పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : హోళీ డోలా పూర్ణిమ

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


:ఫాల్గుణ పౌర్ణమి:శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధించాలి. దీనిని 'డోలోత్సవం' అని అంటారు. ఒరిస్సావంటి ప్రాంతాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.

"నరాడోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం!
ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురంవ్రజేత్!!"

ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈరోజున దర్శించిన వారికి వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రాల వాక్యం.

ఈ రోజుననే హోళికా పౌర్ణమి లేదా హోళీ కూడ. జరుపుకుంటారు శ్రీకృష్ణుడు గోపికలతో హోళీ ఆడుతారు . . ఇంకా జయపూరు మున్నగు ప్రాంతాలలో "దోళో పూర్ణిమ" అని రాధాకృష్ణుల 'కల్యాణం' చేస్తారు. కొత్త మామిడి పిందెలు తింటారు . . రాత్రికి హోళికని కాలుస్తారు. మరుసటి రోజన హోళిరంగులు ఆడతారు.