పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : ఖట్వాంగుని మోక్షం

అది సప్త ద్వీపాలను ఖట్వాంగుడు అనే చక్రవర్తి ఒకరు పరిపాలించే సమయం;
అప్పటి భీకర యుద్ధాలలో దానవుల ధాటికి దేవతలు ఆగలేక పోతున్నారు;
ఇంద్రాది ప్రముఖులు ఖట్వాంగుడిని యుద్ధంలో సాయం రమ్మని పిలిచారు;
ఖట్వాంగుడు వెళ్ళి దానవులను అందరిని వధించాడు; దేవతలు వరం కోరుకోమన్నారు.
ఖట్వాంగుడు వరంగా ముహూర్తం కాలం జీవితం మిగిలి ఉందని తెలుసుకున్నాడు;
భూలోకం వచ్చి సంపదలు, పుత్ర మిత్రాది బంధాలు, భయం విడిచాడు; విష్ణుభక్తి పట్టాడు;
అలా ఒక ముహూర్త కాలం లోనే కైవల్యం సంపాదించాడు.

గమనిక :-
  1. ఎంతటి వారైనా, దేవతలైనా సరే ముక్తి ఇవ్వ లేరు; తనంతట తనే సంపాదించాల్సిందే.
  2. ఎంత గొప్ప కర్మలు చేసినా, ఎంత సమర్థతతో చేసినా ముక్తి దొరకదు.
  3. మోక్షం సాధించాలి అంటే సంసార బంధాలను, భయాన్ని వదలాలి; భక్తి పట్టాలి.
  4. కైవల్య సంపాదించాలంటే స్వర్గంలో కాదు, భూలోకంలోనే సాధన చేయాలి.
  5. తగిన సాధనతో ఎంత తక్కువ సమయంలో అయినా మోక్షం పొందవచ్చు.

  6. తెలుగుభాగవతం.ఆర్గ్
    http://telugubhagavatam.org/?tebha&Skanda=2&Ghatta=4