పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : యోజనము కొలత

యోజనము కొలత

1)    వేదవాఙ్మయంలో వినబడె యోజనము కొలత వేదకాలపు / అంతకు పుర్వపు అతి సూక్ష్మ అంతరిక్ష / జ్యోతిర్మండల విఙ్ఞానపు ఆనవాళ్ళను సూచిస్తుంది. ఇప్పటి (నవ నాగరికపు) కొలతలు వలె పురాతన కొలతలు అంత స్థిరమైనవి సంస్కారవంతమైనవి కావు అన్నది ఒక అపోహ మాత్రమే.
2)   యోజనము రెండు రకములుగా నిర్వచింపబడుతున్నది. అంటే రెండు వేరువేరు విలువలు గల కొలతలు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది, ఒకే పేరు యోజనముతో ఉన్నాయి అన్నమాట. రెండు యోజనాల నాలుగవ వంతును ఒక క్రోసు అనే అంటారు.
3)   చిన్న యోజనము 4.6 మైళ్ళకు సమానము. చిన్న యోజనములో నాలుగవ వంతు అయిన క్రోసులు 60, ఒక డిగ్రీ అక్షాంశాలకు సమానంగా కనబడుతున్నది. పెద్ద యోజనము సుమారు 8.59 మైళ్ళకు సమానం. అంటే భూమధ్యరేఖ వద్ధ 1/8 వంతు అక్షాంశ డిగ్రీకి సమానం ఔతుంది.
4)   ఈజిప్టులోని అతి పెద్ద పిరమిడ్ గిజా. ఇది జ్యోతిర్మండల కొలతలకు అనుగుణంగా కట్టబడింది అంటారు. ఆ గిజా పిరమిడ్ చుట్టుకొలత ఒక చిన్న యోజనము క్రోసుకు సమానం.
5)   భూమి గుండ్రంగా ఉన్నది అన్నది నవ నాగరికపు ఆవిష్కారం, పురాతన కాలంలో ఇది తెలియక భూమి బల్లపరుపుగా ఉంది అనుకొనేవారు అనటం కూడ సబబు కాదు. భూమి గుండ్రంగా ఉంది అన్న అవగాహన లేకపోతే ఇలా యోజనాదులు భూమి కొలతలతో సరిపోలటం సాధ్యం కాదు. భాగవతం పంచమ స్కంధంలో భూమండలం లోని ద్వీపాల కొలతలు నిర్వచించారు. ఇవి భూకేంద్రకంగా గ్రహాల పరిభ్రమణ ఆవృత్తాల కొలతలుతో సరిపోలుతున్నాయి. ఆ పరిభ్రమణాలు జరిగెడిది భూమండలం అనుకుంటే అది ఇంచుమించు బల్లపరుపుగానే ఉంది.
6)   భాగవత పురాణం, ప్రస్తుతం చారిత్రక ఆధారలు అందుబాటులో లేకపోయినా, బాగా వికసించిన నాగరికత / సంస్కృతి అతి పురాతన కాలంలో ఉండేదని సూచిస్తోంది. ఆ సమాజాల సంస్కృతి ఆధారం లేకపోతే లోకంలోని పురాతన కాలపు కొలమానాదులు అంతరిక్ష / జ్యోతిర్మండల కొలతలకి సరిపోలుట సాధ్యం కాదు. అలా సరిపోలే కొలమానాలు స్థిరమైనవి, సంస్కారవంతమైనవి, ప్రామాణికమైనవి కాదనుట సరి కాదు.
[ఆధారము - శతపుట దాస గారి శ్రీమద్భాగవతంలోని - నిర్దుష్టమైన శాస్త్రీయత అనే అంతర్జాల జాలిక పుట నుండి గ్రహించబడింది]
[Based on an article “Exact Science in the Srimad-Bhagavatam” by Sadaputa Dasa @ http://www.krishna.com/exact-science-srimad-bhagavatam]