పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : సంస్కారాలు – మనుస్మృతి

సంస్కారాలు – మనుస్మృతి

సంస్కారము (క్రి) అంటే శాస్త్రీయవంతమైన, ఉత్తమమైన విధముగా అగునట్లు చేయుట. వీటికి అందుకే కాల ప్రభావం అనుకూలత కోసం ముహుర్తం, దైవబల అనుకూలత కోసం మంత్రం ప్రయోగిస్తారు.

షోడశసంస్కారాలు

1. వివాహం: వివాహం సమయంలో వధూవరులచే పలుమంత్రాలు చెప్పించబడుతుంటాయి. ఆ సమయంలో వరుడు, “భగ, ఆర్యమ, సవిత, పురంధి” అనే దేవతలు గార్హపత్యం కోసం నిన్ను నాకు అనుగ్రహించగా, నా జీవితం సుఖమయం అయ్యేందుకు నీ చేతిని నేను పట్టుకున్నాను” అని చెబుతాడు. పుట్టబోయే జీవి జీవితం ఇక్కడనుంచి మొదలౌతుంది అని అంటారు. అందుకో దీనిని కల్యాణం శుభకరం అంటారు. క్షేత్రం బీజం రెండు సుఖసంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉంటేనే కదా ఫలం చక్కగా ఉండేది. వధూవరులకు ధర్మబద్ధ జీవితం అలవరచి తగిన క్షేత్రం బీజం సిద్ధం చేయటానికి ఉద్దేశించారు.
2. గర్భాదానం: వివాహితులైన స్త్రీపురుషులు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉన్నప్పుడు సమయ సందర్భాలు సరిచూసి వారి కలయికు శుభారంభంగా చేసే సంస్కారం ఇది. స్త్రీ పురష సంయోగం ద్వారా పుట్టబోయే సంతానం యోగ్యులుగా ఉండేందుకై ఈ సంస్కారం నిర్దేశించబడింది. క్షేత్రం బీజం రెంటి సంయోగ విధానం, సంయోగ సమయం రెండు ప్రభావవంతమైనవే కనుక ఈ సంస్కారం.
3. పుంసవనం: తల్లిం గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం. పుణ్యవతిని సంతోషంగా ఆరోగ్యంగా బలంగా ఉంచడానికి ఉద్దేశించిన కానుకలు ఫలహారాదులు అందించటం మొదలైనవి ఈ సంస్కారంలో అంతర్భాగాలు.
4. సీమతం: గర్భవతికి ఈ సంస్కారాన్ని నిర్వహించడం వల్ల పిండం దుష్టశక్తుల నుంచి రక్షింపబడుతుంది. గర్భవతిని సంతోషంగా ఆరోగ్యంగా బలంగా ఉంచడానికి ఉద్దేశించిన కానుకలు ఫలహారాదులు అందించటం మొదలైనవి ఈ సంస్కారంలో అంతర్భాగాలు.
5. జాతకకర్మ: పది నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది. బిడ్డ ఆరోగ్యానికి ఉద్దేశించినది. శుచి శుభ్రతల ప్రధానం ఈ సంస్కారంలో. విశ్వం అంతా నామరూపధారుల మయం. ఇక్కడ ఈ జీవునికి రూపధారణ నిరూపితమైంది.
6. నామకరణం: బిడ్డ ఈ సమజంలో తనకంటూ ఓ వ్యక్తిత్వంతో వృద్ధిలోకి రావాలన్న కోరికతో తల్లి దండ్రులు జరిపే సంస్కారం. నామరూపధారుని వ్యక్తిగత నామం ప్రదానం చేయబడుతుంది.
7. నిష్ర్కమణం: బిడ్దను తొలిసారిగా బయటకు తీసుకెళ్ళడం, చంటిబిడ్డను విభిన్న వాతావరణాలకు పరిచయం చేయడమో ఈ సంస్కారంలోని అంతరార్ధం.
8. అన్నప్రాశనం: బిడ్డకు బలవర్ధకమైన, ఆహారాన్ని పరిచయం చేయడం. తల్లినుంచి పోషణ పొందుతున్న జీవికి స్వతంత్ర ఆహారస్వీకరణ శుభారంభం ఈ సంస్కారం ఉద్దేశ్యం.
9. చూడాకర్మ: పుట్టువెంట్రుకలను తీయించడం ఈ సంస్కారంలోని ప్రత్యేకత.
10. కర్ణబేధ: చెవులు కుట్టించడం.
11. ఉపనయనం: బాల బ్రహ్మచారికి జరిపే సంస్కారం. విద్యా సముపార్జనకు శుభారంభం ఈ సంస్కారం.
12. వేదారంభం: సమవర్తన సంస్కారాన్ని చక్కగా ముగించేందుకే వేదారంభం.
13. సమావర్తనం: పిల్లలు విద్య ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంస్కారం జరుపబడుతుంది.
14. వానప్రస్ధం: బాధ్యతలను వారసులకు అప్పగించి వచ్చే జన్మకై జరిపే కర్మ.
15. సన్యాసం: ఐహిక బంధాల నుంచి విముక్తి పొందడం.
16. అంత్యేష్టి: తండ్రి ఉత్తమగతి కోసం, పితృఋణం తీర్చుకునేందుకు పుత్రులు చేసే సంస్కారం.

ద్వాదశ సంస్కారాలు

1. వివాహం: వివాహం సమయంలో వధూవరులచే పలుమంత్రాలు చెప్పించబడుతుంటాయి. ఆ సమయంలో వరుడు, “భగ, ఆర్యమ, సవిత, పురంధి” అనే దేవతలు గార్హపత్యం కోసం నిన్ను నాకు అనుగ్రహించగా, నా జీవితం సుఖమయం అయ్యేందుకు నీ చేతిని నేను పట్టుకున్నాను” అని చెబుతాడు. పుట్టబోయే జీవి జీవితం ఇక్కడనుంచి మొదలౌతుంది అని అంటారు. అందుకో దీనిని కల్యాణం శుభకరం అంటారు. క్షేత్రం బీజం రెండు సుఖసంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉంటేనే కదా ఫలం చక్కగా ఉండేది. వధూవరులకు ధర్మబద్ధ జీవితం అలవరచి తగిన క్షేత్రం బీజం సిద్ధం చేయటానికి ఉద్దేశించారు.
2. గర్భాదానం: వివాహితులైన స్త్రీపురుషులు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉన్నప్పుడు సమయ సందర్భాలు సరిచూసి వారి కలయికు శుభారంభంగా చేసే సంస్కారం ఇది. స్త్రీ పురష సంయోగం ద్వారా పుట్టబోయే సంతానం యోగ్యులుగా ఉండేందుకై ఈ సంస్కారం నిర్దేశించబడింది. క్షేత్రం బీజం రెంటి సంయోగ విధానం, సంయోగ సమయం రెండు ప్రభావవంతమైనవే కనుక ఈ సంస్కారం.
3. పుంసవనం: తల్లిం గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం. పుణ్యవతిని సంతోషంగా ఆరోగ్యంగా బలంగా ఉంచడానికి ఉద్దేశించిన కానుకలు ఫలహారాదులు అందించటం మొదలైనవి ఈ సంస్కారంలో అంతర్భాగాలు.
4. సీమతం: గర్భవతికి ఈ సంస్కారాన్ని నిర్వహించడం వల్ల పిండం దుష్టశక్తుల నుంచి రక్షింపబడుతుంది. గర్భవతిని సంతోషంగా ఆరోగ్యంగా బలంగా ఉంచడానికి ఉద్దేశించిన కానుకలు ఫలహారాదులు అందించటం మొదలైనవి ఈ సంస్కారంలో అంతర్భాగాలు.
5. జాతకకర్మ: పది నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది. బిడ్డ ఆరోగ్యానికి ఉద్దేశించినది. శుచి శుభ్రతల ప్రధానం ఈ సంస్కారంలో. విశ్వం అంతా నామరూపధారుల మయం. ఇక్కడ ఈ జీవునికి రూపధారణ నిరూపితమైంది.
6. నామకరణం: బిడ్డ ఈ సమజంలో తనకంటూ ఓ వ్యక్తిత్వంతో వృద్ధిలోకి రావాలన్న కోరికతో తల్లి దండ్రులు జరిపే సంస్కారం. నామరూపధారుని వ్యక్తిగత నామం ప్రదానం చేయబడుతుంది.
7. నిష్ర్కమణం: బిడ్దను తొలిసారిగా బయటకు తీసుకెళ్ళడం, చంటిబిడ్డను విభిన్న వాతావరణాలకు పరిచయం చేయడమో ఈ సంస్కారంలోని అంతరార్ధం.
8. అన్నప్రాశనం: బిడ్డకు బలవర్ధకమైన, ఆహారాన్ని పరిచయం చేయడం. తల్లినుంచి పోషణ పొందుతున్న జీవికి స్వతంత్ర ఆహారస్వీకరణ శుభారంభం ఈ సంస్కారం ఉద్దేశ్యం.
9. చూడాకర్మ: పుట్టువెంట్రుకలను తీయించడం ఈ సంస్కారంలోని ప్రత్యేకత.
10. ఉపనయనం: బాల బ్రహ్మచారికి జరిపే సంస్కారం. విద్యా సముపార్జనకు శుభారంభం ఈ సంస్కారం.
11. వానప్రస్తం: బాధ్యతలను వారసులకు అప్పగించి వచ్చే జన్మకై వానప్రస్తాశ్రమంలోకి అడుగు పెట్టేటప్పుడు జరిపే శుబారంభ కర్మ.
12. సన్యాసం: ఐహిక బంధాల నుంచి విముక్తి పొందటం కోసం సన్యాసం స్వీకరణ సందర్భంలో చేసే సంస్కారం.