పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : ఆంధ్రులెవరు

1929 KotaVenkatachalmaGari - Andhrulevaru - Grandham - EXTRACT.jpg
(ఈ పుట జెపిజి దస్త్రం, క్రింద చూపబడింది గమనించండి)

-:శ్రీ. కోట వేంకటాటలము గారు రచించిన
"ఆంధ్రులెవరు" అను గ్రంథము నుండి ఉల్లేఖనము:-
“ఆంద్ర" శబ్ద కారణము

 మూడుకోట్ల పదిలక్షల ముప్పదియొక్క వేయి ముప్పదినాలుగు సంవత్సరముల క్రిందట పరిపాలించిన యయాతి రాజు కొడుకయిన “అనువు" వంశములో యయాతినుండి ప్రముఖ వంశములను లెఖ్ఖ వేయగా 15 వ ప్రముఖ వంశములో జన్మించిన "బలి" యను రాజు కుమారులయిన 1 అంగ 2 వంగ కళింగ 4 సుంహ్మ 5 పుండ్ర 6 ఆంధ్ర అను వారలలో 6 వ వాడైన "ఆంధ్ర" అను రాజువలన పరిపాలింపబడిన రాజ్యమునకు “ఆంధ్ర"దేశమనియు అందలిజనులకు “ఆంధ్రు"లనియు నామంబులు గలిగినట్లును అటులనే " ఆంధ్రుని ” సోదరులయిన 1 అంగ 2 వంగ 3 కళింగ 4 సుంహ్మ 5 పుండ్రులవలన పరిపాలింపబడిన దేశము లాయా, రాజనామంబుల పిలువబడినట్టును భాగవతమున నవమస్కంధములో స్పష్టముగా చెప్పబడియున్నది. ( భాగ 9.686 చూడుడు )

 చాతుర్వర్ణ్యములతో గూడి వైదికధర్మ ప్రవృత్తులయిన ఆర్య జాతి పరిపాలకుడయిన “ఆంధ్ర" నృపతినామంబున “ఆంధ్ర జాతి" యని పిలువబడినదిగాని శావహతులై భ్రష్టులై నీచజాతీయులుగా మారిపోయిన "అంధ్ర” జాతి కాదని తెలియవలయును.

శ్రీమద్భాగవతే నవమస్కందే 23 అధ్యాయే 5; 6 శ్లోకాః
శ్లో !! "అంగవంగ కళింగాద్యాః సుంహ్మ పుండ్రాంధ్ర సంజ్ఞితాః
  జజ్ఞిరే దీర్ఘతమసోబలేః క్షేత్రేమహేక్షితః|        (శ్లో5)

శ్లో !! "చక్రుస్స్వనామ్నావిషయాన్ షడిమాన్ ప్రాచ్యకాంశ్చతే   6

 తా!!  "బలియను మహారాజునకు దీర్ఘతముడను ఋషి యనుగ్రహమున 1 అంగ 2 వంగ 3 కళింగ 4 సుంహ్మ 5 పుండ్ర 6 ఆంధ్రయను పేర్లుగల ఆర్గురు కుమారులు గలిగిరి . వారు తూర్పు దేశమునకు రాజులై ఆరుదేశభాగములకు తమ నామములనే పేర్లుగానుంచి ఏలిరి.

  (శ్రీ పోతనామాత్యుని శ్రీమదాంధ్ర భాగవతం నవమస్కంధం 685 చూడుడు)


గమనిక :-
(అ) తెలుగుభాగవతం.ఆర్గ్ నందలి 9-683-వ. - ప్రకారం ఆ బలి కుమారులు (1) అంగ, (2) వంగ, (3) కళింగ, (4) పుండ్ర (5) సింహ (6) ఆంధ్ర అను ఆరుగురు
 (ఆ) తెలుగుభాగవతం.ఆర్గ్ నందలి - వ్యాస భాగవతం అధ్యాయము - 23 నందలి 5, 6 శ్లోకములు చూడగలరు.


ఆంద్రులెవరు

ఇది శ్రీ కోట వెంకటాచలం గారి "ఆంధ్రలెవరు" అను గ్రంథం నుండి "ఆంధ్ర" శబ్దకారణము అను శీర్షిక గల పుట - ఉల్లేఖనము.