరి, రవితేజ, రాధిక, లావణ్య, మమత, నమ్రత, భరద్వాజ్, శ్రీధర్, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు
This post is also available in : English