పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : మకరి - మహాయోగి?

8-65-శా

పాద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని
ష్ఖేబ్రహ్మపదావలంబనరతిం గ్రీడించు యోగీంద్రు మ
ర్యాదన్నక్రము విక్రమించెఁ గరిపాదాక్రాంతనిర్వక్రమై.

పాదద్వంద్వము 

భాగవతము – గజేంద్రమోక్షణము – బమ్మెఱ పోతన!

భాగవతంలో గజేంద్రమోక్షణ మొక అద్భుత ఘట్టము. పోతన తనకవితా చాతుర్యమును వెలయించి దీనిని మిగుల నపురూపముగా తీర్చిదిద్దినాడు."కరి - మకరుల పోరు సందర్భములోనిది" ప్రస్తుత పద్యరత్నము.కరిని గెలువగోరి మకరి యోగీంద్రునివలె సాధనచేయుచున్నదట!
యోగసాధనచేయునప్పుడు యోగి పాదములను నేలపై సమముగానుంచి ప్రాణాయామమునకుపక్రమించి వాయుబంధనమొనరించి, బుధ్ధిని భగవంతుని యందు లగ్నమొనరించి భగవత్పాదారవిందములపైననే దృష్టిని కేంద్రీకరించి యేమరుపాటునువీడి సాధనగావించుచుండును. అదిగో ఆమాదిరిగా నున్నదట మొసలి సాధన! తనరెండు కాళ్ళను నేలపైనూదిపట్టి. గాలినిబిగబట్టి.యేమరుపాటులేక తాబట్టినగజేంద్రునిపాదములపైననే దృష్టినంతయు కేంద్రీకరించి, ఏమాత్రముపట్టువిడువక,, బ్రహ్మపదమునందగోరు యోగీంద్రునిసాధననుపమించుసాధనతో కరిని గెలువ మకరి యత్నించు చున్నదట!
ఆహా! పోతన కవీంద్రా! పశుయోనియగు కరియేడ? మహాయోగియేడ? దానిసాధన యోగిసాధనతో నుపమించి యద్భుతమును సృజియించినావుగదా! నీకు వేరెవరుసాటి? ఇదో స్వీకరింపుము మాప్రణమాంజలులు!
స్వోస్తి!
-ఆచార్య చొప్పకట్ల సత్యన్నారాయణ.