పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : పంచోపనిష ణ్మయ దివ్యదేహము

పంచోపనిష ణ్మయ దివ్యదేహము

(పద్యం 3-173-సీ.)

పంచ ఉపనిషన్మయ దేహం అనేది శ్రీమన్నారాయణుని 5 దివ్య శక్తులతో కూడిన దివ్య మంగళ విగ్రహము.వాటి పేర్లు:
1-పరమేష్టి
2-పుమాన్
3-విశ్వ
4-నివృత్తి
5-సర్వ

జీవునికి ముక్తి లభించిన తరువాత ఈ పాంచ భౌతిక శరీరం విడిపోయి, వైకుంఠ ప్రవేశం చేయగానే పంచోపనిషన్మయ దివ్య మంగళ విగ్రహం వస్తుంది.ఈ సందర్భంలో పంచోపనిషత్తులు నిర్వచించుటలో కొన్ని పాఠ్యంతరాలు ఉన్నాయి. పంచోపనిషద్మార్గంలో అభిషేకాదులు చేయు సంప్రదాయాలు కూడా ఉన్నాయి.

(అ) విద్యార్థి కల్పతరువు ఒక ప్రచురణ ప్రకారం పంచోపనిషత్తులు - నారాయణ, బ్రహ్మ, తైత్తిరేయ, గార్గ, వరాహములు.

(ఆ) వేద పండితులు తెలిపిన ప్రకారం పంచోప‌నిష‌త్తులంటే 1చిత్తి, 2శిక్షా, 3. భృగు, 4. ఆనంద‌వ‌ల్లి, 5. మ‌హానారాయ‌ణం. ఈ ఐదింటిని పంచోప‌నిష‌త్తుల‌ని అంటారు. ఇవి కృష్ణ‌య‌జుర్వేదానికి సంబంధించిన ఉప‌నిష‌త్తులు. వీటిని విష్ణుప‌రంగా, శైవ‌ప‌రంగానూ వాడ‌తారు. కార్తీక‌మాసంలో ఏకాద‌శి మెద‌లైన ప‌ర్వ‌దినాల‌లో పంచోప‌నిష‌త్తుల‌తో పారాయ‌ణ‌లు, అభిషేకాదుల‌ను చేయ‌డం విశేషంగా చెబుతారు. ఒక్కో ఉప‌నిష‌త్ ఒక్కో అంశాన్ని వివ‌రిస్తుంది. . ఇవి ఇప్పటికీ అందుబాటులోనూ, వాడుకలోనూ ఉన్నాయి... 

(ఇ) ఈశావాదిపంచోపనిషదః:- ఈశావాశాది అని అయిదు ఉపనిషత్తులు - ఈశ, కేన, కఠ, ప్రశ్న, మండూకము....నా ఆలోచనలు:- పంచోపనిషత్తులు – 1ఈశ 2కేన 3కఠ 4ప్రశ్న 5మండూక ఉపనిషత్తులను పంచోపనిషత్తులు అంటారు.
ఉపనిషత్తులు ఆత్మ విచారణ సాధనములు. ఉపనిషత్తులు వేదాంత సారాన్ని, పరావిద్యని, పరమాత్మ తత్వాన్ని వివరిస్తాయి. వానిలో ముఖ్యమైనవి పంచోపనిషత్తులు. ఈ పంచోపనిషత్తులలో ప్రతిపాదితమైన ఆ పరమాత్మ లక్షణ మయమై ప్రకాశించే దేహమే ఆ భగవంతుని పంచోపనిషణ్మయ దివ్యదేహము అని కూడ చెప్పవచ్చును అని భావిస్తున్నాను.
ఈ పంచోపనిషత్తుల మూలాలు -
1. ఈశోపనిషద్
శుక్లయజుర్వేదీయ మధ్యాన్దనీశాఖానుసారిణీ కాణ్డవశాఖా కే చతుర్థ దషక్ కె దశమ అద్యాయ్ కె ప్రథమ అనువాక్ కో ఈశోపనిషద్ కహతె హై. (శుక్లయజుర్వేదంలోని మధ్యాందనీశాఖ అనుసరించిన కాండవ శాఖ యొక్క చతుర్థ దషకం యొక్క దశమ అద్యాయంలోని ప్రథమ అనువాక్కుని ఈశోపనిషత్తు అంటారు)
2. కేనోపనిషద్
సామవేద్ కీ తలవకారశాఖా కె నవమ అధ్యాయ్ కో కేనోపనిషద్ కహతె హై. (సామవేదం లోని తలవకారశాఖ యొక్క నవమ అధ్యాయాన్ని కేనోపనిషత్తు అంటారు.)
3. కఠోపనిషద్
కృష్ణయజుర్వేద్ కీ కఠశాఖా కీ యహ్ కఠోపనిషద్ హై. (కృష్ణయజుర్వేదంలోని కఠశాఖయే కఠోపనిషత్తు.)
4. ప్రశ్నోపనిషద్
అధర్వవేద్ కీ పిప్పలాదశాఖా కా ప్రశ్నోపనిషద్ హై. (అధర్వణ వేదంలోని పిప్పలాద శాఖయే ప్రశ్నోపనిషత్తు.)
5. మండూకోపనిద్
అధర్వవేద్ కీ శౌనకీశాఖా కా యహ్ ముండకోపనిషద్ హై. (అధర్వణవేదం లోని శౌనకీ శాఖయే ముండకోపనిషత్తు.)
మూలాలు – శ్రీమహాలక్ష్మీనారాయణయజ్ఞసమితి, ఓభాపట్టీ సమారియా, భోజపుర్ జిల్లా, ద్వారా ప్రచురింపబడిన ఈశాదిపంచోపనిషదః నుండి గ్రహించడ మైనది.