పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : దక్షప్రజాపతి - ప్రసూతి

దక్షుడు~ప్రసూతి వంశం పటం

దక్షుడు-ప్రసూతుల వంశ విస్తారము పాఠ్య రూపం ఇక్కడ తట్టి వీక్షించ గలరు

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 55:-
అగ్నిదేవుడు; అగ్నిష్వాత్తులు,; అభయము; అర్థము; ఆజ్యపులు.; ఉన్నతి; క్రియ; క్షేమము; తితిక్ష; తుష్టి; దక్షుడు; దయ; దర్పము; ధర్ముడు; ధారణి; నరుడు; నారాయణుడు; నిర్గులు; పవమానుడు; పావకుడు; పితలు; పితృదేవతలు; పుష్టి; ప్రచేతసులు; ప్రశ్రయము; ప్రసాదము; ప్రసూతి; ప్రాచీన బర్హి; బర్హిషదుదులు; బుద్ధి; మారిష; ముదము; మూర్తి; మేధ; మేనక; మైత్రి; యోగము; వయున; శతరూప; శాంతి; శివుడు; శుచి; శ్రద్ధ; శ్రుతము; సతి (పార్వతి); సాగ్నులు; సుఖము; సౌమ్యులు; స్మయము; స్మృతి; స్వధ; స్వాయంభువ మనువు; స్వాహాదేవి; హిమవంతుడు; హ్రీ.

. . . దక్షుడు~ప్రసూతి

ప్రసూతి దక్ష ప్రజాపతి వంశ విస్తారము

చతుర్ముఖబ్రహ్మ- పుత్రులు నవప్రజాపతులు (భృగువు, పులస్థ్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి), సనకాదులు, మున్నగువారు
చతుర్ముఖబ్రహ్మ ఆవిర్భావము ఇక్కడ తట్టి చూడగలరు

బ్రహ్మకుమారుడైన దక్ష ప్రజాపతి- భార్య స్వాయంభువమనవు కుమార్తైన ప్రసూతి.

ప్రసూతి దక్షప్రజాపతులు- పుత్రికలు 16 మంది, శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి, స్వాహాదేవి, స్వధ, సతి(ఉమ).

(అ) ధర్ముని భార్యలు పదమూడుమంది
1) శ్రద్ధ, - పుత్రుడు శ్రుతము
2) మైత్రి, - పుత్రుడు ప్రసాదము
3) దయ, - పుత్రుడు అభయము
4) శాంతి, - పుత్రుడు సుఖము
5) తుష్టి, - పుత్రుడు ముదము
6) పుష్టి, - పుత్రుడు స్మయము (గర్వము, ఆశ్చర్యము)
7) ప్రియ, - పుత్రుడు యోగము
8) ఉన్నతి, - పుత్రుడు దర్పము
9) బుద్ధి, - పుత్రుడు అర్థము
10) మేధ, - పుత్రుడు స్మృతి
11) తితిక్ష (ఓర్పు), - పుత్రుడు క్షేమము
12) హ్రీ (సిగ్గు లజ్జ), - పుత్రుడు ప్రశ్రయము (అభిమానము, ఆప్యాయము, ప్రీతి,)
13) మూర్తి – పుత్రుడు నరనారాయణులు.

(ఆ) అగ్నిదేవుడు భార్య-
14) స్వాహాదేవి- పుత్రులు పావకుడు, పవమానుడు, శుచి- పుత్రులు ఒక్కొత్తరికి 15 మంది చొప్పున, 15x3, 45 మంది అగ్నులు. తాతలు, తండ్రులు కలిపి 49 మంది అగ్నులు, వారు 1. అగ్నిష్వాత్తులు, 2. బర్హిషదులు, 3. సౌమ్యులు, 4. పితలు, 5. ఆజ్యపులు, 6. సాగ్నులు, 7. నిరగ్నులు అని ఏడు విధములు.

(ఇ) పిత్రుదేవతలు భార్య
15) స్వధ- పుత్రులు వయన, ధారణి

(ఈ) శివుని భార్య
16) సతి (ఉమ)- తరువతి జన్మలో హిమవంతుని పుత్రికగా పార్వతి పేరుతో శివుని భార్య.

చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భావము

సహస్రశీర్షాది యుక్త ఆదిపురుషుడు – వలన కాలము, స్వభావము
కాలస్వభావములు- వలన ప్రకృతి
ప్రకృతి- వలన మహతత్త్వము
మహతత్తవము- వలన అహంకారత్రయము, సత్వ, రాజస, తమో అహంకారములు.
రాజసాహంకారము- వలన ఇంద్రియాలు
సత్వాహంకారము- వలన ఇంద్రియాధిదేవతలు
తమోహంకారము- వలన పంచతన్మాత్రలు
పంచతన్మాత్రలు- వలన పంచభూతములు
పంచభూతములు- వలన దశేంద్రియములు, మనము
వీటన్నింటి- వలన విశ్వరూపుడైన విరాట్పురుషుడు.
విరాట్పురుషుడు- స్వరాట్టు
స్వరాట్టు- జగత్తు
జగత్తు- విష్ణువు, హిరణ్యగర్భుడు, రుద్రుడు – చతుర్ముఖ బ్రహ్మ

~~~X~~~