పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : ద్వాదశ ఆదిత్యులు

ద్వాదశాదిత్యులు వంశ విస్తారము పాఠ్య రూపం లంకె.

ద్వాదశ ఆదిత్యులు వంశం పటం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 74:-
అగస్త్యుడు; అగ్ని; అగ్నిహోమం; అగ్నులు; అదితి; అనుభవ; అనుమతి; అపుత్రకుడు; అరిష్టుడు; అశ్వనీ దేవతలు; ఆదిత్యులు; ఆర్యముడు; ఆశిష; ఉరుక్రముడు (వామనుడు); ఊర్వశి; ఋషభుడు; కాశ్యపుడు; కీర్తి; కుహువు; క్రియ; చర్షణి; చర్షణులు; ఛాయా దేవి; జయంతుడు; తపతి; త్వష్ట; ధర్శ; ధాత; పంచయజ్ఞం; పశుయాగం; పిప్పలుడు; పురీష; పూర్ణిముడు; పూషుడు; పృశ్ని; పౌలోమి; ప్రాతఃకాలం; బృహత్ శ్లోకుడు; భగుడు; భృగువు; మనుష్యజాతి; మహిముడు; మాత్రుక; మిత్రావరుణులు; మిత్రుడు; యమి; యముడు; రచన; రాక; రేవతి; వరుణుడు; వసిష్ఠుడు; వాల్మీకి; విదుషుడు; విధాత; విభవ; వివశ్వంతుడు; విశ్వరూపుడు; వృత్రాసురుడు; వ్యాహృతి; శక్రుడు; శనైశ్చరుడు;శ్రాద్ధ దేవుడు మనువు; సంజ్ఞాదేవి; సంజ్ఞాదేవి; సంవరణుడు; సవిత; సాయంకాలం; సావర్ణి మనువు; సావిత్రి; సిద్ధికి; సినీవాలి; సోమ యాగం; సౌభగుడు.

. . . 12ఆదిత్యులు

ద్వాదశాదిత్యులు వంశ విస్తారము

కశ్యపుడు 1వ భార్య దక్షుని 48వ పుత్రిక అదితి (1), పుత్రులు ద్వాదశాదిత్యులు 12 మంది.
1) వివస్వతుడు- భార్యలు (1), అర్యముడు (2), పూషుడు (3), త్వష్ట (4), సవిత (5), భగుడు (6), ధాత (7), విధాత (8), వరుణుడు (9), మిత్రుడు (10), శక్రుడు (11), ఉరుక్రముడు (12) 
  1.           వివస్వతుడు (1), ముగ్గరు భార్యలు
  1.1.              సంజ్ఞాదేవి- పుత్రులు శ్రాద్ధదేవుడు మఱియు యముడు, యమి అనే కవలలు
  1.2.             బడబ రూపాన్ని ధరించిన సంజ్ఞాదేవి అశ్వినీ దేవతలు.
  1.3.             ఛాయాదేవి- కుమారులు శనైశ్చరుడు, సావర్ణి అనే మనువు, కుమార్తె తపతి.
  1.3.1.  తపతి- భర్త సంవరణుడు 
  2.          అర్యముడు (2), భార్య మాతృక- పుత్రులు చర్షణులు- వలన మానవ జాతి
  3.          పూషుడు, సంతానహీనుడు.
  4.          త్వష్ట, భార్య రాక్షసుల సోదరి అయిన రచన- పుత్రుడు విశ్వరూపుడు.
  4.2.            యజ్ఞగుండంలో వృత్రాసురుడు
  5.          సవిత, ముగ్గరు భార్యలు. పృశ్ని, సావిత్రి,, వ్యాహృతి.
  5.1.             పృశ్ని,- పుత్రుడు పశుయజ్ఞము
  5.2.            సావిత్రి,,- పుత్రుడు సోమయజ్ఞము
  5.3.            వ్యాహృతి - పుత్రుడు పంచయజ్ఞము
  6.          భగుడు, భార్య సిద్ధికి- పుత్రులు మహిముడు, అనుభవుడు, విభవుడు,- పుత్రిక ఆశిష.
  7.          ధాత, భార్యలు నలుగురు, కుహువు, సినీవాలి, రాక, అనుమతి.
  7.1.             కుహువు,- పుత్రుడు సాయంకాలము
  7.2.            సినీవాలి,- పుత్రుడు దర్శ
  7.3.            రాక,- పుత్రుడు ప్రాతఃకాలము
  7.4.            అనుమతి.- పుత్రుడు పూర్ణముడు.
  8.          విధాత, భార్య విధాత- పుత్రులు అగ్ని పురీషాదులు
  9.          వరుణుడు, భార్య చర్షిణి- పుత్రులు భృగువు, వాల్మీకి
  9.1.             మిత్రావరుణులకు ఊర్వశియందు పుత్రులు అగస్త్యుడు, వసిష్ఠుడు.
  10.       మిత్రుడు, భార్య రేవతి- పుత్రులు అరిష్టుడు, పిప్పలుడు.
  11.        శక్రుడు, భార్య పౌలోమి- పుత్రులు జయంతుడు, ఋషభుడు, విదుషుడు.
  12.       ఉరుక్రముడు / వామనుడు, భార్య కీర్తి- పుత్రుడు బృహశ్లోకుడు
  12.1.           బృహశ్లోకుడు- పుత్రుడు సౌభగాదులు.