పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : ధ్రువ - నళినీమోహను వారి నక్షత్ర వీధిలో

Nakshatra Veedhiloo - Bharatiyulpatra - by Dr. MahiDhara Nalini Mohan
ప్రథమ ముద్రణ : 1997 నవంబర్.
పబ్లిషర్ : శ్రీమతి మహీధర సుభద్ర, అవంతి పబ్లికేషన్స్, హైదరాబాద్.
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
నవోదయ పబ్లిషర్స్
వెల : రూ. 134/- ...... $20



(1)  సింహాసనం మీద కూర్చుని తన రెండవ భార్య సురుచి యొక్క కొడుకును తన తొడమీద కూర్చోబెట్టుకుని ఉండగా. అప్పటికి ఆరేళ్ళ బాలుడై ఉన్న ధ్రువుడు చూచి, తాను కూడా తండ్రి తొడ ఎక్కబోయాడు. సురుచి ధ్రువుని అభిప్రాయాన్ని గ్రహించి, “తండ్రి తొడఎక్కాలనే కోరిక ఉంటే నువ్వు సునీతి కడుపున ఎందుకు పుట్టేవు?” అంది అహంకారంతో.  ఆ మాటలకు ధ్రువుడు చిన్నబుచ్చుకొని జరిగిన దంతా తల్లికి చెప్పి, ఇల్లు విడిచి అడవులకు పోయి చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై “ఆకాశంలో అత్యున్నత స్థానాన్ని పొందిన నీచుట్టూ సప్తర్షులు 26000 సంవత్సరాల అంతరాలలో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు.” అని వరం ఇచ్చాడు.
  భారత, భాగవత, మత్స్య, విష్ణు పురాణాలలో ఈ కథ ఉంది. సంస్కృత భారతం IV-9-19, 20, 21, 22 శ్లోకాలలో విష్ణుమూర్తి ధ్రువునకిచ్చిన వరం ఇదీ.

వేదాహంతే వ్యవసితం, హృదిరాజన్య బాలక!
యత్రగ్రహార్త తారాగణాం, జ్యోతిషాం చక్రమాహితం
మేధ్యాం గోచక్రవత్ స్థాస్ను, పరస్తాత్ కల్పవాసినాం
ధర్మోగ్నిః కశ్యపః శుక్రో, మునయోయేవ నౌకసః
చరంతి దక్షిణీకృత్య, భ్రమంతోయత్సతారకాః
షడ్వింశద్వర్ష సాహస్రం రక్షితావ్యాహతేంద్రియః

  దీనికి ఆంధ్ర బాగవతంలో బమ్మెరపోతన్న గారి ఆంధ్రీకరణం (IV-289-290)

కం.

ధీవ్రత! రాజన్యకు
మాక! నీ హృదయమందు సలిన కార్య
మారూఢిగా నెరుంగుదు
నాయనది పొందరానిదైనను నిత్తున్.
వ.   అది ఎట్టిదనిన నెందేని మేధి యందు పరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలె గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబులైన ధర్మాగ్ని, కశ్యప, శుక్రులును, సప్తఋషులును తారకాసమేతులై ప్రదక్షిణంబు తిరుగుచుండుదురు. అట్టి ధ్రువ క్షితియను పధంబు ముందట ఇరువదియారు వేల యేండ్లు సనం బ్రాపింతువు

. (“మేధి” అనగా పశువును కట్టుటకు పాతిన గుంజ అని అర్థం)
  ధ్రువక్షితి వలయ నిర్మాణము సుమారు ఇరువదియారువేల సంవత్సరములకు పూర్తియగును. - అని గొబ్బూరి వారి వచనం.
 ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం! భూ అక్షం స్థిరంగా ఉండక కదలిపోతూ ఉన్నదనీ, ఈ విధంగా జరిగి జరిగి 26000 సంవత్సరాలకు యథాస్థానానికి వస్తుందని హిపార్చస్ అనే గ్రీకు ఖగోళశాస్త్రజ్ఞుడు కీ.పూ. 143లో కనుగొన్నాడు. దీనిని విషువచ్చలనం అన్నారు. చిత్రం ఏమిటంటే ఒక వలయం పూర్తి అవడానికి 26000 సంవత్సరాలు పడుతుందని భారతీయులకు హిపార్చస్ కన్నా చాలా ముందుగా తెలిసింది!
  విషువత్ స్థానంలో ఉన్న నక్షత్రం సుమారు వెయ్యి సంవత్సరాలు గడచిన పిమ్మట దాని తరువాత నక్షత్రం విషువత్ స్థానంలోకి వస్తుందనీ; మృగశిరలో ఉన్న విషువత్ స్థానం కృత్తికలోనికి వచ్చినప్పుడే - అనగా కీ.పూ. 3000 - 2500 ప్రాంతాల భారతీయులు తెలుసుకున్నారని ముందు ముందు తెలుసుకుందాం.
  “ధ్రువస్య స్థానాదపసరణమ్” అని ఉపనిషత్ వాక్యం చెబుతోంది. అపసరణం అనగా “కదలుట” అని అర్థం

(2) రాక్షసి పాము (DRAC0, THE CRAGAN)