పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : రుక్మిణమ్మ - పోతన్న - అనుబంధము

శ్రీ రామ

బమ్మెరపోతనార్య విరచిత రుక్మిణీకల్యాణం స్వతంత్ర లఘుకావ్యంగా తెలుగుసంప్రదాయ సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా విరాజిల్లుతూనే ఉంటుంది. కన్నయ్య అంటే పోతయ్యకు ఎంతటీ భక్తి ఉందో, రుక్మిణమ్మ అంటేకూడా బమ్మెరవారికి అంతటి భక్తి... పైగా రుక్మిణమ్మకూ పోతన్నకూ పుట్టుకతోనే అనుబంధం ఉంది. ఏమి ఆ అనుబంధం అంటారా!

రుక్కమ్మ, పోతన్న ఇద్దరూ కౌండిన్యులే. రుక్మిణమ్మ కౌండిన్య - అంటే కుండిన నగర సంజాత. పోతయ్యకూడా కౌండిన్య నే - అంటే కౌండిన్యగోత్రసంజాతుడు. ఈ సంబంధం మత్పురాకృతశుభాధిక్యంవల్ల ఇదివరకు ఎవరూ పేర్కొనక నాకు వదలినారు.

వైద్యంవేంకటేశ్వరాచార్యులుభాగవతశ్రీచరణరేణువు