పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతన రచనలు

పోతన రచనలువెనుకటి పుట . . . ఓం శ్రీరామ . . . తరువాత పుట

పోతన రచనలు

జాతీయ మహా పోతనగారి కాలాదులు వారి రచనా కాలాదులు అంత ఇదమిద్ధంగా తెలియటం లేదు అంటారు. కాని వారి రచనలను లభ్యం అవుతున్న నాలుగు ఇక్కడ చదువుకొనుటకు వీలుగా సంకలనం చేసి పెట్టాము ఆస్వాదించండి. వీటి భావార్థాలు మున్నగునవి కూడా ఈ విధంగా అందించాలని ప్రయత్నంలో ఉన్నాము. ఈ పనిలో ఆసక్తి కలవారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి, పాలుపంచుకోండి.

(1)

ఈ గ్రంథం తెలుగుల పుణ్యపేటి పోతన గారు ఆంధ్రభాషకు అలంకార శ్రేష్ఠము, తెలుగులకు అందించిన మహా ప్రసాదము. పోతన గారు బాగా పరిణతి చెందిన స్థాయికి చేరిన పిమ్మట చేసినది రచన. పారాయణ గ్రంథముగా బహుళ ప్రాచుర్యం గలది.
భాగవత రచనలో నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అనే కవిత్రయం పాల్గొన్నారు. భాగవతం విషయంలో పోతన కృతిలో పూరణ, ప్రక్షిప్తాలు లేదా వారిచే నియుక్తులై వారి భాగాలు ఉన్నాయి. గగన, సింగయ, నారయ వారల రచనలు ముఖ్యమైనవి, ప్రసిద్ధమైనవి.

(2)

వీరశైవ కుటుంబంలో అపర వ్యాస అవతారంగా జన్మించిన పోతన్న చేసిన శైవ రచన. ప్రముఖ వీరశైవ పండితుడు అయిన ఇవటూరి సోమనాథరాధ్యులు వారి అనుయాయిగా చెప్పుకుంటూ రచించినది ఈ పుస్తకం.

(3)

వైష్ణవ ప్రమాణ గ్రంధాలలో ముఖ్యమైనది అయిన భాగవతాన్ని తెలుగీకరించిన పోతన వారి రచన ఇది. నారాయణ శతకం పేరుతో మరి కొన్ని ఉన్నా పోతనగారి ప్రత్యేకత వారిదే.

(4)

ఇది సింగ భూపాలుని ఉంపుడుగత్తెను ఉద్దేశించినది. పోతన తన యౌవనం ఆరంభ కాలంలో రచించి ఉండవచ్చును. తెలుగులో దండకం ప్రసిద్ధమైన ఛందస్సు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో. ఇదే పురాతనమైనది అంటారు.
భాగవతం తప్పించి వీరి ఇతర రచనలు అన్నీ వీరి కృతి అనే విషయంలో కొంత కాలం వివాదాలు ఉన్నా, ఇప్పుడు వీరి రచనలు అని అంగీకరించబడ్డాయి.