పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : పంచమ స్కంధం - ద్వితీయాశ్వాసం

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

రచన

సంస్కృత భాగవత కర్త పరాశర తనయుడు వ్యాసభగవానులు.
ఆ భాగవత ప్రయోక్త వ్యాసుని తనయుడు శుకబ్రహ్మ.
ఆ భాగవతాన్ని భాషించిన వాడు సూతమహర్షి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆంధ్రీకరించబడిన సంస్కృత మూల భాగవతాన్ని పోతన భాగవతం అంటారు. యిది 15వ శతాబ్దంలో రూపుదిద్దుకుంది. కాని మొత్తం అంతా పోతన ప్రణీతం కాదన్నది యధార్థం. కొన్ని భాగాలు లుప్తం కావటం వలన కాని, పోతనా మాత్యులే విడిచి పెట్టుటచేత కాని యితరులచే పూరించ బడింది. కొన్ని ప్రక్షిప్తాలు కూడ ఉన్నాయి. స్థూలంగా తీసుకుంటే పంచమ స్కంధము గంగన, షష్ఠస్కంధము సింగయ, ఏకాదశ ద్వాదశ స్కంధాలు నారయ కృతాలు అనవచ్చు. వీరిలో వెలిగందల నారయ కవి మాత్రం తన ఏకాదశ ద్వాదశ స్కంధాంత గద్యాలలో ప్రస్ఫుటంగా పోతన శిష్యుడ నని చెప్పుకున్నాడు. అలా లుప్తం కాడానికి కారణంగా అప్పటి పరిపాలకుడు వేమారెడ్డి తనకు అంకితమిమ్మన్నా యివ్వలేదన్న కోపంతో భూస్థాపితం చేసాడని. తరువాత వాటిని బయటకు తీసినా అనేక తాళపత్రాలు చెదలు తినేసాయని అంటారు. అవేకాక కాలప్రభావం అనండి మరోటి అనండి యేమైతేనేం పదాలు, పద్యాలు, భాగాలు అనేకం ప్రక్షిప్తం కావటం కూడ జరిగింది.

గంగనార్యుడు

ధ్యాత్మిక రంగమున ఆచరించుటయే గాని వర్ణించి నిరూపించుట ఉండదు. కవిత్వమున అట్లు గాదు. కవి భావించి అనుభవించి, అక్షరాలకి శబ్దం, వాక్యం, ఆలంకారం, రసం మున్నగునవి అద్దుతు రసానందసోపానాలు కట్టాలి. వేదాంత తత్వాదులను అందించటానికి ఆ రసానంద సోపానాలకు పైమెట్టుగా బ్రహ్మానందం ప్రకాశింపజేయాలి. అదే భాగవత రచనా విశిష్ఠత.

గంగనార్యునిచే ప్రణీతమైన పంచమ స్కంధం కావటానికి చిన్నదే అయినా వస్తు గాంభీర్యరీత్యా కావచ్చు రెండు ఆశ్వాశాలుగా యివ్వ బడ్డాయి. ఈ రెండు బాగాలు గంగనార్యులే వ్రాసారు. రెంటిలోను తత్వ విచారాలు ఆధ్యాత్మిక విశేషాలు సాంద్రత అంతర్లీనంగా అధికంగానే ఉంది అనవచ్చు.

పంచమ స్కంధము - ప్రథమాశ్వాశం

రమ నిస్సంగులు వృషభుని భరతుని కథలు ప్రధానంగా నడుస్తాయి. ద్వితీయాశ్వాశంలో గయోపాఖ్యానం, భూ ద్వీప వర్షాదుల వర్ణన, భగణ విశేషాలు, నరకాది లోకాలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి. పోతన స్థాయి అందుకోలేక పోయినా, కవిత్వ పరంగా వీరిది కూడ విశిష్ఠ శైలి. భక్తి యావేశాలలో చెప్పుకో దగ్గది. భక్తుడు విఘ్నాలు వాటిల్లినా సాధన వదలిపెట్టడు. అది భక్తిలో విజయ రహస్యం. అది చెప్పిన ఈ పద్యం ఎంతో సొగసుగా ఉంది.

హరి చరణాంబుజ మకరం
ద రసావేశిత మనః ప్రధానుండగు స
త్పురుషుఁ డొకవేళ విఘ్నముఁ
బొరసినఁ దన పూర్వ మార్గమును విడువఁ డిలన్

లేడిపిల్లమీది వ్యామోహం వల్ల భరతుడు జన్మాంతరంలో పూర్వ జన్మజ్ఞానంతో విప్రసుతునిగా పుట్టాడు. అద్వైత సిద్ధాంతం జీర్ణించుకున్న మహానుభావుడు, జడునిలా ఉంటాడు. అది గుర్తించగానే కాళ్ళమీద పడి ప్రబోధం చెప్పమంటే చెప్తున్నాడు తనేలా ఉండేది. అంతటి స్థిత ప్రజ్ఞత చిన్న తేటగీతిలో తెలియబరచిన తీరు అద్భుతం.

అతుల దివ్యాన్నమైన మృష్టాన్నమైన
నెద్ధి వెట్టిన జిహ్వకు హితముగానె
తలఁచి భక్షించుఁగా; కొండుఁ దలఁచి మిగులఁ
బ్రీతి చేయఁడు రుచులందుఁ బెంపుతోడ.

పంచమ స్కంధము – ద్వితీయాశ్వాశం

జంబూ ద్వీపము, ప్లక్ష ద్వీపము, శాల్మలీ ద్వీపము, కుశ ద్వీపము, క్రౌంచ ద్వీపము, శాక ద్వీపము, పుష్కర ద్వీపము అనెడి యేడు సప్తద్వీపాలు. ఈ సప్తద్వీపాలు వర్షములు కలిగి ఉన్నాయి. ప్రథమమైన జంబూ ద్వీపంలో తొమ్మిది వర్షాలు ఉన్నాయి. అవి 1)రమ్యక వర్షము, 2)హిరణ్మయ వర్షము, 3)కురు వర్షము, 4ఇలావృత వర్షము, 5)హరి వర్షము, 6)కింపురుష వర్షము, 7)భారత వర్షము, 8)భద్రాశ్వ వర్షము, 9)కేతుమాల వర్షము.

నం యుండే భరత వర్షం ఏడవది. ఆరవది కింపురుషం. ఈ కింపురుష వర్షమునకు అధిపతి హనుమంతుడు నిత్యం వర్షాధిదేవత శ్రీరాముని కొలుస్తు ఉంటాడట. ఆ సీతాలక్ష్మణసహితుని ఎంతో చక్కగా వర్ణించాడు. రాముడిని వత్తి చెప్తున్నాట్లు ర-కార ప్రాసవాడాడు కవి.

అరయఁగ సీతాలక్ష్మణ
పరివృతుఁడై వచ్చి రామభద్రుఁడు గడిమిం
బరఁగు నధిదేవతగఁ గిం
పురుష మహావర్షమునకు భూపవరేణ్యా!

వృత్తాల వారీ పద్యాల లెక్క

పంచమ స్కంధం = పూర్వాశ్వాసం || = ఉత్తరాశ్వాసం
పద్యగద్యలు = 184 || = 178
తేటగీతి సీసంతో = 23 || = 3
ఆటవెలది సీసంతో = 10 || = 18
మొత్తం = 210 || = 196
పద్యం ఛందోప్రక్రియ = పూర్వాశ్వాసం || = ఉత్తరాశ్వాసం
మొత్తం = 210 || = 196
వచనం. = 56 || = 51
కంద పద్యం. = 44 || = 50
సీస పద్యం. = 26 || = 28
తేటగీతి సీసంతో. = 23 || = 10
మత్తేభం. = 9 || = 1
చంపకమాల. = 7 || = 4
ఉత్పలమాల. = 5 || = 3
ఆటవెలది. = 27 || = 28
తేటగీతి. = 6 || = 1
శార్దూలం. = 1 || =
ఆటవెలది సీసంతో. = 3 || = 18
మత్తకోకిల. =
|| = 1
తరలం. = 1 || =
గద్యం. = 1 || = 1
మాలిని. = 1 || =


కృతఙ్ఞతలు

కృషికి ఉపయోగపడిన వివిధ పుస్తకముల రచయితలకు, ప్రచురణకర్తలకు, సహకరించిన ప్రోత్సాహించిన మిత్రులు, ఇతర వ్యక్తులు, అంతర్జాల సంస్థలకు. మా తెలుగుభాగవతం అంతర్జాల జాలగూడు ఆదులను నిర్మించిన నిర్వహించినవారికి, గాత్ర ప్రదానులకు, తమ అమూల్య సమయాన్ని కేటాయించిన వారికి, అంతులేని సహకారం అందించిన కుటుంబ సభ్యులు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -